BREAKING NEWS
Sunday, February 20, 2011
ఫ్లాఫ్ చిత్రాల దర్శకుడుతో మంచు మనోజ్
మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తాజాగా ఓ కొత్త చిత్రం కమిటయినట్లు సమాచారం. అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలు డైరక్టర్ అనీల్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు.ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. డి.యస్ రావు నిర్మించే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం డియస్ రావు..నాని హీరోగా పిల్ల జమీందార్ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక మనోజ్..త్వరలో రాజా అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ఊ కొడతారా ఉలిక్కపడతారా అనే చిత్రం లో చేస్తున్నారు. దీక్షాసేధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment