BREAKING NEWS
Thursday, February 3, 2011
సహజీవనంలో సుఖం వెతుక్కుంటున్న స్టార్ హీరోయిన్
సహజీవనంలో సుఖం వెతుక్కుంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చాలా కాలంగా సైఫ్ అలీఖాన్ తో లివింగ్ టుదెగర్ కాన్సెప్టుని ప్రాక్టీస్ చేస్తూ గడుపుతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సహజీవనం కన్నా పెళ్లి బెస్ట్ అనుకుంటూ సైఫ్ పెళ్ళికి తొందరపెడుతున్నాడు. కానీ కరీనా మాత్రం దానికి ససిమేరా అంటోంది. నాకింకా పెళ్ళి చేసుకునే వయస్సురాలేదని స్టేట్ మెంట్స్ ఇస్తోంది. తన దృష్టంతా కెరీర్‌మీదనే ఉందని చెబుతోంది.భవిష్యత్ లో తాను చాలా విజయాలు చూడాలనుకుంటున్నానని దానికి వివాహం అనేది అడ్డంకి కాకూడదనే వాయిదావేస్తున్నానంటోంది. షాహిద్ కపూర్ నుంచి విడిపోయిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ మరొకడ్ని చూసుకునే ఆలోచనలో ఉండి ఈ మాట అంటోందా లేక నిజంగానే వివాహం అంటే అనాశక్తితో సహజీవనాన్నే సపోర్టు చేస్తూ గడపుతోందా అని ఆమె కుటుంబ సభ్యులు తలపట్టుకు కూర్చుంటున్నారట. ఇక సైఫ్ ప్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ సంవత్సరం పెళ్ళి చేసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారుట. అదీ సంగతి.
బోంగో బికనీ ధరించి బీచ్‌లలో తిరగాలనేది నాకోరిక
బోంగో బికనీ ధరించి బీచ్‌లలో తిరగాలనేది నాకోరిక
హిల్స్ స్టార్ ఆడ్రినా పాట్రిడ్జి తను కొత్తగా నటించినటువంటి బోంగో యాడ్ క్యాంపెయిన్‌కి బికినీలో తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈ సందర్బంలో ఆడ్రినా పాట్రిడ్జి మాట్లాడుతూ ఇలా ఈబ్రాండ్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం రెండవసారి అని అన్నారు. బోంగో యాడ్ క్యాంపెయిన్‌లో ఆడ్రినా పాట్రిడ్జి తనయొక్క బికినీ బాడీని టూపీస్ బ్లాక్ బికనీ ధరించి ఫోజు లివ్వడం జరిగింది.
బోంగో గర్ల్‌గా నన్నురెండవ సారి కూడా తీసుకున్నందుకు నేను చాలా ధ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నానని న్యూయార్క డైలీ న్యూస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. నిజంగా బోంగో ప్రోడక్ట్‌తో నాఅనుబంధం తీరనిది అందుకే నేను రెండవసారి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాను అని అన్నారు. సాధారణంగా మనం బీచ్‌లలో బికినీలు వేస్తాం..వచ్చే సమ్మర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దానికి కారణం నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేటటువంటి బోంగో బికినీలు ధరించి అలా బీచ్‌లలో విహారించాలనేది నాకోరిక అని అన్నారు. బోంగో కంపెనీ వారు ప్రవేశపెట్టినటువంటి షార్ట్స్ మరియు శాండిల్స్ కూడా ఎంతగానో నన్ను ఆకట్టుకున్నాయని వీటన్నింటిని నాఅభిమానులు కూడా తప్పకుండా వాడాలని అన్నారు.
విశాఖపట్నంలో భాను అచూకీపై ఆకాశరామన్న లేఖ కలకలం
విశాఖపట్నంలో భాను అచూకీపై ఆకాశరామన్న లేఖ కలకలం
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ ఆచూకీపై విశాఖపట్నంలో కలకలం సృష్టించింది. ఓ ఆకాశరామన్న లేఖ ఈ కలకలానికి కారణమైంది. బుధవారం రాత్రి మీడియా కార్యాలయాల బాక్సుల్లో ఆ ఆకాశ రామన్న లేఖలను వదిలి వెళ్లారు. భాను కిరణ్ సూరి హత్య జరిగిన మరుసటి రోజు నుంచి విశాఖపట్నంలోని కిర్లంపూడిలో ఉన్నాడంటూ ఆ లేఖలో ఆగంతకుడు తెలిపాడు. భాను కిరణ్ ఉంటున్నట్లు చెబుతున్న నాలుగు ఆపార్టుమెంట్ల పేర్లను కూడా ఆగంతకుడు ఆ లేఖలో తెలిపాడు.
ఆకాశరామన్న లేఖతో విశాఖపట్నంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. అపార్టుమెంట్లలో సోదాలు నిర్వహించారు. ఆ ఆపార్టుమెంట్లలో కొత్తగా చేరినవారి వివరాలు సేకరించారు. భాను కిరణ్ గతంలో విశాఖపట్నంలో కూడా భూముల సెటిల్మెంట్లు జరిపాడని ఆరోపణలున్నాయి. అయితే, మీడియాను, పోలీసులను తప్పు దారి పట్టించడానికే ఆ ఆకాశ రామన్న లేఖ రాశారని భావిస్తున్నారు.
యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లో భారతీయుడి ఆత్మహత్యా యత్నం
యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లో భారతీయుడి ఆత్మహత్యా యత్నం
దుబాయ్: యూనెటైడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ)లోని రాస్ ఆల్ ఖైమాలోభారతీయుడొకరు(27) ఆత్మహత్యకు యత్నించాడు. గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు అతడు ప్రయత్నించాడని స్థానిక మీడియా తెలిపింది. బాధితుడి పేరు జీ.ఎస్.గా మాత్రమే పేర్కొంది.
ఆరేళ్ల పాటు ప్రాణపదంగా ప్రేమించిన ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో అతను ఈ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో కోలుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నం నేరం కింద అతడికి ఆరు నెలల జైలు లేదా రూ. 62 వేలు జరిమానా విధించే అవకాశముంది.
వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ గరం
వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ గరం
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ
వరలక్ష్మిది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు ఒళ్లు కాలి మరణించిందని ఆయన అన్నారు. వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయని వరలక్ష్మి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ వ్యవహారంపై ఓ మంత్రుల కమిటీ కూడా పనిచేస్తోందని ఆయన చెప్పారు. చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వరలక్ష్మి అనే విద్యార్థి ఫీజు రీయంబర్స్‌మెంట్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందంటూ సాక్షి చానెల్ ఎడతెరిపి లేకుండా వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. పీజుల రీయంబర్స్‌మెంట్ విడుదల కావడం లేదంటూ వైయస్ జగన్ హైదరాబాదులో దీక్ష చేపట్టనున్ననేపథ్యంలో సాక్షి చానెల్ ఆ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. దీంతో బొత్స సత్యనారాయణ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరలక్ష్మి మృతిపై ఓ చానెల్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి అధికారుల దాడులు
టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి అధికారుల దాడులు
టిడిపి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు
అయితే దాడులకు, రాజకీయాలకు సంబంధం లేదని పలువురు భావిస్తున్నారు. నామా గతంలోకంటే టాక్సు తక్కువ కట్టారు. అయితే ఆయనకు కాంట్రాక్టులు తక్కువ అయి టాక్సు తక్కువ కట్టారా లేదా అనే విషయం ఈ దాడులలో బయటకు రానుంది. దేశంలోనే టాప్ మోస్టు ఎంపీల జాబితాలో నామా నాగేశ్వరరావు రెండు, మూడు స్థానాల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 10వేల కోట్ల కన్స్రక్షన్‌లే ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, నామా నాగేశ్వరరావులు పెద్దమొత్తంలో అడ్వాన్సు టాక్సు కట్టారు. కాగా కేవలం హైదరాబాదు, ఖమ్మంలోనే కాకుండా ముంబయి, చెన్నై, కలకత్తాలోని ఆయన కంపెనీలపై కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
కాగా నామా నాగేశ్వరరావు ఆస్తులపై దాడిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో ఈ దాడులు చేయిస్తుందన్నారు. ఆయన పార్టీలోకంటే ముందుగానే కోట్లాది రూపాయల ఆస్తిపరుడన్నారు. రాజకీయాలతో ఆయన సంపాదించింది ఏమీ లేదన్నారు. కంపెనీలపై, ఇళ్లపైన శుక్రవారం ఐటి దాడులు నిర్వహించింది. నామా నాగేశ్వరరావు ఆస్తిపై గత కొద్దికాలంగా నిఘా ఉంచారు. నామా తన ఆస్తులకు పూర్తిగా ఆదాయ పన్ను కట్టనట్టుగా భావించి ఐటి దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే నామాపై ఇలా అనుకోకుండా దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం. ఐటి అధికారులు మూడు బృందాలుకు విడిపోయారు. ఒక బృందం హైదరాబాదులోని నామాకు చెందిన మధుకాన్ కంపెనీపై, ఖమ్మంలో మరియు జిల్లాలోని నేలకొండపల్లిలోని మధుకాన్ కంపెనీలపై దాడులు చేశారు.
ఇమేజ్ అంటూ ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకొన్న స్టార్ హీరో...
ఇమేజ్ అంటూ ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకొన్న స్టార్ హీరో...
యాభై ఏళ్లు దాటిపోయాయి కాబట్టి ఇక హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ తిరగడం సబబు కాదని వెంకటేష్ ఫీలవుతున్నాడు. పార్టీ ప్లస్ ఏజ్ లో ‘వాయిస్ ఆఫ్ యూత్’ అంటూ సినిమాలు చేసేసిన వెంకటేష్ ఇక అది మంచి పద్దతి కాదని గ్రహించాడు. అందుకే తన ఇమేజ్ మార్చుకుని కొత్త తరహా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ‘ఈనాడు’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. హీరోయిన్ లేకుండా ‘నాగవల్లి’ సినిమాలో నటిస్తే ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. దాంతో తాను ఎలాంటి పాత్రలు చేస్తే కరెక్ట్ గా ఉంటుందనేది వెంకీకి అర్ధం కావడం లేదట. కథలైతే వింటున్నాడు కానీ వాటిలో ఏదో ఒకటి చేయడానికి మాత్రం కదలట్లేదు. వయసు పైబడడంతో ఇప్పటికే కాళ్లూ చేతులూ ఆధీనంలో లేకపోవడంతో పాటలు, ఫైట్లు ఉన్న సినిమాలు చేయడానికి ఓపిక చాలక, ప్రయోగాలకి పూనుకుని ప్లాపులు కొని తెచ్చుకోలేక పాపం విక్టరీ వెంకటేష్ చాలా వర్రీ అవుతున్నాడు. ఇమేజ్ అంటూ ప్రయోగాలు చేసి కష్టాలు కొనితెచ్చుకొన్నంత పనైంది..
జగపతి బాబుకి తిరుపతి గుండు కొట్టిస్తామని హెచ్చరిక
జగపతి బాబుకి తిరుపతి గుండు కొట్టిస్తామని హెచ్చరిక
జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.రేపు(శుక్రవారం) విడుదల కానున్న జై బోలో తెలంగాణ చిత్రం లో జగపతిబాబు నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం వెంకటరమణ, కృష్ణా జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాడికొండ సాయికృష్ణలు మీడియాతో మాట్లాడారు. జైబోలో తెలంగాణ చిత్రంలో హీరోగా నటించిన జగపతిబాబు నోటి వెంట సీమాంధ్రులను కించపరిచే విధంగా సంభాషణ ఉంటేకార్యక్రమంలో జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు మణీంద్ర, భాగ్యరాజు, అశోక్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలను, సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచే విధంగా వివాదాస్పదంగా జైబోలో తెలంగాణ చిత్రం ఉంటే అడ్డుకుంటామని అన్నారు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు.
తల్లిని ద్వేషించే పాత్రలో నయనతార అదుర్స్
తల్లిని ద్వేషించే పాత్రలో నయనతార అదుర్స్
నయనతార మలయాళంలో రీసెంట్ గా చేసిన ‘ఎలక్ట్రా’ చిత్రంలో ఆమె తన తల్లిని ద్వేషించే పాత్రను చేస్తోంది. ఆ పాత్ర సినిమాకే హైలెట్ అని అంతటా వినపడుతోంది. ఇఫి అంతర్జాతీయ చిత్రోత్సవాలు తో సహా పలు ఫిల్మోత్సవాల్లో ఈ సినిమా ఇప్పటికే ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా గురించి నయనతార మాట్లాడుతూ..అలెగ్జాండ్రా అనే గ్రీక్ డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఎలక్ట్రా’లో నా పాత్ర చాలా న్యూచురల్ గా ఉంటుంది. నా తల్లి డయానాగా మనీషా నటించింది. తల్లిని ద్వేషించే కూతురు పాత్రలో నేను సరికొత్త గా కనిపిస్తారు. సినిమాలో కనిపంచే భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి అంటోంది.
జాతీయ అవార్డ్ గ్రహీత శ్యాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మేకప్ లేకుండా నటిస్తోంది.ఈ పాత్ర గురించి చెబుతూ - "ఎలక్ట్రా కోసం నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నా. ఇప్పటివరకు నేను నటించినవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. పెద్ద సినిమాల్లో నటించినప్పుడు పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ చిన్న బడ్జెట్ చిత్రాల్లో చేసినప్పుడు నటనకు స్కోప్ ఉంటుంది. వరుసగా ఇలాంటి సినిమాలే కాకపోయినా అడపా దడపా ఇలాంటివి చేయడంవల్ల ప్రతిభ వెలికి వస్తుంది. ఆ కారణంతోనే 'ఎలక్ట్రా' సినిమాని అంగీకరించాను. నటిగా నా సత్తా నిరూపించే చిత్రం ఇది' అంటోంది నయనతార.
ఇక ఈ చిత్రానికి శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులుగా కనిపించే ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజవుతుంది. ఇక నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన బాపు దర్శకత్వంలో శ్రీరామ రాజ్యం చిత్రంలో సీతగా చేస్తోంది
ఏ సినిమా చేయాలో అర్దంకాక సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్
ఏ సినిమా చేయాలో అర్దంకాక సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్
మగధీర హిట్ తో ఎంత పాపులారిటి సంపాదించాడో, ఆరెంజ్ ప్లాఫ్ తో అంత డౌన్ అయ్యాడు రామ్ చరణ్ తేజ్. ఈ చిత్రం చరణ్ ను, ఆయన అభిమానులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడిప్పుడే ఆరెంజ్ షాక్ నుంచి కోలుకుంటున్న చరణ్ తన తదుపరి చిత్రం వేటలో వున్నాడు. ధరణి దర్శకత్వంలో రూపొందనున్న మెరుపు చిత్రం బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇక చరణ్ తదుపరి చిత్రం ఏమిటి అనే కన్ఫ్యూజన్ లో వున్నాడు. అయితే ఈ మగధీరుడు త్వరలో గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడట. ఈ కధ కూడా పూర్తి క్లాస్ గా ఉండటంలో మళ్శీ రామ్ చరణ్ తేజ్ ఆలోచనలో పడ్డాడు. ఇది మాత్రమే కాకుండా ఈసారి రిలీజ్ అవ్వబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం.
ఓ తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యత...ఎన్.శంకర్
ఓ తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యత...ఎన్.శంకర్
ఓ తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యతగా భావించి ఈ సినిమాను తీశాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఉత్తేజం, ఉద్వేగం నాలో కలుగుతోంది. నా కెరీర్‌ను పణంగా పెట్టి తీసిన సినిమా ఇది. ఓ రకంగా చెప్పాలంటే ఈ చిత్రం నా జీవితం అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్.. రేపు విడుదల కానున్న ఆయన తాజా చిత్రం జై బోలో తెలంగాణ చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే జై బోలో తెలంగాణ చిత్రం నిర్మాణ సమయంలో రకరకాల ఇబ్బందులకు గురయ్యాను. ముఖ్యంగా ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఉద్యమం జరుగుతున్న దశలోనే దానికి సమాంతరంగా రూపొందిన సినిమా ఇది. కథ విషయంలో గంటకోసారి మార్పులు జరిగేవి. ఉద్యమంతో పరుగులు తీస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడ్డాను. గుండెలమీద దు:ఖాన్ని పెట్టుకొని కన్నీళ్లతో తెలంగాణ కావ్యాన్ని రచించాను అని చెప్పుకొచ్చారు. జగపతిబాబు ఈ చిత్రంలో పదిహేను నిముషాల పాటు సాగే తెలంగాణ యోధుడు పాత్రను పోషించారు.
గిన్నీస్ బుక్ లోకి సైతం నవనీత్ కౌర్ వివాహం
గిన్నీస్ బుక్ లోకి సైతం నవనీత్ కౌర్ వివాహం
ఎమ్మెల్యే రవి రాణా ని నవనీత్‌కౌర్ అమరావతిలో నిన్న(బుధవారం)వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ వివాహం చాలా గ్రాండ్ గా ఎవరి ఊహకీ అందని విధంగా జరిగి మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహంతో పాటు మొత్తం 3,611 జంటలు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. కార్యక్రమంలో ఒక్కటైనవారిలో హిందూ జంటలు 2,443, 739 బౌద్ధ జంటలు, 150 ముస్లిం జంటలు, 15 క్రైస్తవ జంటలు, 13 అంధ జంటలు ఇంకా శారీరక వికలాంగులు, గిరిజనులు ఉన్నారు.
కార్యక్రమానికి హాజరైన విపరీతమైన రద్దీని అదుపుచేయడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. ఎమ్మెల్యే రవి రాణా ఏర్పాటుచేసిన ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో స్వయంగా ఆయనే పాల్గొని సినీనటి నవనీత్ కౌర్‌ను వివాహమాడి అందరికీ ఆదర్శంగా నిలిచారని అంతటా కొనియాడుతున్నారు. దేశ చరిత్రలోనేకాక ప్రపంచ చరిత్రలో ఇంతపెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు జరగడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కినట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను స్వామి రామ్‌దేవ్‌బాబాకు అందజేశారు.
ఇక వరుడు ఎమ్మెల్యే రవిరాణా కోసం ప్రత్యేకంగా ఒక గురప్రు బగ్గీని తీర్చిదిద్దారు.అందులోనే ఆయన మైదానంలో ఏర్పాలుచేసిన భారీ వేదికపైకి చేరుకున్నారు. సతీమణి నవనీత్‌కౌర్‌తో కలిసి అక్కడ ఆసీనులైన ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో అన్ని ధర్మాలకు చెందిన జంటలు పాల్గొనడంతో పురోహితులు అన్ని రకాల మంత్రాలు చదివారు. ప్రధాన వేదికకు 50 మీటర్ల దూరంలో చిన్న వేదిక ఏర్పాటు చేశారు. ర్యాంప్ మీదుగా నడిచి వెళుతున్న వధూవరులను ప్రముఖులందరు అభినందించి, ఆశీర్వదించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 1,100 జంటలకు వంట సామగ్రిని అందజేశాడు.
అలాగే ఎమ్మెల్యే రవి రాణా, నవనీత్‌కౌర్ దంపతుల డ్రెస్సు గురించి అంతటా హాట్ టాపిక్ గా మారింది. కుంకుమ రంగులో ఉన్న గాగ్రా చోలీతో వజ్రాలు పొదిగిన బంగారు నగలను ధరించి కల్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవనీత్ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోనట్లుగా గోధుమరంగు జోధ్‌పురి సూట్‌లో కల్యాణ వేదికపైకి వచ్చిన రవిరాణా కూడా అందరినీ అలరించారు. బంగారు రంగు వన్నెకల దారాలతో అల్లిన ప్రత్యేకమైన తలపాగను ధరించి కార్యక్రమానికే ఆకర్షణగా నిలిచారు.
వైయస్ మరణంతోనే ఆయన పాలన అంతమైంది: జెసి దివాకర్ రెడ్డి
వైయస్ మరణంతోనే ఆయన పాలన అంతమైంది: జెసి దివాకర్ రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే ఇతని పాలన అంతమైపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. మళ్లీ వైయస్ పాలన తెస్తామని అంటున్న వారు వైయస్ పాలన అంతమైందని తెలుసుకోవాలని చెప్పారు. ఆయన మరణించిన తర్వాత మళ్లీ వైయస్ పాలన ఎలా తీసుకు వస్తారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై అది తమకు తెలియదని, ఆ విషయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికే తెలుసునన్నారు. చిరు సమైక్యవాది అన్నారు. అయితే కాంగ్రెస్‌లో ఎప్పుడూ రెండు వాదనలు ఉన్నాయని చెప్పారు.
పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, జగన్ వర్గంలో భయాలు
పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, జగన్ వర్గంలో భయాలు
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ పులివెందుల శాసనసభా స్థానంలోనూ చెక్ పెట్టేందుకు కాంగ్రెసు పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వైయస్ సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వైయస్ సోదరుడు, మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి కొంతకాలంగా పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివేకా కడప లోక్‌సభ బరిలోకి దిగితే బాగుంటుందనేది మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. పులివెందులలో వివేకా విజయం సాధిస్తారనే ధీమా పెరగడంతో పార్టీ ఆయనను శాసనసభకే పోటీ చేయించేందుకు మొగ్గుచూపుతోందని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అధిష్ఠానానికి ఇదే అభిప్రాయాన్ని వివరించినట్లు తెలిసింది.
వివేకానందరెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో అందరితో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతోనూ వివేకాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిగా ఉండటంతో నియోజవర్గంలో మరింతగా దూసుకుపోతున్నారు. రచ్చబండ కార్యక్రమంతో ఆయన ప్రధానంగా పులివెందులపైనే దృష్టిపెడుతున్నారు. కొందరు నేతలు రహస్యంగా వివేకాకు మద్దతిస్తుంటే మరికొందరు బహిరంగంగానే ఆయన వెంట నిలుస్తున్నారు. దివంగత నేత భార్యపై బరిలో దిగుతున్నారు కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తూ ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. వివేకా వ్యూహంతో వైయస్ జగన్ వర్గంలో గుబులు చోటు చేసుకుంది.
చిరు భేటీకి ఇద్దరు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేల హాజరు
చిరు భేటీకి ఇద్దరు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేల హాజరు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెసు పార్టీ దోస్తీ నేపథ్యంలో గురువారం చిరంజీవి హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశానికి పీఆర్పీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పీఆర్పీకి చెందిన ఇంతమంది ఎమ్మెల్యేలు హాజరు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. అయితే కాంగ్రెసు పార్టీతో పొత్తు నేపథ్యంలో మంత్రి పదవులు తదితరాలను దృష్టిలో పెట్టుకొని వారు హాజరయినట్లుగా భావిస్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేల్లో ఈలి నాని ఒక్కరు చిరంజీవి అనుమతితో సమావేశానికి హాజరు కాలేదు.
ఇక వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలకు ఆహ్వానం పంపినప్పటికీ వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మేం పీఆర్పీలో ఉన్నప్పటికీ చిరంజీవి సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని చెప్పే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు అనీల్, మహేశ్వరరెడ్డి సైతం సమావేశానికి హాజరయ్యారు. గతంలో చిరంజీవి సమావేశం నిర్వహించిన సమయంలో పదిమంది లోపు ఎమ్మెల్యేలు హాజరయ్యేవారు. ఈసారి పదిహేనుమంది హాజరు కావడం మంత్రివర్గంలో చోటు కోసమేనంటూ పలువురు భావిస్తున్నారు. కాంగ్రెసు ఆఫర్‌పై నిర్ణయాన్ని చిరంజీవికి అప్పగిస్తూ ప్రజారాజ్యం విస్తృతస్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది.
వైయస్ వారసులమని టిడిపితో కుమ్మక్కు: ముఖ్యమంత్రి కిరణ్‌పై జగన్ ఫైర్
వైయస్ వారసులమని టిడిపితో కుమ్మక్కు: ముఖ్యమంత్రి కిరణ్‌పై జగన్ ఫైర్
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై గురువారం విరుచుకు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను తమ పథకాలుగా చెప్పుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు తాము ఇచ్చిన సలహాల మేరకే అని కాంగ్రెసు పెద్దలు చెప్పడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వైయస్‌పై బురద జల్లడానికే కాంగ్రెసు పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారసులం అంటూనే వైయస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వైయస్ వారసులు అయితే పావలా వడ్డీ, ఫీజు రియింబర్సు మెంటును ఎందుకు కొనసాగించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైయస్ పేరుతో పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవదన్నారు. వైయస్‌ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు యువనేత తెలిపారు. ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెసు చేసింది ఏమీ లేదన్నారు. కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు.
రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదని, అయితే రాజన్న స్వర్ణయుగాన్ని చూశానని వైయస్ జగన్ అన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత స్వర్ణయుగమేనన్నారు. మహానేత వైయస్‌పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ వారసులమని చెప్పుకుంటూనే సిగ్గులేకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి పాలించే హక్కులేదని జగన్ అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పేనన్నారు.
మా ఫోరం నిర్ణయమే తెలుగుదేశం నిర్ణయం: తెలంగాణపై నాగం జనార్దన్ రెడ్డి
మా ఫోరం నిర్ణయమే తెలుగుదేశం నిర్ణయం: తెలంగాణపై నాగం జనార్దన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణపై తమ నిర్ణయమే తమ పార్టీ నిర్ణయమని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేయడంపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్రంగా మండిపడ్డారు. తమ తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులంతా తెలంగాణకు కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా బహిష్కరించారని, ఇంకా తెలంగాణపై పార్టీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఏముంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని చెప్పాలని తమను పదే పదే డిమాండ్ చేస్తే తాము సహించబోమని ఆయన అన్నారు.
తెలంగాణపై పార్టీ నిర్ణయం చెప్పాలంటూ తమకు అడ్డంకులు కల్పిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. తమను లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తుంటే తెలంగాణ నాయకులు పార్టీ పేరు చెప్పి వెనక్కి తగ్గుతున్నారని ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులకు బుద్ధి లేదని ఆయన అన్నారు.
సిఎం కిరణ్ రచ్చబండలో రసాభాస: వైయస్ బొమ్మ ఉంటే వద్దు
సిఎం కిరణ్ రచ్చబండలో రసాభాస: వైయస్ బొమ్మ ఉంటే వద్దు
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కృష్ణా జిల్లా రచ్చబండ కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ ఉన్న పోస్టర్లను తొలగించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పోస్టర్లను మాత్రం తొలగించలేదు. వైయస్ ఫోటో బ్యాడ్జిలతో సమావేశానికి వచ్చిన వారిని కూడా లోపలకు అనుమతించలేదు. దీంతో జగన్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రచ్చబండ కార్యక్రమం తీవ్ర రసాభాసగా మారింది.
కాగా బందరు పోర్టును త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే రైతులు తమ భూములను త్యాగం చేయాల్సి ఉంటుందని సూచించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోలవరాన్ని రాజకీయం చేస్తున్నాయన్నారు. దురుద్దేశంయతో పోలవరాన్ని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని అయితే ఎవరు అడ్డుకున్నా పూర్తి చేస్తామని చెప్పారు. కొల్లేరును ఐదవ కాంటూరునుండి మూడవ కాంటూరుకు కుదిస్తామని చెప్పారు.
వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం, వైయస్ పేరే ఖరారు
వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం, వైయస్ పేరే ఖరారు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలబై ఐదు రోజుల్లో తమ పార్టీ వస్తుందని వైయస్ జగన్ అప్పట్లో చెప్పారు. కానీ ఆ గడువు ఎప్పుడో దాటి పోయింది. సంక్రాంతి తర్వాత అని, మార్చి రెండో వారంలో అని వైయస్ జగన్ వర్గం నాయకులు పార్టీ స్థాపనపై చెబుతూ వచ్చారు. కానీ మార్చిలో కూడా జగన్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.
మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్‌లో గానీ పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, పులివెందుల, కడప ఉప ఎన్నికల నాటికి పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే పార్టీ స్థాపనలో జాప్యం జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. అయితే, కారణం అది కాదని తెలుస్తోంది. తెలంగాణపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే పార్టీని స్థాపించాలనేది జగన్ అభిమతమని చెబుతున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని, తెలంగాణలో అడుగు పెట్టాలంటే కేంద్రం తెలంగాణపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు రావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. యథాతథ స్థితి చోటు చేసుకుంది.
పార్లమెంటు సమావేశాల లోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ, అది జరిగే అవకాశాలు లేవు. కాగా, రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనా, ప్రజారాజ్యం పార్టీతో వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, మంత్రివర్గంలో చేరుతుందా అనేది స్పష్టంగా తేలిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అప్పుడే జగన్ తన పార్టీ స్థాపనకు తగిన రంగం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు
Subscribe to:
Posts (Atom)