BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 13, 2011

జూ ఎన్టీఆర్ ఇంటిలోగిల్లో లగ్నపత్రిక సందడి..

Jr Ntrనార్నే శ్రీనివాసరావు గారాల పట్టి లక్ష్మీ ప్రణతితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం నాడు ఇరువైపు కుటుంబాల వారు లగ్నపత్రిక మార్చుకోవడానికి సిద్దపడుతున్నారని వినికిడి. ఈ కార్యక్రమానికి సంబంధించిన సందడి గురువారం నుంచే ఆరంభమయ్యిందని నార్నే ఇంటిని చూస్తే అనిపిస్తోంది. భారీ ఎత్తున పందిళ్ళు, పూలమాలల అలంకరణ చేయిస్తున్నారు. ఈ హడావిడి అంతా లగ్నపత్రిక కార్యక్రమం కోసమేనని పరిశీలకులు అంటున్నారు.

నేను డబ్బుకు దాసోహం కాను-స్టార్ హీరోయిన్ అనే పొగరు నాకు లేదు...

Trishaనన్నెవరూ డబ్బుతో కొనలేరు..నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని. డబ్బుకోసమో, పాపులారిటీ కోసమో సినిమా రంగంలోకి రాలేదు. సినిమా రంగాన్ని ఓ ప్రొఫెషన్ గానే ఎంచుకున్నానంతే..’అంటోంది సౌతిండియన్ బ్యూటీ త్రిష . కథ తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా ఓప్పుకుం టానంటోన్న త్రిష, పాత్ర తీరుతెన్నులు అర్థం చేసుకుని, ఎలాంటి కాస్ట్యూమ్ ధరించాలనేదీ తానే డిసైడ్ చేసుకుంటానని చెబుతోంది.

స్టార్ హీరోయిన్ అనే బేషజాలు తనకేమీ లేవనీ, రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపుల్లేవనీ, నా అవసరాన్ని బట్టి నిర్మాత రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారని త్రిష చెప్పుకొచ్చింది. టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా..తనకు పెద్దగా తేడా ఏమీ లేదని, ప్రేక్షకలు మెప్పు పొందడమే లక్ష్యంగా సినిమాలు చేస్తానంటోంది త్రిష.

శివరాత్రినాడు భయపెట్టటానికి చార్మి ప్రిపరేషన్

Charmiచార్మి ప్రధాన పాత్రగా దర్శకుడు ఓషో తులసీరామ్(మంత్ర ఫేమ్) రూపొందించిన చిత్రం 'మంగళ'. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.వి. శర్మ, ఓషో తులసీరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులన్నీ ముగింపుకొచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు గంగపట్నం శ్రీధర్ మీడియాకు తెలియజేస్తూ "చార్మికి ఇదొక వైవిధ్యమైన చిత్రం.ఇటీవల విడుదలైన పాటలకి అద్భుత స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' మాదిరిగానే ఈ సినిమా కూడా అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది. ప్రేక్షకుల్ని భయపెట్టడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. మేం మాత్రం కొత్త పంథాలో వెళ్లాం. చార్మి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. ఆహార్యం విషయంలో చార్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది '' అన్నారు. ప్రదీప్ రావత్, విజయ్‌సాయి, ఉత్తేజ్, పావలా శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, ఛాయాగ్రహణం: శివేంద్ర, సహ నిర్మాత: నాగేశ్వరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్.

రాజకీయ భేరాల కోసమే కెసిఆర్ అవిశ్వాసం: టిడిపి నేత దాడి వీరభద్రారావు

Dadi Veerabhadra Raoవిశాఖపట్టణం: రాజకీయ భేరాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవిశ్వాసం అంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రారావు ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించారు. ఆయన తన రాజకీయ అవసరాల కోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారన్నారు. ఆయన సవాల్‌కు తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు.

తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం తన నిర్ణయం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పక పోవడమేమిటన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో కలుస్తానని కెసిఆరే గతంలో చెప్పారు: ఎమ్మెల్యే గండ్ర

Gandra Venkata Ramana Reddyవరంగల్: కాంగ్రెస్ పార్టీలో కలుస్తానని గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలోనే చెప్పారని వరంగల్ జిల్లా శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం అన్నారు. కెసిఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసినా కలవకున్నా తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని చెప్పారు. ఆయన వచ్చినా, రాకున్నా మాకు ఫరవాలేదని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజల మనోభావాల్ని అధిష్టానానికి చెప్పి తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పించేందుకు మా వంతు కృషి మేం చేస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం లేకుంటే కేంద్రం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన అయినా చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 9 ప్రకటనను బలపరుస్తూ మరో ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. అధికార పార్టీ సభ్యులుగా సహాయ నిరాకరణలో పాల్గొనలేమని ఆయన స్పష్టం చేశారు.

సాక్షిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్‌రావు

Shankar Raoగుంటూరు: చేనేత, జౌళీ శాఖామంత్రి శంకర్‌రావు సాక్షి పత్రికపై ఆదివారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సాక్షి ప్రతినిధి అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సాక్షి ప్రతినిధి వేసిన ఏఐసిసి అధ్యక్షురాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నేను మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి(కాకా) సోనియాపై చేసిన వ్యాఖ్యలపై సాక్షి ప్రతినిధి ప్రశ్నించారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించి తీరుతుందని విజయవాడలో అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయన ఆదివారం పర్యటించారు. విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత శాఖ అధికారులు, చేనేత సొసైటీ సభ్యులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కో జిల్లా నుంచి నలుగురు ప్రతినిధులు చొప్పు వస్తే ముఖ్యమంత్రితో సమీక్ష ఏర్పాటు చేయిస్తానని శంకర్రావు చేనేత సొసైటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.312 కోట్ల చేనేత రుణమాఫీలో తొలివిడత 109 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు, మార్చి 21 లోపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని మంత్రి తెలిపారు

15-year-old girl raped in UP

Firozabad, February 13: A 15-year-old girl was allegedly raped by a teenager in Rasoolpur area here, police said today.
"The girl was forcibly dragged into the fields and raped by Ram Mohan (16) on February 8," Additional Superintendent of Police Daddanpal said, adding that a report in this connection was lodged today.
He said the accused has been arrested and medical examination of the girl is being conducted.

Man involved in 25 cases arrested

New Delhi: A 37-year-old man, allegedly involved in around 25 cases, was arrested in north Delhi with police today claiming that they recovered four cars he allegedly stole along with his associates.
The arrested has been identified as Mohd Nisar, who hails from Meerut in UP. Four cars and a country-made pistol were recovered from him, S S Yadav, Deputy Commissioner of Police (North), said.
Nisar was apprehended from near Nigam Bodh Ghat yesterday, he said.
During interrogation, Yadav claimed, he told police that he is running his gang in association with his partner Zahoor.
Nisar told police that he was arrested in 2006 by South District police and at that time also, stolen cars were recovered by them at his instance.
"After that he changed his criminal trade and started supplying smack in Delhi but was again apprehended by South-East District police," Yadav said.

Cuckolded husband kills three minors in revenge

Raipur,: Chhattisgarh's temple town of Ratanpur woke up to a bloody Sunday with the discovery of the corpses of three children - all below ten years of age. The children were killed by a man in revenge for his wife eloping with their uncle, police said.
"It's a brutal and shocking killing. The man, Manoj Suryavanshi, lured Ajay, 9, Sakchhi, 7, and Vijay, 5, on Friday when they were on way back to their house from school and killed them in a field on the outskirts of Ratanpur. Their bodies were recovered Sunday when locals spotted it and informed us," Ajay Yadav, police chief of Bilaspur district, told IANS over phone.
Manoj confessed to the police that he decided to kill the three children as his wife's decision of running away with their uncle had greatly embarassed him in the village and also caused misery to his two daughters, both below five years of age.
Ratanpur, situated in Bilaspur district, is located some 130 km from state capital Raipur.

20 killed as bus catches fire in Pakistan

Islamabad, February 14: At least 20 people were killed and several others injured when a bus caught fire in Pakistan's Punjab province, a media report said.
The incident happened Sunday night in Gujar Khan, around 100 km from Rawalpindi, police were quoted as saying by Samaa TV.
The bus was returning from Sialkot, they said.
The cause of the fire is not immediately known but eye witnesses said that a cylinder blast was heard before the bus turned into a fireball, the channel reported, adding that the passengers were returning from a wedding ceremony.
Rescuers were trying to recover the bodies. The lack of necessary equipment is reportedly causing difficulties in their work.
"The bodies are badly burnt and it is difficult to identify them," said a rescue official. The injured were shifted to a nearby hospital.
Last month, more than 30 people were burnt to death in a similar incident when a bus rammed into an oil tanker in Pakistan's Sindh province.

AP minister enters into altercation with journalist

 

Guntur: Andhra Pradesh Handlooms Minister P Shankar Rao lost his cool at a press conference here today and called a journalist unfit for his job, after which the latter said that he was not fit to be a minister.
It all began when the reporter, working with a television channel, asked the minister as to why he cricitised Warangal MLA Konda Surekha, a supporter of Jaganmohan Reddy, for lashing out at Congress president Sonia Gandhi, when he preferred not to react when a senior party leader raised question marks on Gandhi's nationality and called her misfit to be an Indian leader.
Not satisfied with Rao's response, the journalist continued asking the minister counter-questions, thereby annoying him following which Rao said the reporter was misfit to be in journalism.
The reporter retaliated by saying, "You are not fit for a minister job..