BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, February 14, 2011

శాటిలైట్ రైట్స్ లో మహేష్ 'దూకుడు' కి 5.75కోట్లు.

Mahesh Babuఒకప్పుడు తెలుగు సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి డబ్బులు వచ్చేవి. చిన్నా చితకా సినిమాలకి కూడా లక్షల్లో వచ్చేవి. జీటీవీ తమ తెలుగు చానెల్ స్టార్ట్ చేసాక ఇది మరీ ఎక్కువైపోయింది. ఫ్లాప్ సినిమాలకు కూడా కోట్లు ఆఫర్ చేయడం జరిగింది. దాంతో ఆ పోటీని తట్టుకోలేక, ఈటీవీ , మాటీవీ, జెమినీ కొన్నాళ్ల క్రితం తమకు తాముగా ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ఒక్క జీటీవీ మాత్రమే వీటిని ఎక్కువగా కొంటోంది. జెమినీ కూడా అప్పుడప్పుడు కొంటోంది కానీ, పోటీకి వెళ్లి కొనడం లేదు. దాంతో పెద్ద హీరోల సినిమాలకే మంచి రేటు వస్తోంది.

ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5.75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టర్కీ, దుబాయ్ లలో షూటింగ్ పూర్తి చేసుకొని, రీసెంట్ గా పాటలు మరికొన్ని సీన్స్ ను కచ్, గుజరాత్ లలో చిత్రీకరించిన విషయంత తెలిసిందే. కాగా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 15న హైదరాబాదులో మొదలై మార్చి చివరికి పూర్తవుతుందని సమాచారం.

మహేష్ బాబు దూకుడు చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతంటే...

Mahesh Babuమహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న "దూకుడు" చిత్రం ప్రారంభం నుంచి విపరీతమైన క్రేజ్ క్రియోట్ చేస్తూ వస్తోంది. దాంతో మార్కెట్లో నూ ఈ చిత్రంపై మంచి హైప్ ఏర్పడి ..శాటిలైట్ రైట్స్ ఐదు కోట్ల డబ్బై ఐదు లక్షలు వరకూ పలికినట్లు సమాచారం. మా టీవీ వారు ఈ చిత్రం ను తీసుకున్నారు. మాటీవీ వారు రీసెంట్ గా లాంచ్ చేసిన మా మూవీస్ కోసం ఈ చిత్రం పోటీపడి మరీ తీసుకున్నారు.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

పోకిరి స్టైల్లో ‘దూకుడు’ చేయాలని మహేష్ టెన్షన్..

Mahesh Babuటాలీవుడ్ నెం 1 హీరో అంటూ మహేష్ ని మోసేసిన అభిమాన సంద్రం నివ్వెరపోయింది ఫ్యూచర్ మెగాస్టార్ అంటూ మహేష్ ని ఆకాశానికెత్తేసిన మీడియా సైలెంట్ అయిపోయింది. దానికి కారంణం ‘ఖలేజా’ సినిమా కోసం మూడేళ్ళ పాటు టైమ్ తీసుకున్నాడు మహేష్. ఓ హీరో కెరీర్ లో ఇదేమీ చిన్న పీరియడ్ కానే కాదు. కనీసం ఓ అరడజను సినిమాలు ఈ టైమ్ లో రిలీజ్ అయిపోయేవే సరిగ్గా సినిమాలు చేస్తే. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ అంగీకరించేశాడు. ఇకపై ఆ తప్పు చేయనన్న మహేష్,‘దూకుడు’ సినిమాతో చాలా దూకుడుతో ప్రేక్షకుల ముందుకొస్తానని హామీ ఇచ్చాడు.

శ్రీనువైట్ల దర్శకుడు కావడంతో, మహేష్ మీద నమ్మకాల్లేకపోయినా ఈ సినిమా ఎలాగోలా తొందరగా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందని మహేష్ అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకే, చాలా తొందరగా ‘ఖలేజా’ ప్లాప్ ని దిగమింగేసుకున్నారు. అయితే మహేష్ మాత్రం ‘దూకుడు’ సినిమాని ఫలానా టైమ్ లో మీ ముందుకు తెస్తాననే భరోసా అభిమానులకు ఇవ్వలేకపోతున్నాడు. శ్రీను వైట్ల సినిమాకు బిన్నంగా ‘దూకుడు’ చాలా స్లోగా తెరకెక్కుతోందిట. మళ్ళీ ‘ఖలేజా’ టైమ్ కి తప్ప ఈలోగా సినిమా విడుదలయ్యే అవకాశాలు కన్సించడంలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఏమో ‘పోకిరి’ స్టైల్ లో ఫినిష్ చెయ్యాలనీ, బాక్సాఫీస్ లో భారీ లాభాల్ని చూపించాలనీ కలలు కన్న మహేష్ తాను టెన్షన్ పడిపోతూ, శ్రీను వైట్లను టెన్షన్ పెట్టేస్తున్నట్టు సమాచారం. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే..

అదుర్స్ సినిమా నుంచే నాపై బ్రహ్మానందం కన్నేశాడంటున్న హీరోయిన్..

Brahmanandam-Sheelaఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం మీద తెగ ఆరోపణలు చేస్తున్నారు సినిమా ప్రముఖులు. ఈకోవలోకి కొత్తగా మరో హీరోయిన్ ఇటీవలే చేరింది. జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం.

ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట. మొన్నిటికి మొన్న హాస్యనటుడు శివారెడ్డి కూడా బ్రహ్మానందం తనని వేధిస్తున్నాడంటూ మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి బైటకు వచ్చేందుకు బాధ పడుతున్న బ్రహ్మానందంపై షీలా ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకుంది..ఇక మీదటైనా బ్రహ్మానందం ఇలాంటి పనులు మానుకోవాలని తన సన్నిహితులు హెచ్చరించినట్లు సమాచారం.

త్రిష మసాజ్ వీడియోకు నెట్ లో భలే డిమాండ్

Trishaటాప్ స్టార్ గా ఎదిగిన త్రిష ప్రారంభం రోజుల్లో ఓ కేరళ మసాజ్ సెంటర్ వారి యాడ్ ఫిలిం లో నటించింది. ఆ వీడియోలో ఆమె ఓ కష్టమర్ కి మసాజ్ చేస్తుంది. ఆయుర్వేద మసాజ్ గా ఆ యాడ్ ఉన్నప్పటికీ అందులో మసాజ్ చేయటం అనేదే హాట్ కాన్సెప్ట్. దానిమీదే అప్పటి రూపకర్తలు దృష్టిపెట్టి త్రిషను ఎక్సపోజ్ చేసారు. ఎప్పుడో చేసిన ఈ యాడ్ ఫిలిం దాని కాలపరిమితి ముగిసిపోవటంతో ప్రచారంలో లేదు. అయితే ఇల్లీగల్ గా కొందరు దానిని సేకరించి నెట్ లో పెట్టారు. త్రిష క్రేజ్ ని గిట్టని ఓ స్టార్ హీరోయిన్ కొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ దానిని సేకరించి నెట్ లో పెట్టించిందని వినపడుతోంది. ఎవరు పెట్టారనేది ప్రక్కన పెడితే ఆ వీడియోకు మాత్రం మంచి క్రేజ్ వచ్చి ఎక్కువ డౌన్ లోడ్స్ అవుతున్నాయని సమాచారం.

జూ ఎన్టీఆర్ ‘శక్తి’ స్టోరీ లీక్ అయింది..ఇక రికార్డు బ్రద్దలే...!?

Jr Ntrయంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం ‘శక్తి’. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మగధీర’ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనే దృష్టితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంతభారీ స్థాయిలో రూపొందించబడుతున్న ఈ చిత్రం దాదాపు 45కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ‘పోకిరి’సాధించిన రికార్డ్స్ ని తిరగరాసిన ‘మగధీర’ని తలదన్నే రేంజ్ లో ఊహకందని ప్రత్యేకతలతో ‘శక్తి’ రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర ప్రమోషన్ ని త్వరలో ప్రారంభించనున్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్నశక్తి సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ బయటికి లీకయ్యిందట. లీకయిన కథ ప్రకారం సినిమా యాక్షన్ ఓరియంటెడ్ గా రూపొందుతోందని చెప్పోచ్చు. ఎన్టీఆర్ ఓ ఫవర్ ఫుల్ ఆయుధాన్ని వెతకడానికి రకరకాల ప్లేస్ లకు వెళతాడట. ఆ ఆయుధం చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. ఎలాగైనా ఆ ఆయుధాన్ని సాధించి తీరాలే పట్టుదలతో దాన్ని వెతుక్కుంటూ వెళుతున్న ఎన్టీఆర్ రకరకాల ఆపాయాలను, అనుభవాలను ఎదుర్కొంటాడట. ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఈ ఆయుధం దొరుకుతుందా లేదా? ఈ అపాయాలను దర్శకుడు మోహర్ రమేష్ చాలా అడ్వంచర్ గా చిత్రీకరించాడని సమాచారం. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 27న, మార్చి 30న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్ణయించారు.


అప్పలరాజు చిత్రంలో వర్మ వాయిస్ ఓవర్ లో ...

Ram Gopal Varmaమొన్న రక్త చరిత్ర చిత్రంతో తన వాయిస్ తో నేరాలు-ఘోరాలు ని మరపించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన వాయిస్ ని వినిపించటానికి రెడీ అవుతున్నారు. ఆయన తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు లో ఆయన మొదట ఓ ఉపోద్ఘాతం ఇస్తారు.తెర మీద బొమ్మ పడగానే వర్మ గొంతు వినిపిస్తుంది. ఆ ఉపోద్ఘాతం లో 'ఇది కామెడీ సినిమా - కాసేపు నవ్వుకొందాం అని వస్తే సారీ...' అంటూ సినిమా జెనర్ గురించి ముందుగా చెప్పి ప్రిపేర్ చేస్తారు.

ఇక ఫిల్మ్‌నగర్‌లో అప్పల్రాజు చేసిన ప్రయాణమే ఈ సినిమా. అప్పలరాజుకి అమలాపురంలో సినిమాలు చూడ్డం తప్ప మరే పనీ ఉండదు. థియేటర్‌కి వెళితే... సినిమాలన్నీ ఒకేలా పరమ బోర్‌ కొట్టేస్తున్నాయి. 'ఓస్‌... ఈ మాత్రం సినిమా నేను తీయలేనా..?' అనుకొని హైదరాబాద్‌ వచ్చేస్తాడు.అక్కడనుంచి అతను సినీ పరిశ్రమలోని పరిచయమయ్యే విచిత్రమైన పాత్రలతో అతను జర్నీ చేసి ఎలాంటి సినిమా తీస్తాడు అనేది కథ.

అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

రీమేక్ సినిమాలకు కొత్త శ్రీకారం చుట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Pawan Kalyanపవన్ కళ్యాణ్ ఏది చేసినా అది కొత్తే. గతంలో రీమేక్ సినిమాలు చాలా విరివిగా విడుదలయ్యేవి. కాగా ఈమద్య కాలంలో పోలిస్తే మాత్రం ఇది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. దానికి కారణం మన దర్శకులు కొత్త కొత్త కధలతో సినిమాలు తీయడమే. గతంలో తమిళ సినిమాల్ని మన వాళ్శు ఎక్కవగా రీమేక్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తమిళంలో విడుదలైనటువంటి అన్ని సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతుండంతో మన సినిమా నిర్మాతలు కన్నడ, మళయాళ సినిమాలను రీమేక్ చేసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు.

ఇకపోతే బాలీవుడ్ హిట్ సినిమాలని రీమేక్ చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దానికి కారణం బాలీవుడ్ సినిమాలు నైజాంతో పాటు అన్ని ముఖ్యమైన నగరాలలో విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి విడుదలయిన వెంటనే మనవాళ్శు వెంటనే కవర్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాటిని రీమేక్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చనే కాబోలు వాటిని రీమేక్ చేయడం మానివేశారు మనవాళ్శు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా బాలీవుడ్ లో హిట్ అయినటువంటి లవ్ ఆజ్ కల్, దబాంగ్ రీమేక్ వల్ల టాలీవుడ్ నిర్మాతలు దృష్టి ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద పడిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో రీసెంట్‌గా హిట్స్ అయినటువంటి నోవన్ కిల్డ్ జెస్సికా, యమ్లా పగ్లా దీవాలా లాంటి సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడిందని ఫిలింవర్గాల సమాచారం. ఇలాగే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఇంత గిరాకీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.

గోపీచంద్ 'వాంటెడ్‌' చిత్రం సెన్సార్ కట్స్ ఏమిటంటే...

Wantedగోపీచంద్, దీక్షాసేధ్ కాంబినేషన్ లో రూపొంది రిలీజైన చిత్రం వాంటెడ్. ఈ చిత్రం ద్వారా బి.వి.యస్ రవి అనే రచయిత దర్శకుడు మారారు.భవ్య క్రియేషన్స్‌ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవి, నిర్మాత వి. ఆనందకుమార్‌. ఈ చిత్రానికి సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి.

1. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'నిత్యానందం' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

2. మూడు నాలుగు రీళ్లలో పిక్చరైజ్‌ చేసిన 'నా కాయని గిచ్చావ్‌' అనే డైలాగ్‌లలోని ''కాయ''ని తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

3. అయిదు ఆరు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో 'స్త్రీలను గర్భిణీ స్త్రీలను చేస్తూ వుంటారు' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడనీయకూడదన్నారు.

4. తొమ్మిది పది రీళ్ళలో గల 'ముండ' పదాన్ని తొలగించి శబ్దం వినబడనీయ వద్దన్నారు.

16 రీళ్ళ నిడివిగల 'వాంటెడ్‌' 26-1-2011న విడుదలయింది.

గోపిచంద్‌, దీక్షాసేథ్‌, జయసుధ, చంద్రమోహన్‌, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషించిన 'వాంటెడ్‌' చిత్రాన్ని ఇసి చూసి 4 కట్స్‌తో 24-01-2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీచేసింది.

నట్టికుమార్ నా దృష్టిలో గొప్ప నిర్మాత...జగపతి బాబు

Jagapathi Babuనట్టికుమార్ మార్కెట్ తెలిసిన నిర్మాత. ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుసుకుని దాన్ని నియంత్రించడం తెలిసిన వ్యక్తి. నా దృష్టిలో పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. నేను నటించే 100వ సినిమా కూడా ఈ ఏడాది తప్పక ప్రారంభమవుతుంది. నట్టికుమారే ఆ సినిమాను నిర్మిస్తానని అంటున్నారు అంటూ నట్టికుమార్ గురించి చెప్తున్నారు జగపతిబాబు. ఆయన నట్టికుమార్ నిర్మాతగా చట్టు,బ్లాక్ మనీ చిత్రాలు చేస్తున్నారు. అలాగే తన రీసెంట్ ఫెయిల్యూర్ గాయం 2 గురించి చెబుతూ...'గాయం-2' మంచి సినిమానే. కానీ కాస్ట్ ఫెయిల్యూర్. ఆ సినిమాకి ప్రొడక్షన్ మొత్తం నేనే చూశా. ఎప్పుడూ అంటుంటాను కదా. బ్యాడ్ బిజినెస్ మేన్‌ని అని. ఆ మాటని ఆ సినిమా మరోసారి నిజం చేసింది అన్నారు. అంతేగాదు ప్రేక్షకులకు రిలీఫ్ కోసమని బలవంతంగా పాటల్ని, ఫైట్లను చొప్పించే పద్ధతికి ఇక స్వస్తి చెప్పాలనుకుంటున్నా. మరీ సన్నివేశం బలంగా ఉంటే తప్ప తూతూ మంత్రంగా పాటలను పూర్తి చేయడం వృథా. ఫైట్లు పెట్టవద్దని నా దర్శక, నిర్మాతలకు క్లియర్ గా చెప్తున్నా అన్నారు.

నిర్మాతగా మారునున్న అల్లు గారి అబ్బాయి..!?

Allu Sirishగీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీస్ నిర్మాతగా మారనున్నాడా..?అవుననే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ గీత ఆర్ట్స్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా రెండో కొడుకు అల్లు అర్జున్ హీరోగా నిరూపొంచుకున్నాడు. చిన్న కొడుకు అల్లు శిరీష్ ప్రస్తుతం సౌత్ స్కోప్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ ను నెలకొల్సి విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రానున్న కాలంలో పూర్తిస్థాయి నిర్మాతగా మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అని సమాచారం.

గతంలో గీతా ఆర్ట్స్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మించిన మిందీ చిత్రం ‘గజినీ’ కి సంబంధించి ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ శిరీష్ దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే సినిమా నిర్మాణంపై మరియు పంపిణి వ్యవస్థ మీద అతనికి ఉన్న అవగాహన ట్విట్టర్ లో శిరీష్ పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాకపోతే అతను ఎవరితో, ఎప్పుడు సినిమా మొదలు పెడగాడు వంటి విషయాలు తెలుసుకోవటానికి మరి కొంత సమయం వేచి చూడాలి.

'గగనం' చిత్ర కథ కాపీ వివాదంపై దిల్ రాజు ఘాటు స్పందన

Dil Rajuనాగార్జున హీరోగా శుక్రవారం విడుదలైన గగనం చిత్ర కథ తను రాసినదేనని రచయిత్రి ముచ్చర్ల రజనీశకుంతల మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. అలాగే కథంతా అలాగే తీసి కేవలం తను రాసుకున్న క్లైమాక్స్‌ను కొద్దిగా మార్చి దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మండిపడ్డారు. పబ్లిసిటీకోసం మీడియాకెక్కవద్దని అన్నారు. కథ మీదేనని అనిపించినప్పుడు తనను సంప్రదించాలి కానీ...ఇలా మీడియాకెక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు ఆ కథ ముచ్చర్లదని ఆమె చెపుతున్నా, తను విశ్వసించలేనని అన్నారు. అయితే దీనికి శకుంతల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తను రాసిన కథను ఆసాంతం చదివిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని దిల్ రాజుకు సూచించారు. అయితే గగనం కాపీ కథ అని నిరూపణ అయితే తాను దేనికైనా సిద్ధమేనని ఆయన అన్నారు.కాందహార్ హైజాక్ ఉదంతాన్ని ప్రేరణగా తీసుకుని తాను హైజాక్ పేర నవల రాశానని, 2000లో అది మయూరి పత్రికలో సీరియల్‌గా వచ్చిందని ఆమె చెప్పారు.

తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణపై కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన?

Kiran Kumar Reddyహైదరాబాద్: తెలంగాణ సంఘాల జెఎసిలు సహాయ నిరాకరణకు పిలుపునివ్వడం వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఆయన ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే మాట వినిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగో ఆయనకు బోధపడడం లేదని అంటున్నారు. ప్రభుత్వోద్యోగులను సహాయ నిరాకరణకు సమాయత్తం చేయడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పూర్తిగా మునిగిపోయారు. వివిధ శాఖలకు, సంస్థలకు చెందిన ఉద్యోగులతో వారు సమావేశమవుతున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ కూడా మద్దతు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యోగులు చేపట్టే సహాయ నిరాకరణ వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభిస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నాలుగు జిల్లాలకు చెందిన సింగరేణి కార్మికులు కూడా సహాయ నిరాకరణకు సమాయత్తమయ్యారు. బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేయడానికి వారు పూనుకున్నారు. అన్ని గనుల్లోనూ పనులు జరగకుండా బైఠాయించాలని వారు నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆయన సోమవారం వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు. బిల్లు ప్రతిపాదించడం అటుంచితే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాజకీయ నాయకులు కూడా కోరుతున్నారు.

ఉద్యోగుల సహాయ నిరాకరణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా మద్దతు ప్రకటించారు. సహాయ నిరాకరణ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు తాను ధర్నాకు దిగుతానని ఆమె హెచ్చరించారు. మొత్తం మీద సహాయ నిరాకరణపై వాతావరణం వేడెక్కుతోంది

మార్చిలోనే పార్టీని వైయస్సార్ సమాధి వద్ద ప్రకటిస్తా: వైయస్ జగన్

YS Jaganకడప: తన కొత్త పార్టీని మార్చి నెలలోనే ప్రారంభిస్తున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెప్పారు. కడప జిల్లాలోని పులివెందులలో గల వైయస్సార్ సమాధి వద్ద తన పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసినా సిగ్గురాదని ఆయన అన్నారు.

సోమవారం ఆయన బద్వేల్‌లో సభలో మాట్లాడారు. త్వరలోనే వైఎస్‌ఆర్ స్వర్ణయుగం వస్తుందన్నారు. ఆ పాలన ముప్పయి ఏళ్లపాటు కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ పాదాల చెంత మార్చిలోపేదల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పేర వైయస్ జగన్ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మేం తెచ్చుకున్న సీట్లు, ఓట్లు తెచ్చుకో: జగన్‌కు చిరు సవాల్

Chiranjeeviరాజమండ్రి: కొత్తగా పుట్టుకు వస్తున్న పార్టీలో గత సాధారణ ఎన్నికల్లో మేం తెచ్చుకున్న ఓట్లు, సీట్లను తెచ్చుకోగలవా అంటూ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సవాల్ విసిరారు. ఇప్పుడు పార్టీని వీడుతున్న వారంతా నా అభిమానుల వల్లే నాయకులుగా గుర్తింపు పొందారని ఆయన అన్నారు. నా అభిమానుల వల్ల నాయకులుగా గుర్తింపు పొంది ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు నడుచుకోక పోవడం విచారకరమన్నారు. కార్యకర్తలకు, తనకూ మధ్య దూరాన్ని పెంచేందుకు ఓ వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తుందన్నారు.

ప్రభుత్వాన్ని ఆదుకునేందుకే ఆపద్బాంధవుడి అవతారం ఎత్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేయడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. స్వార్థంతో విమర్శించే వారిని మేం పట్టించుకోమని చెప్పారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదన్నారు.

రామోజీరావుపై మళ్లీ యుద్ధం ప్రారంభించిన ఎంపీ ఉండవల్లి అరుణ్

Undavalli Arun Kumarన్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై మరోసారి ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆర్‌బిఐ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో భారత రిజర్వు బ్యాంక్ రూల్సును పాటించడం లేదని, ఆర్‌బిఐ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును సోమవారం కలిశారు.

నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన దువ్వూరిని కోరారు. గతంలోనే తాను మార్గదర్శిపై ఆర్‌బిఐ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉండవల్లి నాలుగు పేజీల లేఖను దువ్వూరికి ఇచ్చారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రామోజీరావును లక్ష్యంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అయితే వైఎస్ మరణం అనంతరం ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ రామోజీరావుపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.

బాబాయ్, అబ్బాయిలకు ప్రజలే బుద్ధి చెప్తారు: చంద్రబాబు ధ్వజం

Chandrababu Naiduకడప: కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి, జగన్ (బాబాయ్, అబ్బాయ్)ల రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబాల ఆస్తులు ఎంత? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంతని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కొత్త పార్టీ పేట్టేవాడా అంటూ బాబు ఆరోపించారు.

దేశంలో, రాష్ట్రంలో సంపదను కొన్ని కుటుంబాలే దోచుకుంటున్నాయని బాబు విమర్శించారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు అంకాలమ్మ గూడూరులో రోడ్ షో నిర్వహించారు. చిత్రావతి-లింగాల ప్రాజెక్టు పనులకోసం వైఎస్ వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుపెట్టారు తప్ప ఒక్క ఎకరాకు నీరివ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చితికిపోతున్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా పేదవాడి ఆదాయం మాత్రం పెరగడంలేదని చంద్రబాబు తెలిపారు. ధరలను అదుపుచేయలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ రుణ సంస్థలకు ఎవరూ రుణాలు కట్టవద్దని, మీకు అండగా టీడీపీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం అంటూ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయినా, అందులో చిరంజీవి ఏమీ సాధించలేరని బాబు విమర్శించారు. కాగా పులివెందులలో బహిరంగ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బాబు వారిపై మండిపడ్డారు. జిల్లా ఆయన పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది.