BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, April 2, 2011

'శక్తి' హీనం(జూ ఎన్టీఆర్ శక్తి చిత్రం రివ్యూ)

Shakthi Review
సంస్థ: వైజయంతీ మూవీస్‌
నటీనటులు: ఎన్టీఆర్ ‌, ఇలియానా , సోనూ సూద్‌, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్‌, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్‌, తదితరులు.
మాటలు: సత్యానంద్
రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్
ఆర్ట్: ఆనంద్‌సాయి
కెమెరా: సమీర్ రెడ్డి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: సి. ధర్మరాజు
నిర్మాత: సి.అశ్వనీదత్‌
స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.


ఈసారి తీసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకూడదని అనుకున్నాం.హేమాహేమీలైన రచయితలు కథాసహకారాన్ని అందించడంతో చాలా పకడ్బందీగా కథ తయారైంది. 300 మంది యూనిట్ సభ్యులతో 18 నెలల పాటు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడు మెహర్‌రమేష్ అంటూ శక్తి చిత్రం విడుదలకు ముందు అశ్వనీదత్ మీడియాలో కంటిన్యూగా ఊదరకొట్టారు.దాంతో అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు కదా అని నమ్మి వెళ్ళిన వారికి ప్రేక్షకుడుని ఈ రోజు ఏప్రియల్ ఫూల్స్ డే కదా గుర్తులేదా అని ఓ నవ్వు నవ్వి వెటకారం చేసింది.జూ.ఎన్టీఆర్ తన పరిధి మేరకు కష్టపడి చేసినా మెహర్ రమేష్ తన శాయశక్తులా శక్తి చిత్రాన్ని సీన్ సీన్ కీ దిగజారుస్తూ దెబ్బతీసాడు.హాలీవుడ్ చిత్రం ఛేజింగ్ లిబర్టీకి,మగధీరని కలిపి చేసినట్లున్న ఈ చిత్రం ఎన్టీఆర్ వీరాభిమానికి కూడా డైజస్ట్ చేసుకోవటం కష్టంగా మారింది.

సెంట్రల్ హోం మినిస్టర్ మహదేవరాయలు(ప్రభు)కి ఐశ్వర్య(ఇలియానా)ఒక్కత్తే కూతురు. ఆమెకి తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ బంధనాలు తెంచుకుని స్వేఛ్చగా విహరించాలని కోరిక.దాంతో ఓ శుభముహూర్తాన్న ఇంట్లో వాళ్ళకి బురిడీకొట్టి జైపూర్ లో తేలుతుంది.అయితే ఆమెకు అక్కడ లోకల్ రౌడీలతో సమస్య ఎదురౌతుంది.అప్పుడు మన హీరో శక్తి(ఎన్టీఆర్)ఓ పెద్ద ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు.అక్కడనుంచి ఆమెకు గైడ్ లా వ్యవహిస్తూ దేశమంతటా తిరుగుతూ ఎప్పటికప్పుడు రక్షిస్తూంటాడు.ఇంతకీ ఆమెపై దాడి చేస్తుందెవరు...గైడ్ అయిన శక్తికి ఆమె చుట్టూ తిరుగుతూ రక్షించే అవసరం ఏమి వచ్చింది.అసలు శక్తి ఎవరు..శక్తికీ ఈజిప్టులో ఫక్తూన్(పూజాబేడి) కి సంభంధం ఏమిటన్నది మిగతా కథ.

సూపర్ హిట్ మగధీరలా తీర్చిదిద్దాలనే తాపత్రయంతో అదే పోలికలతో ఈ కథను తయారు చేసినట్లు అర్దమవుతూంటుంది.అయితే కథలో హీరో చేయటానికి ఏమి లేకపోవటంతో ఆ క్యారెక్టర్ ప్యాసివ్ గా మారి మైనస్ గా మారింది.ముఖ్యంగా మగధీరలో పే ఆప్ అయిన ఎలిమెంట్ ప్రేమ లాంటి బలమైన ఎమోషన్ ఏదీ ఈ చిత్రంలో కనిపించదు.ఇక ఫస్ట్ హాఫ్ అంతా హీరో పనిపాటా లేకుండా హీరోయిన్ వెనక తిరగటం,ఆమెను రక్షించటమే జీవితాశయం అన్నట్లు ఉండటం,అతనికి ఫైట్ చేయటానికి బలమైన మనుష్యులు తప్ప బలమైన సమస్య ఎదురుకాకపోవటంతో కథ పై ఆసక్తి ఉండదు.సమస్యలో పడని హీరోతో ప్రయాణించటమే కష్టమే అనిపిస్తుంది.పోనీ సెకెండాఫ్ లో అయినా ఏదన్నా జరుగుతుందా అంటే కేవలం హీరో తన ఫ్లాష్ బ్యాక్ వినటం తప్ప ఏమీ చెయ్యడు.విలన్స్ కూడా క్లైమాక్స్ దాకా ఎక్కడా హీరోకి డైరక్ట్ అవరు.దాంతో విలన్స్ కీ ,హీరో కి మధ్య పోరాటం మొదలయ్యేసరికే సినిమా పూర్తవుతుంది.అంతమంది హేమాహేమీ రైటర్స్ రాసిన ఈ స్క్రిప్టులో ఇది కథన సమస్య.

నటీనటుల్లో జూ.ఎన్టీఆర్ ఎప్పటిలాగే చాలా బాగా చేసారు.ఇలియానా గ్లామర్ ప్రదర్శనకు తప్ప మరిదేనికి పనికి రాలేదు.ఇక బ్రహ్మానందం,అలీ,కృష్ణభగవాన్,శ్రీనివాస రెడ్డి,వేణు మాధవ్ వంటి సీనియర్ కమిడెయన్స్ ఉన్నా కామిడి ఎక్కడా పండలేదు.ఎస్పీ బాలసుబ్రమణ్యం,జాకీ షరాఫ్,పూజా బేడిలు తమ పాత్రల పరిధిమేరకు నటించినా పెద్ద గా ఎలివేట్ కాలేదు.ఇక ప్లస్ ల విషయానికి వస్తే సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ లు బాగా ఉన్నాయి.శక్తి ఫీఠాల మొత్తం ఒకేసారి తెరపై చూసే అవకాశం ఇస్తుంది.కెమెరా,ఎడిటింగ్ వంటివి సినిమా స్ధాయిలో ఉన్నాయి. సత్యానంద్ డైలాగులు పేలలేదు.ముఖ్యంగా సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే రుద్ర గెటప్,ఎపిసోడ్ నీరసం తెప్పిస్తాయి.

ఫైనల్ గా ఎన్టీఆర్ వంటి మాస్ అప్పీల్ వంటి హీరోని పెట్టుకున్న మెహర్ రమేష్ ఆయన్ను సరిగా వాడుకోలేదనిపిస్తుంది.లొకేషన్స్ మీద,ట్విస్టులు మీద పెట్టిన శ్రద్ద..కథ,కధనాలపై పెట్టి ఉండే బావుండనినిపిస్తుంది.అభిమానులుకు ఏమన్నా కొద్దో గొప్పో సినిమాను ఇష్టపడగలరేమోగాని,సామాన్య ప్రేక్షకుడుకి సినిమా ఎక్కటం కష్టమే.

ఇండియా - శ్రీలంక వరల్డ్ కప్ 2011 ఫైనల్ మ్యాచ్ ఫొటోస్.....













జయహో భారత్: మనమే విశ్వవిజేతలం, నెరవేరిన సచిన్ కల

ముంబై: శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్‌ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు. యువరాజ్ సింగ్ ఆనందంతో కంట తడిపెట్టాడు.
Indian Team

 కులశేఖర వేసిన 47వ ఓవరులో ధోనీ, యువరాజ్ చెరో ఫోర్, సింగిల్స్ ద్వారా 11 పరుగులు చేయడంతో ఆట భారత్ చేతిలోకి వచ్చింది. అంతకు ముందు మలింగ వేసిన ఓవరులో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. కులశేఖర వేసిన ఓవరు తర్వాత 18 బంతుల్లో 16 పరగులు చేయాల్సి ఉండింది. దీంతో డ్రెసింగ్‌ రూంలో భారత ఆటగాళ్లు హర్షాతిరేకాలు చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాతి మలింగ ఓవరులో యువరాజ్ సింగ్ ఓ సింగిల్ తీయగా, ధోనీ బంతిని బౌండరీ అవతలికి తరలించి నాలుగు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా అతను ఫోర్‌గా లమిచాడు. అప్పటికి 15 బంతుల్లో భారత్ ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఇరువురు బ్యాట్స్‌మెన్ తొలుత సంయమనం కుదరక కాస్తా ఇబ్బంది పడ్డారు. రన్నవుట్ కాబోయే ప్రమాదాలను తప్పించుకున్నారు. రెండు ఓవర్లు మిగిలి ఉండగా భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది.
కెరీర్‌లో చివరి మ్యాచు ఆడిన ముత్తయ్య మురళీథరన్‌కు ఈ మ్యాచులో ఒక్క వికెట్ కూడా పడలేదు. భారత్‌కు విజయాన్ని అందించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎన్నికయ్యాడు. ధోనీ 91 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. మ్యాన్ ఆఫ్ ద టోర్నిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. ప్రపంచ కప్ పోటీల్లో నాలుగు సార్లు యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎన్నికయ్యాడు. బౌలింగులోనూ, బ్యాటింగులోనూ యువరాజ్ సింగ్ అద్భుతంగా రాణించాడు.

పరుగులేమీ చేయకుండానే భారత డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌కు గౌతం గంభీర్ తోడుగా నిలిచాడు. తొలుత బాగానే బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించిన సచిన్ టెండూల్కర్ లసిత్ మలింగ బౌలింగ్‌లో సంగక్కరకు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 31 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. కప్ ఇండియా చేజారిపోతుందేమో అనిపించింది.

అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ గంభీర్‌తో కలిసి ఆచితూచి షాట్లు కొడుతూ పరుగులు రాబట్టారు. కానీ విరాట్ కోహ్లీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్‌ చేతిలో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 114 పరుగులు. విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగుకు దిగిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్‌ పోటీల్లో తొలిసారి రాణించాడు. పట్టుదలతో ఆడాడు. ధోనీ, గంభీర్ స్కోరును విజయం దిశగా నడిపించారు. శ్రీలంక బౌలర్లు వీరిద్దరిపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సంగక్కర మార్చి మార్చి బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు గౌతం గంభీర్ పెరేరా బౌలింగులో 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోరు 223 పరుగులు ఉంది. విజయానికి 52 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, ధోనీకి తోడుగా యువరాజ్ సింగ్ బ్యాటింగుకు దిగాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన మహేలా జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో శ్రీలంక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. జయవర్ధనే 103 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయినా చివరలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జయవర్ధనేకు చక్కని సహకారం అందించడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను కంగు తినిపించారు. చివరి ఐదు ఓవర్లో బ్యాటింగ్ పవర్ ప్లేలో శ్రీలంక 63 పరుగులు పిండుకుంది. కులశేఖర ఓ సిక్స్ సహాయంతో 32 పరుగులు చేయగా, పెరేరా 22 పరుగులు చేశారు. జహీర్ ఖాన్ బౌలింగ్‌ను కూడా పెరేరా చితకబాదాడు.

తొలుత శ్రీలంక స్కోరు 17 పరుగులు ఉన్నప్పుడు రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఉపుల్ తరంగ వికెట్‌ను జహీర్ ఖాన్ తీసుకున్నాడు. ఆ తర్వాత దిల్షాన్, సంగక్కర స్కోరును ముందుకు కదిలించే పని సాగించారు. అయితే, 60 పరుగుల వద్ద దిల్షాన్ హర్భజన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన జయవర్ధనేతో సంగక్కర నిలకడగా ఆడి స్కోరును పెంచాడు. 122 పరుగుల వద్ద సంగక్కర యువరాజ్ బౌలింగులో అవుటయ్యాడు. సంగక్కర 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే యువీ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా సమరవీర పెవిలినయ్ దారి పట్టాడు. అప్పుడు శ్రీలంక స్కోరు 179 పరుగులు. ఆ తర్వాత మూడు పరుగులకే కపుగెదర అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కులశేఖర, పెరేరా భారత బౌలింగుపై విరుచుకుపడ్డారు. జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లకు రెండేసి వికెట్లు లభించగా, హర్భజన్‌కు ఒక్క వికెట్ లభించింది. శ్రీశాంత్ బౌలింగులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దండిగా పరుగులు రాబట్టుకున్నారు.

అంతకు ముందు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ వేయడంలో కొంత అయోమయం చోటు చేసుకుంది. దీంతో రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. మొదటి సారి వేసినప్పుడు భారత్ టాస్ గెలిచింది. రెండోసారి వేసినప్పుడు శ్రీలంక గెలిచింది.



అఫ్ కోర్స్ మహేష్ అందగాడే, పెద్ద స్టారే కాదని అనలేం..ఐతే..

Mahesh Babuతండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పోలిస్తే మహేష్ బాబుది కాస్త స్పీడు తక్కువే. కృష్ణ ఏడాదికి పది, పన్నెండు సినిమాలు చేసిన రోజులు కూడా వున్నాయి. అయితే, మహేష్ ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనంగా కనిపిస్తోంది. డిమాండ్ వుండి కూడా సినిమాలు చేయలేకపోతున్నాడు. అయితే, ఇప్పుడా స్పీడుని మరోలా చూపిస్తున్నాడు. ఎడాపెడా అడ్వర్ టైజ్ మెంట్లు ఒప్పేసుకుంటున్నాడు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడార్ గా కమిట్ అయిపోతున్నాడు. ఇప్పటికే థమ్సప్, అమృతాంజన్, నవరత్న, యునివేర్సాల్, ప్రోవోగ్, ఐడియా ఉత్పత్తులని ప్రమోట్ చేస్తున్న మహేష్, తాజాగా వివేల్ షాంపు కి కూడా అండార్స్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే, సినిమాలకన్నా ఇవే బాగా వర్కౌట్ అవుతున్నాయట. కోట్లలో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.!

కాగా మహేష్ బాబు సినిమాల్లో కంటే ఎక్కువగా యాడ్ ఫిలింస్ లో కనిపిస్తున్నాడని జోకులు పేలుతున్నా అది కాంప్లిమెంట్ గానే తీసుకుంటూ కొత్త కొత్త బ్రాండులతో మహేష్ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఏ ఇతర హీరోలనీ కాకుండా మహేష్ నే ఈ బ్రాండ్లు ఎందుకు వరిస్తున్నట్టు? అఫ్ కోర్స్ మహేష్ అందగాడే, పెద్ద స్టారే కాదని అనలేం. అయితే మహేష్ ఒక్కడే పెద్ద స్టార్ కాదు కదా?అతడి రేంజ్ లేదా అతడిని మించిన స్టార్లు ఇంకా ఉన్నారు కదా? మరి వాళ్లకి రాని యాడ్లు ఇతనికే ఎందుకొస్తున్నట్టు?దీనికంతటికీ కారణం మహేష్ భార్య నమ్రతే అని తెలుస్తోంది. మహేష్ ని ఈ బ్రాండ్ అండార్స్ మెంట్ కి ప్రోత్సహించిందీ, ఇప్పుడు వివిధ కంపెనీలతో చర్చలు జరపు తున్నదీ నమ్రతేనట. బాలీవుడ్ స్టార్స్ లా బీభత్సమైన కొటేషన్ అయితే చెప్పడు కాబట్టి మహేష్ గో టైఅప్ కి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండడం లేదు. ఈ సైడ్ ఇన్ కమ్ బాగుండడంతో నమ్రత జోరు పెంచి కనీసం మూడు నెలలకో కొత్త అసైన్ మెంట్ తీసుకొస్తుందని సమాచారం.

ఇలియానాకి జూ ఎన్టీఆర్ లైఫ్ ఇవ్వలేకపోయాడు మరి రాణా కథేంటో.

Ileanaఅందరూ ఎంతగానో ఎదురుచూసిన ‘శక్తి’ సినిమా విడుదలైంది. రికార్డులు బ్రేక్ చేసేస్తుందంటూ ఎంతో ప్రచారంతో రిలీజ్ అయిన సినిమా రిజల్ట్ ఏమిటనేది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ప్రచారం జరిగినంత విషయం సినిమాలో లేదని తేలిపోయింది. రికార్డులు క్రాస్ చేయడం మాట అటుంచి, అసలు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? అన్నట్టుగా వుంది.


సినిమా రిజల్టును కాసేపు అలా ఉంచితే, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా ఈ సినిమా పేరు చెప్పి, రిలీజుకి ముందే ఇలియానా తన రేటుని పెంచేసుకుంది. అయితే, ఈ సినిమాలో తను విగ్రహ పుష్టి నైవేద్యనష్టి అన్నట్టుగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జూ ఎన్టీఆర్ సరసన ఇలియానా నటించింది. తన నడుముతో అందరిని మైమరిపించే ఇలియానా ‘శక్తి’ చిత్రంలో మాత్రం మైనస్ మార్కులు వేయించుకుంటోంది.

జూ ఎన్టీఆర్ పక్కన ఇలియానా అంత సూట్ అవ్వలేదని, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ నటన ముందు ఇలియానా నటన వెలవెలబోయిందని, కేవలం ఎక్స్ పోజింగ్ మాత్రమే చేసిందని, నటన కనబర్చలేకపోయిందని పరిశీలకులు అంటున్నారు. ‘శక్తి’ సినిమాకి ఇలియానా ప్లస్ కాకపోగా..మైనస్ అయ్యిందని కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.కథానాయికకు ‘అందమొక్కటే కాదు, కాస్తంత నటన కూడా కావాలి తల్లీ’ అంటూ సినిమా చూసిన వాళ్ళు ఆమెకు చురకలేస్తున్నారు. ఆమె అడిగినంతా ఇస్తున్న నిర్మాతలు ఇప్పుడైనా ఒక్కసారి ‘డజ్ షి డిజర్వ్ ఇట్?’ అన్నది ఆలోచించుకోవాలి!

జాతీయ జెండా వివాదంలో ఎన్టీఆర్ "శక్తి"

Shaktiఈ రోజు రిలీజైన జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి బూట్ల వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఆయన వాడిన బూట్లు మూడు రంగుల జెండాను పోలి ఉండడం అంతటా వివాదస్పదంగా మారింది.ఈ విషయమై ఎక్స్ సర్వీస్ మెన్ లు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఈ విషయమై అప్పుడే మీడియాలో చర్చా గోష్టిలు మొదలయ్యాయి.ఈ సనిమాలో ఎన్.టి.ఆర్ వాడిన బూట్లపై మూడు రంగులు ఉన్నాయి.అవి జాతీయపతాకాన్ని పోలి ఉన్నట్లు టాక్ బయిటకు వచ్చింది.అంతేగాక ఆ స్టిల్ ను ఒక సినిమా పత్రిక ప్రచురించింది.జాతీయ పతాక నియామవళి ప్రకారం జాతీయ పతాకాన్ని కించపరిచే విధంగా ఎక్కడా వాడకూడదు.అంతేకాకా పూర్తిగా ,లేదా పాక్షికంగానైనా జాతీయ పతాకాన్ని డ్రెస్ లో భాగంగా అభ్యంతరకరంగా వాడరాదు. పతాకాన్ని అగౌరవ పరిచినట్లు తేలితే జైలు శిక్షలు కూడా అమలు పరిచే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్ టిఆర్ బూట్లే జాతియ పతాకం రంగులతో ఉండడంపై ఈ విమర్శలు మొదలయ్యాయి.ఇక ఈ ఫోటోలను ప్రచురించిన పత్రిక నిర్వాహకులు తామకు ఆ సినిమా వారు అందచేసిందే తప్ప మరొకటి కాదని,తమను ఈ వివాదంలోకి లాగవద్దని అంటున్నారు.అయితే పత్రికపై ఫోటో అలా ఉన్నప్పటికీ, సినిమాలో దానిని ఉంచారా లేదన్నది మరి కొద్ది సేపట్లో తేలపోనున్నది.

లైఫ్ ఐస్‌ క్రీమ్‌ లాంటిది..కరిగిపోయేలోపే ఆస్వాదించాలి: త్రిష

Trisha‘జీవితం ఐస్‌ క్రీమ్‌లాంటిది. కరిగిపోయేలోపే ఆస్వాదించాలన్నది నా పాలసీ’ అంటున్నారు త్రిష. షూటింగ్స్ లేకపోతే చాలు.. ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుని స్నేహితులతో సహా చెక్కేస్తారామె. మీకు టూర్లంటే ఇష్టమా? అన్న ప్రశ్న త్రిష ముందుంచినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఒకవైపు మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతోపాటు మరోవైపు తనలో మంచి గ్లామరస్ నటి ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారు త్రిష.

ఆ విషయం గురించి త్రిష మాట్లాడుతూ ‘ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి నా కెరీర్ ఓ ఉదాహరణ. నా ప్రతిభను నిరూపించుకునే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయి. అలాగే ట్రెండీ హీరోయిన్ అనిపించుకునేలా గ్లామరస్ రోల్స్ చేసే అవకాశం కూడా వస్తోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తున్నావు కదా? గ్లామరస్ రోల్స్ చేయడం అవసరమా? అని కొంతమంది నన్నడిగారు. గ్లామరస్ రోల్స్ చేయడం పాపమా? ప్రేక్షకులకు కావల్సింది అదే కదా. ట్రెండ్‌ కు తగ్గట్టుగా ఉండాలి. లేకపోతే ‘అమ్మమ్మ’ అని ముద్ర వేసేస్తారు. అందుకని మోడర్న్‌ గా ఉండటం తప్పు కాదు’ అని లెక్చర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సరసన త్రిష కథానాయికగా నటించిన ‘తీన్‌మార్’విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం విడుదల దగ్గర పడుతున్న కొద్దీ చాలా థ్రిల్‌గా ఉందని త్రిష అంటున్నారు.

'One Billion $' Betting on India vs Srilanka Final



India - World Cup Champions 2011



India - World Cup Champions 2011
An inspiring, unbeaten 91 by captain Mahendra Singh Dhoni helped India score a comprehensive six-wicket win over Sri Lanka in the final of the ICC World Cup at the Wankhede stadium on Saturday. It is India's second world title, coming 28 years after Kapil's Devils scored that famous, albeit unexpected, win in England against West Indies.

Gambhir scored a valuable 97. However, it was Dhoni who was the star of the show. The man who led India to the inaugural World T20 title in 2007 was at his imaginative best again.

"A few decisions I have taken, including why I brought in Sreesanth instead of Ashwin and why I promoted myself in the batting order ahead of Yuvraj who has been in great form. It could have been that the decisions cost the match. We have been hearing a lot of things during this tournament and so it feels great to win the World Cup. I always wanted to give chance to give chance to younger players by sending them up the order. On Saturday, I thought I would take the responsibility myself. It was more like proving myself and not to others," he said at the post-match presentation after India beat Sri Lanka by six wickets in the summit showdown here.

Asked specifically if the World Cup triumph was in a way telling the critics to shut up as the players would do their job with their performance, he said, "In India it would be very rude to say like that. We spent the last 30-35 days together in the field and the dressing room thinking of this victory only and we have achieved that now," he added.
 
 Dhoni said coach Gary Kirsten and senior players backed him on his decision to promote ahead of Yuvraj.

"The pressure had got to me in the previous games. In this game, I wanted to bat up the order and Gary and the senior players backed me," said Dhoni, who was declared man of the match for his 91 not out from 79 balls.

He praised Gautam Gambhir (97) and Virat Kohli (35) for keeping the team on track after the early dismissal of Virender Sehwag and Sachin Tendulkar.

"Virat and Gautam batted brilliantly. They ran lots of singles. Then with the help of bit of dew, we were able to put pressure on the spinners. I would have liked Gautam to go on and get that big hundred. A World Cup hundred would have been huge. Credit to him for taking the team closer to victory," he said before lifting the World Cup after the trophy was handed to him by ICC chief Sharad Pawar.

Sri Lankan captain Kumar Sangakkara conceded that the Indians were the deserved winners.

"When you look at this Indian team anything less than 350 looks less. They deserved this title, the way they played in front of a great crowd. Both Sri Lanka and India will be proud with the way they have played. Congrats India, you were the better side today. The only way to stop India is to get at least seven wickets quickly and that did not happen. Gautam was outstanding and Dhoni stepped up when it was required. Very proud of everyone, especially Mahela Jayawardene who rose up to the occasion and put up a great hundred. Of course, we are disappointed but I think we would take the positives from this World Cup. Thanks to Sri Lankan fans at home and here, to the president and the support staff," said Sangakkara.
 

అల్లుఅరవింద్ కి చుక్కలు చూపిస్తున్న తమన్నా

Tamanna playing with Allu Aravind




 

శక్తి హీరో జూనియర్ ఎన్టీఆర్ కాదు...!

NTR isn't Shakti movie hero