ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రొషనల్ గా సక్సెస్ అయినటు వంటి వ్యక్తులకు అవార్డ్స్ తో సత్కరిస్తుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ ఎన్ డి టీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ని 'ఎంటర్ టైనేర్ ఆఫ్ ద డికేడ్' అవార్డుతో ఘనంగా సత్కరించింది. నిన్న రాత్రి డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర హోం మంత్రి చిదంబరం చేతుల మీదుగా రజనీకాంత్ స్వీకరించాడు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా రజనీని ప్రశంసలతో ముంచెత్తారు. 'రజనీ కేవలం ఇండియన్ స్టారే కాదు, అంతర్జాతీయ నటుడు' అన్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. 'రజనీ సార్ కూర్చున్న వేదిక మీద కూర్చోవడమే పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఆయన గొప్పతనం గురించి మా అమ్మ చాలా సార్లు చెప్పింది' అంది కత్రినా కైఫ్.
విద్యాబాలన్ అయితే గబగబా వెళ్లి రజనీ పాదాలకు నమస్కరించింది. సౌత్ రన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా త్రిష అవార్డు సొంతం చేసుకొన్నది'తన జీవితంలో ఇంతవరకు చేసిన వాటిలో అత్యుత్తమ సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ సినిమా 'రోబో' అని చెప్పాడు ఈ సూపర్ స్టార్. ‘భగవంతుడి చేతిలో నేనో పరికరాన్ని. ఆయన ఎలా చేయమంటే అలా చేస్తున్నానంతే’అన్నాడు రజనీ, ఎన్ డి టీవి చైర్మన్ ప్రణబ్ రాయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా. ఏమైనా, ఈ అవార్డుల వేడుక రజనీ సన్మాన వేడుకగా మారిపోయింది. !
No comments:
Post a Comment