పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కానున్న చిత్రం'గబ్బర్ సింగ్'.ఈ చిత్రం స్క్రిప్టు లోని ఓ డైలాగుని ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ కూడా అయిన హరీష్ శంకర్ ..పవన్ అభిమానుల కోసం రివిల్ చేసారు.ఆ డైలాగు..లైఫ్ లొ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. నాతో మాట్లాడేటప్పుడు,నాతో పోట్లాడేటప్పుడు.ఇక గబ్బర్ సింగ్ లో పవన్ పాత్ర పోలీస్ ఆఫీసర్.
బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ లో పంచ్ డైలాగులే ప్రాణం.హరీష్ శంకత్ తన మిరపకాయ చిత్రం కూడా డైలాగులతో కొట్టుకొచ్చాడు.అంతటా డైలాగులు బాగున్నాయిని పేరు వచ్చింది.ఈ నేఫధ్యంలో అతన్నే డైరక్టర్ గా ఎన్నుకున్నందుకు పూర్తి న్యాయం చేసే దిశలో అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది.ఆగస్టు 2011 నుంచి సెట్స్ కు వెళ్ళే ఈ చిత్రంలో మిగతా పాత్రలు ఎంపిక జరగాల్సి ఉంది.ఇంతకీ ఈ డైలాగు ఎలా ఉంది.పవన్ నోటితో చెప్పితే అదురుతుంది కదూ
BREAKING NEWS
Sunday, April 24, 2011
జూ ఎన్టీఆర్ కి పెళ్ళవుతుందనే బాధతోనే ఆమె ఆ నిర్ణయం!
జూ.ఎన్టీఆర్ కి త్వరలో వివాహం జరగనుందనే సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా అతని మాజీ ప్రేయసి సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.అవేమిటంటే.. పెళ్లి అనేది మనిషి ఏర్పరచుకున్న కట్టుబాటుల్లో ఒకటి. అది లేకపోతే జీవితమే అంధకారం కాదు. నేను పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. సింగిల్‌గానే ఉంటా.అలాగే జీవితాన్ని సాగిస్తా అంది.
అయితే హటాత్తుగా ఆమెకీ వైరగ్యం ఏమిటి అంటే ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవటమే అని కొందరంటున్నారు.అయితే ఆమె మాత్రం దానిని ఖండిస్తున్నట్లుగా...ఇది వైరాగ్యంకాదు. నా లైఫ్ గురించి అన్ని విధాలా ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయం. ఒకళ్లకు నేను భారం కాను. నాకు మరొకరు భారంగా ఉంటే నాకు నచ్చదు. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నాను.అలాగని పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదని అనుకోవద్దు.నన్ను ఆదర్శంగా తీసుకోమని కూడా మరొకరికి చెప్పను అని తేల్చి చెప్పేసింది.

సత్యసాయి బాబా నిర్యాణం: శోక సముద్రంలో భక్త కోటి
అనంతపురం: కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆదివారం ఉదయం 7.40 నిమిషాలకు మరణించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రకటించారు. గత నెల 28న సిమ్స్ హాస్పిటల్లో చేరిన బాబా 28 రోజుల అనంతరం 24వ తేది ఉదయాన మరణించారు. బాబా ఉత్తరాయణం వసంత రుతువు చైత్రబహుళ సప్తమి ఉత్తరాషాడ నక్షత్రంలో నిర్యాణం చెందారు.
బాబా పార్థివ శరీరాన్ని సందర్శించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తదితరులు నివాళులు అర్పించారు. కాగా బాబాను చూడటానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం పుట్టపర్తి వెళ్లనున్నారు. బాబా మరణంతో పుట్టపర్తితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన భక్తులు తీవ్ర ఆవేదనలో మునిగి పోయారు. పుట్టపర్తి గ్రామం పూర్తిగా రోధిస్తోంది. భగవాన్ సత్యసాయిని సందర్శించడానికి విదేశీయులు భారీగా వస్తున్నారు.
ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం వరకు మూడు రోజుల పాటు భక్తుల దర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. భక్తులకు ఎప్పుడూ దర్శనమిచ్చే కుల్వంత్ హాలులోనే బాబా దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 3.05 నిమిషాల ప్రాంతంలో కుల్వంతు హాలుకు తరలించారు. భారీ కాన్వాయ్‌తో బాబా దేహాన్ని తరలించారు. బుధవారం ఉధయం అనగా ఏప్రిల్ 27వ తేదిన బాబా దేహానికి అంత్యక్రియలు జరుపుతారు

Subscribe to:
Posts (Atom)