నెల్లూరు: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా అందరూ కట్టుబడాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, దానిని అందరూ ఆమోదించాలని కోరారు.
సమస్య జఠిలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో భాగంగా అందరూ ఒక పరిష్కారానికి అంగీకరించాలని సూచించారు. అంతేగానీ తాము కోరుకున్నదే కావాలనే వాదన మాత్రం సరైనది కాదన్నారు. రాష్ట్రం విభజించాలా, కలిసి ఉండాలా అన్న అంశంపై కేంద్రం ఇప్పటికే అధ్యయనం చేస్తుందని చెప్పారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో దాడులు సరియైన చర్యలు కావన్నారు. సమస్య వచ్చినప్పుడు, విభిన్న వాదనలు ఉంటే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.
No comments:
Post a Comment