BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, February 17, 2011

రొమాన్స్, ఎంజాయ్ అంటున్న జూ.ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు

Sameera Reddyరొమాన్స్ చేయడం ఎప్పుడయినా చాలా ధ్రిల్ ఇచ్చే విషయమే. అయినా లైఫ్ ఉన్నది మనకు అణుగుణంగా బ్రతకటానకే..ఎవరికోసమో ఎవరూ ఉండరు. ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలి అంటోంది సమీరా రెడ్డి. అలాగని నేను ఎవరినీ జీవిత భాగస్వామిగా భావించలేదు. అందరూ ఫ్రెండ్సే. ఎవరితోనూ హద్దులు దాటలేదు మన జాగ్రత్తల్లో మనం ఉంటూ రొమాన్స్ ని ఎంజాయ్ చేయాలి. గడిచిపోయిన కాలం తిరిగిరాదు కదా అంటోంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది.

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు. కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.

నందమూరి, నారా ఫ్యామిలీల మద్య చిచ్చుపెట్టడానికి సిద్దమైన పూరి

Shakti-Soloతెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు పూరి జగన్నాద్..అందుకు కారణం ఆయన అసిస్టెంట్‌గా చేరింది ఎవరి దగ్గర అనుకుంటున్నారు ఎవరి పేరు చెబితే తెలుగు ఇండస్ట్రీకి చెమటలు పడతాయో ఆయనే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన డైరెక్షన్‌‌లో తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసినటువంటి పోకిరిని అందించారు. దాంతో పూరి జగన్నాధ్ పేరు తెలుగు సినిమా చరిత్రలో అలా నిలచిపోయింది.

ఇది మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ తనలాంటి కత్తిలాంటి డైరెక్టర్లుని కూడా అందివ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు మెహర్ రమేష, పరుశరామ్. వీళ్శిద్దరూ పూరి జగన్నాధ్‌కు రెండు చేతులు. ఇంతకీ మనం వీళ్శ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పూరి జగన్నాధ్ అంబులో పోదిలోంచి వచ్చినటువంటి ఈఇద్దరూ డైరెక్టర్లు ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి మరియు నారా ఫ్యామిలీ మద్య పోటీ వాతావరణం ఏర్పాటు చేయడానికి కారణం అవుతున్నారు కాబట్టి.

ఎన్టీఆర్ కాలం నుండి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని నందమూరి ప్యామిలీ ఏలుతా వచ్చింది. ఇప్పుడు కొత్తగా నారా వారి ఫ్యామిలీ నుండి ఓ నటుడు రావడం జరిగింది. ఈ రెండు కుటుంబాలకు మొదటి నుండి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నందమూరి ప్యామిలీ నుండి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి స్టారా రావడం జరిగింది. అదే విధంగా నారా వారి ప్యామిలి నుండి బాణం అనే సినిమా ద్వారా నారా రోహిత్ పరిచయం అయ్యాడు.

ఐతే ఆడైరెక్టర్స్‌కి వీరికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా..సంబంధం చాలా ఉందండి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుపెట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా శక్తి అనే సినిమాని నిర్మిస్తున్నారు. అదేవిధంగా నారా రోహిత్ హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో సోలో సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా సోలో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ శక్తికి పోటీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈరెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎవరెవరి సత్తా ఎంత ఉంటుందో తెలిసిపోవడమే కాకుండా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్‌ వల్ల రాజకీయంగా ఏమైనా ఇబ్బంది వస్తే దానిని ఎదుర్కోవడానికి నారా ఫ్యామిలీ నుండి ఓ హీరో అవసరం అని నారా అభిమానులు అనుకున్నట్లు సమాచారం.

ఇక డైరెక్టర్లు విషయానికి వస్తే మెహార్ రమేష్ గతంలో జూ ఎన్టీఆర్‌కు కంత్రి, ప్రభాస్‌కు బిల్లా లాంటి హిట్స్ ఇవ్వడం జరిగింది. అదే పరుశరామ్ విషయానికి వస్తే రవితేజతో ఆంజనేయులు లాంటి డిజాస్టర్ ఫిల్మ్ ఇవ్వడం జరిగింది..

సునీల్ తో చేయటం కాకతాళీయం అనిపిస్తోంది

Ram Gopal Varmaపన్నెండేళ్ల క్రితం సుమంత్‌తో నేను రూపొందించిన ప్రేమకథ చిత్రంలో సుమంత్ స్నేహితుడి పాత్రను వేయడానికి ఓ ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ పాత్రకు అతను సరిపోడని రిజెక్ట్ చేశాను. అతనే సునీల్ అంటున్నారు రామ్ గోపాల్ వర్మ గతాన్ని తలుచుకుంటూ. అలాగే పన్నేండేళ్ల గ్యాప్ తర్వాత నేను రూపొందించిన తెలుగు చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు లో సునీల్‌ని హీరోగా పెట్టి సినిమా చేయడం కాకతాళీయం అనిపిస్తోంది అన్నారు రాంగోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో కిరణ్‌కుమార్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

జీవితాంతం చీకట్లో బ్రతికాలంటే కష్టం కదా...స్నేహ

Snehaరాత్రి పూట కరెంట్‌పోయి క్షణం వెలుతురు లేకపోతేనే మనం భరించలేం కదా. అలాంటిది జీవితాంతం చీకట్లో బతికాలంటే వారి పరిస్ధితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే అంతా నేత్రదానం చేయాలంటాను. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అందరికీ అవగాహన కల్పించాలి...మననంతా సహకరించాలి అంటోంది స్నేహ. ఆమె రీసెంట్ గా తన కళ్ళను నేత్రదానం చేసింది. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది అన్న మాటను నిజం చేసింది. తనలాంటి వారు చేసే పనులను చూసి మరింతమంది ప్రేరణ పొందుతారనే ఉద్దేశ్యంతో ఈ పనిచేసాను అంది. అలాగే నన్ను చూసి నలుగురైనా ఈ మంచి కార్యక్రమానికి పాల్పడుతారు కదా అని నేను ప్రచారం చేస్తున్నాను'' అని అంటోంది స్నేహ

అల్లు అర్జున్ బద్రినాధ్ స్టోరీ లైన్ ఇదేనా..?

Badrinathస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం బద్రీనాథ్ లో అల్లు అర్జున్ పాత్ర అది. మోడరన్ గా ఉంటూనే డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కధ ఇది. ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఫ్లాష్ బ్లాక్‌లో వచ్చేటటువంటి సీన్లు సినిమాకే పెద్ద హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఈసినిమాకి కధ అందించినటువంటి చిన్నికృష్ణ గతంలో సినిమాకి ప్రాణం సెకండాఫ్ లో వచ్చేటటుంటి డివోషనల్ బ్యాక్ డ్రాప్‌యేనని చాలా సార్లు చెప్పడం మనకు తెలిసిందే. ఈసినిమాని చాలా అత్యున్నత విలువలతో ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటోంది.

దశావతారం చిత్రానికి కెమెరామన్ గా పని చేసిన రవి వర్మ ఈ చిత్రానికి ఛాయా గ్రహణం అందిస్తుండగా, పీటర్ హెయిన్స్ ఫైట్స్ ను సమకురుతున్నాడు. గతంలో అర్జున్ తో బన్ని వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ కు బద్రినాథ్ విడుదల
........

జూ ఎన్టీఆర్ 'శక్తి' సినిమాలో ఈజిప్ట్ రాకుమారి కధేంటి..!!

Jr Ntrలెజండరీ డైరెక్టర్ కె విశ్వనాధ్ మొన్నామద్య తీసినటువంటి సినిమాలో హోమ్లీ ఫిగర్‌‌గా తెలుగు సినిమా ప్రేక్షకులు గుండెల్లో అలా నిలచిపోయింది మంజరి ఫడ్నిస్. ఆసినిమా తర్వాత మంజరికి తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి సినిమాలే లేకుండా పోయాయి. మరలా తన నటనా కౌశలాన్ని నిరూపించుకునేందుకు జూ ఎన్టీఆర్ రూపంలో వెతుక్కుంటూ మరో అవకాశం తన తలుపు తట్టింది. ఏంటా ఆఅవకాశం అని అనుకుంటున్నారా..శక్తి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశం.. ఈవార్త తెలుసుకున్న మంజరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అనడంలో సందేహాం లేదు.

దీంతో మంజరి డైరిలో ఇప్పటి వరకు ఇలాంటి బెస్ట్ ఆఫర్ రాలేదని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు. దానికి కారణం ఈసినిమాని అశ్వినిదత్ ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి మరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూ ఎన్టీఆర్ స్వయంగా మంజరి ఐతే ఆ క్యారెక్టర్‌కి కరెక్టుగా సరిపోతుంది అని అనడంలో మంజరి ఫడ్నిస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం. ఇది మాత్రమే కాకుండా కలలో కూడా ఇలాంటి అవకాశం తనకి వస్తుందని ఊహించి ఉండదు. ప్రస్తుతం తెలుగు ఇండస్టీలో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న జూ ఎన్టీఆర్ ప్రక్కన అవకాశం మాటలు కాదు అని అంటున్నారు సినీ పండితులు.

ఇక ఈసినిమాలో మంజరి ఫడ్నిస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈజిప్ట్ ప్రిన్సెస్‌గా పూజా బేడి నటిస్తుండగా ఆమె కూతురుగా మంజరి ఫఢ్నిస్ నటిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈసినిమాలో జూ ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన ఆయుధం కోసం వెతుక్కుంటూ దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించడం జరుగుతుందని సమాచారం. చివరకు ఆ ఆయుధాన్ని జూ ఎన్టీఆర్ ఎలా సంపాదించారనే ఇతివృత్తం ఆధారంగా కధ సాగుతుందని సమాచారం. ఈదెబ్బతో మంజరి ఫడ్నిస్ దశ కూడా తిరుగుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైనటువంటి శక్తి సినిమా వాల్ పేపర్స్ హాల్ చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఆడియో కార్యక్రమాన్ని ఈనెల 27వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. సినిమాని మార్చి 30న విడుదలే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు