మా నాయకుడికి పాత్ర తీరుకు చక్కగా కుదిరే టైటిల్ అని పెట్టాం. జనాలు అంగీకరించారు. ఈ చిత్రాన్ని మేమేం హీరో ఇమేజ్‌కు దూరంగా తీయలేదు. హీరోయిన్‌కు ధైర్యాన్నిచ్చే వెలుగు అని హీరోని చూపించాం. అంతకన్నా మాస్ అంశం ఇంకేం ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తాను. 'ఊసరవెల్లి'కి అక్కడ రణధీర్‌కపూర్ అయితే బావుంటుందని నా నమ్మకం. 'కిక్'ను కూడా హిందీలో చేయమని నన్ను అడిగారు. కానీ అప్పుడు 'ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. అక్కడ ఇంకా ఆ సినిమా ప్రారంభం కాలేదు. తదుపరి ప్రోగ్రెస్‌ను త్వరలో ప్రకటిస్తాను.'' అన్నారు.ఇక ఈ చిత్రం సమష్టి కృషి ఫలితమిది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి ప్రొడక్షన్ వేల్యూస్ అమేజింగ్. తమన్నా చాలా బాగా నటించింది. ఈ చిత్రానికి ఆమెకు అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌కు డెడికేషన్ ఎక్కువ. సినిమా సినిమాకూ ఆయనకు నటన పట్ల మోజు పెరగడాన్ని గమనించాను అన్నారు.
Source:news.oneindia.in