రాజశేఖర్ కొత్త సినిమా
BREAKING NEWS
Saturday, February 5, 2011
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....
పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ‘కొమరం పులి’, మహేష్ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా’, ఎన్టీఆర్ తో తెరకెక్కిన‘బృందావనం’.. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్ గా నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా..‘వల్లీ’‘తీన్ మార్’ అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అలాగే, మహేష్ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘దూకుడు’ చిత్రాన్ని కూడా సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఖలేజా’ కూడా నిరాశపరిచినందున మహేష్ ఫ్యాన్స్ ‘దూకుడు’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక, ఈ ఏడాది సంక్రాంతికే విడుదలవుతుందని ప్రకటించబడిన ఎన్టీఆర్ ‘శక్తి’ కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయడమే సరైనదని దర్శకనిర్మాతలతోపాటు చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి ‘ఢీ అంటే ఢీ’ అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్ లో మొదలు కానుంది.
ముసలి వయసులో బికినీ వేసి కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న హీరోయిన్
ముసలి వయసులో బికినీ వేసి కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న హీరోయిన్
2008వ సంవత్సరంలో అత్యంత స్టయిలిస్ ఉమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అలనాటి అందాల తార డామి హెలెన్ మిర్రన్ తనలో తనకి ఎటువంటి స్టయిల్ ఉండదని అన్నారు. ఏదో కొత్త తనంగా ఉండాలనే ప్రయత్నం తప్ప..ఆకొత్త తనాన్నే నేటి యవతరం అదోక స్టయిల్‌గా పరిగణిస్తుంది తప్ప నాకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి స్టయిల్ అంటూ ఏమి లేదని తేలికగా కొట్టిపారేశారు.
ఈ సందర్బంలో డామి హెలెన్ మిర్రన్ మాట్లాడుతూ నావయసు అరవై అయిదు సంవత్సరాలు. ఇప్పటికి కూడా నన్ను చాలా మంది మీరు చాలా స్టయిల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతుంటారు..దీనికి నేను ఇచ్చే ఒకే ఒక సమాధానం నేను నాశరీరాన్ని ఎల్లప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను..బహుశా అదే కాబోలు నేను ఇంత స్టయిల్ గా ఉండడానికి కారణం అన్నారు.
తను నటించినటువంటి కొత్త సినిమా బ్రైటన్ రాక్ ప్రీమియర్ సందర్బంగా తన అభిమానులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇది మాత్రమే కాకుండా డామి హెలెన్ మిర్రన్ పోయిన సంవత్సరం బికినీ ఎర్రని బికినీ ధరించి దిగినటువంటి పోటోలు ఇప్పటికి కూడా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయంటే నమ్మండి అంతలా తన శరీరాన్ని ఎల్లప్పుడు ఫిట్‌గా సాధన చేస్తుంటారు. ఇటీవల డామి హెలెన్ మిర్రన్ నటించినటువంటి ద కింగ్స స్పీచ్ సినిమా ఆస్కార్ నామినేషన్స్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ భారీ నుండి మిస్ అయినందుకు చాలా హ్యాపీ..
బాలకృష్ణ భారీ నుండి మిస్ అయినందుకు చాలా హ్యాపీ..
సింహా’ విజయంలో భాగం పంచుకున్న భామలు నయనతార , నమిత లకి మళ్లీ ఇంకో సినిమా ఇస్తానని బాలకృష్ణ
అయితే ఒక చారిత్రిక పరాజయం సాధించిన చిత్రంలో తన పాత్ర లేనందుకు నమిత ఇప్పుడు ఆనందిస్తోంది. అయితే నమిత ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతోంది. నేహా ధూపియాకి ఆ స్కిన్ షో వల్ల కాస్త పేరయినా దక్కింది. ఒకవేళ నమిత ఆ పాత్ర పోషించి ఉంటే రెండు వారాలాడిని పరమవీర చక్ర ఒక్కవారంలోనే బాక్సులు సర్థేసుకునేదేమో మాటిచ్చాడట. అన్నమాట ప్రకారమే నయనతారని ‘శ్రీరామరాజ్యం’లో సీతని చేశాడు. అలాగే నమితకి కూడా ‘పరమవీర చక్ర’ ఆఫర్ చేశాడు. నేహా ధూపియా క్యారెక్టర్ కి నమిత పేరుని బాలయ్య సిఫార్సు చేయగా, ఆ క్యారెక్టర్ ఫైట్లు చేయడంతో పాటు బికినీ కూడా ధరించాల్సి వస్తుందని, నమితని అందులో జనం చూడలేరని దాసరి అభ్యంతరం చెప్పాడట. అలా ఆ క్యారెక్టర్ ని నమిత మిస్ అయింది.
వైయస్ పథకాలకు పేటెంట్ ఎవరిది?
వైయస్ పథకాలకు పేటెంట్ ఎవరిది?
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహానికి కాంగ్రెసు నాయకులు మరో వ్యూహం కనిపెట్టారు. వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల కీర్తిని తాము కూడా సొంతం చేసుకునే ప్రతివ్యూహంతో ముందుకు కదులుతున్నారు. వైయస్ జగన్ ప్రచారానికి వారు విరుగుడు కనిపెట్టారు. వైయస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో తమదే కీలక పాత్ర అని చెప్పుకుంటున్నారు. పావలా వడ్డీ, ఆరోగ్య శ్రీ పథకాల రూపకల్పనలో తన పాత్ర ఉందని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో ప్రకటించారు. దీంతో వైయస్ జగన్ కొంత మేరకు ఆత్మరక్షణలో పడినట్లేనని చెబుతున్నారు. తాజాగా ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడంలో తన పాత్రే ప్రధానమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటించుకున్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి తాను ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం జాఫర్‌గూడలోని నోవా విద్యాసంస్థలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరుగుతోందని, తాను వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తూ వైయస్ జగన్ ఆందోళనకు సిద్ధపడుతున్న సమయంలో డిఎస్ ఆ ప్రకటన చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు కాబట్టే వైయస్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కాంగ్రెసు నాయకులు పదే పదే చెబుతున్నారు. వైయస్ ఉన్నత పదవిని అధిష్టించడానికి సోనియా గాంధీ కారణమైనట్లే, రాష్టంలో కాంగ్రెసు అభ్యర్థులు గెలవడానికి కారణం కూడా ఆమెనే అని చెప్పడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు లేకుండా వైయస్సార్‌కు ప్రత్యేక ఉనికి లేదని చెప్పి వైయస్ జగన్ రాజకీయాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు
పూరి దర్శకత్వంలో ప్రభాస్-గోపిచంద్ ‘పార్ట్ నర్స్’..!?
పూరి దర్శకత్వంలో ప్రభాస్-గోపిచంద్ ‘పార్ట్ నర్స్’..!?
పూరీ జగన్నాథ్ హిందీ చిత్రం ‘షోలే’ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ హీరోలుగా మంచి బాడీ పర్సనాలిటీ మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలైన ప్రభాస్, గోపిచంద్ కాంబినేష్ లో పూరీ జగన్నాథ్ రూపొందించాలని భావిస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్ ఇంతకు మందే ‘వర్షం’లో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకొన్న గోపిచంద్ ఇండస్ట్రీలో ఓ అగ్రసీవ్ హీరోగా వెలుగొందుతున్నాడు.
అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ మల్టీస్టారర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబందించి ‘పార్ట్ నర్’ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్వతి మిల్టన్, బిందుమాధవి హీరోయిన్స్ గా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది
జూబ్లీహిల్స్ రోడ్డ్ నెం.41లో అనుష్క, నాగచైతన్య పిచ్చాపాటి కసరత్తులు
జూబ్లీహిల్స్ రోడ్డ్ నెం.41లో అనుష్క, నాగచైతన్య పిచ్చాపాటి కసరత్తులు
సినీ పరిశ్రమలో నటీనటులు తమ అందాల మీద, ఫిట్నెస్ ల మీద పూర్తిగా శ్రద్ద చూపిస్తున్నారు. ముఖ్యంగా సినీ సర్కూట్ లో మగవారు సిక్స్ ప్యాక్ మీద, ఆడవాళ్ళు తమ శరీరం షేపుల మీద ఖర్ఛు బాగా పెడుతున్నారు. ఈ మధ్య వస్తున్న కొత్త హీరోలు, హీరోయిన్లు తమ ఒంటి వంపుల కోసం మరియు ఆ ఒంటి వంపులతో ప్రేక్షకులకు ఆనందింప చేయటం కోసం విపరీతమైన ఎక్సర్ సైజులు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఫిట్ నెస్ సెంటర్స్ లో ప్రఖ్యాతిగాంచిన ఒక ఫిట్ నెస్ సెంటర్ కు ఇద్దరు సెలబ్రటీస్ వచ్చి ఫిట్ నెస్ కోసం బాగా వర్కు చేస్తున్నారు.
ఇంతకీ ఆ సెలబ్రటీస్ ఎవరో తెలుసా? నాగచైతన్య, పొడుగు సుందరి అనుష్క . వీళ్ళిద్దరు ప్రతినెల ఒక్కొక్కరు రూ 6000/- ఆ సెంటర్ కు ఇస్తూ వాళ్ళ పనులకు సహాయంగా ప్రత్యేకమైన ట్రైనర్ ను పెట్టుకున్నారు. ఈ ట్రైనర్ వాళ్ళ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేస్గాడట. నాగచైతన్య, అనుష్క సెక్స్ లుక్స్ వెనుక ఉన్న రహస్యానికి కారణం ఈ ఫిట్ నెస్ సెంటరేనని ‘ఫిలింనగర్’ కబుర్లు. కావున జిమ్ లో ఎక్కువ గంటలు గడపకుండా, ఫుడ్ విటమిన్స్ లేకుండా అందాల షేపులకు ఈ ఫిట్ నెస్ సెంటర్ ఆదర్శంగా ఉంది.
నాగచైతన్యను, అనుష్క యొక్క అందాలను చూసిన తోటి సినీ సెలెబ్రటీస్, ‘హిలైస్’ ఫిట్ సెంటర్ కి ఎగబడుతున్నారని సినీ సర్కూట్ లో చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన ట్రైనర్ చైతన్యకు అనుష్కకు ఎటువంటి ఎక్సర్ సైజులు ఇస్తున్నాడోనని సినీ జనాలు ఎంతో యాంగ్జైమెంట్ గా చెప్పుకుంటున్నారు.
మే 5వ తేదీన లక్ష్మిప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి బాజాలు
మే 5వ తేదీన లక్ష్మిప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి బాజాలు
జూనియర్ ఎన్టీఆర్ వివాహం మే 5న జరగనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు నిర్ణయించిన భామామణి లక్ష్మిప్రణతిని ఆయన వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం 'శక్తి' సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ అది పూర్తయిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న ఇరు కుటుంబాలు లగ్నపత్రికను మార్చుకోబోతున్నట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ నివాసంలో వారు ఈ లగ్న పత్రికలు మార్చుకుంటారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే
Subscribe to:
Posts (Atom)