BREAKING NEWS
Monday, January 31, 2011
ఆ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా కమిటైన అనుష్క
ఆ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా కమిటైన అనుష్క
అరుంధతి విజయంతో వెనక్కి తిరిగిచూసుకోలనటువంటి క్రేజు తెచ్చుకున్న అనూష్క తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ ‘బిల్లా-2’లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ తో చేసిన ‘రెండు’ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఆమెకు అప్పట్లో ఐడెంటెటీ రాలేదు. ఆ తర్వాత విజయ్ ‘వేట్టైక్కారన్’తో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తమిళంలోనూ బిజీ స్టార్ గా మారింది. ఇక సూర్యతో చేసిన ‘సింగం’ (యముడు) ఘన విజయం సాధించటంతో అక్కడా బిజీ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం తెలుగు ‘వేదం’ రీమేక్ అయిన ‘వానం’లో ఆమె వేశ్యగా నటిస్తోంది. అలాగే విక్రమ్ సరసన ‘దైవమగన్’ చిత్రంలో నటిస్తున్న అనుష్కను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిల్లా’కు సీక్వెల్‌గా విష్ణువర్థన్ ‘బిల్లా-2’ తెర కెక్కించే సన్నాహంలో ఉన్నారు. అజిత్ 50వ చిత్రమైన ‘మంగాత్తా’ తర్వాత ‘బిల్లా-2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో నాగార్జున ‘ఢమరుకం’, ప్రభాస్ ‘రెబల్’ చిత్రాలను అంగీకరించింది.
పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ మూవీ...
పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ మూవీ...
ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ‘క్రియేటివ్ వర్క్’ అనే బ్యానర్ ఎలాంటి క్రియేషన్ లేకుండా వరుసగా రీమేక్ సినిమాలు చేసేస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ సినిమాని క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రీమేక్ గా గబ్బర్ సింగ్ చేయబోతున్నానని పోస్టర్ ని విడుదల చేశారు. దాని గురించి వర్మ మరోరకంగా స్పందించాడు, మరి ఇలా తన గురించి అవాకులు, చెవాకులు మాట్లాడేవారికి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ..పవన్ కళ్యాణ్ ఓ ఎక్సిపిరిమెంటల్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు ఉండవట. అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ బయట పెట్టనున్నాడని సమాచారం.
నాలో మరింత పరిపక్వత వచ్చినప్పుడే..సమంత
నాలో మరింత పరిపక్వత వచ్చినప్పుడే..సమంత
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అందరూ అడుగుతున్నారు. అయితే అలాంటివి చేసేందుకు ఇంకా సమయం ఉంది. నాలో మరికొంచెం పరిపక్వత రావాలి. నేను ఆ పాత్రలకు సరిపడతాను అని నాకైతే అనిపించడం లేదు..అంటోంది సమంత. అలాగే ఈ ఫీల్డులో ఎప్పటికప్పుడు మనం నిరూపించుకోవాల్సిందే..అయినా నాకన్నా గొప్ప హీరోయిన్స్ ఇంకా ఎందరో ఉన్నారు. అయినా అప్పుడే నా నెంబర్ ఇది అని చెప్పుకొనేంత స్థాయికి నేను రాలేదు అంటోంది. ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తున్నఈ ముద్దుగుమ్మ రామ్ సరసన ఓ చిత్రం కమిటైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నాని సరసన ఈగ చిత్రంలో చేస్తోంది. ఇక ఆమె గెస్ట్ రోల్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.
'పరమ వీర చక్ర' ఫ్లాప్ బాలకృష్ణకు పాఠాలు నేర్పిందా?
'పరమ వీర చక్ర' ఫ్లాప్ బాలకృష్ణకు పాఠాలు నేర్పిందా?
పరమవీర చక్ర పరాజయంతో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని ఎలా గైనా హిట్ చేయాలని తలపోస్తున్నారు. అందుకోసం ఆయన రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథ,గెటప్స్ విషయంలో ఆయన దగ్గరుండి మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయనున్నారు. దాంతో ఆ మూడు గెటప్స్ వేటికవే స్పెషల్ గా ఉండాలని,రెగ్యులర్ గా పొరపాటున కూడా ఉండకూడదని ఆయన దర్శకుడుకి చెప్పినట్లు సమాచారం. పరమవీర చక్రలో చేసిన ద్విపాత్రాభినయం గెటప్స్ పెద్దగా ఆకట్టుకోలేదని అభిమానులు సైతం విమర్శిస్తూండగా ఆయన ఈ సారి ఆ పొరపాటు జరగకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కధ,కథనం కూడా పకడ్బందీగా ఉండాలని, మళ్ళీ సింహా తరహా విజయం సాధించాలంటే స్క్రిప్టుపై కసరత్తులు చేయాల్సిందేనని పదే పదే చెప్తున్నారుట.
ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మించారు. బాలకృష్ణ, బ్రహ్మానందం తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా అక్కడే తీయనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కనిపించే మూడు పాత్రల మధ్య సంబంధం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.
టాలీవుడ్ కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ కెప్టెన్‌గా సూర్య
టాలీవుడ్ కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ కెప్టెన్‌గా సూర్య
విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ లేని సమయాల్లో ఏ దేశంలో క్రికెట్ జరిగినా అక్కడ వాలిపోతుంటారాయన. అలాగే విష్ణుకి కూడా క్రికెట్ అంటే మోజు. తాజాగా అందరి కళ్లూ త్వరలో జరగబోయే ‘సిసిఎల్’ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచ్‌లపైనే ఉన్నాయి. సినీ తారలు కలిసి ఆడనున్న ఈ మ్యాచ్‌లను తనివి తీరా వీక్షించడానికి ప్రేక్షకులు రెడీ అయిపోతున్నారు. మరోవైపు ఈ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి, కొనుగోలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ ఆరోగ్యకరమైన పోటీలో టాలీవుడ్ టీమ్‌కి యజమానిగా వ్యవహరించే అవకాశాన్ని మంచు విష్ణు చేజిక్కించుకున్నారు. టాలీవుడ్ టీమ్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబర్చిన తరుణంలో ‘వెంకటేష్’ ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారని ‘టాలీవుడ్ టీమ్ ఓనర్’ విష్ణు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
హీరోలు క్రికెట్ ఆటలో సత్తా చూపడానికి రెడీ అవుతుంటే మరోవైపు హీరోయిన్లు ఆట మైదానంలో అందంగా ప్రత్యక్షమై ఆటగాళ్లను ‘చీర్ అప్’ చేయనున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా టాలీవుడ్ టీమ్‌కు అందాల తారలు తాప్సీ, సమంత ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా తమిళ టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా.. అక్కడి నడిగర్ సంఘం (ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఓనర్‌గా వ్యవహరించడానికి తీర్మానం అయ్యాయి. కన్నడ టీమ్‌కు పునీత్ రాజ్‌కుమార్, హిందీకి కెప్టెన్ కమ్ ఓనర్‌గా సల్మాన్‌ఖాన్ వ్యహరించబోతున్నారు. ఆ కోరికతోనే టీమ్ ఓనర్‌గా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఇక టాలీవుడ్ టీమ్‌లో ఏయే ఆర్టిస్టులు ఆడబోతున్నారనే విషయం త్వరలో తెలుస్తుంది. ‘‘ఫిబ్రవరి 14లోపు ఆటగాళ్లను నిర్ణయించి, టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తాం’’ అని విష్ణు తెలిపారు.
బికినీలో నన్ను నేను చూసుకుంటే బాగుంది
బికినీలో నన్ను నేను చూసుకుంటే బాగుంది
ప్రియమణి కి బికినీ పిచ్చి ఇంకా పోయినట్లు లేదు. ద్రోణ చిత్రం వచ్చి చాలా రోజులైనా ఇప్పటికీ అవకాశం దొరి్కినప్పుడల్లా అందులో ఆమె వేసిన బికినీ గురించి ప్రస్దావించి గుర్తు చేస్తూంటుంది. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ...'ద్రోణ' సినిమా కోసం స్విమ్మింగ్ పూల్‌లో పాట తీస్తాం అన్నారు. అక్కడ జీన్స్, సల్వార్ వేసుకొంటే కుదర్దు కదా. అందుకే బికినీ వేయాల్సివచ్చింది. ఆ పాట కూడా బాగా షూట్ చేసారు. నాకైతే బాగా నచ్చింది..నన్ను నేను బికినీలో చూసుకుంటే బాగుంది అనిపించింది అంటోంది ప్రియమణి. త్వరలో ఆమె తాజా చిత్రం రాజ్ విడుదల అవుతోంది. వియన్ ఆదిత్య దర్శకత్వంలో సుమంత్ హీరోగా చేసిన ఆ చిత్రంలో విమలారామన్ కూడా మరో హీరోయిన్ గా చేసింది. అయితే ప్రియమణి ఎక్సపోజింగ్ కళ్లు చెదరకొడ్తుంది అంటున్నారు. ప్రియమణి హీరోయిన్ గా కన్నడంలో లక్ష్మీ అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది.
లక్ష్మీ ప్రసన్నను 'ఆంటీ' అని పిలుస్తున్న హీరోయిన్
లక్ష్మీ ప్రసన్నను 'ఆంటీ' అని పిలుస్తున్న హీరోయిన్
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రతీ ఒక్కరినీ ఆంటీ..అంకుల్ అని పిలుస్తూంటుంది. అయితే ఆమెను శృతిహాసన్..ఆంటి అని పిలిచి షాక్ ఇచ్చింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంతో హీరోయిన్ గా పరచయం అయిన శృతిహాసన్ కి రీసెంట్ గా అందులో విలన్ గా చేసిన లక్ష్మీ ప్రసన్న పార్టీ ఇచ్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ...లక్ష్మి ప్రసన్న ఆంటీ ఇచ్చిన పార్టీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయేది అంది. దాంతో ఆమె త్వరలో ఈటీవీ కోసం చేసే ప్రేమతో మీ లక్ష్మీ పోగ్రాం టైటిల్ ని ప్రేమతో మీ లక్ష్మీ ఆంటీ అని మారిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న వర్మ దర్శకత్వంలో దొంగలముఠా చిత్రంలో కమిటైంది. ఆమె అనగనగా ఓ ధీరుడు చిత్రం ప్లాప్ అయినా అందులో ఆమె చేసిన మంత్రగత్తె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
విద్యార్థినిపై ఐఐటి-బొంబాయి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
విద్యార్థినిపై ఐఐటి-బొంబాయి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బొంబాయి (ఐఐటి - బి) ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిట్లు బయటపడింది. ఆ ప్రొఫెసర్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. ఐఐటి - బిలో పర్యావరణ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ ఎస్‌కె గుప్తాను పదవీ విరమణ చేయించి ఇంటికి పంపేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 15 ఐఐటిలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ ఐఐటి మండలి చైర్మన్‌గా సిబాల్ కొనసాగుతున్నారు. గుప్తా మానవ వనరుల మంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయినా గుప్తా వినతిని తోసిపుచ్చుతున్నట్లు సమాచారం.
విద్యార్థినిని గుప్తా చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు సమాచారం. అయితే విద్యార్థిని ప్యానెల్ ముందు హాజరు కావపడానికి నిరాకరించింది. అయితే, విద్యార్థినిని గుప్తా లైంగికంగా వేధించినట్లు ప్యానెల్ నిర్ధారించింది. గుప్తాను తప్పనిసరి పదవీ విరమణపై పంపించాలని ఐఐటి - బి పాలక మండలి నిర్ణయించింది.
అవమానం భరించలేకనే సూరిని హత్య చేసిన భాను కిరణ్?
అవమానం భరించలేకనే సూరిని హత్య చేసిన భాను కిరణ్?
హైదరాబాద్: సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ద్వారా వచ్చిన స్థిరాస్తులు, భూములు తన పేరు మీద రాయాలంటూ మద్దెలచెర్వు సూరి ఒత్తిడి తెచ్చినందుకే భాను కిరణ్ అతడి హత్యకు పథకం రచించాడని పోలీసుల వద్ద మన్మోహన్‌సింగ్, సుబ్బయ్య వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. సూరి కొంతకాలంగా అసభ్య పదజాలంతో దూషించడం, కొట్టేందుకు యత్నించడంతో అవమానం భరించలేకే అతడిని చంపేద్దామంటూ భాను నిర్ణయానికి వచ్చాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మద్దెలచెర్వు సూరి బినామీ పేర్లతో ఉన్న ఆస్తులతో పాటు భానుకిరణ్ సొంతంగా సెటిల్‌మెంట్లు చేసేవాడని సుబ్బయ్య పోలీసు అధికారులకు చెప్పాడు. ఐదారేళ్లుగా మాత్రమే భానుతో పరిచయం ఉందని, అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడినన్నారు. సూరిని చంపేయాలనుకున్నట్టు భాను తనకు కొద్దిగంటల ముందు మాత్రమే చెప్పాడని, తాను భయం వ్యక్తం చేస్తే అలాంటిదేం లేదంటూ ఒప్పించాడని మన్మోహన్‌సింగ్ చెప్పినట్టు సమాచారం.
మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వెళ్లేలోపు జనసంచారం లేని ప్రాంతంలో ఎక్కడో ఒక్క చోట పథకాన్ని అమలు చేస్తానని, కారుతో కూకట్‌పల్లిలో ఫలానాచోట ఉండాలంటూ భాను చెప్పాడని మన్మోహన్‌సింగ్ వివరించాడు. సూరి హత్యజరిగిన రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి భాను, సుబ్బయ్యల మధ్య ఫోన్ సంభాషణలు లేవని, సంక్షిప్త సందేశాల ద్వారానే వీరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని, ఫోన్‌లో మాట్లాడితే సూరికి అనుమానం వస్తుందన్న భావనతో భాను ఈ జాగ్రత్త తీసుకున్నాడుని అంటున్నారు. మాదాపూర్‌లో అలేఖ్య అపార్ట్‌మెంట్ నుంచి కారులో బయలుదేరిన కొద్ది నిముషాలకే తాను ఎక్కడున్నది, ఎలా ఉన్నది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సుబ్బయ్యకు తెలిపాడు.
తెలిసిన వివరాల ప్రకారం - పథకాన్ని ఎక్కడైతే అమలు చేస్తే బావుటుందని సంక్షిప్త సందేశాల ద్వారా మాట్లాడుకున్నారు. కారును వెంబడిస్తున్న సుబ్బయ్య, హరిలు కొంచెం ముందుకు వెళ్లి బంజారాహిల్స్‌లో సూరిని చంపితే అనుమానం రాదంటూ సంక్షిప్త సందేశాన్ని పంపారు. దాన్ని పరిశీలించిన తర్వాత భాను సూరిని పదిహేను నిముషాల్లో కాల్చిచంపాడు. బయటకు వచ్చిన తర్వాత మన్మోహన్‌సింగ్‌ను కలవగా కారు లేదని చెప్పడంతో లోక్‌నాథ్‌కు ఫోన్ చేసి కారు తెమ్మన్నారు. కూకట్‌పల్లి నుంచి కారులో షోలాపూర్ వరకూ వెళ్లామని మన్మోహన్‌సింగ్, సుబ్బయ్యలు పోలీసుల వద్ద అంగీకరించారు. షోలాపూర్ వెళ్లిన తర్వాత భాను తమను వెళ్లిపొమ్మన్నాడని, భయంతో అతడి వెంటే ఉండిపోయామని వివరించారు.
Subscribe to:
Posts (Atom)