ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 20, 2011
దేవకట్ట 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో నాగచైతన్య పాత్ర గురించి..
దేవకట్ట, నాగచైతన్య కాంబినేషన్ లో "ఆటో నగర్ సూర్య" అనే చిత్రం త్వరలో రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల..ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆయన తాజాగా ఈ విషయమై ట్వీట్ చేస్తూ...ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో..హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం. మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఇక ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.
No comments:
Post a Comment