అనగనగా ఒక ధీరుడు చిత్రం కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుంది. సిద్దార్ధ సరసన శృతిహాసన్ మరోసారి మెరవనుంది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా ఈ జంటకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో దిల్ రాజు తన తాజా చిత్రంలో వీరిని తీసుకున్నాడు. మొదట ఈ పాత్రకు అమృతారావుని అనుకున్నారు. కానీ ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టిన రూల్స్ కి ఒప్పుకోకపోవటంతో తప్పించారు. దాంతో అలా మొదలైంది హీరోయిన్ నిత్యా మీనన్ లైన్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను కూడా కాదనుకుని శృతిని సీన్ లోకి రప్పించారు. శృతిని సిద్దార్ధ రికమెండేషన్ మీద తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ అనే నూతన దర్సకుడు డైరక్షన్ చేస్తున్నాడు. ఓ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది.
No comments:
Post a Comment