BREAKING NEWS
Tuesday, May 31, 2011
మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా...మహేష్..దూకుడు ఫస్ట్ లుక్ ...!
మరోసారి పోకిరి రోజుల్ని తలపుకి తెస్తున్న ‘దూకుడు’ టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రానికి బిజినెస్ క్రేజ్ అమాంతం రెట్టింపయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆగస్టులో విడుదలకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న దూకుడుని ‘నమో వెంకటేశ’ నిర్మించిన 14రీల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది.
పోకిరి తర్వాత అయిదేళ్లుగా విజయం లేని మహేష్ బాబు ఈ సినిమాతో ఆ కొరత తీర్చి మళ్లీ విజయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ సంగీతం అందిస్తున్న థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు..
Source:something.com
దియా మీర్జా, జయేద్ ఖాన్‌లపై జుహు బీచ్ షూటింగులో దాడి
దియా ఈ సినిమాలో ఫొటోగ్రాఫర్‌గా నటిస్తోందని, బయటి నుంచి వచ్చిన జయేద్‌ను తీసుకుని వెళ్లే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నామని, తన కళ్ల ద్వారా జయేద్‌కు ముంబైని చూపిస్తుందని ఆయన చెప్పారు. తమ పరిశ్రమ ప్రభుత్వాన్ని స్నేహపూర్వక వైఖరితోనే చూస్తోందని, అనుమతి తీసుకునే విషయంలో చట్టప్రకారమే
వ్యవహరిస్తున్నామని నటి, సహ నిర్మాత దియా మీర్జా అన్నారు.
Source:something.com
మాజీ లవర్ తో మళ్లీ జూ ఎన్టీఆర్ రొమాన్స్ ..?
జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊసరవెల్లి’ సినిమాలో సమీరా రెడ్డి నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ కాదనీ, ఓ స్పెషల్ సాంగ్ లో కన్పించనుందనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి, సమీరా రెడ్డి కాంబినేషన్ లో ‘అశోక్’ సినిమా గతంలో తెరకెక్కిన సంగతి విదితమే.
Source:something.com
హైకోర్టుకి క్షమాపణ చెప్పిన రామోజీరావు...!
దాని తర్వాత రామోజీరావు హైకోర్టుకు హాజరు కానందున, కర్ణాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారిచేసింది. అయితే గత్యంతరం లేక రామోజీరావు గత ఎప్రిల్ నెల 19తేదిన హైకోర్టుకు హాజరై షరత్తులతో కూడిన క్షమాపణలు కోరుకున్నాడు. కేసు విచారణ జరపుతూ మే 31 కి వాయిదా వేశారు. అనగా ఈ రోజు(మే 31)న కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తులు వేగు సూరి అప్పారావు, ఆనంద్ ఆద్వర్యంలో ద్విసభ్య బెంచ్ వారు విచారణ జరిపింది. ఆరోగ్యం బాగోలేదని, కొన్ని అనివార్య కార్యాలవల్ల తను కోర్టు హాజరు కాలేనని ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రై.లి చైర్మెన్ రామోజీరావు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకొంటానని న్యాయస్థానానికి బేషరత్తులతో కూడిన క్షమాపణలు కోరుతూ అర్జి సమర్పించారు.
ఈ విషయంపై న్యాయమూర్తులు విచారణ జరిపి తర్వాత రామోజీరావు, టిఎన్ సీతారామ్ పై కేసు వేసిన జిఆర్ మోహన్ కు ఎటువంటి అభ్యంతరం లేనందున..ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రమోజీరావుకి, టిఎన్ సీతారామ్ కి హెచ్చరించి కేసు కొట్టివేయడమైనది.
Source:something.com
ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం, యువకుడి సజీవ దహనం
వరంగల్: జిల్లాలోని జఫర్ ఘడ్ మండలం రఘునాథ్ పల్లి గ్రామంలో మంగళవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ యువకుడిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. రఘునాథ్ పల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె అతని ప్రయత్నాన్ని అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన సదరు యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తలపై తీవ్ర గాయం ఏర్పడింది. రక్తస్రావం ఎక్కువయింది. దీంతో స్థానికులు ఆమెను వరంగల్ జిల్లా ఎంజిఎంకు తీసుకు వెళ్లారు. సుత్తితో బలంగా మోదడం వలన ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అయితే మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ది చేశారు. సంఘటనపై సమాచారం అందిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో మరోసారి గ్రామస్థులు ఆ యువకుడిని పోలీసు జీపులో నుండి బయటకు లాగి అతనిని చెట్టుకు కట్టేసి కొట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అయితే యువకుడిని అరెస్టు చేయడానికి ఎస్ఐ, ఇద్దరు పోలీసులు మాత్రమే రావడంతో వేలాదిగా ఉన్న గ్రామస్తులను నిలువరించడం కుదరలేదు. మౌనికపై యువకుడి దాడికి గల కారణాలను పోలీసులు కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఒక్కడే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
అయితే మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ది చేశారు. సంఘటనపై సమాచారం అందిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో మరోసారి గ్రామస్థులు ఆ యువకుడిని పోలీసు జీపులో నుండి బయటకు లాగి అతనిని చెట్టుకు కట్టేసి కొట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అయితే యువకుడిని అరెస్టు చేయడానికి ఎస్ఐ, ఇద్దరు పోలీసులు మాత్రమే రావడంతో వేలాదిగా ఉన్న గ్రామస్తులను నిలువరించడం కుదరలేదు. మౌనికపై యువకుడి దాడికి గల కారణాలను పోలీసులు కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఒక్కడే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
Source:something.com
టిడిపి నాయకత్వం: జూ ఎన్టీఆర్‌కే ఓటు, నారా లోకేష్‌కు అంతంత మాత్రమే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌ను బలపరిచినవారు అంతంత మాత్రంగానే ఉన్నారు 12.6 శాతం మంది మాత్రమే లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణకు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని 14.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, ఏమీ చెప్పలేమని అన్నవారి శాతం 18.5 శాతం ఉంది. అయితే, ఈ పోల్‌కు పరిమితులు ఉన్నాయనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సి ఉంది. రాష్ట్రంలో నెట్ వాడకందార్లు చాలా తక్కువ మంది. పైగా, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో ఉండే అవకాశం లేదు. నెట్ అందుబాటులో ఉండి, చదువుకున్నవారి అభిప్రాయం మాత్రమేనని గుర్తించాల్సి ఉంటుంది. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాకర్షణ శక్తి ఎక్కువ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
Source:something.com
Subscribe to:
Posts (Atom)