"గగనం" లో నటించినందుకు గర్వంగా ఉంది. నటుడిగా నా ఫ్యూచర్‌కి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఈ సినిమా. ఇంత మంచి కథతో నా దగ్గరకొచ్చిన రాధామోహన్, దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కాకపోతే ప్రతిసారీ ఇలాంటి సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే ఓ హీరోగా కమర్షియల్ సినిమాలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని అక్కినేని నాగార్జున అన్నారు. దిల్ రాజు నిర్మాతగా రాధామోహన్ దర్సకత్వంలో రూపొంది రిలీజైన గగనం చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ...పాటలు, ఫైట్లు లేకుండా నాగార్జునతో సినిమా చేయడం సాహసం, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావడానికి గగనం బాట వేసిందని చెప్పారు.మరో కీలకపాత్ర వేసిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... తెలుగులో కూడా ఇంత మంచి సినిమాలు తీయొచ్చని నిరూపించింది గగనం గొప్ప హ్యూమన్‌బీయింగ్ ఉన్న వ్యక్తి నాగ్. ఆయన చేశారు కాబట్టే ఈ విజయం అన్నారు
No comments:
Post a Comment