BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, January 21, 2011

Director EVV Satyanarayana passed away

Director EVV Satyanarayana passed away

దీపిక కోసం నిర్మాతగా మారనున్న సిద్ధార్థ్ మాల్య..!?

దీపిక కోసం నిర్మాతగా మారనున్న సిద్ధార్థ్ మాల్య..!?

Deepika Padukone ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యులు విజయ మాల్య తనయుడు సిద్ధార్థ మాల్య (జూనియర్ మాల్య) త్వరలోనే ఓ కొత్త అవతారమెత్తనున్నారు. తన ప్రేయసి, బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే కోసం సిద్ధార్థ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇందుకు సిద్ధార్థ్ ఓ ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే..సిద్ధార్థ్ పెట్టబోయే చలనచిత్ర నిర్మాణ సంస్థకు బ్యానర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. కానీ.. ఈ బ్యానర్ పేరులో మాత్రం తమ కంపెనీ బ్రాండ్ పేరు (కింగ్‌ఫిషర్) వచ్చేలా సిద్ధార్థ్ అడుగులేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2012 [^] ఆరంభంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమయ్యే అవకాం ఉంది.

తన కలను నిజం చేసుకోవడం కోసం సిద్ధార్థ్ ఇప్పటికే డైరెక్టర్లు, ఆర్టిస్టుల కోసం గాలింపు మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ అప్పటి వరకూ సిద్ధార్థ్ తన తండ్రి వ్యాపారాన్నే చూసుకోనున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ మాత్రం సిద్ధార్థ్ తన ప్రేయసి కోసమే ప్రారంభించనున్నారని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇటీవల కూడా సిద్ధార్థ్ దీపికకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. 16 కోట్ల రూపయాలు విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికకు సిద్ధార్థ్ బహుమతిగా ఇచ్చాడట. దీంతో అవాక్కయిన దీపూ ఆనందం తట్టుకోలేక సీనియర్ మాల్య ముందే జూనియర్ మాల్యకు ముద్దు పెట్టసేందిట.



తెలుగు సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కన్నుమూత

తెలుగు సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కన్నుమూత..

 EVV Satyanarayanaప్రముఖ తెలుగు [^] సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఇవివి వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఆర్యన్‌ రాజేశ్‌, 'అల్లరి' నరేశ్‌ఉన్నారు. ఈవీవీ 51సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఈవీవీగా సినీరంగంలో పేరు తెచ్చుకున్న ఈదర వీర వెంకట సత్యనారాయణ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. నిడదవోలులో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండటంతో మద్రాస్‌కు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. నవత కృష్ణంరాజు సలహా మేరకు దర్శకత్వ శాఖలో చేరి ప్రముఖ దర్శకుడు జంధ్యాల దగ్గర అసిస్టెంట్‌గా పలు చిత్రాల్లో పని చేశారు. సినిమాల్లో వినోదాన్ని పండించటం ఆయన దగ్గరే నేర్చుకున్నారు. దర్శకునిగా ఈవీవీ 'చెవిలో పువ్వు' చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమఖైదీ సినిమాతో ఆయనకు తొలిహిట్‌ లభించింది.

ఒక దశలో ఆయన దర్శకత్వంలో వరుసగా దాదాపు 10 హిట్‌ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి [^] , బాలకృష్ణ [^] , నాగార్జున [^] , వెంకటేశ్‌ తదితర అగ్ర హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు తీశారు. ముఖ్యంగా కామెడీహీరో రాజేంద్రప్రసాద్‌తో ఈవీవీ తీసిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. సీనియర్‌ నటుడు శోభన్‌బాబుతో ఏవండీ ఆవిడొచ్చింది, హిందీలో అమితాబ్‌బచ్చన్‌ హీరోగా సూర్యవంశ్‌ తీశారు. కుమారులిద్డరితోనూ బెండు అప్పారావు, ఎవడి గోల వాడిది, అత్తిలి సత్తిబాబు, కితకితలు తదితర సినిమాలు రూపొందించారు. వినోదంతోపాటు సెంటిమెంటు, సీరియస్‌ సినిమాల్లో కూడా ఈవీవీ పలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఆమె, తాళి, అమ్మో ఒకటో తారీఖు తదితర సినిమాలు ఈ కోవకే చెందుతాయి. దర్శకునిగా ఆయన చివరి సినిమా కత్తి కాంతారావు. కుమారుడు నరేశ్‌ హీరోగా తీసిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.

 

వీరాట్ రూపం వృధా, వర్షం కారణంగా దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి

వీరాట్ రూపం వృధా, వర్షం కారణంగా దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి..

 

Virat Kohli 

 పోర్ట్‌ ఎలిజబెత్‌: దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేను గెలిచి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వర్షం దెబ్బతో భారత్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దీంతో సిరీస్ 2-2 తేడాతో సమమైంది. శుక్రవారం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 48 పరుగుల తేడాతో ఓడింది. విరాట్‌ కోహ్లి (87 నాటౌట్‌; 92 బంతుల్లో 7X4, 2X6) పోరాటం వృథా అయింది. 266 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌ 137/6 (31.3 ఓవర్లు)తో ఉన్నప్పుడు మ్యాచ్‌కు గంటన్నరసేపు వర్షం అంతరాయం కలింగించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 46 ఓవర్లలో 260 పరుగులకు కుదించారు. ఐతే మరో 8 బంతులకే వర్షం తిరిగి మొదలైంది. అప్పటికి భారత్‌ 142/6 (32.5 ఓవర్లు)తో ఉంది. అంపైర్లు డక్‌వర్త్‌ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికాను విజేతగా ప్రకటించారు. భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి తప్ప అందరూ విఫలమయ్యారు. రోహిత్‌ (1), పార్థివ్‌ (11), యువరాజ్‌ (12), రైనా (20), ధోనీ (2), యూసుఫ్‌ (2) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. భజ్జీ నాటౌట్‌గా నిలిచాడు. మొదట ఆమ్లా (64; 69 బంతుల్లో 8X4) అర్ధసెంచరీకి.. డుమిని (71 నాటౌట్‌; 72 బంతుల్లో 2X4, 1X6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవడంతో దక్షిణాఫ్రికా 265 (7 వికెట్లకు) పరుగులు చేసింది. యువీ మూడు వికెట్లు తీశాడు.

మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను భారత బౌలర్లు తిప్పలు పెట్టారు. జహీర్‌, మునాఫ్‌ బౌలింగ్‌లో పరుగులు సాధించేందుకు ఓపెనర్‌ స్మిత్‌ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఆమ్లా మాత్రం కుదురుకున్నాక.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆమ్లా తర్వాత ఎవరినీ లెక్కచేయలేదు. మునాఫ్‌ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. జహీర్‌, నెహ్రాల బౌలింగ్‌లోనూ స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. ప్యాడ్‌లపైకి బంతులు విసురుతూ ఆమ్లాను కట్టడి చేయలనుకున్న భజ్జీ వ్యూహాలు పారలేదు. మరోవైపు తడబడుతూనే చాలాసేపు క్రీజులో నిలిచిన స్మిత్‌ (18) నెహ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడు భజ్జీకి క్యాచ్‌ ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత వన్డే ఆడుతున్న వాన్‌విక్‌ (15) పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ సింగిల్స్‌తో స్త్ట్రెక్‌ రొటేట్‌ చేస్తూ ఆమ్లాకు సహకరించాడు. వ్యక్తిగత స్కోరు 38 పరుగుల వద్ద ఆమ్లా వన్డేల్లో రెండు వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అత్యంత వేగంగా (41 వన్డేల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడు ఆమ్లానే. జహీర్‌ అబ్బాస్‌ (45 మ్యాచ్‌లు) పేరిట ఉన్న 28 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. యువీ బౌలింగ్‌లో బౌండరీతో ఆమ్లా ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అతడు జోరు కొనసాగించడంతో 19వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది.

19 ఓవర్లలో 105/1తో భారీ స్కోరు చేసేలా కనిపించిన దక్షిణాఫ్రికా వరుసగా నాలుగు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 20వ ఓవర్లో వాన్‌విక్‌ను యువీ ఔట్‌ చేస్తే.. తర్వాతి ఓవర్లో ఆమ్లా పెవిలియన్‌ చేరాడు. రోహిత్‌ బౌలింగ్‌లో లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. డివిలియర్స్‌ (3) యువీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్‌ ఇవ్వగాప్లెసిస్‌ (1) కూడా రనౌటయ్యాడు. 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను పార్ట్‌టైం బౌలర్లు మరింత పరీక్షించారు. కష్టాల్లో ఉన్న జట్లును డుమిని ఆదుకున్నాడు. వెంటనే వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరుబోర్డును కదిలించాడు. అతడికి బోథా (44; 59 బంతుల్లో 3X4) అండగా నిలబడ్డాడు.

 

EVV Satyanarayana Is No More

EVV Satyanarayana Is No More

 

 Noted filmmaker EVV Satyanarayana (55) died of heart attack on Friday. He has been suffering from blood cancer for the last few years and was admitted to the Apollo Hospital a couple of days back. His full name is Edara Veera Venkata Satyanarayana. Known for his comedy films, EVV was born on June 10, 1956, in a village called Dommeru in the district of West Godavari. He is survived by his wife and two sons, Rajesh and Naresh.

He was born on 10 June 1958. He made his debut as a director with ‘Chevilo Puvvu’ in 1990. His second film Prema Khaidi went onto become a commercial hit. He has produced several hit comedies as well as women-oriented films in his career spanning 20 years. He has worked with all top heroes of Telugu film industry. His sons Allari Naresh and Aryan Rajesh are noted heroes.

He started his film career as an assistant director to 'Hasya Brahma' Jandhyala. Chevilo Puvvu was his first film as a director. However, his first hit was Prema Khaidi, produced by D. Ramanaidu. His last film was Kathi Kantha Rao, which released in December 10 last year. He also directed a Hindi film Sooryavansham in 1999 starring Amitabh Bachchan and Soundarya. May his soul rest in peace.

May His Soul Rest In Peace

సాఫ్టువేరు కంపెనీ సిఇవోతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి యమున

సాఫ్టువేరు  కంపెనీ సిఇవోతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి యమున

  Yamuna

  బెంగళూర్: ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇవో వేణుగోపాల్‌‌తో వ్యభిచారం చేస్తూ సినీ నటి యమున పట్టుబడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి బెంగళూర్‌లోని ఐటిసి రాయల్ గార్డెనియా హోటల్లో వ్యభిచారం చేస్తూ యమున పోలీసులకు పట్టుబడింది. సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇవో వేణుగోపాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యమునతో పాటు పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బెంగళూర్ పోలీసు కమిషనర్ ధ్రువీకరించారు. మిగతా వారి వివరాలు కూడా త్వరలో ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

వ్యభిచారం చేస్తూ యమునతో పాటు మరో సినీ తార కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. యమునను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వలేదు. యమునను పోలీసుల నుంచి విడిపించడానికి కర్ణాటక సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యభిచారానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో యుమున ఎక్కువగా నటించింది. ఈ వ్యభిచార రాకెట్లో సురక్షిత్ సుమన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించిట్లు ప్రచారం జరుగుతోంది.

సెక్స్ రాకెట్‌లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆర్టిస్టు అరెస్టు

సెక్స్ రాకెట్‌లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆర్టిస్టు అరెస్టు.....

 Hyderabad

   హైదరాబాద్: సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్ [^] పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని మాదాపూర్ ‌లోని ఓ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ డెవలపర్ గా పనిచేస్తున్న పి. చంద్రశేఖర్ ‌ను, స్థానిక ఆర్టిస్టు వి. గోపిని సెక్స్ వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన మరో వ్యక్తి పేరు కూడా గోపియే. గోపి అనే మూడో వ్యక్తి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించడానికి ఓ గదిని అద్దెకు తీసుకున్నట్లు బంజారాహిల్స్ [^] ఎసిపి ఆర్. రవీందర్ రెడ్డి చెప్పారు. ఆ ముగ్గురితో పాటు నలుగురు కమర్షియల్ సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రశేఖర్, గోపి గత రెండేళ్లుగా హైదరాబాదులో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎస్కార్టుల్లో మొబైల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి వ్యభిచార వ్యాపారం చేస్తున్నారని, సెక్స్ వర్కర్లను సప్లయ్ చేసినందుకు 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు తీసుకుంటారని పోలీసులు చెప్పారు. కృష్ణానగర్‌ లోని ఓ ఇంటిలో వ్యభిచారం నడుపుతుండగా ఆ ముగ్గురిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. కోల్ ‌కత్తా, తూర్పు గోదావరి [^] జిల్లాలోని రాజమండ్రి [^] , కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన సెక్స్ వర్కర్లను రిస్య్యూ హోమ్‌ కు పంపించారు.

 

 

 

భాను కిరణ్ అనుచరుడు సజ్జల కేశవ్ ను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసు

భాను కిరణ్ అనుచరుడు సజ్జల కేశవ్ ను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసు...

  Bhanu Kiran

  అనంతపురం: మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అనుచరుడుగా భావిస్తున్న సజ్జల కేశవ్ ను సిసిఎస్ పోలీసులు శుక్రవారం అనంతపురం [^] లో అరెస్టు చేశారు. సజ్జల కేశవ్ ద్వారా భాను గురించి మరిన్ని ఎక్కువ వివరాలు సేకరించవచ్చునని పోలీసుల భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పోలీసులు కేశవ్ ను అరెస్టు చేశారు. కేశవ్ వస్త్ర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. సజ్జల కేశవ్ కు భాను కిరణ్ ఆర్థికంగా కూడా బాగా సహకరించినట్లుగా సమాచారం. అనంతపురం జిల్లా వాసి అయిన కేశవ్ కు బెంగుళూరులో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

బెంగుళూరు దగ్గరగా ఉండటంతో ఆయన తన వ్యాపారాన్ని హైదరాబాదు కంటే బెంగుళూరులోనే ఎక్కువగా విస్తరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేశవ్ కు ఎక్కడ ఎక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయం రేపటి వరకు తెలియవచ్చు. కేశవ్ ను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాదుకు తరలించారు. సూరి హత్యకు రెండు మూడు రోజుల ముందునుండి భానుకిరణ్ కేశవ్ కే అత్యధికంగా ఫోన్లు చేసినట్టుగా తెలుస్తోంది.

 

నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు, షాలిమార్ వీడియోస్ ఫిర్యాదు

నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు, షాలిమార్ వీడియోస్ ఫిర్యాదు..

  C Kalyan

 హైదరాబాద్: తెలుగు [^] సినీ నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు చుట్టుకునే అవకాశం ఉంది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలపై పీకల లోతు కష్టాల్లో పడిన కళ్యాణ్‌పై మరో పిడుగు పడినట్లే. తనను బెదిరించాడంటూ హైదరాబాదుకు చెందిన షాలిమార్ వీడియోస్ అధినేత అష్రాఫ్ కళ్యాణ్‌పై హైదరాబాద్ [^] నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనకు ఓ సినిమా వీడియో హక్కులు ఇప్పిస్తానని చెప్పి తనను కళ్యాణ్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.

సినిమా వీడియో హక్కులు ఇప్పిస్తానని తన వద్ద కళ్యాణ్ 99 లక్షల రూపాయలు తీసుకున్నాడని, తర్వాత ఆ సినిమా హక్కులు వేరేవారికి ఇప్పించాడని, తాను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తనను, తన సిబ్బందిని బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదుదారును విచారిస్తున్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి సాక్ష్యాధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

హీరోతో ప్రేమాయణం నడిపి, అతన్ని కొట్టించిన శ్వేతారెడ్డి?

హీరోతో ప్రేమాయణం నడిపి, అతన్ని కొట్టించిన శ్వేతారెడ్డి?

  Maddelachervu Suri

హైదరాబాద్: టీవీ న్యూస్ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న శ్వేతారెడ్డి చిక్కుల్లో పడింది. శ్వేతారెడ్డికి చెందిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి, భాను కిరణ్ ఆస్తులకు ఆమె బినామీగా వ్యవహరించడమే కాకుండా తీవ్రమైన పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్వేతారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమెను టీవీ చానెల్ ఉద్యోగం నుంచి తొలగించింది. శ్వేతారెడ్డి ఓ హీరోతో ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. ఆ ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్లింది. కానీ, శ్వేతారెడ్డికి తన పెట్టుబడులు ఉన్న ల్యాబ్‌లోని ఓ వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానాలు రావడంతో హీరో గొడవ పడ్డాడని తెలుస్తోంది.

శ్వేతారెడ్డి ఈ హీరోను మద్దెలచెర్వు సూరి ముఠాతో కొట్టించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ హీరో హైదరాబాదు వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆ హీరో ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడని కూడా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం శ్వేతారెడ్డి సోదరుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూరి తనకు మేనమామ అంటూ శ్వేతారెడ్డి తాను పనిచేసే కార్యాలయంలో కూడా చెప్పుకునేది అంటున్నారు. అనంతపురం [^] జిల్లాలోని తన ఆస్తులను సూరి శ్వేతారెడ్డి పేరు మీదనే పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పలు చోట్ల భాను కిరణ్ ఆమె పేర పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. శ్వేతారెడ్డి సూరికి బంధువని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.