BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, January 13, 2011

హాట్ సీన్స్ కి సెన్సార్ కట్స్ అంటూ పబ్లిసిటీ బాగానే ఇచ్చుకొంటున్నాడు....

హాట్ సీన్స్ కి సెన్సార్ కట్స్ అంటూ పబ్లిసిటీ బాగానే ఇచ్చుకొంటున్నాడు....

 

Mirapakaya షాక్’ సినిమాతో రవితేజ కి షాకిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, ఈసారి మాత్రం ‘మిరపకాయ్’ అంటూ ఘాటైన హిట్టిస్తానంటున్నాడు. ‘మిరపకాయ్’ పక్కా కమర్షియల్ సినిమా..రొమాన్స్..యాక్షన్..ఎంటర్ టైన్ మెంట్..ఇవన్నీసమానంగా మిక్స్ అయి వుంటాయంటోన్న హరీష్ శంకర్, తనను నమ్మినందకు రవితేజకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టివ్వాలనే ప్రయత్నంతో సినిమాని మరింత జాగ్రత్తగా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. ఇక, ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువయ్యిందనీ, సెన్సార్ కట్స్ బాగానే పడ్డాయని గుసగుసలు విన్సిస్తుండడంపై స్పందించిన హరీష్ శంకర్, సినిమాలో ఎక్కడ కట్స్ పడ్డాయో తనకు చెప్పాలంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపాడు.

సీరియస్ గా అన్నాడో?సరదాగా అన్నాడో గానీ, ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రొమోస్ లో రిచాగంగోపాద్యాయ-రవితేజ రొమాన్స్ ఘాటు..వెరసి సినిమా పబ్లిసిటికీ బాగానే హెల్సవుతోంది. కాగా సెన్సార్ కట్స్ రిచా-రవితేజ రొమాన్స్ పైనా..?యాక్షన్ సన్నివేశాలపైనా..?డైలాగులపైనా..?అనేది రివ్వూ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.

 

స్టార్ డైరక్టర్ నుంచి "కొమరం పులి" హీరోయిన్ కి పిలుపు

స్టార్ డైరక్టర్ నుంచి "కొమరం పులి" హీరోయిన్ కి పిలుపు..






Nikisha Patel పవన్ కళ్యాణ్ సరసన 'కొమరంపులి' చిత్రంలో చేసిన నికిషపటేల్‌ కి ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాలేదు.చిన్న చితకా చిత్రాల నుంచి ఆపర్స్ వచ్చినా ఆమె రిజెక్ట్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుభాష్ ఘయ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చేయబోయే పాత్ర గురించి ఘాయ్‌ నికిషకి చెప్పేశారు. నికిష తనకు లభించిన అవకాశాన్ని అంది పుచ్చుకుంది. కేవలం గ్లామర్‌కు మాత్రమే కాకుండా కథకి, క్యారక్టర్‌కి ప్రాధాన్యత నిస్తానని నికిష చెబుతోంది. అందువల్లే ఇతర భాషా చిత్రాల నుండి అవకాశాలు వచ్చిన అంగీకరించలేదని చెప్తోంది. ఇక కొమురం పులి చిత్రం చేసిన తర్వాత నిఖిష ఓ లీడింగ్ న్యూస్ పేపరుతో తన గోడు వెళ్ళబోసుకుంది. పులి ప్లాపుతో నేనే నాశనమయ్యాను..పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారు. ఎస్.జె.సూర్య..దర్శకుడుగా కంటిన్యూ అవుతున్నారు. ఎటొచ్చీ నా రెండున్నరేళ్ళ కెరీర్ పాడయింది. ఈ సినిమా సంతకం పెట్టేడప్పుడు ఈ చిత్రం రిలీజయితే చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నాను. షూటింగ్ లో ఉండగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ నన్ను తమ కొత్త చిత్రాల కోసం సైన్ చేయమని అడిగారు.అయితే రిలీజయ్యే వరకూ వేరే చిత్రం ఒప్పుకోవద్దని ఈ పులి చిత్రం వారు చెప్పారు. ఇప్పుడు సినిమా చూస్తే ఇలా దారుణంగా ఫెయిలైంది అంది.

మిరపకాయ్ రివ్యూ

మిరపకాయ్ రివ్యూ .......

Mirapakaya Movie Review

Mirapakaya Movie Review

తమన్నా రైలు ఎక్కకపోతే...అతనికి ఆత్మహత్యే గతి

తమన్నా రైలు ఎక్కకపోతే...అతనికి ఆత్మహత్యే గతి..!

 

Tamannaఎటుచూసినా కష్టాలు..భాధలు..ఈ పరిస్దితుల్లో మరణమే మేలు అనుకుని అతను ఫిక్సై వైజాగ్ రైలు ఎక్కాడు. రైలు కదిలాక ఆత్మ హత్య చేసుకుందాముకుందామనుకున్నాక...కదులుతున్న ఆ రైల్లోకి అందాల అమ్మాయి తమన్నా ఎక్కింది. ముఖం నిండా నవ్వు..చక్కటి కనుముక్కు తీరుతూ లొడ లొడ మాట్లాడుతూంటే ఆమె..ఈ కుర్రాడికి తనకు తాను పరిచయం చేసుకుంది. అక్కడ్నుంచీ ఆ కుర్రాడి జీవితం పూర్తిగా మారిపోయింది.అయితే ఇదంతా నిజ జీవిత కథ కాదు. తమన్నా హీరోయిన్ గా చేసిన ప్రియా...ప్రియతమా...చిత్రంలోని పాయింట్ ఇది. ప్రేమిస్తే ఫేం భరత్, తమన్నా జంటగా తమిళంలో రూపొందిన కండేన్ కాదలై చిత్రం తెలుగు [^] లో ఈ టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది. ఆర్.కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా...అక్కడ యావరేజ్ గా ఆడింది. మోసర్ ‌బేర్ ఎంటర్‌ టైన్ ‌మెంట్ లిమిటెడ్ వారు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ జబ్ వి మెట్ చిత్ర కి రీమేక్. ఇక ప్రస్తుతం తమన్నా..నాగచైతన్య సరసన ఐలవ్ యు అనే చిత్రంలోనూ, అల్లు అర్జున్ [^] సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ [^] , సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రంలోనూ ఎంపికైంది.

 

బాయ్ ప్రెండ్ తో డేటింగ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ తెచ్చుకున్న హీరోయిన్

బాయ్ ప్రెండ్ తో డేటింగ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ తెచ్చుకున్న హీరోయిన్..

 

Kate Hudson

 కేట్ హుడ్సన్ తన బాయ్ ప్రెండ్ మాట్ బెల్లామీ ద్వారా తల్లి కాబోతున్న విషయాన్ని తనకు బాగా కావాల్సిన దగ్గరి బందువు ఒకరు కన్ ఫర్మ్ చేశారు. గతంలో తన భర్త క్రిస్ రాబిన్ సన్ ద్వారా ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి రైడర్ అనే కుమారుని కలిగి ఉన్న కేట్ హుడ్సన్ కొన్ని అని వార్య కారణాల వల్ల తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత తన బాయ్ ప్రెండ్ మాట్ బెల్లామీ తో కలసి ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సందర్బంలో కేట్ హుడ్సన్ మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నాకు మరో బేబి పుట్టబోతున్నందుకు అని అన్నారు. మాట్ బెల్లామీ తో డేటింగ్ చేయడం వల్ల నాకు బేబి పుట్టబోతున్న విషయం తేలిసిందే. నాకు మాట్ బెల్లామీకి పుట్టబోయే మొదటి మొదటి బేబి. నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలో రైడర్ తో ఆడుకోవడానికి తనకు చెల్లి లేక తమ్ముడు ఎవరో ఒకరు ఈభూమి మీదకు రాబోతున్నందుకు అని అన్నారు.

డిసెంబర్ 31, 2000లో తన మాజీ భర్త రాబిన్ సన్ ని కేట్ హుడ్సన్ పెళ్శి చేసుకోవడం జరిగినది. రాబిన్ సన్ తనని అనుమానిస్తున్నాడంటూ, ఇక తనతో కలసి ఉండటం సాధ్యం కాదని అక్టోబర్ 22, 2007 విడాకులు తీసుకోవడం జరిగినది. వీళ్శిద్దరూ కలసి ఉన్నప్పుడు వీరికి ఒక రైడర్ అనే అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాధ్యూ బెల్లమితో కలసి ఉంటుంది. తనతో కలసి జీవించడం నాకు చాలా ఆనందందా ఉంది. తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నన్ను ఇప్పుడు ఎవరైతే బాగా ప్రేమిస్తారో ఇక వాళ్శతో మాత్రమే కలసి జీవిస్తాను. ఒకసారి పెళ్శి చేసుకోని మోసపోయా, ఇక నేను ప్రేమను మాత్రమే నమ్ముతాను, పెళ్శిని నమ్మను అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. అంతేకాకుండా పెళ్శి శాశ్వతం కాదని, ప్రేమ మాత్రం కడవరకు ఉంటుందని అన్నారు.

మాజీ ప్రియురాలిని ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిసిన జూ ఎన్టీఆర్

మాజీ ప్రియురాలిని ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిసిన జూ ఎన్టీఆర్..

 

Jr Ntr-Sameera Reddy 

 టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేమించుకొని, ప్రేమ ముదిరి, పెళ్లిదాక వెళ్లి విడిపోయిన జూ ఎన్టీఆర్ ను సమీర రెడ్డి హైదరాబాద్ లో మళ్లీ కలిశారని తెలిసింది. ‘ఎర్ర గులాబీలు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా, హీరోయిన్ సమిరా రెడ్డి హైదరాబాదుకు వచ్చింది. జూ ఎన్టీఆర్ ను సీక్రెట్ గా కలిసిందని టాలీవుడ్ లో టాక్.

జూ ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలసి నటించిన మొదటి సినిమా నరసింహుడు ఈ సినిమాలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అయ్యారనేది వాస్తవం. ఈ క్లోజ్ ‘అశోక్’ సినిమాతో తారాస్థాయికి వెళ్లి, ప్రేమ పెళ్లిదాకా వెల్లిందనేది వాస్తవం. సమీర రెడ్డి పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ ను తన వయస్సు చిన్నది కాబట్టి కొంతకాలం ఆగమని చెప్పాడు జూ ఎన్టీఆర్.

అయితే ఆ చిన్న గ్యాప్ లో ‘జై చిరంజీవా’ సినిమా చిరంజీవితో సమీరా రెడ్డి నటించటానికి ఓప్పుకోవటంతో, ఎన్టీఆర్ సహించలేక సమీర రెడ్డితో మాట్లాడటం మానేశాడని అప్పుట్లో టాలీవుడ్ లో గుసగుసలు. కాగా సమీరా రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ కు ఫోన్ చేసి నిన్ను కలసి మాట్లాడాలని ఉందని చెప్పడంతో జూ ఎన్టీఆర్ జరిగినవన్నీ మర్చిపోయి సమీరారెడ్డిని హైదరాబాదు ఊరి చివర ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ యాంగిల్ లో నన్ను చూడొద్దు, పిలవొద్దు: జెనీలియా వార్నింగ్..

 Genelia 

 

 ఈ మధ్య ఒకరు హాయ్ సెక్సీ అని పిలిచారు. నాకు చాలా చిరాగ్గా అనిపించింది. నాలాంటి ఫ్యామిలీ అమ్మాయిని పట్టుకుని సెక్సీ అని పిలవడమేంటి..ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదూ...అయినా నేను సెక్సీగా కనిపించాలని అనుకోను. ఆలాంటి ఇమేజ్ నాకొద్దు...అంటోంది ఆరెంజ్ హీరోయిన్ జెనీలియా [^] . అలాగే సెక్సీ వస్త్రధారణకు కూడా దూరంగా ఉంటాను. అయినా నన్ను పిలవాలనుకుంటే నాకు అమ్మా నాన్నా పెట్టిన పేరు చక్కగా ఉందిగా..ఈ సారి ఎవరైనా అలా పిలిస్తే చాలా సీరియస్ పరిణామాణాలు ఎదుర్కోవాల్సివస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది జెనీలియా. 'ఆరెంజ్' చిత్రంలో చేసి వివాదాలు పాలైన జెనీలియా కొంతకాలం పాటు తెలుగు [^] పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఆమె 'ఆరెంజ్' తర్వాత ఒక్క తెలుగు చిత్రం కూడా ఒప్పుకోలేదు. త్వరలో విడుదల కానున్న 'బొమ్మరిల్లు' రీమేక్ 'ఇట్స్ మై లైఫ్', 'హుక్ యా క్రూక్' చిత్రాల మీదే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది

అల్లరి నరేష్ ఆ ఒక్క అబద్దం ఆడే సమస్యలో పడ్డాడు

అల్లరి నరేష్ ఆ ఒక్క అబద్దం ఆడే సమస్యలో పడ్డాడు.

 

Allari Naresh 

 వంద అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలి అంటారు పెద్దలు. మా హీరో అల్లరి నరేష్ పెళ్ళి కోసం ఒకే ఒక్క అబద్ధం ఆడాడు. అక్కడి నుంచే సమస్య మొదలౌతుంది అంటున్నారు దర్శకుడుగా పరిచయం అవుతున్న వీరభధ్ర చౌదరి.ఆయన తాజా చిత్రం 'అహ నా పెళ్లంట'. 'మ్యాచ్‌ ఫిక్సింగ్‌' అనేది ట్యాగ్ లైన్.వచ్చేనెలలో రిలీజుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఆడియో ఈనెల 14న పాటల్ని విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఇక చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ...ఓటు వేసే వయసు దాటేసి పుష్కరం అయినా నాకుపెళ్లి కాలేదు. నచ్చిన పిల్ల దొరక్క కాదు. ఉద్యోగం లేకా కాదు.అప్పటికీ అందాల భరిణె లాంటి అమ్మాయి నా ప్రేమకి పచ్చజెండా వూపేసింది. ఆర్థిక మాంద్యం దెబ్బకి తట్టుకొన్న ఓ ఐటీ కంపెనీలో ఎప్పటికీ వూడిపోని ఉద్యోగం ఉంది. మరి సమస్య ఏమిటి? అదే మా సినిమాలోని అసలు కథ అంటున్నారు నరేష్‌. అలాగే ఈ చిత్రం ద్వారా రీతూ అనే హీరోయిన్ పరిచయం అవుతోంది. ఇక ఈ అహనా పెళ్ళంట టైటిల్ గతంలో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల సృష్టించిన అధ్బుతమైన కామిడీకి పెట్టారన్న సంగతి తెలిసిందే.అలాగే ఈ చిత్రానికి సంగీతం...రఘు కుంచె అందిస్తున్నారు.