BREAKING NEWS
Tuesday, February 1, 2011
బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ‘చురకత్తి’...
బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ‘చురకత్తి’..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్
కాగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ జూ ఎన్టీఆర్ సరసన నటించనుందని సమాచారం. సిద్దార్థ, శృతి హాసన్ నటించిన చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’ రీసెంట్ గా విడుదలై మహారాణి గా అద్భుతమైన నటన కనబరించిన విషయం తెలిసిందే. సో దర్శక, నిర్మాతలు ఈ సినిమా టైటిల్, టెక్నీషియన్స్, ఇతర పాత్రదారుల గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూ ఎన్టీఆర్ ‘శక్తి’ షూటింగ్ పూర్తవగానే జూ ఎన్టీఆర్ చురకత్తి ఆరంభం కావచ్చని సమాచారం. బోయపాటి దర్శకత్వ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందన్న విషయం తెలిసిందే. జూ ఎన్టీఆర్ బోయపాటి శీను చెప్పిన కథకు ఇన్స్ఫైర్ అయి శీను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెయస్ రామారావు నిర్మాణ సారధ్యంలో త్వరలో రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్ ‘గర్జన’ అనే టైటిల్ కాస్తా ‘చురకత్తి’గా రాబోతోంది. రీసెంట్ గా ఈ టైటిల్ ను ఫిల్మిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని సమాచారం.
కాంగ్రెసులో చిచ్చు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి
కాంగ్రెసులో చిచ్చు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తో పొత్తు అంశం కాంగ్రెసు పార్టీలో చిచ్చు పెట్టింది. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయంపై కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం సమర్థిస్తోంది. ఇరు వర్గాల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ చర్చను మలుపు తిప్పారు. చిరంజీవితో పొత్తు అంశం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో కూడా విభేదాలు సృష్టించింది. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే కాంగ్రెసు అధిష్టానం ప్రతిపాదనపై వైయస్ జగన్ వర్గం నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం.
రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని, ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకోవడాన్ని కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి తప్పు పడుతూ సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోనియా నాయకత్వాన్నే వెంకటస్వామి వ్యతిరేకించారు. సోనియా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆంటోనీ వంటి నేత చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని ఆయన సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి చిరంజీవితో కాంగ్రెసు పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యవాది చిరంజీవితో కాంగ్రెసు పొత్తుకు సిద్ధపడడమేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్, మంత్రి బస్వరాజు సారయ్య, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ తమ కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించారు. తెలంగాణకు, ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకు మధ్య సంబంధం లేదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.
కాగా, కాకా విమర్శలతో స్వయంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి కాకాను తప్పు పట్టారు. వి. హనుమంతరావు కాకాను ఉతికి ఆరేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వెంకటస్వామి విమర్సలను వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాకాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద, చిరంజీవితో పొత్తు ప్రతిపాదన కాంగ్రెసులో తీవ్ర దుమారాన్నే రేపింది.
గోవా బ్యూటీ ఇలియానా భోరున ఏడ్చేసిన కారణం
గోవా బ్యూటీ ఇలియానా భోరున ఏడ్చేసిన కారణం
రీసెంట్ గా ఇలియానా నేను నా రాక్షసి చిత్రం కోసం ఇలియానా ఏడ్చారు.అయితే ఆమె ఏడుపుకి కారణం అందులో సీన్ కాదు. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వడమే. రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి సీన్ తీయడం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ పేకప్ చెప్పగానే...ఇలియానా చాలా భోరున ఏడ్చేసింది. ఆ విషయం గురించి ఆమె చెబుతూ పోకిరి తర్వాత మళ్లీ పూరీతో చేసిన చిత్రం ఇది. ఆయనతో రెండో సినిమా చేయడం అనేది నా కల. ఈ చిత్రంలో పూరి నాకు మంచి పాత్ర ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రానా సెట్లో ఉంటే ఎంతో సందడిగా ఉంటుంది. అలా ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడే పూర్తయ్యిందా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ యూనిట్‌తో నా ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా సాగింది. అందుకే ఈ చిత్రం నాకు చాలా చాలా ప్రత్యేకం. నేను నా రాక్షసి విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. పూరి, నా కాంబినేషన్‌లో రూపొందిన పోకిరి ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ మా కాంబినేషనలో మరో సక్సెస్ చవి చూడబోతున్నాం అన్నారు.
ఫ్యామిలి సంతతిని అభివృద్ది చేసుకోవాలనే ఆలోచన లేదంటున్న హీరోయిన్
ఫ్యామిలి సంతతిని అభివృద్ది చేసుకోవాలనే ఆలోచన లేదంటున్న హీరోయిన్
హాలీవుడ్‌లో అందమైన జంట ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్‌ల తర్వాత వాళ్శలాగే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి జంట సూపర్ మోడల్ హైదీ క్లూమ్ మరియు సీల్. వీరిద్దరికీ ఓ ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత అని అనుకుంటున్నారా వీరిద్దరూ సింగర్స్ కావడమే. వాళ్శకు పుట్టినటువంటి పిల్లలకు ఎనలేని ప్రేమను కనబరుస్తారు ఇద్దరు స్టార్లు. వీరిద్దరి ప్రేమకు వీరికి నలుగురు పిల్లలు పుట్టడం జరిగింది. ఇంతటితో ఫ్యామిలీని నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు హైదీ క్లూమ్ వెల్లడించారు.
ఈసందర్బంలో హైదీ క్లూమ్ మాట్లాడుతూ నాకు తెలిసి నలుగురు పిల్లలు అనేది చాలా పెద్ద విషయం. మేము ఏంజిలీనా జోలి, బ్రాడ్ పిట్ లాంటి జంట కాదు. ఎందుకంటే వారు వారియొక్క ప్యామిలీని వృధ్ది చేసుకొవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారు కాబట్టి ఎక్కవమంది పిల్లలను కనడం, దత్తతు తీసుకోవడం జరిగింది. హైదీ క్లూమ్ గతంలో విక్టోరియా సీక్రెట్ ఏంజిల్స్ రియాలిటీ షోలో పాల్గోన్న విషయం తెలిసిందే.
ఇకపోతే వచ్చే నెలలో హైదీ క్లూమ్ సీరియస్లీ ఫన్నీ కిడ్స్ అనే లైఫ్ టైమ్ సిరీస్‌ను ప్రారంభించనున్నారు. ఈషోలో హైదీ క్లూమ్ చాలా మంది పిల్లలతో కలసి నటించనున్నారని సమాచారం. ఈ ముప్పై ఏడు సంవత్సరాల సూపర్ మోడల్ హైదీ క్లూమ్ ఇటీవల మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి అసభ్యకరమైన పదజాలం మాట్లాడనని అన్నారు. వారిని ఎంతో అపురూపంగా చూచుకోవడం జరుగుతుందని హైదీ క్లూమ్ అన్నారు.
ఇంట్లోకి టివి తీసుకోని రాకపోవడానికి కారణం అదే అంటున్న హీరోయిన్
ఇంట్లోకి టివి తీసుకోని రాకపోవడానికి కారణం అదే అంటున్న హీరోయిన్
పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ హీరోయిన్ కైరా నైట్లీ ఇటీవల ఇంటర్యూలో ఓ అరుదైన విషయాన్ని వెల్లడించారు. ఆవిషయం ఏమిటంటే కైరా నైట్లీ ఇంట్లో అస్సలు టివి లేదనే నిజాన్ని తన అభిమానులకు వెల్లడించారు. సాధారణంగా ఇంట్లో టివి ఉంటే మనం అందరం రియాలిటీ టివిషోలు అయినటువంటి అమెరికన్ ఐడియల్, కీపింగ్ విత్ కర్దాషియాన్స్ లాంటి షోలకు బానిసలు అవుతాం అనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా తాను ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటర్నేట్ కనేక్షన్‌ని కూడా కట్ చేయడం జరుగుతుందని అన్నారు. టివి మరియు ఇంటర్నేట్ అనే వాటికి ఒకసారి అలవాటు పడ్డామంటే అంతే ఇక జీవితంలో వాటినుండి బయటకు రావడం చాలా కష్టం అన్నారు. అంతేకాకుండా గంటల తరబడి టైం వెస్టు చెయ్యవలసి వస్తుందని అన్నారు. అందుకే అటువంటి వాటిని నేను ఎక్కువగా ఇష్టపడను అన్నారు.
వీటికి కనుక మనం అలవాటుపడితే ప్రపంచంలో మన అంత సోమరిపోతులు ఇంక ఎవరూ ఉండరన్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మన పని అయిపోయేంత వరకు మాత్రమే ఇంటర్నేట్ చేసుకోవడం మంచిది కానీ, అదే పనిగా గంటలు తరబడి దాని ముందు కూర్చోని టైం వేస్టు చేయకూడదన్నారు. అందుకే వాటికి నాఇంట్లో ఇంత వరకు ప్రవేశం కల్పించలేదన్నారు.
జీవితంలో ఎప్పుడూ నగ్నంగా ఫోటోలకు ఫోజులివ్వకుండా చేసింది ఆమ్యాగజైన్
జీవితంలో ఎప్పుడూ నగ్నంగా ఫోటోలకు ఫోజులివ్వకుండా చేసింది ఆమ్యాగజైన్
హాలీవుడ్ సెక్సీ బాంబ్ కిమ కర్దాషియాన్ ఇటీవల కోర్ట్నీ అండ్ కిమ్ టేక్ న్యూయార్క్ షోలో కంటతడి పెట్టకున్నారు. దానికి కారణం కిమ కర్దాషియాన్ డబ్ల్యు అనే మ్యాగజైన్ కవర్ పేజికి తాను నగ్నంగా ఇచ్చినటువంటి పోటోషూట్. ఈ సందర్బంలో కిమ కర్దాషియాన్ మట్లాడుతూ డబ్ల్యు మ్యాగజైన్ నాతో ఒకవిధంగా కవర్ పేజికి అని చెప్పి నగ్నంగా పోటోలు తీయడం జరిగింది. కానీ ఆతర్వాత నన్ను మోసం చేశారని వాపోయింది. కిమ్ కర్దాషియాన్ నగ్నమైన పోటోలను మ్యాగజైన్ వారు చాలా తెలివిగా క్యాష్ చేసుకోవడం జరిగింది.
కిమ్ కర్దాషియాన్ నగ్నమైన పోటోలను మ్యాగజైన్ కవర్ పేజిపై వేసిన తర్వాత కిమ్ శరీరంపై రాసినటువంటి కోటేషన్స్ తనకి చాలా బాధను కలిగించే విధంగా రాయడం జరిగిందని కిమ్ తన మనసులోని మాటలను వెల్లడించారు. మొదట తన నగ్నమైన పోటోలకు స్ట్రిప్స్ వేస్తామని మ్యాగజైన్ వారు చెప్పడం జరిగిందన్నారు. కానీ ఆస్ట్రిప్స్ నన్ను ఇబ్బంది పేట్టే విధంగా ఉంటాయని ఊహించలేకపోయానని అన్నారు.
గతంలో ప్లేబాయ్ మ్యాగజైన్ కు కూడా నగ్నంగా పోజు లివ్వడం జరిగింది. కానీ వారు నన్ను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదు. కానీ డబ్ల్యు మ్యాగజైన్ వారు వేసినటువంటి పోజు మాత్రం నాకు పిచ్చేక్కే విధంగా చేశారు. ఆర్ట్ వర్కుతో నాశరీరాన్ని కవర్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం నానిప్పిల్స్ కూడా కనిపించే విధంగా చేశారు మ్యాగజైన్ వారు అని అన్నారు. ఇలాంటి మ్యాగజైన్స్ వల్ల నాజీవితంలో నేను గుణపాఠం నేర్చుకున్నాను అని అన్నారు.
దీనిని బట్టి నాజీవితంలో ఇక ఎప్పుడూ నగ్నంగా ఫోజులివ్వకూడదు అని నిర్ణయించుకున్నాను అని అన్నారు. టాప్ మ్యాగజైన్ వోగ్ వారు అడిగినా కూడా నానిర్ణయం మాత్రం మార్చుకోను అని తన సిస్టర్స్‌తో ఈవిషయాన్ని చెప్పారు
పోస్ట్ స్క్రీనింగ్‌కు ముందే డివిడిని దొంగతనం చేసిన దొంగలు
పోస్ట్ స్క్రీనింగ్‌కు ముందే డివిడిని దొంగతనం చేసిన దొంగలు
హాలీవుడ్ చరిత్రలో నిలచిపోయేటటువంటి సినిమాలు తీసిన దర్శకుడు మెల్ గిబ్సన్. అలాంటి మెల్ గిబ్సన్ లాస్ ఏంజిల్స్ ఇంట్లో తన కొత్త సినిమా ది బేవర్‌కు సంబంధించినటువంటి డివిడి కాపీ దోంగలు దోంగతనం చేశారని మెల్ గిబ్సన్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే సమ్మిట్ ఎంటర్ టైన్ మెంట్‌కి సంబంధించినటువంటి ప్రోడక్షన్ బాసెస్ ఓ డివిడి కాపీని మెల్ గిబ్సన్ కోసం ప్రత్యేకంగా పంపండం జరిగింది. ది బేవర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను జోడి పోస్టర్‌కు అప్పగించారు మెల్ గిబ్సన్.
త్వరలో సౌత్ వెస్ట్ ఫిలిం ఫెస్టివల్ ఆస్టిన్‌లో జరగనున్న తరుణంలో ఈసినిమాని అక్కడ ప్రీమియర్ షోగా ప్రదర్శించునున్నారు. అందులో భాగంగానే సినిమాని ఫైనల్ మెల్ గిబ్సన్ చూసి ఓకే చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఓ కాపీ మెల్ గిబ్సన్ పంపడం జరిగందన్నారు. దీనిని చూసినటువంటి మెల్ గిబ్సన్ దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లును సరిచేసి తన ఇంట్లో ఉన్నటువంటి మెయిల్ బాక్స్‌లో ఉంచడం జరిగింది. అటుతర్వాత కోరియర్ బాయ్‌కు ఫోన్ చేసి కోరియర్‌ని తీసుకెళ్లవలసిందిగా కోరడం జరిగంది. కొరియర్ బాయ్ వచ్చి దీనిని కలెక్టు చేసేకునే లోపల డివిడిని ఎవరో దుండగులు దోంగలించడం జరిగిందన్నారు.
దీనిపై మెల్ గిబ్సన్ లాస్ ఏంజిల్స్ లో ఉన్నటువంటి లోకల్ పోలీసులకు విషయం క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీనిపై ఇన్విస్టిగేటింగ్ మొదలు పెట్టినటువంటి లోకల్ పోలీసులు త్వరలోనే విషయం తేలస్తామన్నారు.
అనుష్క మళ్లీ బికినీ వేయటానికి సిద్దమవుతోంది
అనుష్క మళ్లీ బికినీ వేయటానికి సిద్దమవుతోంది
ప్రభాస్ సరసన భిళ్లాలో అనుష్క బికినీ వేసి ఆకట్టుకున్న సంగితి తెలిసిందే. ఇప్పుడు బిళ్ళా -2 లోనూ నటించటానికి కమిటైన ఆమె అందులోనూ బికినీ వేస్తుందని తమిళ సినీ వర్గాల సమాచారం. అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. మొదట ఈ పాత్రకు నయనతారనే అనుకున్నారు కానీ ఆమె ప్రభుదేవాతో పెళ్ళి చేసుకోనున్నానని, ఇప్పుడు ఇలాంటి పాత్రలు చేసే ఆలోచన లేదని తెలపటంతో అనుష్కను ఈ ఆఫర్ వరించింది. అందులోనూ అనుష్కకు ఇప్పుడు తమిళంలోనూ మంచి మార్కెట్టే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని కొంత ఈ ఆఫర్ ఇచ్చారని వినికిడి. ఇక దర్శకుడు విష్ణువర్థన్ తెలుగులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత బిల్లా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
విశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.
పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.
లీగల్ వివాదంలో అనుష్క..రమా రాజమౌళి???
లీగల్ వివాదంలో అనుష్క..రమా రాజమౌళి???
ప్రముఖ దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి, హీరోయిన్ అనుష్క ఓ లీగల్ చిక్కులో ఇరుక్కుని వైజాగ్ కోర్టుకి హాజరు కావాల్సిన పరిస్దితి వచ్చిందని సమాచారం. వీరిద్దరూ కలిసి వైజాగ్ లోని మధురవాడ ప్రాంతంలో ఓ ల్యాండ్ ని కొనుగోలు చేసారు. అయితే రాంగ్ పవర్ ఆఫ్ అటార్నీతో ఆ స్ధలాన్ని తీసుకున్నారంటూ వీరిద్దరపై నారాయణ అనే వ్యక్తి పిటీషన్ ధాకలు చేసారు. దాంతో వైజాగ్ కోర్టు వీరిని జనవరి 28 వ తేదీన కోర్టుకి హాజరు కావాలని ఆదేశించింది. అయితే అనుష్క, రమ ఇద్దరూ..హైకోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని వైజాగ్ కోర్టుకి హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ కేసు మళ్ళీ పిబ్రవరి 18వ తేదీన హియరింగ్ కి రానుంది.
నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్ అన్న సూపర్ స్టార్
నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్ అన్న సూపర్ స్టార్
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది ప్రియాంక చోప్రా. ప్యాషన్ సినిమాలో తనలోని నటనా విశ్వరూపాన్ని సినీ అభిమానులకు చూపించారు. ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో ప్రియాంక దాదాపు ఆరు రకాల గెటప్స్‌లో కనిపించి అలరించారు. ‘‘అరే.. ప్రియాంకా... నువ్వింత అందంగా ఉంటావనుకోలేదు. నా గెటప్‌లో నువ్వు చాలా బాగున్నావ్’’.. అని ఇటీవల జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ప్రియాంక చోప్రాను అభినందించారు షారుక్ ఖాన్. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని వేదిక మీద ఉన్న ప్రియాంకను ఉద్దేశించి ఆయన అన్న ఈ మాటలకు చప్పట్లతో ఆ ప్రాంగణం హోరెత్తిపోయింది. ‘కింగ్ ఖాన్’ అందించిన ఈ కాంప్లిమెంట్స్‌కు ప్రియాంక తెగ ఆనందపడ్డారు.
‘దబాంగ్’లో సల్మాన్ చేసిన చుల్‌బుల్ పాండే, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో షారుక్ గెటప్, ‘రాజ్‌నీతి’లో కత్రినాలా... ఇలా ఇతర నటీనటులు చేసిన గెటప్స్‌లో ఒదిగిపోయి, ఆయా చిత్రాల్లో వారు మాట్లాడిన డైలాగులు మాట్లాడారు ప్రియాంక. ఆమె తన గెటప్ చేసినప్పుడు షారుక్ పై విధంగా స్పందించారు. ‘వాట్స్ యువర్ రాశి’లో ఈ బ్యూటీ 12 అవతారాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
త్వరలో విడుదల కానున్న ‘7 ఖూన్ మాఫ్’లో 20ఏళ్ల యువతిగా, 30ఏళ్ల మహిళగా, 45ఏళ్ల మధ్య వయస్కురాలిగా, 65ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతున్నారు. ఇలా మొత్తం ఏడుగురి భర్తలతో నటించి, అందరిని చంపేసే దిశగా స్టోరీ సాగుతుందని సమాచారం. ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలైన 7 ఖూన్ మాఫ్ ఆడియోకి కూడా మంచి స్పందన రావడంతో ఈసారి ప్రియాంక మంచి హిట్ కొడుతుందని అంటున్నారు. సినిమా షూటింగ్స్‌లో రీటేక్స్ ఉంటాయి కాబట్టి ఫర్వాలేదు.. కానీ వేదికల మీద పెర్ఫార్మ్ చేసినప్పుడు రీటేకులు ఉండవు. ప్రియాంక తొణకకుండా, బెణకకుండా ఆరు గెటప్స్‌లో అద్భుతంగా అభినయించడంతో సినిమా పరిశ్రమవారితో పాటు వీక్షకులు కూడా విస్తుపోయారట. దానితో అక్కుడున్న వారంతా ప్రియాంకానా మజాకానా అంటూ తెగ అభినందనలతో ముంచెత్తారట.
Subscribe to:
Posts (Atom)