BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 20, 2011

నేను మిస్టర్ ఫర్ ఫెక్ట్' నే పెళ్ళి చేసుకుంటాను...కాజల్

Kajalమగధీర చిత్రంతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కాజల్. ఆమెకీ ప్రభాస్ కీ మధ్య రిలేషన్ నడుస్తోందని, త్వరలోనే వివాహం చేసుకుంటారని వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ నేఫద్యంలో కాజల్‌ నీక్కాబోయేవాడు ఎలా ఉండాలి? అని మిడియా వారు అడిగారు .దానికి ఆమె తడుముకోకుండా .. ‘చదువు, సంస్కారం వంటి అన్ని విషయాల్లోనూ పెర్‌ఫెక్ట్‌గా ఉన్నవాడై ఉండాలి’ అని చెప్పేసింది. దాంతో అంత డైరక్ట్ గా చెప్పటం విన్నవారు షాక్ అయ్యారు. అంతలోనే తేరుకుని ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనేమీ లేదని తేల్చిచెప్పేసింది.కాజల్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌’ చిత్రంతోపాటు రవితేజతో ‘వీర’ నాగచైతన్యతో ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ నటిస్తోంది.ఇక ఈ మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, దశరధ్ దర్శకత్వం వహించారు. దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్‌ రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె.

దేవకట్ట 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో నాగచైతన్య పాత్ర గురించి..

Naga Chaitanyaదేవకట్ట, నాగచైతన్య కాంబినేషన్ లో "ఆటో నగర్ సూర్య" అనే చిత్రం త్వరలో రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల..ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆయన తాజాగా ఈ విషయమై ట్వీట్ చేస్తూ...ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో..హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం. మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఇక ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

ఫ్లాఫ్ చిత్రాల దర్శకుడుతో మంచు మనోజ్

Manchu Manojమోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తాజాగా ఓ కొత్త చిత్రం కమిటయినట్లు సమాచారం. అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలు డైరక్టర్ అనీల్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు.ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. డి.యస్ రావు నిర్మించే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం డియస్ రావు..నాని హీరోగా పిల్ల జమీందార్ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక మనోజ్..త్వరలో రాజా అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ఊ కొడతారా ఉలిక్కపడతారా అనే చిత్రం లో చేస్తున్నారు. దీక్షాసేధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కాఫీ కప్పులో ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు

Bhimaneni Srinivasa Raoగతంలో శుభాకాంక్షలు, సుస్వాగతం,సూర్య వంశం వంటి సూపర్ హిట్స్ అందించిన దర్సకుడు భీమినేని శ్రీనివాస రావు త్వరలో నటుడుగా పలకరించనున్నారు. వరుణ్ సందేశ్ తాజా చిత్రం కుదిరితే కాఫీ కప్పు చిత్రంలో ఆయన వరుణ్ సందేశ్ తండ్రిగా చేస్తున్నారు. సుస్వాగతం చిత్రంలో రఘువరన్ తరహా క్యారెక్టరైజేషన్ తో ఈయన పాత్ర సాగనుందని తెలుస్తోంది. కొడుకుని స్నేహితుడిలా భావిస్తూ ఎంకరేజ్ చేసే ఈ పాత్రతో భీమినేని నటుడుగా కూడా బిజీ అవుతాడని యూనిట్ వారు అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రమణ సెల్వా అనే కెమెరా మెన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భీమినేని శ్రీనివాసరావు ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమచారం.

ఇక వరుణ్ సందేశ్, సుమాభట్టాచార్య జంటగా రూపొందిన ‘కుదిరితే కప్పు కాఫీ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న విడుదల కానుంది. 80 స్క్రీన్స్‌తో ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిదని దర్శకుడు చెప్తున్నారు.సుకుమారి, తనికెళ్ల భరణి, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం యోగేశ్వరశర్మ, పాటలు: సిరివెన్నె సీతారామశాస్ర్తీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: అనిల్‌కుమార్, కెమెరా: సంతోష్‌రాయ్, ఆర్ట్: శశిధర్ అడప, నిర్మాతలు: శివ, మహి, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణ సాల్వ.

అక్కినేని నాగేశ్వరరావు ట్విట్టర్ డిటేల్స్ ...ట్వీట్స్

Akkineni Nageswara Raoపద్మ భూషణ్ అక్కినేని నాగేశ్వరరావు తాజాగా ట్విట్టర్ లో ఎక్కౌంట్ తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ 86 సంవత్సరాల నవ యువ హీరో మొదటగా ట్వీట్ చేస్తూ...నటీ నటులందరికీ, నన్ను ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్ధంగా అభిమానిస్తున్న ప్రేక్షక లోకానికి నా మనపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఆయన తన అరవై రెండవ మ్యారేజ్ ఏనవర్శిరీ సంవద్భంగా ఈ ఎక్కౌంట్ ని ఓపెన్ చేసారు.ఆయన్ని ట్విట్టర్ లో పలకరించాలంటే.. http://twitter.com/A_NageswaraRao# లో దొరుకుతారు. ఇక ఆయన ట్వీట్స్ తో తన కుమారుడు నాగార్జునకి, మనమలు నాగచైతన్య, అఖిల్, సుమంత్ లకు పోటీ ఇస్తారమో చూడాలి. ఎంతో వాక్చుతుర్యం కలిగిన నాగేశ్వరరావు ట్విట్టర్ లోనూ అదరకొట్టాలని కోరుకుందాం.

అసెంబ్లీలో చంద్రబాబుతో మంత్రి దానం నాగేందర్ మాటకు మాట

Chandrababu Naiduహైదరాబాద్: గవర్నర్ నరసింహన్ స్పీచ్‌ను అడ్డుకున్న ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభ్యులను సస్పెండ్ చేయడం సభాపతికి ఉన్న హక్కు అని, అయితే వివరణ ఇచ్చుకునే హక్కు కూడా సభ్యుడికి ఉందన్నారు. సభ్యుడి వివరణ వినకుండానే సస్పెన్షన్ వేయడం విచారకరమని అన్నారు. వారిపై చేసిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి దానం నాగేందర్‌కు, చంద్రబాబుకు మాటకు మాట వివాదం చెలరేగింది. క్షమాపణ చెప్తేనే శాసనసభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని దానం నాగేందర్ ఆయన అన్నారు.

తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ నాగం జనార్ధన్ రెడ్డి సైతం టిఆర్ఎస్, టిడిపి ఎమ్మెల్యేలపై వేసిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారి వాదనలు వినకుండా సస్పెన్షన్ చేయడం ఏమిటని మీడియా పాయింట్ వద్ద ప్రశ్నించారు. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలలో బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. సహాయ నిరాకరణను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో అందరూ సహాయ నిరాకరణకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి యాజమాన్యాల ఆల్టిమేటం: సిఎంను కలవాలని నిర్ణయం

హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఇస్తామన్న 30 శాతం ఫీజు రీయింబర్సుమెంట్సు తమకు ఎటూ సరిపోవని, కనీసం 50 శాతం అయినా ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఆదివారం యాజమాన్యాలు సమావేశం అయ్యి బకాయిలపై చర్చించాయి. 50 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌‍ను ఈ నెల 23వ తేదీలోగా ఇవ్వాలని డెడ్‌లైన్ విధించాయి. ఈ నెల 23వ తేది వరకు ఫీజు బకాయిలలో సగం చెల్లించకుంటే ఇంతకుముందు నిర్ణయించుకున్నట్లుగా 24వ తారీఖు నుండి కళాశాలలు మూసి వేస్తామని హెచ్చరించాయి.

కాగా ఫీజు బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలవలాని నిర్ణయించుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వారం రోజుల నిరాహార దీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జెపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, అందుకే దాడి!: కెకె

K Keshava Raoహైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి కార్యవర్గ సభ్యుడు కె కేశవరావు ఆదివారం అన్నారు. అయితే దాడిని మాత్రం తాము సమర్థించడం లేదన్నారు. దాడి ఖండించదగినదే అన్నారు. జెపి అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించుకోవాలని కోరారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో సహాయ నిరాకరణపై గానీ, తెలంగాణ అంశంగానీ ప్రస్తావనకు రాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

ఏ అంశమూ ప్రస్తావనకు రాకుంటే తెలంగాణలోని సామాన్య జనానికి బాధ కలగదా అని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. అసెంబ్లీ అవినీతిపరుల అడ్డా అని చెప్పడం జెపికి ఎంతవరకు సమంజసం అన్నారు.

యూపిఐ ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్

KT Rama Raoహైదరాబాద్: బస్సులో టిక్కెట్లు తీసుకోని వారిపై కాకుండా తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పిన యూపిఏ ప్రభుత్వంపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని సిరిసిల్ల శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కె తారకరామారావు ఆదివారం డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని గత డిసెంబర్ 9న ప్రకటించి ఇప్పుడు మాట తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

తెలంగాణలోని పది జిల్లాల్లో విజయవంతంగా జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చూసి ప్రపంచమే విస్తు పోతోందని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలంటే ప్రభుత్వం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆయన అన్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బతీయకుంటే ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు లేవన్నారు. అధికా పార్టీకి ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు.

మార్షల్స్‌ను ఛేదించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి

Revanth Reddyహైదరాబాద్: గవర్నర్ నరసింగన్ ప్రసంగాన్ని అడ్డుకొని అసెంబ్లీనుండి వారం రోజులు సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ శాససనభ్యుడు రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలోకి వెళుతున్న సమయంలో మార్షల్స్ ఆయనను అడ్డుకోవడంతో మార్షల్స్‌కు, టిడిపి ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోనికి వెళుతున్న రేవంత్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెన్షన్‌కు గురి అయినందున లోనికి అనుమతించేది లేదని అన్నారు. దీంతో టిడిపి ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ రూల్స్ తెలుసా అని ప్రశ్నించారు. చీఫ్ మార్షల్స్ సైతం వద్దని వారించడంతో రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి చీఫ్ మార్షల్స్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఎంతకీ అనుమతించక పోవడంతో టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు మార్షల్స్‌ని చేధించుకొని లోనికి వెళ్లారు. మార్షల్స్‌తో తమతో ప్రవర్తించిన తీరుపై రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.
Allu Arjun Wedding Invitation Card : Exclusive

అప్పలరాజు దెబ్బకు దొంగల ముఠా ఠా


KSD Appalraju bad impact on RGV Dongala Mutha !

వయసు మరచిపోతున్న అతిలోక సుందరి


Sridevi suffering from Old Age Syndrome !

కూతురి వయసు హీరోయిన్ తో సరసాలు


Kamal Hassan Wants to Act with Hot Young Actress

హైదరాబాద్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెడతాను: హీరో నాగార్జున

Nagarjunaస్టార్ హీరో నాగార్జున త్వరలో హైదరాబాద్ లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్ధాపించే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో... చిత్ర పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నిపుణుల్ని అందించేందుకు, ఔత్సాహిక నటులను తీర్చిదిద్దేందుకు మన దగ్గర సరైన శిక్షణ సంస్థల్లేవు.ముంబయిలో ఉన్నట్లుగా దక్షిణాదిన సరైన శిక్షణ సంస్థల్లేవు. ఉన్నా అవి సినిమా రంగానికి అవసరమైన రీతిలో తీర్చిదిద్దేలా ఉండట్లేదు. దాంతో ఆసక్తి ఉన్న ఔత్సాహికులుకు సరైన మార్గ దర్శకత్వం లభించట్లేదు.

ప్రస్తుతం ఈ రంగంలో అసెస్టింట్ లుగా చేరి పని చేస్తూనే నేర్చుకొంటున్నారు. ఇది సరైన విధానం కాదు. అందుకే నేను అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా తరహాలో ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాలనుకొంటున్నా అన్నారు. ఇక తెలుగులో ఇప్పటికే చిన్న చిన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లు ప్రక్కన పెడితే రామానాయుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, రామోజీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటివి అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్నాయి.

రాజమౌళి "సూపర్‌మేన్"‌ కాన్సెప్టు తోనే ఆ చిత్రం

Prabhasప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే చిత్రం నిన్న(శుక్రవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ మేన్ తరహా కాన్సెప్ట్ తో రూపొందనుందని తెలుస్తోంది. హిందీలో హృతిక్ రోషన్ చేసిన క్రిష్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించాలని రాజమౌళి ప్లాన్ చేసే ఈ చిత్రం స్టార్ట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి... చత్రపతి’ తర్వాత ప్రభాస్‌తో తీసే సినిమాపై ఇప్పటికే చాలా ఊహాగానాలు నడిచాయి. కొందరైతే ‘విశ్వామిత్ర’ అనీ అనేశారు! అదంతా కేవలం ఇమాజినేషన్‌ మాత్రమే. ఈసారి ప్రభాస్‌ని అసాధారణ శక్తులున్న హీరోగా ఆవిష్కరిస్తున్నా. ‘మగధీర’కు 2రెట్లు అధిక బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నాం. చారిత్రకం, పౌరాణికం కలగలిసిన పూర్తి స్థాయి ఫాంటసీ సినిమా ఇది. ఈ విజువల్‌ వండర్‌ను తెలుగు, తమిళ్‌లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం’ అన్నారు . కె.రాఘవేంద్రరావు సమర్పణలో ప్రభాస్‌ హీరోగా..శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మించే సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

కమర్షియల్ సినిమాలు చేయాల్సిన భాద్యత నాపై ఉంది..నాగార్జున

Nagarjuna"గగనం" లో నటించినందుకు గర్వంగా ఉంది. నటుడిగా నా ఫ్యూచర్‌కి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఈ సినిమా. ఇంత మంచి కథతో నా దగ్గరకొచ్చిన రాధామోహన్, దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కాకపోతే ప్రతిసారీ ఇలాంటి సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే ఓ హీరోగా కమర్షియల్ సినిమాలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని అక్కినేని నాగార్జున అన్నారు. దిల్ రాజు నిర్మాతగా రాధామోహన్ దర్సకత్వంలో రూపొంది రిలీజైన గగనం చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఇక దిల్ రాజు మాట్లాడుతూ...పాటలు, ఫైట్లు లేకుండా నాగార్జునతో సినిమా చేయడం సాహసం, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావడానికి గగనం బాట వేసిందని చెప్పారు.మరో కీలకపాత్ర వేసిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... తెలుగులో కూడా ఇంత మంచి సినిమాలు తీయొచ్చని నిరూపించింది గగనం గొప్ప హ్యూమన్‌బీయింగ్ ఉన్న వ్యక్తి నాగ్. ఆయన చేశారు కాబట్టే ఈ విజయం అన్నారు

రజనీకాంత్ ని ‘ఎంటర్ టైనర్ ఆఫ్ ద డికేడ్’ ప్రశంసలతో ముంచెత్తిన రాజధాని

Rajinikanth and Chidambaram ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రొషనల్ గా సక్సెస్ అయినటు వంటి వ్యక్తులకు అవార్డ్స్ తో సత్కరిస్తుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ ఎన్ డి టీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ని 'ఎంటర్ టైనేర్ ఆఫ్ ద డికేడ్' అవార్డుతో ఘనంగా సత్కరించింది. నిన్న రాత్రి డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర హోం మంత్రి చిదంబరం చేతుల మీదుగా రజనీకాంత్ స్వీకరించాడు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా రజనీని ప్రశంసలతో ముంచెత్తారు. 'రజనీ కేవలం ఇండియన్ స్టారే కాదు, అంతర్జాతీయ నటుడు' అన్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. 'రజనీ సార్ కూర్చున్న వేదిక మీద కూర్చోవడమే పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఆయన గొప్పతనం గురించి మా అమ్మ చాలా సార్లు చెప్పింది' అంది కత్రినా కైఫ్.

విద్యాబాలన్ అయితే గబగబా వెళ్లి రజనీ పాదాలకు నమస్కరించింది. సౌత్ రన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా త్రిష అవార్డు సొంతం చేసుకొన్నది'తన జీవితంలో ఇంతవరకు చేసిన వాటిలో అత్యుత్తమ సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ సినిమా 'రోబో' అని చెప్పాడు ఈ సూపర్ స్టార్. ‘భగవంతుడి చేతిలో నేనో పరికరాన్ని. ఆయన ఎలా చేయమంటే అలా చేస్తున్నానంతే’అన్నాడు రజనీ, ఎన్ డి టీవి చైర్మన్ ప్రణబ్ రాయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా. ఏమైనా, ఈ అవార్డుల వేడుక రజనీ సన్మాన వేడుకగా మారిపోయింది. !

"బెజవాడ రౌడీలు" డైరక్టర్ వర్మ కాదా? మరి ఎవరు?

Ram Gopal Varmaవిజయవాడ నేఫధ్యంలో రామ్ గోపాల్ వర్మ రూపొందనున్న తాజా చిత్రం ' బెజవాడ రౌడీలు' టైటిల్ ప్రకటించగానే సంచలనం రేగిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్ళూ రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తారనుకున్నారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు.

నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.

వినాయకుడు' దర్శకుడు సాయి కిరణ్ నెక్స్ట్ చిత్రం డిటేల్స్...

Sai Kiran'వినాయకుడు', 'విలేజిలో వినాయకుడు' చిత్రాల దర్శకుడు సాయికిరణ్ అడివి త్వరలో మరో చిత్రం చేస్తున్నారు. 'కేరింత' పేరుతో నిర్మించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. ఇందులో కొత్తవారు ప్రధాన పాత్రలు పోషిస్తారు.మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సాయి కిరణ్ ..విలేజ్ లో వినాయకుడు అనంతరం నాగచైతన్యకు ఓ కథ చెప్పారని సమాచారం.

అయితే ఆ కథ నచ్చినా డేట్స్ ఇప్పుడిప్పుడే దొరికే సిట్యువేషన్ లేకపోవటంతో గ్యాప్ రాకూడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు కూడా తన బ్యానర్ పై చిన్న చిత్రాలు చేసి ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తన్నారు. ప్రస్తుతం దిల్ రాజు...సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో ఓ మై ప్రెండ్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన నిర్మించిన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.

సిద్దార్ధ, శృతిహాసన్ మరోసారి తెలుగు తెరపై

Sruthi Hassan-Siddharthఅనగనగా ఒక ధీరుడు చిత్రం కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుంది. సిద్దార్ధ సరసన శృతిహాసన్ మరోసారి మెరవనుంది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా ఈ జంటకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో దిల్ రాజు తన తాజా చిత్రంలో వీరిని తీసుకున్నాడు. మొదట ఈ పాత్రకు అమృతారావుని అనుకున్నారు. కానీ ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టిన రూల్స్ కి ఒప్పుకోకపోవటంతో తప్పించారు. దాంతో అలా మొదలైంది హీరోయిన్ నిత్యా మీనన్ లైన్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను కూడా కాదనుకుని శృతిని సీన్ లోకి రప్పించారు. శృతిని సిద్దార్ధ రికమెండేషన్ మీద తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ అనే నూతన దర్సకుడు డైరక్షన్ చేస్తున్నాడు. ఓ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది.

మూడు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించదా: అంబటి

Ambati Rambabuహైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం స్పందించదా అని అయన ప్రశ్నించారు. జగన్ దీక్షపై ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. జగన్ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారని, అయితే ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ వైద్యులను కూడా పరీక్షించడానికి పంపించేలేదన్నారు. మూడు రోజులుగా కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉంటున్నారన్నారు. ప్రభుత్వానికి బకాయిల విడుదలపై, రాష్ట్ర సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

ఈ అంశంపై ఏదో విధంగా కాలం గడపాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 24వ తేదీ సాయంత్రం వరకు జగన్ ఫీజుపోరు కొనసాగుతుందని ఆయన చెప్పారు. జగన్ యువకుడు, మిత ఆహారి కాబట్టి ఇంకా బాగానే ఉన్నాడన్నారు.

గవర్నర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: ఎంపీ పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakarకరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో సోమవారం నుండి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో తెలంగాకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతో రావాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రేపటి నుండి జరగనున్న సమావేశాలలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయిస్తామని చెప్పారు. సహాయ నిరాకరణను అణిచివేసే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని అన్నారు. ప్రజల మనోభావాలను గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో చేర్చక పోవడం శోచనీయమని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం తప్పు కాదన్నారు. సభ్యులకు ఆ హక్కు ఉందన్నారు.

గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఇలాగే గవర్నర్ రంగరాజన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని కేవలం మూడు నిమిషాల్లో బయటకు పంపించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఘటన జరిగిన రోజును చీకటి రోజుగా అభివర్ణించటం సరికాదన్నారు. ఆయన ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ప్రతినిధి అనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలని సూచించారు.

జగన్‌ది తొందరపాటు చర్య, కాంగ్రెస్‌లోకి వస్తారు: మంత్రి పల్లంరాజు

Pallam Raju గుంటూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లడం తొందరపాటు చర్య అని మంత్రి పల్లంరాజు ఆదివారం గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా విలేకరులతో అన్నారు. అయితే జగన్ కొన్ని తొందరపాటు చర్యలు చేసినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటారన్నారు. ఆయన తొందరపాటును త్వరలో తెలుసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ కాంగ్రెస్ వారంతా అభిమానించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు అని, కాబట్టి ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలనే కోరుకుంటున్నామన్నారు.

కాగా ఒరిస్సాలో మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. ఆయనను విడిపించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందని అన్నారు. దేశంలో అంతర్గత భద్రతా చర్యలు చేపట్టడానికి అవసరమైన పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కోస్ట్‌గార్డ్ ట్రెయినింగ్ సెంటర్‌ను నిజాంపట్నంకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విశాఖ, హైదరాబాద్ నగరాలలో రక్షణ ఆయుధాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు.

తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి: మాజీ సిఎం రోశయ్య

Rosaiahనెల్లూరు: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా అందరూ కట్టుబడాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, దానిని అందరూ ఆమోదించాలని కోరారు.

సమస్య జఠిలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో భాగంగా అందరూ ఒక పరిష్కారానికి అంగీకరించాలని సూచించారు. అంతేగానీ తాము కోరుకున్నదే కావాలనే వాదన మాత్రం సరైనది కాదన్నారు. రాష్ట్రం విభజించాలా, కలిసి ఉండాలా అన్న అంశంపై కేంద్రం ఇప్పటికే అధ్యయనం చేస్తుందని చెప్పారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో దాడులు సరియైన చర్యలు కావన్నారు. సమస్య వచ్చినప్పుడు, విభిన్న వాదనలు ఉంటే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.

వీరబాదుడు: 87 పరుగులతో బంగ్లాపై భారత్ ఘన విజయం

India Vs Bangladeshమీర్పూర్‌: ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. నాలుగేళ్ల కింద వెస్ట్ ఇండీస్‌లో జరిగిన పరాభవాన్ని తలదన్నేలా పంతం నెరవేర్చుకుంది. బంగ్లాదేశ్‌పై భారత్ 87 పరుగుల ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ తొలి రోజే భారత్‌ సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలిసొచ్చింది. ధోనీసేన టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. సెహ్వాగ్‌ 140 బంతుల్లో 175, కోహ్లీ 83 బంతుల్లో 100 పరుగులతో భారత్‌కు భారీ విజయాన్ని అందించారు. సచిన్‌ 28, గంభీర్‌ 39లతో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో భారత్‌ తొలుత నాలుగు వికెట్లకు 370 పరుగుల సాధించింది. బంగ్లాదేశ్‌ మొదట బాగా పోరాటం చేసినప్పటికి ఆ తర్వాత తొమ్మిది వికెట్లకు 283 పరుగుల చేసింది. మునాఫ్‌పటేల్‌ 4/48 తీసుకున్నాడు. సెహ్వాగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది.

కొద్దిలో చేజారిందిగానీ డబుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మనయ్యేవాడే. అతడి ఎక్కువసేపు క్రీజులో నిలవడం మిగతా బ్యాట్స్‌మెన్‌ విశ్వాసాన్ని పెంచడంతో పాటు ప్రత్యర్థి నైతిక స్త్థెర్యాన్ని దెబ్బతీసింది. వీరూ ఏ దశలోనూ రన్‌రేట్‌ తగ్గనివ్వలేదు. చక్కగా స్త్ట్రెక్‌ రొటేట్‌ చేస్తూ.. మధ్య మధ్యలో భారీ షాట్లు బాదాడు. టాస్‌ గెలిచిన వెంటనే ఫీల్డింగన్నాడు షకిబ్‌. అతడు బొక్కాబోర్లా పడ్డాడని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. 10 ఓవర్లలోనే స్కోరు 60/0. తొలి బంతినే బ్యాక్‌ఫుట్‌పై కవర్‌లో బౌండరీకి తరలించి ప్రపంచకప్‌ పరుగుల ఖాతా తెరిచిన సెహ్వాగ్‌.. ఆ ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. రెండో ఓవర్లో సచిన్‌ రెండు ఫోర్లు కొట్టాడు. తొలి 4 ఓవర్లలోనే స్కోరు 36. ఐతే స్పిన్నర్‌ అబ్దుర్‌ రజాక్‌ రంగ ప్రవేశం చేయడంతో స్కోరు వేగం తగ్గింది. అయినా పది ఓవర్లలో 60. అయితే 11వ ఓవర్లో అనవసరంగా వికెట్‌! ఊపుమీదున్న సచిన్‌, సెహ్వాగ్‌తో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు.

ఆ తర్వాత సెహ్వాగ్‌ రజాక్‌ ఓవర్లో తొలి సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరూ చెలరేగుతుంటే ఆత్మవిశ్వాసంతో ఆడిన గంభీర్‌ పదే పదే సింగిల్స్‌, డబుల్స్‌తో తన ఇన్నింగ్స్‌ను నిర్మించుకున్నాడు. ఐతే 24వ ఓవర్లో మహ్మదుల్లా స్ట్రెయిట్‌ డెలివరీకి అతడు బౌల్డ్‌ కావడంతో 83 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వీరూ.. విరాట్‌ జోరు: ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లిల భాగస్వామ్యమే హైలైట్‌. వీరూ విధ్వంసానికి ఇన్నింగ్స్‌ మధ్యలో కోహ్లి తోడవడంతో బంగ్లా విలవిల్లాడింది. ఎందరు బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. ఎప్పటిలాగే దూకుడును ప్రదర్శించిన కోహ్లి అద్భుతమైన డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు.

పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు రాబట్టాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ చకచకా సింగిల్స్‌ తీశాడు. నయీమ్‌ ఇస్లామ్‌ వేసిన 33వ ఓవర్లో కవర్‌లో రెండు ఫోర్లతో పాటు ఓ సిక్స్‌ కొట్టాడు. సెహ్వాగ్‌ అంతకుముందు ఓవర్లో మిడ్‌వికెట్లో సింగిల్‌ తీసి సెంచరీ 94 బంతుల్లో పూర్తి చేశాడు. 35వ ఓవర్లో భారత్‌ బ్యాటింగ్‌ పవర్‌ ప్లే తీసుకుంది. అందులో 48 పరుగులొచ్చాయి. గాయం కారణంగా వీరూ.. గంభీర్‌ను రన్నర్‌గా పెట్టుకుని అడాడు. జోరు చూస్తుంటే డబుల్‌ సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ అలసిపోయిన అతడు 48వ ఓవర్లో బౌల్డయ్యాడు. కోహ్లితో కలిసి సెహ్వాగ్‌ మూడో వికెట్‌కు 203 పరుగులు జోడించాడు. చివరి ఓవర్‌ ఐదో బంతికి శతకం పూర్తి చేసిన కోహ్లి ఆనందం పట్టలేక పోయాడు.

స్కోరు

భారత్‌ ఇన్నింగ్స్‌: సెహ్వాగ్‌ (బి) షకిబ్‌ 175; సచిన్‌ రనౌట్‌ 28; గంభీర్‌ (బి) మహ్మదుల్లా 39; విరాట్‌ కోహ్లి నాటౌట్‌ 100; యూసుఫ్‌ పఠాన్‌ (సి) ముష్ఫికర్‌ (బి) షఫియుల్‌ ఇస్లామ్‌ 8; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (50 ఓవర్లలో 4 వికెట్లకు) 370; వికెట్ల పతనం: 1-69, 2-152, 3-355, 4-370

బౌలింగ్‌: షఫియుల్‌ ఇస్లామ్‌ 7-0-69-1; రుబెల్‌ 10-0-60-0; అబ్దుర్‌ రజాక్‌ 9-0-74-0; షకిబ్‌ అల్‌ హసన్‌ 10-0-61-1; నయీమ్‌ ఇస్లామ్‌ 7-0-54-0; మహ్మదుల్లా 7-0-49-1

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ (సి) యువరాజ్‌ (బి) మునాఫ్‌ 70; ఇమ్రుల్‌ కయెస్‌ (బి) మునాఫ్‌ 34; జునైద్‌ సిద్దిఖీ (స్టంప్డ్‌) ధోనీ (బి) హర్భజన్‌ 37; షకిబ్‌ (సి) హర్భజన్‌ (బి) యూసుఫ్‌ 55; ముష్ఫికర్‌ (సి) రైనా (బి) జహీర్‌ 25; రకిబుల్‌ నాటౌట్‌ 28; మహ్మదుల్లా (బి) మునాఫ్‌ 6; నయీం ఇస్లామ్‌ ఎల్బీ (బి) మునాఫ్‌ 2; అబ్దుర్‌ రజాక్‌ ఎల్బీ (బి) జహీర్‌ 1; షఫియుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ 0; రుబెల్‌ హొసెన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 24 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 283; వికెట్ల పతనం: 1-56, 2-129, 3-188, 4-234, 5-248, 6-261, 7-275, 8-279, 9-280

బౌలింగ్‌: శ్రీశాంత్‌ 5-0-53-0; జహీర్‌ 10-0-40-2; మునాఫ్‌ పటేల్‌ 10-0-48-4; హర్భజన్‌ 10-0-41-1; యూసుఫ్‌ పఠాన్‌ 8-0-49-1; యువరాజ్‌ 7-0-42-0

YS Vijayalakshmi joins Jagan Fees Deeksha
Lara Dutta-Mahesh Bhupathi sangeet : Visuals

Dil Raju turns liar day-by-day?


Dil Raju turns liar day-by-day?
The talk of industry is about the supposed 'lies' Dil Raju is sharing with the media to promote his projects. This jumbo producer of Telugu Film Industry is saying that he wants to experiment with different stories as people love his taste. He quoted 'Brindavanam' and 'Gaganam' as the best examples of it before announcing them as commercial hits.

Trade reports say that, though 'Brindavanam' finally managed to recover the investment, it failed to generate profits. This is the reason that halted the flamboyant celebrations of 50days and 100 days functions of that movie. Though it is rich in content, you know the fate of 'Gaganam' already, else you can check with the empty parking stands in its theatres. So, what is that Dil Raju is trying to flash for those jaw-dropped spectators? Only, he can answer!

Telugu Anchor's 'Dum Maaro Dum' tensions


Telugu Anchor's 'Dum Maaro Dum' tensions
While the entire nation is gripped with Cricket fever, Tollywood is still choking with drugs and sex rackets. Though Bangalore based Telugu anchor Ishika is running at large these days, she is suddenly caught in a web of 'Dum Maaro Dum', as per reports.

Ishika is keeping herself busy by hosting a lot of programs for a reasonable remuneration. For all those close pals of this dusky hostess, it is well known that she smokes a lot. The other day, she is invited by some of her pals to a happening coffee lounge '… … *oom'. This western blended café had a chain of outlets in Hyderabad to serve the luxurious needs of its high profile customers. According to reports, at one such outlet, hookah and drugs are in abundant for ecstasy of some babus.

Our Ishika is said to be emptying packets of imported cigarettes before rounded up by the task force police on that fateful day. Though the police freed her after questioning, the incident came as a shock to many, including the anchor and they thanked God for the absence of Media. It is also heard that the task force sleuths had a secret vigil on this duck cheeked anchor from now, as she is behaving suspiciously.

Lean Hero fails to tempt the girls

Lean Hero fails to tempt the girls
The skeleton man Varun Sandesh is getting into a deep black hole of failures. Till now, audience considered him only as a lover boy with small following in girls and now he is at the danger of loosing this minimum image. Already the serial flops from 'Evaraina Epudaina' to 'Yemaindi Ee Vela' made Varun Sandesh a low guaranteed hero and the next release of 'Kudurithe Kappu Coffee' is the only light at end of tunnel to save him.

Apparently, Producers are looking for a solo release of this flick with no competition but it looks impossible as many small budgeted movies are queued up to hit the theatres in coming weeks. Till then Varun Sandesh is trying to sustain the interest on movie by participating in chat shows and interactive group discussions with young girls in TV channels. But his foolish answers and unmanly outlook has become a joke for babes on these shows and Varun is absolutely failed tempting the girls with his wits.  

Digital sentiment shakes Tollywood

Digital sentiment shakes Tollywood
If wishes were horses, there is no doubt that our directors and producers will make them run to Hollywood. To save a budget of whopping 25-35 lakhs, our makers opted to shoot with Digital Cameras (Red One, Arri Alexa, Canon 5D Mark II) unlike regular film ones. Now, the same 'digital' is sending shivers down the spines of many in Tollywood.

One can surely say that our guys are using latest technology but not technically brilliant. Films like Gaganam, Vastadu Na Raju, KSD Appalraju boasts the blunders of our inability in handling digital cameras with that washed out color-tones and frame-dropping pan shots (rolling shutter problem).  Same technology produced stunning outputs in Hollywood. Another noticeable fact is that most of these digitally made films generated positive talk in terms of content, but are not filling the pockets of producers. The future of more than half a dozen Telugu films that are shooting in digital at present is in a state of confusion. Both the technical snags and crippled success piled up to become a 'Digitlal Sentiment' to shake Tollywood.