BREAKING NEWS
Tuesday, January 25, 2011
ఏ డ్రెస్‌కి ఎంత ఎక్స్‌పోజింగ్ వుంటుందో నాకు తెలుసు అంటున్న హీరోయిన్
గత సంవత్సరం తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల్లో ఒక్క చిత్రంతోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న తారల్లో సమంత ఒకరు. తొలి చిత్రం ఏమిమాయ చేశావేలో చీరకట్టులో హోయలు ఒలికించి, మలి చిత్రం బృందావనంలో గ్లామర్‌డోసును పెంచిన ఈ చెన్నై భామ ఆ రెండు చిత్రాల ద్వారా విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు సరసన దూకుడు అనే సినిమాలో నటిస్తున్నారు.
ట్విట్టర్‌లో శృతి హాసన్ కి అసభ్యకరమైన రాతలు
ట్విట్టర్‌లో శృతి హాసన్ కి అసభ్యకరమైన రాతలు
సంక్రాంతికి విడుదలైన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన అందం శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైన ఆమె గత కొంత కాలంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ తో సమస్యలు ఎదుర్కోంటోంది. ఎవరో ఓ వ్యక్తి తన కిష్టం వచ్చినట్టు ఆమెను అసభ్యకరమైన, విచిత్రమైన ప్రశ్నలతో వేధిస్తున్నాడట. దాంతో ఏం చేయాలో పాలుపోని శృతి ట్విట్టర్‌లో పోస్టులు రాయటం తగ్గించిందిట. అయితే ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారు కాస్త మనస్సు పెట్టి ఆలోచించాలని, ఇలాంటి పనులు తగదని, ఇంకా ఎక్కువ చేస్తే ఎంక్వైరీ చేసి మరీ మూయించగలనంటూ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం శృతి సూర్య సరసన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘7మ్ అరివు’ చిత్రంలో నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా నటిస్తున్నారు. సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరిగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం విదేశాలు వెళ్ళనున్నారని తెలుస్తోంది. రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు
అలా.. మొదలైంది' చిత్రం బయ్యర్లు రారనే...
అలా.. మొదలైంది' చిత్రం బయ్యర్లు రారనే...
చిన్న సినిమాకి బయ్యర్లు రారు కాబట్టి ప్రేక్షకుల్ని నమ్మి సొంతంగానే రిలీజ్ చేశాం...అంటున్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్. నాని, నిత్యమీనన్ కాంబినేషన్ లో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం 'అలా..మొదలైంది'. బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమైన ఈ చిత్రం క్రిందటవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుని విజయ పధంలో దూసుకుపోతోంది.ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకోవటానికి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...ఈ సినిమా చేయడానికి ముందు యాభై పైగా కథలు విన్నా. వారిలో దర్శకులమవుదామన్న వారినుంచి నాలుగైదు సినిమాలు చేసిన డైరెక్టర్ల దాకా ఉన్నారు. నందిని చెప్పిన కథ ట్రీట్ మెంట్ పరంగా బాగుంది. పురుషాధిక్య రంగంలో ఈ అమ్మాయి రావడమే విశేషం. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ వద్ద పనిచేశానని చెప్పింది. నాకంటే ముందు చాలామంది నిర్మాతల చుట్టూ తిరిగింది అవకాశాల కోసం. ఆమె వేవ్‌లెంగ్త్ నాకు మ్యాచ్ అయ్యింది. సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయగలదనిపించింది. అందుకే అవకాశమిచ్చా. కచ్చితంగా ఆమె పైకి వస్తుందనే నమ్మకం. ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.
అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!
అల్లు అరవింద్ ని ముప్పతిప్పలు పెడుతోన్న హీరోయిన్..!
సినిమాలపై ఎంతైనా ఖర్చు పెడతాడనే పేరున్న నిర్మాత అల్లు అరవింద్ కి ఆర్టిస్టులకి పారితోషికాలు ఇచ్చే విషయంలో మాత్రం గీసి గీసి బేరాలాడతాడనే బ్యాడ్ నేమ్ ఉంది. హీరోలు ఎలాగూ తమ ఫ్యామిలీ వాళ్లే కాబట్టి వాళ్లకి సినిమా రిజల్ట్ ని బట్టి డబ్బులిస్తుంటాడు. ఇక ప్రొడక్షన్ మిగతా నటీనటులు మాత్రం గీతా ఆర్ట్స్ సినిమా అంటే తిట్టుకుంటూ ఉంటారు. అలాగే తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న తమన్నాని ఒకేసారి రెండు సినిమాల్లో తీసుకుని నామమాత్రపు పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ ఒప్పందం చేసుకున్నాడు.
బద్రీనాథ్ సినిమాతో పాటు నాగచైతన్య, సుకుమార్ ల చిత్రంలో తమన్నాని హోల్ సేల్ గా బుక్క చేసుకున్నాడు. తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమన్నా తక్కువ మొత్తానికే నటించడానికి రెడీ అయింది. అయితే ఇంతలో తమన్నాకి తెలుగులో డిమాండ్ పెరిగింది. చాలా మంది అవకాశాలిస్తున్నారు. మరోవైపు తమిళ సినిమాలు ఎలాగో ఉన్నాయి. దాంతో తమన్నా అల్లు అరవింద్ సినిమాకి సరిగా డేట్లివ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. ఆమె కారణంగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ దెబ్బతిని కొంత నష్టం కూడా జరిగింది. అందరికీ టోకరా ఇచ్చే అల్లు అరవింద్ కే తమన్నా కాజా తినిపించిందని అతని బాధితులు సంబరపడుతున్నారు.
అనుకోకుండా వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకొనే చాన్స్ ఎవరిది..
అనుకోకుండా వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకొనే చాన్స్ ఎవరిది..
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చే హిందీ హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చే వారు తక్కువ మంది ఉంటారు. వీరిలో నిలదొక్కుకునే వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒకప్పుడు కూడూ ఇదే ట్రెండ్ ఉండేది. అయితే అతి తక్కువ మందే తెలుగు సినీ రంగం నుంచి బాలీవుడ్ లో కాలు మోసి సక్సెస్ సాధించారు. వాళ్లలో జయప్రధ, శ్రీదేవిలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినవారే ఎక్కువ.
మళ్లీ ఈ మధ్య ఈ ట్రెండ్ అసిన్, శ్రియలతో ఆరంభం అయింది. అసిన్ పరిస్థితి పర్వాలేదనిపించేలా ఉంది. అక్కడ ఎవరికీ దక్కని రీతిలో ఏకంగా ముగ్గురు ఖాన్ లతో సినిమా ఛాన్సులు కొట్టేసింది అయితే ఆ ఆ తర్వాత త్రిష పరిస్థితి ‘కట్టామిఠా’గా తయారయింది. తొలిసినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. లేటెస్ట్‌గా ప్రియమణి చిత్రం రక్తచరిత్ర హిందీ, రావన్ చిత్రాల ఫలితాలతో బాలీవుడ్‌లో ప్రియమణి భవిత ప్రశ్నార్థకమైంది. కాగా ఇప్పుడు అనుష్క, ఇలియానా, మంచు లక్ష్మీప్రసన్నలకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరికొందరు కూడా బి.రెడీ అంటున్నారు ఇప్పుడు!
ఆ కథ హరీష్ శంకర్ ది కాదు, అందుకే... రవితేజ
ఆ కథ హరీష్ శంకర్ ది కాదు, అందుకే... రవితేజ
హరీష్ శంకర్ సత్తా నాకు ముందే తెలుసు. నాకు నాలుగు సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. అప్పుడే మనం ఓ సినిమా చేద్దాం అని చెప్పా. అనుకోకుండా 'షాక్' అవకాశం వచ్చింది. ఆ కథ తనది కాదు. ఆ కథలో వినోదం పండించడానికి అవకాశం తక్కువ. కానీ హరీష్ తన శక్తి మేరకు ప్రయత్నించాడు. ఆ సినిమాలో మీరు నవ్విన ప్రతి సన్నివేశం హరీష్ శంకర్ రాసుకొన్నదే అంటూ తన షాక్ చిత్రం ప్లాప్ గురించి చెప్పుకొచ్చారు రవితేజ. ఆయన తాజా చిత్రం మిరపకాయ్ సంక్రాతి విజేతగా నిలబడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇలా స్పందించారు. అలాగే హరీష్ శంకర్ మీద తాను పెట్టుకున్న నమ్మకాన్ని వందకి రెండు వందల శాతం నిలబెట్టుకున్నాడన్నారు. అలాగే తాను ఎవరికీ సమాధానం చెప్పటానికి సినిమా చేయననీ, ఒక సినిమా ఎలా ఆడుతుందో ఆ సినిమా వచ్చే వరకూ ఎవరం చెప్పలేమని అన్నారు. అలాగే ప్రతిభనీ, కష్టాన్నీ నమ్మాకుంటే విజయం వస్తుందని, తాను కూడా అదే చేశానని చెప్పారు.
అమెరికా విశ్వవిద్యాలయంలో ఫ్రాడ్: తెలుగు విద్యార్థులే ఎక్కువ
అమెరికా విశ్వవిద్యాలయంలో ఫ్రాడ్: తెలుగు విద్యార్థులే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ వెలుగు చూసింది. అధికారులు సోదాలు చేసి, విశ్వవిద్యాలయాన్ని మూసేశారు. దీంతో వందలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. వీరిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికార వర్గాలు దర్యాప్తు చేపట్టి విశ్వవిద్యాలయంలోని వీసా పర్మిట్లను దుర్వినియోగ పరుస్తూ మనీ లాండరింగ్‌కు, ఇతర నేరాలకు విద్యార్థులు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఈ విశ్వవిద్యాలయం సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా శివారులోని ప్లెజంటోన్‌లో ఉంది. గతవారం ఈ విశ్వవిద్యాలయం మూత పడింది.
విశ్వవిద్యాలయంలో 1555 మంది విద్యార్థులుంటారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే. విద్యార్థులు వివిధ కాలిఫోర్నియాలో ఉన్నట్లు చెబుతూ రెసిడెన్షియల్, ఆన్‌లైన్ కోర్సుల్లో చేరారని, నిజానికి వారంతా అక్రమంగా మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో తేలింది. పలువురు భారతీయ విద్యార్థులను అధికారులు విచారించారు. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు.
కాగా, ఈ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులను ఆదుకోవడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ముందుకు వచ్చింది. తెలుగు విద్యార్థులకు చట్టపరిధిలో సహాయం చేయడానికి, తగిన సమాచారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా చెప్పారు. తాము ట్రై వ్యాలీ విద్యార్థులను సంప్రదిస్తున్నామని, తగిన సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. సహాయం అవసరమైన విద్యార్థులు ఆకులను సంప్రందించాల్సిందిగా ఆయన సూచించారు. లా కంపనీ నడుపుతున్న ఆకుల అండ్ అసోసియేట్స్ విద్యార్థులకు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన విద్యార్థులు ఆకులను 972-241-4698 అనే ఫోన్ నెంబర్‌పై గానీ Raj.akula@akulalaw.com అనే ఇ - మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.
ప్రేమికుల రోజు కానుక
ప్రేమికుల రోజు కానుక
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా మూన్‌వాటర్ పిక్చర్స్ రూపొందిస్తున్న చిత్రం ‘కుదిరితే కప్పు కాఫీ’. సుమభట్టాచార్య కథానాయిక. శివ, మహి నిర్మాతలు. రమణ సాల్వ దర్శకుడిగా, సిరివెన్నెల సీతారామశాస్ర్తి తనయుడు యోగేశ్వర్ (యోగి) సంగీతదర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 11న విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరుణ్‌సందేశ్, రమణసాల్వ, మహి, శివ, యోగి తదితరులు పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిన సినిమా ఇది. పార్కుల్లో కనిపించే సాదాసీదా ప్రేమ ఇందులో ఉండదు. కవితాత్మకత సినిమా సాంతం కనిపిస్తుంది. ప్రేమికులరోజుకి 3రోజుల ముందు థియేటర్లలోకి వస్తోంది. యోగి సంగీతం కీరవాణిస్థాయిలో ఉందనే ప్రశంసలు సైతం వచ్చాయి. సంగీతం సహా కెమెరావర్క్ హైలైట్. దర్శకుడు తొలిచిత్రమైనా అనుభవజ్ఞునిలా మలిచారు. మామూలు థియేటర్లలో సైతం ఎసిలో ఉన్న ఫీలింగ్‌నిచ్చే సినిమా ఇది’ అన్నారు. దర్శకుడు రమణ సాల్వ మాట్లాడుతూ ‘సినిమాటోగ్రాఫర్‌గా అనుభవజ్ఞుడిని. టర్నులు, ట్విస్టులతో ఆకట్టుకునేలా సినిమా మలిచాను. రంగుల సమన్వయంతో అందమైన ఫోటోగ్రఫీ అలరిస్తుంది. ప్రేయసీప్రియుల మధ్య ఎడబాటుతోనే సిసలు ప్రేమ పుట్టుకొస్తుందని, పెయిన్ నుంచే ప్రేమ పెరుగుతుందని విడమర్చి చెబుతున్నాం. సందర్భానుసారమే పాటలుంటాయి’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 11న సినిమా విడుదల చేస్తున్నాం. ప్రేమికుల రోజు కానుక ఇది’ అన్నారు.
అప్ టు డేట్‌గా ఉండాలి
అప్ టు డేట్‌గా ఉండాలి
అనుభవం పెరుగుతున్న కొద్దీ అభినయానికి ఆస్కారమున్న పాత్రల వైపు మొగ్గుచూపాల్సింది పోయి… గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు త్రిష. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా…? అని ఈ తమిళ తామరను అడిగితే- ‘‘ప్రత్యేకమైన కారణం ఏమీలేదు. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉండాలి. కేవలం మోడ్రన్ లుక్ కోసమే అలా కనిపిస్తున్నాను’’ అని సమాధానమిచ్చారు త్రిష. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఈ ప్రయత్నాలని కొందరి అభిప్రాయం.
దానికి మీరిచ్చే సమాధానం ఏమిటి? అన్నప్పుడు- ‘‘వారి అభిప్రాయాలను వారి వద్ద ఉండనీయండీ. బాలీవుడ్ అవకాశాలకోసం వెంపర్లాడాల్సిన పరిస్థితిలో నేను లేను. ఆ విషయం కాస్త ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చేతినిండా నాకు సినిమాలున్నాయి. గతంలో ఓ ప్రయత్నం చేశాను. అంతమాత్రం చేత చేసే పనిని పక్కన పెట్టి 24 గంటలూ అదే పనిమీద ఉంటాను అనుకోవడం వారి అమాయకత్వం. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కళాకారులు ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నానని వల్గారిటీకి కూడా అవకాశం ఇస్తానని అనుకోకుండి. ఎంత ట్రెండీగా వెళ్లినా… నా పరిధి నాకుంది’’ అంటూ తనదైన శైలిలో అందంగా నవ్వేశారు త్రిష.
‘ఆదుకాలం’ విమర్శకుల ప్రశంసలు
‘ఆదుకాలం’ విమర్శకుల ప్రశంసలు
తాప్సీ, ధనుష్ జంటగా నటించిన ‘ఆదుకాలం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నిర్మాతకు మంచి వసూళ్లూ రాబట్టుకుంది. ఈ సినిమా అనుభవాన్ని నటి తాప్సీ ఇలా చెప్పుకొచ్చింది…. నటిగా ప్రేక్షకుల ఆనందమే మాకు అత్యంత ప్రధానమైంది. అభిమానుల చప్పట్లు, ప్రశంసలు ఎనలేని బలాన్ని ఇస్తాయి. ఇండిస్టీ పెద్దలు మా సినిమా చూసి బాగా చేశావ్ అని పొగిడినప్పుడు ఇంకా ఆనంద మేస్తుంది. అలాంటి మరిచిపోని సంఘటన ఇటీవల జరిగింది. అదేంటంటే… తమిళంలో ధునుష్ సరసన నేను నటించిన ‘ఆదుకాలం’ సంక్రాంతికి విడుదలై, మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. హీరో ధునుష్ మామ అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మా సినిమా చూడ్డానికి వచ్చారు.
నా చిత్రాన్ని చూడ్డానికి రజనీసార్ వచ్చారని తెలియగానే నాకెంత సంతోషమేసిందో చెప్పలేను. ఆయనకు ఎదురెళ్లి ఆహ్వానించాను. ఆయన పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడాను కూడా. పలు విషయాలు నేను చెబుతుంటే చక్కగా విన్నారు. తెరపై ఎన్నోసార్లు చూసిన నాకు, ఆయన పక్కన కూర్చొని నా సినిమా వీక్షిస్తానని ఊహించలేదు. ఇండిస్టీ గురించి, జీవితాన్ని గురించి కొద్ది మాటల్లోనైనా విలువైన సలహాలు ఇచ్చారు. ఆయన మాటతీరు, వేషం చాలా సింపుల్. ఓ సగటు ప్రేక్షకుడి మాదిరి సినిమాలో లీనమై ఎంజారు చేశారు. నేను నటించిన చిత్రం చూసి, రజనీ ఎంజారు చేశారని మనసులో గర్వంగా ఫీలయ్యాను కూడా ! అంతా అయిపోయాక… తిరిగి వెళ్లేప్పుడు నా దగ్గరికొచ్చి…’యు డిడ్ గుడ్ జాబ్’ అని ప్రశంసించారు. ఆ మాటలు ఎప్పటికీ మరిచిపోలేను.
పారిపోతే బాగుండు అనిపించింది
పారిపోతే బాగుండు అనిపించింది
‘‘ఎముకలు కొరికే చలి అంటారే.. అదెలా ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను. ఆ చలికి తట్టుకోలేక వేడిగా ఉండే ప్రాంతానికి పారిపోతే బాగుండు అనిపించింది’’ అంటున్నారు శ్రుతి హాసన్. సూర్య సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఏళామ్ అరివు’ చిత్రం షూటింగ్ ఇటీవల హాంగ్‌కాంగ్‌లో జరిగింది. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉందట. దాని గురించే శ్రుతి చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’లో చాలా గ్లామరస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు శ్రుతి. ఈ చిత్రంలో చేసిన ప్రియ పాత్ర తనకెంతో ఇష్టమని కూడా ఆమె అన్నారు. మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అని శ్రుతిని అడిగితే – ‘‘అసలు డ్రీమ్ రోల్ అనే కాన్సెప్ట్ మీదే నాకు నమ్మకం లేదు. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారుతుంటాయి. మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఇవాళ డ్రీమ్ రోల్ అనిపించినది రేపు సాదా సీదా పాత్రలా అనిపించొచ్చు. అందుకే నేను ఫలానా పాత్ర నా ‘డ్రీమ్ రోల్’ అని ఫిక్స్ అవ్వను.
ఏ పాత్ర చేస్తే దాన్నే డ్రీమ్ రోల్‌గా భావించి చేస్తాను’’ అన్నారు. మీ చెల్లెలు అక్షరకు ఏమైనా సలహాలు ఇస్తారా? అన్నప్పుడు – ‘‘లేదు. మా నాన్నగారు మాకు బాగా స్వేచ్ఛ ఇస్తారు. ఆయన నాకు సలహాలు ఇవ్వరు. అలాగే నేను పెద్దదాన్ని కదా అని అక్షరకు సలహాలివ్వడానికి ట్రై చేయను. అక్షర తెలివిగలది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తనకు బాగా తెలుసు.
నాకు తగిన కథే ఎంచుకుంటా – నిత్యమీనన్
నాకు తగిన కథే ఎంచుకుంటా – నిత్యమీనన్
వాస్తవంగా నేను మలయాళీ. మా తల్లిదండ్రులు బెంగుళూరులో స్థిరపడ్డారు. నేను అక్కడే పుట్టాను. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేశాను. చిన్నతనం నుండీ నాకు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. అయితే మనం ఒకటి తలిస్తే, దైవం ఒకటి తలుస్తాడు కదా అందువల్ల కాలేకపోయాను’ వివరిస్తోంది నూతన తార నిత్యమీనన్. తన తాజా చిత్రం ‘అలా మొదలైంది’ అనుభవాల్ని ఇలా వివరిస్తోంది.
Subscribe to:
Posts (Atom)