హైదరాబాద్: సినీ ప్రముఖులు అనుష్క, రవితేజ, నాగార్జునలపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు చేయడం వెనక గల మతలబు ఏమిటనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. వీరి ముగ్గురి ఇళ్లలోనే కాకుండా సినీ నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. అక్కినేని గ్రూపు సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూర్‌ల్లో పెద్ద మొత్తంలో ఐటి అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అయితే, ఈ సోదాల్లో బయటపడిన విషయాలు ఇంకా వెలుగు చూడలేదు. ఆదాయం పన్ను అంచనాల్లో లోపాలే ఈ దాడులకు కారణమని భావిస్తున్నారు.
రవితేజ, అనుష్కల రెమ్యునరేషన్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. వీరిద్దరు కూడా పెద్ద మొత్తంలో సొమ్ము పెట్టి విశాఖపట్నంలో భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల లావాదేవీల వ్యవహారాల వల్లనే ఐటి శాఖ కన్ను వారిపై పడిందని చెబుతన్నారు. విశాఖపట్నంలో అనుష్క కొనుగోలు చేసిన భూమి విషయంలో చట్టపమైన వివాదం కూడా చెలరేగింది. కేసు నడుస్తోంది. అనుష్కపై ఓ ఎన్నారై ఫిర్యాదు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన విషయాలను వీరిద్దరు కూడా ఐటి రిటర్స్స్‌లో చూపించలేదని తెలుస్తోంది. అందుకే ఐటి శాఖ సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.
అలాగే నాగార్జున కూడా పెద్ద మొత్తంలో సొమ్ము పెట్టి విశాఖపట్నంలో భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. హైదరాబాదులోని హైటెక్ సిటీ వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టును కూడా చేపట్టినట్లు చెబుతున్నారు. అక్కినేని గ్రూపు సంస్థలను, ఎఎన్ఆర్ గ్రూపు సంస్థలను కూడా విస్తరించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలేవీ నాగార్జున సమర్పించిన ఐటి రిటర్న్స్‌లో చూపించలేదని, వాటి గుట్టు తేల్చేందుకే ఐటి అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం.
BREAKING NEWS
Friday, March 25, 2011
ప్రియమణికి చెంప చెల్లుమనిపించిన మిరపకాయ్ హీరోయిన్..!
హీరోయిన్లన్నాక అందాలను యధేచ్ఛగా ఆరబోయాలని, డబ్బు సంపాదనికి ఈ రంగంలోకి వచ్చాం కాబట్టి డబ్బులిచ్చిన వాళ్లు అడినట్టుగా అందాలు చూపించాలని ఇటీవలే ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో సిగ్గులేకుండా చెప్పింది. డబ్బులిస్తే దేనికైనా రెడీ అని నిస్సిగ్గుగా చెప్పిన ప్రియమణి చెప్పుతో బుద్దొచ్చేట్టు సమాధానం ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ.
‘లీడర్’ సినిమాతో సరిచయమై ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’ చిత్రాల్లో నటించిన రిచా ఇంతదాకా ఏ సినిమాలోనూ అదుపు దాటి అందాల ప్రదర్శన చేయలేదు. అసలు అలా చేయడం సబబు కాదని ఆమె అంటోంది. సినిమా పరిశ్రమ అంటే కేవలం డబ్బు సంపాదనకి మాత్రమే కాదని, ఇది కళ అని, కళని నమ్ముకున్న కళాకారులు డబ్బుకోసం అందాలు ఆరోబోయడం అంటే వ్యక్తిత్యాన్ని అమ్ముకోవడమేనని రిచా ఘాటుగా మాట్లాడింది ప్రియమణిలా డబ్బు పిచ్చితో ఉచ్ఛ నీచాలు మరిచిపోయిన వారికి రిచా మాటలు చెంపపెట్టు అని చెప్పాలి.

జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ టైటిల్?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ చేయనున్న చిత్రానికి టైటిల్ గా 'దమ్ము'ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షయల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఏప్రియల్ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైంది. యాక్షన్ తో కూడిన పూర్తి స్ధాయి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించటానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. సింహా విజయం తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం త్వరలో రిలీజ్ కావటానికి రెడీగా ఉంది. ఈ చిత్రం తో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చిత్రం ప్రారంభం కానుంది. ఆ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. రచ్చ టైటిల్ అనుకున్నా అది ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి పెడుతున్నాడు ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది.
రాజమౌళి అసోసియేట్ తో...శ్రీకాంత్ చిత్రం
శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన సినిమాల్లో రెండు కొత్తదర్శకులతో చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఒకటి రాజమౌళి దగ్గర సహాయదర్శకుడిగా చేసిన రామకృష్ణా రెడ్డి (ఆర్.కె) దర్శకత్వంలో అని తెలుస్తోంది. స్టార్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిలీప్, చంద్ర, శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, తెలుగులో ఇంతవరకూ రాని నేపధ్యంలో వస్తున్న ఒక హైస్పీడ్ యాక్షన్ థ్రిల్లర్ అని నిర్మాతలు తెలియపరిచారు. ఈ చిత్రంలో శ్రీకాంత హాలీవుడ్ చిత్రాల తరహా గెటప్ లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా తెలుస్తోంది. భిన్నమైన కథాంశంతోపాటూ ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు చెప్తున్నాడు. మిగతా నటీనటులు మరియు సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలుపుతామన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తోపాటూ మరొక ప్రత్యేకపాత్రలో మరొక హీరో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో రాజమౌళి శిష్యులు డైరక్టర్స్ గా పరిచయం అవుతూ.. కరుణాకర్ (ద్రోణ), జి.కె.కన్నన్(సారాయి వీర్రాజు) చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే సునీల్ తో నెపోలియన్ చిత్రం తీస్తున్న కోటి కూడా రాజమౌళి శిష్యుడే.
త్రిష 'తీన్ మార్'కు అక్కడ నొప్పి దెబ్బకొట్టింది
ఈ మధ్యే రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లి వచ్చాను. ఆ తరవాత చీలమండ నొప్పి మొదలైంది. ఫలితంగా 'తీన్ మార్' ఆడియో పంక్షన్ వేదిక మీద నృత్యం చేయలేకపోయాను. జనం ముందు ఓసారి నృత్యం చేయాలని ఎప్పట్నించో ఉంది. తీన్‌మార్‌కి కుదురుతుంది అనుకొన్నాను. చీలమండ నొప్పితో చేయలేకపోయాను అంటోంది త్రిష . ఇక ఈ డాన్స్ కోసం ప్రిపరేషన్స్ కూడా చేసుకున్నాను.కానీ ఆ ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయి అని భాధ పడుతోంది.ఇక ఆమె స్టేజిపై డాన్స్ చేయాలనుకోవటానికి కారణం...ఇలియానా అని చెప్తోంది.
'శక్తి' సినిమా పాటల వేడుకలో ఎన్టీఆర్-ఇలియానాలు వేదిక మీద నృత్యం చేసి అభిమానులను ఆనంద పరిచారు. ఎన్టీఆర్, ఇలియానాలు వేదిక మీద నృత్యం చేయడం అదే తొలిసారి. జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ విషయం త్రిషనూ బాగా ఆకట్టుకొంది. 'తీన్‌మార్' వేడుకలో నేను కూడా అలా నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది. అయితే ఈ ప్రయత్నం కుదర్లేదు. త్రిష కాలు నొప్పి వల్ల నృత్య కార్యక్రమం ఆగిపోయింది. ఇక ప్రస్తుతం త్రిష... తమిళంలో అజిత్ సరసన మంగాత్తా, తెలుగులో తీన్‌మార్‌లో పవన్ కల్యాణ్‌తో నటిస్తున్నారు.

మళ్ళీ కలర్స్ స్వాతినే తీసుకున్న డైరక్టర్
అష్టాచెమ్మ చిత్రంతో పాపులరైన కలర్స్ స్వాతి ముచ్చటగా మూడో సారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రంలో బుక్కయింది. సుశాంత్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఆమెనే మళ్ళీ తీసుకున్నాడు. అష్టాచెమ్మ,గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో ఆమెను తీసుకున్న మోహన్ కృష్ణ ఆమెను తన లక్ గా భావిస్తున్నాడని చెప్తున్నారు. అందుకే మరోసారి ఆమెనే తన ప్రాజెక్టులోకి తీసకున్నాడు. ఇక కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం..కలవరమాయే మదిలో, అప్లలరాజు,గోల్కొండ హైస్కూల్ అంటూ వరస ప్లాప్ ల్లో మునిగితేలుతున్న ఆమె మళ్ళీ ఈ చిత్రంతో మళ్ళీ నిలబడతానని భావిస్తోంది. ఇక ఈ చిత్రానికి "తొక్కుడు బిళ్ళ" అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గోల్కొండ హైస్కూల్ కు ముందు రాసుకున్న కథతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్కొండ హైస్కూల్ మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఆశించిన ఫలితం రాకపోవటంతో ఈ చిత్రాన్ని అష్టాచెమ్మ తరహాలో కామిడీ ఎంటర్టైనర్ గా మలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల మాట్లాడుతూ 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Subscribe to:
Posts (Atom)