BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, March 7, 2011

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేష్ బాబు గ్లామర్ కి దిష్టి చుక్క అయిందా..!

Mahesh Babu-Namrataటాలీవుడ్ యువరాజు మహేష్ అందం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అలాంటి మహేష్ ని పెళ్ళాడిన నమ్రత, గ్లామర్ విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గ్లామర్ క్వీన్ గా సినిమా్లో ఓ ఊపు ఊపినా, పెళ్ళయ్యాక బొత్తిగా గ్లామర్ మీద దృష్టిపెట్టడంలేదు నమ్రత. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ పెళ్ళి సందర్భంగా ఏర్పాటైన‘సంగీత్’ కార్యక్రమానికి మహేష్, తన భార్య నమ్రతను వెంటేసుకొస్తే, నమ్రత ఆయనకు దిష్టి చుక్కలా కన్సించింది. క్యూట్ ఫేస్ తో మహేష్ దృష్టినీ ఆకర్షించాడు. నమ్రత మాత్రం అస్సేలేమాత్రం అందంగా కన్పించలేదు.

మామూలు సందర్భాల్లో ఎలా వచ్చినా ఫర్లేదుగానీ, ఇలాంటి కార్యక్రమాలకొచ్చేటప్పుడు గ్లామరస్ గా వుండాలన్న ఆలోచన నమ్రతకి రాకపోవడం ఆశ్చర్యకరమే. అందునా, హీరోయిన్ గా వున్నప్పుడు నమ్రత తన గ్లామర్ తో బాలీవుడ్ టాలీవుడ్ లను ఓ ఊపు ఊపేసింది. మరి ఆమె గురించి ఎవరైనా ఆ మాత్రం అందాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం సహజమే కదా. నెక్స్ ట్ టైమ్ అదం విషయంలో, మేకప్ విషయంలో నమ్రత తగు జాగ్రత్తలు తీసుకుంటే మహేష్ గ్లామర్ కి నమ్రత దిష్టి చుక్క అన్సించుకోకుండా వుంటుంది.

టూపీస్ బికినీకి నేను రెడీ, మీరు రెడీనా? జెనీలియా

Geneliaఇన్నాళ్ళూ తన అందాల ప్రదర్శనకు లిమిటేషన్స్ పెట్టుకుని బికినీకు దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు బికినీ వెయ్యటానకి రెడీ అంటోంది. అంతేగాక. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా రెడీ అని చెప్తోంది. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటీ అంటే...కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. పాత్ర కోసం నేను ఎంతటి ఎడ్వంచర్ అయినా చేస్తానని చాలా సార్లు చెప్పాను. బికినీ వెయ్యటం కూడా ధైర్యంతో తీసుకున్న నిర్ణయంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అయితే బికినీ వెయ్యాలంటే నాకు ఆ కథ నచ్చాలి. ఆ కథ..బికినీని డిమాండ్ చెయ్యాలి కథ నచ్చి , సీన్ కి అది కరెక్ట్ అనిపిస్తే టూపీస్ బికినీకి నేను రెడీ అంది. రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం తర్వాత నిర్మాత నాగబాబు డైరక్ట్ గా ఆమె తనను ఇబ్బందిపెట్టిందని స్టేట్మెంట్ ఇవ్వటంతో తెలుగులో ఆ తర్వాత ఒక్క ఆఫరూ రాలేదు. హిందీలోనే సినిమాలు చేస్తున్న జెనిలియా ఇలా బికినీకి, లిప్ లాక్ కిస్ కి రెడి అంటూ నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బికినీ ఆఫర్ ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనపడటం లేదు. ఎందుకంటే జెనీలియా బికినీ వేస్తే ఎవరు చూస్తారు. ఆమె నిండుగా బట్టల్లోనే క్యూట్ గా ఉంటుంది అంటున్నారు. అదీ నిజమేనేమో..

చిరంజీవికి మరో షాక్, వైయస్ జగన్ వెంట వాసిరెడ్డి పద్మ

Vasireddy Padmaహైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల వ్యహారం చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని భావించిన చిరంజీవికి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల కోటాలో ఓ ఎమ్మెల్సీ సీటు కేటాయించింది. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ తిరుగుబాటు చేశారు. ఈ మేరకు ఆమె చిరంజీవికి ఓ లేఖ రాశారు. ఎమ్మెల్సీ సీటును సి. రామచంద్రయ్యకు కేటాయించాలని చిరంజీవి నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు చిరంజీవి సోమవారం ఉదయం పార్టీ శాసనసభ్యులతో, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. వాసిరెడ్డి పద్మ వైయస్ జగన్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.

కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్‌పై చంద్రబాబు, వైయస్ జగన్‌లకు చిక్కులు

Chandrababu Naidu - Ys Jaganహైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్- ఇద్దరికీ ఒకే విధమైన ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ప్రతిపక్ష నాయకులుగా కాకరాపల్లి బాధితుల పక్షాన నిలబడాల్సిన అవసరం వారికి ఏర్పడింది. అయితే, వారు ఈ విషయంపై ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టే పరిస్థితిలో లేకుండా పోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

కాకరాపల్లి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు చిక్కులు ఎదురయ్యాయి. బాధితులు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రపై ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెంనాయుడికి వాటాలున్నాయని బాధితులు ఆరోపించారు. బహుశా దీనివల్లనే కావచ్చు, చంద్రబాబు పర్యటనకు ఎర్రంనాయుడు దూరంగా ఉన్నారు. ఈ వివాదంతో ఎర్రంనాయుడు చంద్రబాబుకు దూరమవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కాకరాపల్లి వల్ల తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయిందని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. బహుశా ఎర్రంనాయుడి పాత్రను ఉద్దేశించి ఆ విధంగా అని ఉంటారు. అయితే, మరో రకంగా వైయస్ జగన్ చిక్కుల్లో పడినట్లు అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది. దీని గురించి సర్దిచెప్పుకోవడానికి జగన్ ప్రయత్నించారు. అప్పుడు ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించలేదని, ఇప్పుడు వ్యతిరేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.


రానా కోసం కత్తి యుద్దం నేర్చుకోవడానికి వెనకాడని సూపర్ స్టార్

Rajinikanthయావత్ ప్రపంచానికి రోబోతో తన సత్తా చాటినటువంటి సూపర స్టార్ రజనీకాంత్ తదుపరి నటించనున్నటువంటి చిత్రం రానా. ఈసినిమాకి కెయస్ రవికుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓ చారిత్రాత్మక నేపద్యంలో రూపోందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకోణే, విద్యాబాలన్‌లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ఓ ముఖ్య పాత్రలో రజనీకాంత్ సరసన అలనాటి అందాల రాశి రేఖ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా చారిత్రక నేపద్యంతో కూడుకున్నది కావడంతో ఈసినిమా కోసం రజనీకాంత్ ప్రత్యేకంగా కత్తి యుద్దాన్ని నేర్చుకుంటున్నాడంట. రజనీకాంత్ ఈవయసులో ఈసినిమాపై ఇంత ఆసక్తి చూపిస్తుడడంతో కోలీవుడ్‌లో ఇప్పటికే ఈసినిమాపై చాలా అంచనాలు నెలకోన్నట్లు వినికిడి. రోబోతో వరల్జ్ వైడ్ మార్కెట్ లో తన సత్తా ఏంతో చూపించినటువంటి రజనీకాంత్ రానాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కనువిందు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్శనున్న ఈ చిత్ర తోలి షెడ్యూల్ లండన్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

చార్మితో అసభ్యంగా ప్రదీప్ రావత్ మాట్లాడటం ఎంతవరకూ సబబు?

Charmiతాజా చిత్రం మంగళ లో ప్రదీప్ రావత్ పాత్ర వచ్చి తో నా కొడుకు నీ సల్లు పట్టుకున్నాడని నువ్వు చెంప దెబ్బ కొట్టావు..వాడు పురుగుల మందు త్రాగి ప్రాణాపాయ స్ధితిలో ఉన్నాడు..నువ్వు ఒక్కసారి వచ్చి చూస్తేనే మందులు వేసుకుంటానంటున్నాడనే డైలాగు ఉంటుంది. కథ ప్రకారం ..మంగళ అనే సినీ హీరోయిన్. ఆమె తో అసభ్యంగా బిహేవ్ చేసారని ఓ వ్యక్తిని కొడతారు. అయితే అది పొరపాటున వేరే వ్యక్తికి తగులుతుంది. అభిమానంతో కారు గిప్ట్ గా ఇద్దామని వచ్చిన ఆ వ్యక్తి భాధతో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ అభిమాని తండ్రి ప్రదీప్ రావత్ వచ్చి ఈ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగులో సల్లు అనే పదం వాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ పదానికి సెన్సార్ వారు ఎట్లా అనుమతి ఇచ్చారో అని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

చిరంజీవి, బాలకృష్ణ లపై ఆగని ఆకతాయి ఆగడాలు...!

Chiranjeevi-Balakrishnaబాలకృష్ణ చిరంజీవిలను ద్వేషిస్తూ కొంతమంది వెబ్ సైట్లు నడుపుతూ వారిరువురుపై దుష్ప్రచారానికి ఇష్టంగా కష్టపడిన సంగతి, తర్వాత బాలకృష్ణ పోలీసు కంప్లైటు ఇవ్వడం తథితర సంగతులన్నీమన అందరికి తెలిసిందే. అయితే, ఈ తతంగానంత వివరిస్తున్న ప్రతీ పత్రిక మరియు న్యూస్ చానెల్ వాళ్ళు మరో మారు సదరు వెబ్ సైట్ వాళ్ళు బాలకృష్ణ చిరంజీవిలపై వ్రాసుకొని ప్రచారంలోకి తెచ్చిన అనేకానేక జోకులని, ఫోటోలని వేసి మరీ చూపిస్తూ మంచి మసాల కధనాలని వండి వడ్డిన్చేస్తున్నారు వారి పాటకులు మరియు ప్రేక్షకులకి.

చివరికి ఇదంతా ఎలా తయారైందంటే, యిల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు దొరికిందని మరోడు సంతోసిన్చినట్లు! ఇక, బాలకృష్ణ చిరంజీవిల విషయానికి వస్తే, మొగుడు కొట్టినందు కాదు నే ఏడ్చింది, తోడి కోడలు నవ్వినందుకే అన్నట్లు! వాడెవడో మాకు సైటు పెట్టడమేమిటి, పెట్టినా ఈ తిట్టడమేమిటి అని వాపోతున్న మన హీరోలద్దరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తునారు రోజుకో జోకు రెండ్రోజులకో చర్చవేదికలతో ఈ న్యూస్ పేపరు వాళ్ళు, న్యూస్ చానెల్ వాళ్ళు.

అయినా, వాళ్ళు అసలు తమ మీద జాలి పడుతున్నారా లేక యెగతాళి చేస్తున్నారా అనే అనుమానము లేక పోలేదు మన హీరోలకి. పచ్చి పుండు మీద కారం జల్లి ఉఫ్ ఉఫ్ మని ఉంది ఉసులాడుకొంటున్న విలంధరిని ఏమి చేయాలో తెలియక, ఏమి చేయలేక విగ్గులు పిక్కొంటున్నారు మన హీరోలిద్దరు.

అల్లు అర్జున్ కట్నకానుకల విశేషాలు.

Allu Arjun-Sneha Reddyనిన్న హైటెక్స్‌లో అశేష ప్రజానీకం ముందు అత్యంత ఘనంగా అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహాం జరిగిన విషయం తెలిసిందే. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ కట్నకానుకుల గురించి చాలా మంది చర్చించుకుంటున్నారనేది విషయం. తాజా సమాచారం మేరకు స్నేహారెడ్డి తండ్రి అల్లు అరవింద్‌తో మీకు ఎంత కట్నం కావాలని కోరడం జరిగిందంట.

దానికి అల్లు అరవింద్ మాకు సింగిల్ పైసా వద్దు. మీ అమ్మాయి మా ఇంటికి ఒక చిన్న సూటికేసు తీసుకోని వస్తే అది మాకు చాలా సంతోషం. అంతేకాని మాకు ఎటువంటి కట్నకానుకలు అక్కరలేదని అన్నారని సమాచారం. మా కుటుంబంలో కలసి మెలసి ఉంటే చాలు అని అల్లు అరవింద్ అన్నారంట. దాంతో ఉప్పోందిపోయినటువంటి స్నేహారెడ్డి తండ్రి పెళ్శికి మాత్రం ఎలాంటి లోటు లేకుండా గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించుకోని భోజనాలు, పెళ్శి మండపం, బట్టలు తదితర విషయాలు తానే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారంట.

ఇక అల్లు అర్జున్ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేటట్లుగా.. వివాహ వ్యవస్థ ఆచారాలు నేటి ఆధునిక యువతకు కళ్ళకు కట్టినట్లుగా ‘వరుడు’ చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్ జరుపుకున్న ఐదు రోజుల పెళ్ళి అందరికీ గుర్తుండే వుంటుంది.‘రీల్‌లైఫ్’లో ఐదు రోజుల పెళ్ళిని ఘనంగా చేసుకొన్న అల్లు అర్జున్ ‘రియల్‌లైఫ్’లో తన వివాహాన్ని ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ప్రభాస్ 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం కథ ఏమిటంటే..

Darlingఏ వ్యక్తైనా చెడు అనిపించుకోవడానికి క్షణకాలం పట్టదు. అదే మంచిపేరు తెచ్చుకోవాలంటే ఒక వ్యక్తిని, అతని గుణగణాలను ఎంతోకాలం గమనిస్తే కానీ అతనికి గుడ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అందరిచేత పర్‌ఫెక్ట్‌ అని ఎలా అనిపించుకున్నాడన్నది 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం కథ అంటున్నారు. ప్రభాస్‌ హీరోగా, కాజల్‌, తాప్సీ హీరోయిన్స్ గా దశరథ్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా, కేరళ, హైదరాబాద్‌, అహోబిలం లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్‌ చేశారు. యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌ అంశాలతో ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిల్ రాజు కధా రచయిత అవతారమెత్తారు. కె. విశ్వనాథ్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షాయాజి షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే: పి. హరి, కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: దిల్ రాజు, కథ-దర్శకత్వం: దశరథ్.

ఆ హీరోయిన్ కి గాఢ్ ఫాదరైపోయిన రాజమౌళి...!

Saloniబాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ రావడంతో సెక్సీ భామ సలోనీ ఎగిరి గంతేస్తోంది. ఇదంతా రాజమౌళికి కృతజ్ఝతలు చెప్పేసుకుంటోంది సలోనీ. ‘మగధీర’ సినిమాలో చిన్న పాత్ర కోసం రాజమౌళి తనను అప్రోచ్ కాకపోతే. ఇప్పుడు టాలీవుడ్ లో తాను కన్పించేదాన్ని కాననీ, తనకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఘనంగా ఇచ్చిన రాజమౌళి జీవితాంతం రుణపడి వుంటానని సలోనీ చెబుతోంది.

ప్రస్తుతం సలోని ‘తెలుగమ్మాయి’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. బాలయ్యతో ఛాన్స్ రావడంతో, సలోని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అవకాశాలు తనను ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయనీ, కెరీర్ ఇలా దశ తిరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదని సలోనీ ఎగిరి గంతేస్తోంది. మొత్తమ్మీద ‘మర్యాదరామన్న’ పేరు చెప్పి సలోనీకి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి సలోనీకి గాడ్ ఫాదర్ అయిపోయాడన్నమాట.

డెహ్రాడూన్ లో '3 ఇడియేట్స్'తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఇలియానా...!

Ileanaహిందీ బ్లాక్ బస్టర్ '3 ఇడియేట్స్' తమిళ, తెలుగు రీమేక్ రెండో షెడ్యులు షూటింగు ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతోంది. గత రెండు రోజుల నుంచీ జరుగుతున్న ఈ షూటింగులో హీరో విజయ్, జీవా, శ్రీకాంత్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఓ పాటను, ముఖ్య సన్నివేశాలను దర్శకుడు శంకర్ అక్కడ చిత్రీకరిస్తున్నాడు. నేటి (మార్చి 7) నుంచి కథానాయిక ఇలియానా కూడా షూటింగులో పాల్గొంటోంది. హిందీ ఒరిజనల్ వెర్షన్ తీసిన లోకేషన్లలోనే ఈ షూటింగును కూడా చేస్తున్నారు.

తమిళంలో దీనికి 'నన్బన్' టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఇదిలా ఉంచితే, మహేష్ బాబు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, తెలుగు వెర్షన్ కి కూడా విజయ్ నే హీరోగా కంటిన్యు చేయచ్చని అంటున్నారు. హేరిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్లోని ట్యూన్స్ ని వాడకుండా అన్నీ ఫ్రెష్ గా చేస్తున్నాడు!


సోనాక్షిసిన్హా పై కన్నేసిన టాలీవుడ్ టాప్ హీరో

Venkatesh-Sonakshi Sinhaదబాంగ్ బాలీవుడ్‌లో ఓ చరిత్రను నెలకోల్పినటువంటి సినిమా. ఒకే ఒక్క సినిమాతో యావత్ బాలీవుడ్ మొత్తం అభిమానులను సంపాదించుకుంది సోనాక్షిసిన్హా. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ కూడా ఈమె డైరీలోని కొన్ని పేజీలను కేటాయించాలని తిరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచ కధానాయకుడు కమల్ హాసన్ ప్రక్కన ఈ భామ నటించనుందని వార్తలు రావడం జరిగింది.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ పాత హీరో సోనాక్షిసిన్హాని తన సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో అర్రులు చాచుతున్నట్లు వినికిడి. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన విక్టరీ వెంకటేష్ అండి. గతంలో త్రిష, నయనతార, అసిన్ లాంటి హీరోయిన్స్ తో నటించి, నటించి చివరకి బోర్ కోట్టి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కళ్శు బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా మీద పడ్డాయని ఫిలింవర్గాల సమాచారం.

త్వరలో చిత్రం సినిమా దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించనున్నటువంటి సావిత్రి సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షిసిన్హా ఐతే బాగుంటుందని వెంకటేష్ చెప్పినట్లు వినికిడి. దాంతో సోనాక్షిసిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఐతే ఇప్పటికే సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి చాలా సినిమాలు సోనాక్షిసిన్హా అంగీకరించకపోవడం మరో విశేషం. దానికి కారణం డేట్స్ కుదరకపోవడమేనంట.

ఐతే టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ సరసన నటించడానికి ఒప్పుకుంటుందే లేదో చూద్దాం. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ మన రీమేక్ రాజా అయినటువంటి బెల్లంకోండ సురేష్ బాడీగార్డ్ సినిమాని రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో వెంకీ సరసన అందాలతార ఇలియానా ఆడిపాడనున్నారు. ఈ సినిమాకి డాన్ శీను సినిమాకి దర్శకత్వం వహించినటువంటి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు.

దిల్ రాజు సినిమాలోకి హన్సిక కూడా వచ్చి చేరింది

Hansikaదిల్ రాజు, సిద్దార్ద కాంబినేషన్ లో రూపొందనున్న ఓ మై ప్రెండ్ చిత్రం లో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హన్సికను కూడా ఈ చిత్రంలోకి మరో హీరోయిన్ గా తీసుకున్నారు. అతి త్వరలోనే సెట్స్ కు వెళ్లే ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే దర్సకుడు డైరక్ట్ చేస్తున్నాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది.

రాజమౌళి ఈగ తమిళ వర్సన్ రైట్స్ ఎంతంటే..?

SS Rajamouliతెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కు చిరునామా రాజమౌళి. తను తీసినటువంటి ప్రతి సినిమాలలోను ఓ వైవిద్యమైన కొణాన్ని వెతుకుతుంటారు యస్ యస్ రాజమౌళి. రాజమౌళి ప్రస్తుతం ఈగ అనే సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇక ఈగ సినిమాకి సంబంధించినటువంటి రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి రామానాయుడు స్టూడియోలో వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సెట్‌లో తీయనున్నారు.

ఈగ సినిమా కోసం మొట్టమొదటసారి హాలీవుడ్ కమెరామెన్ జేమ్స్ ఫోల్డ్స్ అనే అతనిని టాలీవుడ్‌కి పరిచయం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా భారీ క్రేన్ తీసుకురావడం జరిగిందన్నారు. రజనీకాంత్ నటించినటువంటి రోబో సినిమాలో ఇలాంటి క్రేన్‌నే వాడడం జరిగింది. ఇక ఈగ సినిమా విషయానికి వస్తే నాని, సమంత, కన్నడ హీరో సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. సురేష్ బాబు ఈసినిమాని సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే యమ్ యమ్ కీరవాణి. ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు. ఇది ఇలాఉంటే ఈసినిమా తమిళ వర్సన్ రైట్స్ దాదాపు 5 కోట్లు పలికాయని సమాచారం

చంద్రబాబు వెంట ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంత మంది?

Chandrababu Naiduహైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు ఎంత మంది పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వెంట ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తన వెంట చాలా మంది శాసనసభ్యులున్నారని పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. సభకు ఈ రోజు ఎంత మంది వచ్చారో చూడండి, వారంతా తన వెంటే ఉంటారని ఆయన అన్నారు. దీంతో చంద్రబాబు వెంట పార్టీ తెలంగాణ శాసనసభ్యులందరూ లేరా అనే ప్రశ్న ముందుకు వచ్చింది. సోమవారం శాసనసభకు దాదాపు 20 మంది శాసనసభ్యులు హాజరు కాలేదు. తెలంగాణపై స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడాన్ని వ్యతిరేకించిన తెలంగాణ శాసనసభ్యులు సగానికి తక్కువగా ఉంటారనేది స్పష్టంగానే తెలిసిపోయింది.

రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకవీరయ్య, మండవ వెంకటేశ్వర రావు వంటి శాసనసభ్యులు పూర్తిగా చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సభకు రాలేదు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు పలికారు. సముద్రాల వేణుగోపాలాచారి సభ ఆవరణలో తిరిగారు గానీ సమావేశానికి హాజరు కాలేదు. సత్యవతీ రాథోడ్, హరీశ్వర్ రెడ్డి, పి. మహేందర్ రెడ్డి, జోగి రామన్న తదితరులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే, వీరంతా చంద్రబాబును వ్యతిరేకిస్తారా, లేదా అనేది తెలియదు.

తెలంగాణ అంశంపై, నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తెలంగాణ శాసనసభ్యులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కూడా సగానికి పైగా హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 38 మంది ఉన్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరింత శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి బాట పట్టకుండా, పార్టీ క్యాడర్ నాగం జనార్దన్ రెడ్డి వెంట వెళ్లకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది.

Karuna talks tough; Cong working out numbers

M KarunanidhiChennai, Mar 7: The DMK is playing hard-to-please and is keeping the government waiting with baited breath. After news of the flip-flop between DMK leaders who are in New Delhi negotiating and re-negotiating, they have still not been able to make a headway to break the deadlock.

Finance Minister Pranab Mukherjee after holding talks through telephone with DMK Chief M Karunanidhi today (Mar 7) expressed hope that the relationship issues would be ironed out soon. A DMK source have revealed, “Pranab spoke to the CM for more than half an hour and we have decided to resume talks.”



DMK's Parliamentary Party leader TR Baalu who has been spearheading the talks with bigwigs in Tamil Nadu and Centre initiated the talk between Pranab and Karunanidhi and has sought some more time to set things right. Karunanidhi has however given the UPA some breathing space by saying that the Minister's resignations has been put on hold and that nothing more than the 60 allotted seats can be conceded.

The DMK Chief has also conveyed in no-less terms that the Congress would not get all the constituencies identified by them. There was major haggling for seats and the DMK does not want to loose its upper hand in the state. After talks were on for 90 seats for the Congress, that later fell to 63. The DMK however reiterated that they are in no position to offer more than 60 seats. The DMK has assigned Union minister for textiles Dayanidhi Maran to carry on the talks for the DMK in the Centre.

The final round of talks between DMK leaders and the Prime Minister is expected to be held at 6:30pm today.

OneIndia News

ముమైత్ మీద కన్నేసిన స్టార్ హీరో

Bollywood Superstar Wants to Cast Mumaith in his Film !

బాల జేజెమ్మ తో బూతు సినిమా


B grade movie with young Arundhati