BREAKING NEWS
Sunday, September 28, 2014
ఇది మన భారతం!
మన భారతావని.. భిన్నమైన జీవన శైలిల సమ్మేళనం. కుల మతాలకు అతీతంగా మన
ప్రజానీకం కలిసి మెలిసి ఉంటారు. ఇక్కడ తారసపడే భిన్నమైన జీవన విధానాలు
ఒకింత ఆశ్చర్యానికిలోను చేస్తాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో సోషల్
మీడియాలో హల్ చల్ చేస్తున్న భారతదేశపు ట్రెండింగ్ ఫోటోలను మీతో షేర్
చేసుకుంటున్నాం. ముఖ్యంగా సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో ఫన్నీ ఫోటోగ్రఫీకి
పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో హాస్యభరిత ఫోటోలను సృష్టించి వాటిని
సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు పలువురు తహతహ లాడుతున్నారు.
source:news.oneindia.in
రాశి తల్లైంది :తల్లి బిడ్డా క్షేమం
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, జగపతి తో శుభాకాంక్షలు
వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసిన రాసి వివాహం చేసుకుని సెటిలైన సంగతి
తెలిసిందే. ఆమె తాజాగా తల్లైంది. శుక్రవారం చెన్నైలో ఓ పాపకు జన్మ
ఇచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాశి ఆనందం వ్యక్తం చేస్తూ...తమ ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి
వచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు
చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత
చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు
క్యారెక్టర్లు కూడా చేసింది.
చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా,
అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి
తెరమరుగైంది. తర్వాత రాజేంద్రప్రసాద్ సరసం ఓ కామెడీ చిత్రం చేస్తూ రీఎంట్రీ
ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.
source:news.oneindia.in
'గోపాల గోపాల'లో పవన్ వాడే స్పెషల్ బైక్ ఇదే...(ఫొటో )
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీకృష్ణుడి
పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ
చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు.
ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్
మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని
ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి
ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు
మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని
ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.
ADVERTISEMENT
ఇక ఈ చిత్రంలో పవన్ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట.
అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ
పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో
దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి
పెంచారని సమాచారం.
Source:news.oneindia.in
లాలూ టు జయ: రూ.కోట్లు కొట్టేసి జైలుకు సీఎంలు!
న్యూఢిల్లీ: అక్రమార్కుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు
ఊచలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. అధికారాన్ని దుర్వినియోగం చేసి,
కటకటాలపాలైన ముఖ్యమంత్రులు పలువురు ఉన్నారు. కొందరు ఇతర కేసుల్లోను
జైలుకెళ్లారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన తొలి మహిళా సీఎం జయలలిత.
జైలుపాలైన మాజీ ముఖ్యమంత్రులలో జయలలిత, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్,
శిబూ సోరెన్, జగన్నాథ్ మిశ్రా, ఓం ప్రకాశ్ చౌతాలా, మధుకొడా తదితరులు
ఉన్నారు.
source:news.oneindia.in
Subscribe to:
Posts (Atom)