BREAKING NEWS
Tuesday, January 18, 2011
లెస్బియన్ ఆంటీగా నటించడానికి సిద్దమైన హీరోయిన్
ఆదివారం లాస్ ఏంజిల్స్ లో జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో హిట్ టివి సిరిస్ 'గ్లీ' షో నిర్మాత రేయన్ ముర్పే డేవిల్ వీర్స్ ప్రాదా సినిమా స్టార్ హీరోయిన్ అన్నే హాత్వేని కలవడం జరిగింది. హాలీవుడ్ సీరిస్‌లలో గ్లీ అనే షోది ప్రత్యేక స్దానం. స్వతహాగా అన్ని సింగింగ్ మరియు డాన్సింగ్ ప్రోగ్రామ్‌లకు మంచి ప్యాన్ అయినటువంటి అన్నే హాత్వే గతంలో కూడా గ్లీ షోలో క్రిస్ కోల్పోర్ గే క్యారెక్టర్ కుసంబంధించి రిలటివ్‌గా ఆంటీ(కుర్ట్ హమ్మెల్) నటించడానకి ఒప్పుకున్న కొన్ని అనివార్యకారణాల వల్ల అది జరగలేదు.
సూరి హత్య కేసు: బయటపడుతున్న సినీ, రాజకీయ లింక్ లీలలు
సూరి హత్య కేసు: బయటపడుతున్న సినీ, రాజకీయ లింక్ లీలలు......
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యతో రాష్ట్ర రాజకీయ, తెలుగు సినీ రంగాల డొంక కదులుతోంది. సూరిని అతని నమ్మినబంటు భాను కిరణ్ హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్న స్థితిలో రాజకీయ, సినీ రంగాల పెద్దల పేర్లు వెలికి వస్తున్నాయి. హైదరాబాదు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలా కాలంగా భూదందాలు, సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిల్, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయనేది సూరి హత్య జరిగేంత వరకు ప్రచారం మాత్రమే. ఆ ప్రచారం ఇప్పుడు వాస్తవాల రూపంలో బయటపడుతున్నాయి.
రాజకీయాలు, సినీ రంగాలు మిలాఖతైన వైనం కూడా గత కొద్ది కాలంగా చూడవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. కానీ సూరి హత్య జరిగిన తర్వాత మాఫియా సంబంధాలు బయటపడుతున్నాయి.
పులివెందుల ముఠాలు హైదరాబాదులో సెటిల్మెంట్లు చేస్తున్నాయని, భూకబ్జాలకు పాల్పడుతున్నాయని దివంగత నేత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సభలోనే అప్పట్లో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ఆరోపించారు. దాన్ని ఎవరూ అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు సూరి హత్యతో డొంక కదులుతోంది.
రాజకీయ వైరుధ్యాలు కూడా భూదందాలు, సెటిల్మెంట్లు బయటపడడానికి దోహదం చేస్తున్నాయి. సూరి హత్య వెనకనే కాకుండా మస్తాన్ రావు అనే రియల్టర్ ఆత్మహత్య వెనక వైయస్ జగన్ హస్తంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, స్టూడియోఎన్ టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. వైయస్సార్ కుటుంబ సభ్యులు భాను కిరణ్ దందాల్లో ఉన్నారని వైయస్ తోడల్లుడు మల్లికార్జున రెడ్డి ఉదంతాన్ని చూపుతూ వేలెత్తి చూపుతున్నాయి.
కాగా, తెలుగు సినీరంగంలో కొద్ది మంది నిర్మాతలపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. కానీ, వాటిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. మాస్ హీరోలతో భారీ బడ్డెట్‌లతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవరూ అడిగిన పాపాన పోలేదు. అయితే, భాను కిరణ్‌కు చెందిన 43 ఆస్తులు సినీ నిర్మాత సి. కళ్యాణ్ పేర ఉన్నట్లు పోలీసులు కనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూరి పేరు మీద కళ్యాణ్ సహకారంతో భాను సెటిల్మెంట్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాత శింగనమల రమేష్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, నిర్మాతగా మారిన హాస్యనటుడు గణేష్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.
సూరి పేరు మీద భాను కిరణ్, మంగలి కృష్ణ, శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తులు భూదందాలు చేసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నింటికీ జగన్‌తో లింక్ కలిపే ప్రయత్నం చేస్తోంది. మస్తాన్ రావు ఆత్మహత్య కేసులో జగన్‌ను రికార్డు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్‌ను అనవసరంగా ఇరికిస్తున్నారని, తనను కూడా అనవసరంగా లాగుతున్నారని, ఓ కుట్ర జరుగుతోందని శ్రీకాంత్ గౌడ్ అంటున్నారు. మొత్తం మీద, రియల్ ఎస్టేట్ బూమ్‌కు దందాలకు, సెటిల్మెంట్లకు సంబంధం ఉందనే విషయం మాత్రం అర్థం చేసుకోవచ్చు.
భానుతో కమెడియన్ గణేష్ కు లింకులు: టాలీవుడ్ చుట్టూ భాను స్టోరీ
భానుతో కమెడియన్ గణేష్ కు లింకులు: టాలీవుడ్ చుట్టూ భాను స్టోరీ......
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ తో టాలీవుడ్ కి ఉన్న సంబంధాలు రోజుకో కొత్త కోణం బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భారీ నిర్మాతలు సి.కళ్యాణ్, శింగనమల రమేష్‌బాబుతో భానుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు వీరిని విచారించారు. ఇప్పుడు మరో నిర్మాత గణేష్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌తో భాను సంబంధాలపై పోలీసులు కూపి లాగుతున్నారు. గణేష్ చిన్న కమేడియన్ స్థాయినుండి భారీ నిర్మాతగా ఎలా ఎదిగాడనే విషయంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఒక్కో సినిమాకు లక్ష రూపాయల లోపు రెమ్యునరేషన్ తీసుకునే గణేష్ భారీ చిత్రాలు ఎలా నిర్మించాడనే కోణాన్ని పరిశీలిస్తున్నారు.
గణేష్ సినిమాలలో కమేడియన్‌గా నటించేవాడు. అయితే హీరో రవితేజతో ఇటీవల గణేష్ ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మరో కొన్ని చిత్రాలు తీయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే మామూలు కమేడియన్ భారీ చిత్రాలు తీయడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయనను సిసిఎస్ పోలీసులు రెండుమూడు రోజుల్లో విచారించే అవకాశముంది. గణేష్‌కు భాను కిరణ్‌తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ల్యాండ్ విషయంలో భానుకు, గణేష్ కు పరిజయం ఏర్పడిందని భావిస్తున్నారు. ఆ పరిచయం కాస్త పెరిగి గణేష్‌ను నిర్మాతగా ఎదిగేందుకు అవకాశం వచ్చినట్టుగా భావిస్తున్నారు. గణేష్ భానుతో కలిసి భూదందాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తదితర రంగాలలోకి గణేష్ దిగటం వల్లనే కమేడియన్‌గా తెరపై కనిపించడం లేదని భావిస్తున్నారు. మొత్తానికి పోలీసుల విచారణలో భాను గురించి కొత్త కొత్త విషయాలు తెలియడమే కాకుండా, టాలీవుడ్ చుట్టూ తిరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రవితేజ సినీ కెరీర్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారంటే...
రవితేజ సినీ కెరీర్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారంటే...
రవితేజ తాజా చిత్రం మిరపకాయ విజయాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడుతూ...తాను రిటైరయ్యేది లేదని,తన చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉంటానని అన్నారు. అలాగే తను యేడాదికి ఇన్ని సినిమాలు చేయాలి అన్ని చేయాలి అన్న ఆలోచన లేదని, ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేస్తూనే ఉంటానని అన్నారు.అలాగే తన చిత్రాల్లో కామిడి అనేది ఉండేలా చూసుకుంటానని జీవితంలోనే ఎంతో డ్రామా ఉండగా తన సినిమాలతో వారిని మరింత విసుగు తెప్పిచదలచుకునే ఆలచన లేదని అన్నారు. అలాగే తనకు వేరే వ్యాపకం ఏదీ లేదని సినిమానే తనకు ఆహారం, శ్వాస, జీవితం అన్నారు. ఇక తనకు ట్రాజిక్ ఫిల్మ్ లు అంటే అస్సలు ఇష్టం ఉండవని, రెండున్నర గంటల సేపు తన సినిమాకు వచ్చిన వారు రిలాక్స్ అవ్వాలని, అందుకే వారిని నవ్వించాలనే ప్రయత్నిస్తూంటనని అన్నారు.ఇక తను సీరియస్ రోల్స్ పోషించదలిచినా విక్రమార్కుడు లాంటి సినిమాలు ఎన్నుకుని ఎంటర్టైన్ మెంట్ మిస్ కాకుండా చూసుకుంటానని అన్నారు. అలాగే తన మిరపకాయ చిత్రాన్ని కావాలని సంక్రాంతికి పోటీకి పెట్టలేదని,అది కో ఇన్సెడంట్ గా జరిగిందని,ఎన్ని సినిమాలు ఉన్నా తన సినిమా విజయం సాధించటంతనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.
కృష్ణవంశీ నెక్ట్స్ చిత్రం ‘నాగవంశ’ లేటెస్ట్ ఇన్ఫో ...
కృష్ణవంశీ నెక్ట్స్ చిత్రం ‘నాగవంశ’ లేటెస్ట్ ఇన్ఫో ...
కృష్ణవంశీ, నాగార్జన కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగవంశ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు. కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అందరికీ నచ్చే విధంగా వుంటుందని, నాగార్జున అభిమానులతో పాటు ప్రేక్షకులు నచ్చే, మెచ్చే అంశాలు ఇందులో వుంటాయని నిర్మాత చెబుతున్నారు. ఇది ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తాం. ఎక్కడా రాజీపడకుండా చిత్రం రూపుదిద్దుకోనుంది అని ఆయన చెబుతున్నారు. చూద్దాం ఈ ‘నాగవంశ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
డైరక్టర్ కి చాలా టాలెంట్ ఉంటే తప్ప చేయనంటున్న కాజల్
డైరక్టర్ కి చాలా టాలెంట్ ఉంటే తప్ప చేయనంటున్న కాజల్....
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం నాకు అభ్యంతరం లేదు. అలాగే నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా వెనుకాడను. కాకపోతే... అలాంటి పాత్రలు ఒప్పుకునే ముందు దర్శకుడి గురించి మాత్రం ఆలోచిస్తాను. ఒక హీరోయిన్‌ని నెగటివ్ టచ్ లో చూపించాలంటే దర్శకుడికి చాలా టాలెంట్ కావాలి. అలాంటి దర్శకుడు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను అంటోంది కాజల్ అగర్వాల్. అలాగే హిందీ సినిమాలకు అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే హిందీ నాకు బాగా వచ్చు. అందుకని ఆ భాషలో నటించడం నాకు చాలా సులువు అని చెప్పారు. ప్రస్తుతం కాజల్...నాగచైతన్య సరసన అజయ్ భుయాన్ చిత్రంల చేస్తోంది.అలాగే రామ్ చరణ్ మెరుపు నుంచి డేట్స్ లేవని తప్పుకుంది. అలాగే ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి చిత్రం రచ్చలో ఆమె బుక్కయింది. అలాగే ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ ఫెరఫెక్ట్ లోనూ చేస్తోంది.
సుమంత్ 'గోల్కొండ హైస్కూల్' రిజల్ట్ ఏమిటి?
సుమంత్ 'గోల్కొండ హైస్కూల్' రిజల్ట్ ఏమిటి?
సంక్రాంతికి విడుదలైన సుమంత్ తాజా చిత్రం "గోల్కొండ హైస్కూల్". అష్టా చెమ్మా చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరోసారి కలర్స్ స్వాతిని తీసుకుని క్రికెట్ క్రీడ నేఫద్యలో ఈ చిత్రం తెరకెక్కించారు. స్లో నేరషన్, ఆకట్టుకోని కథనం, వినోదం లేకపోవటంతో ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలకపోతోంది. అక్కడక్కడా బావుంది అని పించినా టోటల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల నాడి పట్టుకోవటంతో విఫలమయిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక కథ విషయానికి వస్తే...హైదరాబాద్ లోని గోల్కొండ హైస్కూల్ కు కార్పోరేట్ వాతావరణంతీసుకొచ్చి హైటెక్ కోచింగ్ సెంటర్ గా తీర్చిదిద్దాలి అనే ప్రపోజల్ తో వస్తాడు ఆ స్కూల్ కు ట్రస్టీ కిరీటి (సుబ్బరాజు). అందుకోసం ఎందుకూ పనికిరాకుండా ఉన్న స్కూల్ గ్రౌండ్ లో కోచింగ్ కాంప్లెక్స్ కట్టాలి అని పట్టు పడతాడు. పిల్లలకు చదువెంతో ఆటలూ అంతే అని ఆలోచించిన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ విపత్తును ఆపటానికి స్కూల్ లో క్రికెట్ కోచ్ గా ఒకప్పటి పాత విద్యార్ధి సంపత్(సుమంత్) ను రప్పిస్తాడు. క్రికెట్ ప్లేయర్ అయిన సంపత్ గ్రౌండ్ ను కాపాడే క్రమంలో కిరీటి తో ఇప్పుడున్న టీంను ఇంటర్ స్కూల్ చాంపియన్ గా నిలబెడతాను అని చాలెంజ్ చేస్తాడు.
అక్కడే ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న అంజలి (స్వాతి) సంపత్ ఫై ప్రేమ పెంచుకుని అతనికి సపోర్ట్ చేస్తుంది. వివిధ నేపధ్యాలనుండి వచ్చిన పదకొండు మంది స్కూల్ పిల్లలు క్రికెట్ ను సరదాగా ఆడుతూ ఉంటారు. ఆ సరదా క్రికెట్ ను సీరియస్ గా మారుస్తాడు గోల్కొండ హైస్కూల్ టీం ను టోర్నమెంట్ కు సిద్ధం చేస్తాడు. ఆ ఫై వాళ్ళు చాంపియన్ షిప్ ను గెలిచి స్కూల్ గ్రౌండ్ ను ఎలా కాపాడుకున్నారు అన్నది మిగతా కధ. ఈ కథ షారూఖ్ ఖాన్ హిట్ చక్ దే ఇండియాను చాలా మందికి గుర్తు చేస్తే, చివరి అరగంట అమీర్ ఖాన్ లగాన్ లో క్రికెట్ పోటీని గుర్తు చేస్తుంది.పిల్లలను టార్గెట్ చేసినట్లున్న ఈ చిత్రం ఫైనల్ గా ఏ వర్గానికి నచ్చుతుంది అంటే ఆలోచనలో పడాల్సిందే. స్కూల్లో జరిగే క్రికెట్ టోర్నమెంటు నేపథ్యంగా జరిగే కథ ఇది. హరిమోహన్ పరువు రచించిన 'ది మెన్ విత్‌ఇన్' నవల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుబ్బరాజు, షఫీ, రవిప్రకాశ్, ఝాన్సీ, హేమలతోపాటు కొంతమంది పాఠశాల విద్యార్థులూ నటించారు. కెమెరా: సెంథిల్ కుమార్, సంగీతం: కల్యాణి మాలిక్, పాటలు: సీతారామశాస్త్రి, కళ: రవీందర్, కూర్పు: శ్రావణ్.
ఆయన చేతిలో బాబాయి ఇర్కున్నాడు నేను మాత్రం ఇరుక్కోనంటున్న జూ ఎన్టీఆర్..
ఆయన చేతిలో బాబాయి ఇర్కున్నాడు నేను మాత్రం ఇరుక్కోనంటున్న జూ ఎన్టీఆర్..
సింహా సినిమా లాంటి బాక్సాఫీసు విజయానందంలో ఉన్న బాలయ్య బాబుని పరమవీర చక్క అంటూ బాలయ్య బాబు ఇమేజ్‌ని డామేజ్ చేసిన దాసరి నారాయణరావు త్వరలో తన 151వ సినిమా తీస్తున్నానని ప్రకటించాడు. దీనితో దాసరి తన 151వ సినిమా ఏహీరోతో చేస్తాడనే చర్చలు ఆరంభమయ్యాయి. తాజాగా దీనిపై ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి సర్దార్ పాపారాయుడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలింసిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈసినిమా సీక్వెల్‌ని దాసరి నారాయణరావు జూ ఎన్టీఆర్ తోచేయనున్నారని సమాచారం. ఐతే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాసరి చేతినుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఇది మాత్రమే కాకుండా సింహా తర్వాత బాబాయికి ఒక రేంజి హిట్ ఇస్తాడని అనుకుంటే బాబాయి ఇమేజ్ నిపూర్తిగా డామేజ్ చేసినందుకు దాసరిపై జూనయర్ ఎన్టీఆర్ కూడా చాలా కోపంగా ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఏదో ప్రస్తుతానికి నామానాన నేను కుర్ర డైరెక్టర్లుతో సినిమాలు తీసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి నాజీవితాన్ని అమాంతం తీసుకెళ్శి దాసరి చేతిలో పెట్టలేనంటూ జూ ఎన్టీఆర్ తప్పించుకుంటున్నాడని సమాచారం.
Subscribe to:
Posts (Atom)