BREAKING NEWS
Sunday, February 20, 2011
రాజమౌళి "సూపర్‌మేన్" కాన్సెప్టు తోనే ఆ చిత్రం
ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే చిత్రం నిన్న(శుక్రవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ మేన్ తరహా కాన్సెప్ట్ తో రూపొందనుందని తెలుస్తోంది. హిందీలో హృతిక్ రోషన్ చేసిన క్రిష్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించాలని రాజమౌళి ప్లాన్ చేసే ఈ చిత్రం స్టార్ట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి... చత్రపతి’ తర్వాత ప్రభాస్‌తో తీసే సినిమాపై ఇప్పటికే చాలా ఊహాగానాలు నడిచాయి. కొందరైతే ‘విశ్వామిత్ర’ అనీ అనేశారు! అదంతా కేవలం ఇమాజినేషన్ మాత్రమే. ఈసారి ప్రభాస్‌ని అసాధారణ శక్తులున్న హీరోగా ఆవిష్కరిస్తున్నా. ‘మగధీర’కు 2రెట్లు అధిక బడ్జెట్ ఖర్చు చేస్తున్నాం. చారిత్రకం, పౌరాణికం కలగలిసిన పూర్తి స్థాయి ఫాంటసీ సినిమా ఇది. ఈ విజువల్ వండర్‌ను తెలుగు, తమిళ్‌లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం’ అన్నారు . కె.రాఘవేంద్రరావు సమర్పణలో ప్రభాస్ హీరోగా..శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించే సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment