హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం స్పందించదా అని అయన ప్రశ్నించారు. జగన్ దీక్షపై ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. జగన్ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారని, అయితే ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ వైద్యులను కూడా పరీక్షించడానికి పంపించేలేదన్నారు. మూడు రోజులుగా కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉంటున్నారన్నారు. ప్రభుత్వానికి బకాయిల విడుదలపై, రాష్ట్ర సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ఈ అంశంపై ఏదో విధంగా కాలం గడపాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 24వ తేదీ సాయంత్రం వరకు జగన్ ఫీజుపోరు కొనసాగుతుందని ఆయన చెప్పారు. జగన్ యువకుడు, మిత ఆహారి కాబట్టి ఇంకా బాగానే ఉన్నాడన్నారు.
No comments:
Post a Comment