BREAKING NEWS
Sunday, February 20, 2011
నేను మిస్టర్ ఫర్ ఫెక్ట్' నే పెళ్ళి చేసుకుంటాను...కాజల్
మగధీర చిత్రంతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కాజల్. ఆమెకీ ప్రభాస్ కీ మధ్య రిలేషన్ నడుస్తోందని, త్వరలోనే వివాహం చేసుకుంటారని వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ నేఫద్యంలో కాజల్ నీక్కాబోయేవాడు ఎలా ఉండాలి? అని మిడియా వారు అడిగారు .దానికి ఆమె తడుముకోకుండా .. ‘చదువు, సంస్కారం వంటి అన్ని విషయాల్లోనూ పెర్ఫెక్ట్గా ఉన్నవాడై ఉండాలి’ అని చెప్పేసింది. దాంతో అంత డైరక్ట్ గా చెప్పటం విన్నవారు షాక్ అయ్యారు. అంతలోనే తేరుకుని ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనేమీ లేదని తేల్చిచెప్పేసింది.కాజల్ ప్రస్తుతం ప్రభాస్తో ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ చిత్రంతోపాటు రవితేజతో ‘వీర’ నాగచైతన్యతో ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ నటిస్తోంది.ఇక ఈ మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, దశరధ్ దర్శకత్వం వహించారు. దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్ రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment