BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, March 11, 2011

గెస్ట్ హౌస్‌లో సీక్రెట్‌గా ‌ కలుసుకొంటున్న ఇద్దరు స్టార్స్..!


 Siddharth Mallya-Deepika Padukone
దీపికా పదుకొనే సిద్దార్థ మాల్యాల మధ్య ఎఫైర్ గురించి తెలయనిదెవరికి? ఈ విషయం ఇంగ్లాండ్ క్రికెటర్ కెవన్ పీటర్ సన్‌కి తెలిసిపోయింది. ఏకంగా పీటర్ సన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా, దీపికా సిద్దార్థల ఎఫైర్ గురించి రాసేసరికి, దీపిక ఒక్కసారిగా సిగ్గుతో తెగ ఇబ్బంది పడిపోయిందట. ఇంకా ఈ ఎఫైర్ ని ఓపెన్‌గా కొనసాగించడం మంచిదికాదని డిసైడ్ అయిన దీపిక, పబ్లిక్‌గా సిద్దార్థని కలవడం మానేసిందని బాలీవుడ్ లో గుసగుసలు విన్సిస్తున్నాయి.

గత వారం పది రోజులుగా మీడియాకి సిద్దార్థ దీపిక జంటగా ఎక్కడా దొరక్కపోవడం గమనార్హం. అయితే చాటుమాటుగా ఇద్దరూ కలుసుకుంటున్నారనీ, ప్రేమలో మునిగి తేలిసోతున్నారనీ, సిద్దార్థ స్నేహితుడికి చెందిన పబ్‌లో ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారనేది బాలీవుడ్ లో తాజాగా విన్సిస్తోన్న గాసిప్. ముంబై శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లోనూ, బెంగళూరులో ఓ గెస్ట్ హౌస్ లోనూ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటున్నారట కూడా మీడియాకి భయపడిందో ఏమోగానీ, దీపిక ఇలా చాటుమాటుగా కలుస్తున్న వ్యవహారం ఎక్కడి వరకూ దారితీస్తుందో వేచి చూడాల్సిందే

పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో అమితాబ్ చిత్రం..పూరీ జగన్నాధ్

 Amitabh Bachchan

అమితాబ్ బచ్చన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘బుడ్డా’హోగా తేరా బాప్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ముంబాయిలోని వేర్‌సోవా ఖోజా బంగ్లాలో ప్రారంభమైంది.పూరీజగన్నాథ్ ముహూర్తపు సన్నివేశాన్ని సోనూసూద్‌పై చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీజగన్నాథ్ మాట్లాడుతూ- అమితాబ్‌కు నేను చిన్నప్పటి నుంచి అభిమానిని.అటువంటి గొప్ప వ్యక్తితో ఇలాంటి సెనే్సషనల్ మూవీ చేయడం సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్ మార్చి 11 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు.సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదలవుతుంది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్టోరీ ఎక్స్‌లెంట్‌గా ఉంటూ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మంచి కమర్షియల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఈ చిత్రంలో హేమమాలిని, రవీనాటాండన్, సోనాల్ చౌహాన్, చార్మీ, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, షేవర్ అలి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమోల్‌రాథోడ్, సంగీతం: విశాల్ శేఖర్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాణం: ఎబి కార్పొరేషన్ అండ్ వయాకామ్ 18, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీజగన్నాథ్.

సాక్షిశివానంద్‌ ఇప్పుడు 'రాజాగాడి పెళ్ళాం' అయ్యింది


 Sakshi Sivanand

తెలుగులో ఆ మధ్య వరసగా పెద్ద హీరోల సినిమాలు చేసి హఠాత్తుగా ఫేడవుట్ అయిన స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్. త్వరలో ఆమె 'రాజాగాడి పెళ్ళాం'గా అలరించటానికి సిద్దమవుతోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన చిత్రం 'నానునేనే 'తెలుగులో 'రాజాగాడి పెళ్ళాం' టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది.ఇందులో ఉపేంద్ర సరసన సాక్షిశివానంద్‌, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.కర్నాటకలో ఈ చిత్రం నూట యాభై రోజులకు పైగా ప్రదర్శింపబడింది.ఇందులో ఉపేంద్ర టాక్సీడ్రైవర్‌గా పక్కా మాస్‌పాత్రని పోషించారు. శ్రీభవాని ఆర్ట్స్‌ సంస్థ పతాకంపై ఎమ్‌.విజయ్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విశేషాలు చెబుతూ 'తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా విశేషంగా పొందిన ఉపేంద్ర ఇందులో టాక్సీడ్రైవర్‌గా నటించారు. సాక్షిశివానంద్‌ హీరోయిన్ గా నటించగా, ఒక కీలక పాత్రని రమ్యకృష్ణ పోషించింది. ఇందులో ఐదు పాటలున్నాయి.లండన్‌, మలేషియా, కులుమనాలి తదితరల లొకేషన్స్‌లో షూటింగ్‌ చేసినట్టు తెలిపారు.పవిత్ర, కోవైసరళ, శివపార్వతి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం మాటలు, పాటలు:భారతీబాబు, సంగీతం:దేవా, ఫైట్స్‌ విజయన్‌, సమర్పణ:జి.తిరుపాల్‌రెడ్డి, నిర్మాత :ఎమ్‌.విజయకుమార్‌రెడ్డి, దర్శకత్వం ..రాజేంద్రబాబు.

హీరోలను ఉద్దేశించి జెనీలియా స్ట్రైయిట్ కామెంట్స్


 Genelia
సినీ పరిశ్రమలో హీరోల బాగా ఆధిపత్యం ఎక్కువ.వారికి అనుకూలంగా ఇక్కడ అన్ని శాఖలూ నడుస్తాయి.హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు గానీ, హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు, సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి అంటూ డైరక్ట్ గా కామెంట్ చేసింది జెనీలియా.ప్రస్తుతం జెనీలియాను తెలుగులో ఏ హీరోకూడా తమ ప్రక్కన చేయటానికి రికమెండ్ చెయ్యటం లేదు.అలాగే ఆసక్తి చూపటం లేదు. అందులోనూ ఆమె నటించిన రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఆ వైఫల్యం వివరిస్తూ..అందులో ఆమె పాత్ర కూడా ఉందని నాగబాబు డైరక్ట్ గా స్టేజిపై చెప్పినప్పుటి నుంచి ఆమెకు తెలుగులో ఆఫర్స్ రావటం లేదు.అందులోనూ ఆమెకు గ్లామర్ రోల్స్ ఇవ్వటానకి దర్శకులు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు.బబ్లీ,బబ్లీగా ఉండే పాత్రలకు కొత్త అమ్మాయిలనే ఎంపికచేసుకుంటున్నారు.వారైతే వీలైన మేరకు ఎక్సపోజింగ్ చేయటమే కాక పేమెంట్ విషయంలోనూ చాలా తక్కువకి చేయించుకోవచ్చనేది తెలుగు దర్శక,నిర్మాతల ఆలోచన.దానికి తగినట్లే హీరోలు కూడా ఎప్పుడూ తమ ప్రక్కన ప్రెష్ గా ఉండే పేస్ లనే ఎంపికచేసుకోవటానకి ఇష్టపడుతున్నారు.దాంతో ఆమె ఇలా డైరక్ట్ గా బయిటపడింది.

అల్లు అర్జున్ బద్రీనాథ్ 'మగధీర' కాన్సెప్టేనట...!?



 Allu Arjun
‘బద్రినాథ్’ సినిమా ఎలా ఉంటుంది? ఈ సినిమా కథ ఏంటి?ఈ విషయాలపై కొద్దికొద్దిగా సస్పెన్స్ వీడుతోంది. ఇది కూడా బన్నీ, రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలనే వుండేలా ప్లాన్ చేసుకున్నాడట. చిన్నా చితకా మార్పులు మినహా, పక్కాగా ‘మగధీర’ సినిమా కాన్సెప్ట్ నే ‘బద్రీనాథ్’ సినిమాలో బోల్డన్ని వున్నాయనీ, వందమందితో ఫైటింగ్ ఎపిసోడో ‘మగధీర’ సినిమాలో ఎంత సక్సెస్ అయ్యిందో, అచ్చం అలాంటిదే కాకపోయినా, కొంచెం అటు ఇటూగా ఆ షెడ్స్ వున్న బీభత్సమైన ఎపిసోడో..అదీ పన్నెండు నిమిషాలపాటు ‘బద్రీనాథ్’లో వుందనీ సమాచారం. వినాయక్ డైరెక్టర్ కావడంతో సినిమా భారీగా వుండబోతోందనీ, ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ లో బీభత్సమే చేసేశాడనీ తెలుస్తోంది. మరి, బన్నీ ‘మగధీర’ను తలపించేలా ‘బద్రీనాథ్’ సినిమాతో హిట్టు కొడ్తాడా?లేక బావని చూసి వాతలెట్టుకున్నట్టు మిగిలిపోతాడా వేచి చూడాల్సిందే.

బన్నీని సరికొత్తగా చూపించనున్న జూ ఎన్టీఆర్ 'శక్తి' డైరెక్టర్..!?

 Meher Ramesh-Allu Arjun
ప్రస్తుతం 'బద్రీనాథ్' సినిమాను పూర్తి చేస్తున్న కొత్త పెళ్ళికొడుకు అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాల ప్లానింగ్ ను చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఇటీవలే అంగీకరించిన బన్నీ, తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెహర్ 'శక్తి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నాడు.

హీరోలను ఓ కొత్త స్టయిల్ లో చూపిస్తాడనే పేరు సంపాదించుకున్న మెహర్ కూడా బన్నీతో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పుడీ కాంబినేషన్ ను ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఏమైనా, వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రం మాత్రం రానుంది!.

వార్నర్ బ్రదర్స్ సినిమాలు ఇక ఫేస్‌బుక్‌‌లో...

The Darknight




హాలీవుడ్‌లో పేరుగాంచినటువంటి ఫిల్మ్, టెలివిజన్ ఎంటర్‌టైన్మెంట్ సంస్ధ అయినటువంటి వార్నర్ బ్రదర్స్ ఓ సరిక్రొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంటి వార్నర్ బ్రదర్స్‌కు సంబంధించినటువంటి కొన్ని సినిమాలు ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్‌లో రానున్నాయి. నాకు తెలిసి ఓ హాలీవుడ్ స్టూడియో ఓ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌తో కలసి పనిచేయడం ప్రధమం. ఫేస్‌బుక్‌ ఎకౌంట్స్ ఉన్నటువంటి వారందరూ ఈసదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇది వార్నర్ బ్రదర్స్ స్టూడియోకి డబ్బులు వచ్చే మంచి పని అని దీనిని ప్రోత్సహించడం జరిగిందన్నారు.


ఈ ప్రక్రియ గనుక సక్సెస్‌పుల్ అయినట్లైతే దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా విస్తరిస్తామని అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరికైతే 30 ఫేస్‌బుక్ క్రెడిట్స్ ఉన్నవారికి సినిమాకి గాను మూడు డాలర్స్ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. సినిమాని 48 గంటల పాటు చూడడానికి వీలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మొట్టమొదటగా పెట్టినటువంటి సినిమా 2008వ సంవత్సరంలో విడుదలైనటువంటి బ్లాక్ బాస్టర్ సినిమా బ్యాట్ మ్యాన్: ద డార్క్ నైట్. తర్వాత వరుసగా సినిమాలు ఫేస్‌బుక్‌లో పెట్టడం జరుగుతుందని బిబిసికి ఇచ్చిన ఇంటర్యూలో వార్నర్ బ్రదర్స్ తెలియజేశారు.

ఈ సందర్బంలో వార్నర్ బ్రదర్స్ మాట్లాడుతూ మేము ఫేస్‌బుక్‌ని ఎంచుకోవడానికి కారణం ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఫేస్‌బుక్ డైలీ డెస్టినేషన్ అవుతుంది కాబట్టి అని అన్నారు. ఫేస్‌బుక్ మా సినిమాలు ఉంచడానికి కారణం వార్నర్ బ్రదర్స్ సినిమాలు చూడాలనుకునే కస్టమర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మూవీ ప్రేక్షకులకు ఓ కొత్తతనాన్ని అందివ్వడానికి కూడా ఓ కొత్త ప్రయత్నంగా చేస్తున్నామన్నారు. ఫేస్‌బుక్‌లో వార్నర్ బ్రదర్స్ సినిమాలు చూడడం చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయని అన్నారు.

చిరంజీవి, చంద్రబాబు మొసలి కన్నీరు: ఉద్యోగ జెఏసి

Chandrababu Naidu - Chiranjeevi



న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యోగులను మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా కుట్రలో భాగంగా తమను ఢిల్లీకి తీసుకు వచ్చారని తెలంగాణ ఉద్యోగు ఐక్య కార్యాచరణ సమితి నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీపైన మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా తమను ఢిల్లీకి పంపిందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలతో అపాయింట్‌మెంట్ ఖరారు కాకుండానే తమను ఢిల్లీకి రప్పించడం విచారకరమన్నారు. కాగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాల్ని పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

మిలియన్ మార్చ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాల తెలంగాణ ప్రజలు సహకరించారని, అయితే ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఆ ప్రశాంతతను చెడగొట్టారన్నారు. బలవంతపు అరెస్టుల పేరు చెప్పి మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా చాలా మందిని అడ్డుకున్నారన్నారు. సహాయ నిరాకరణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి బలి కాలేదని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు చెప్పారు. విగ్రహాల విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఆరువందలకు పైగా విద్యార్థులు మరణించినప్పుడు వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ప్రస్తుత సమాజంలో సాప్ట్‌వేర్ జీవితాలు ఎందుకు నిస్సారం అవుతున్నాయి..?

Software People



పెళ్శైన కొత్తలో భార్య భర్తల మద్య ఉండేటటువంటి ప్రేమ చెప్పలేనిది. ఒకరి కంట్లో నలక పడితే, మరోకరి కళ్శల్లో నీళ్శు తిరగడం. కూరలో కోంచెం కారం ఎక్కువయినా నా మీద ప్రేమ చూపిస్తే చాలు అనుకునే భార్త. అనుకోని సర్దుబాట్లు, వారానికో సినిమా.. రెస్టారెంట్ భోజనం ఇలాంటివి అన్ని పెళ్శైన కొత్తలో చోటుచేసుకునే సంఘటనలు. ఆ తర్వాత కాలంలో నిదానంగా అవి తగ్గుముఖం పడతాయి. గోడవలు ప్రారంభం అవుతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భార్యభర్తలు ఏమి చేయ్యాలి.


పెళ్శైన కోత్తంలో ప్రతి జంట ఉత్సాహాంతో ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలం గడచే కొద్ది బందం పాతబడుతుంది. కొత్తలో ఉన్నంత ఉత్సాహాం కూడా మసకబారుతుంది. ఆఫీసు, ఇల్లు, వంట, భోజనం ఎప్పుడన్నా బయటకు వెళ్శడం, పిల్లలు, స్కూళ్శు అన్ని యాంత్రింకంగా జీవితంలో జరిగిపోతుంటాయి. ఈ సమయంలో బంధం కంటే కూడా భాద్యత ముందు నిలుస్తుంది. ఇలాంటి సమయాలలోనే మన జీవితాలలో ప్రేమను గనుక నింపుకోపోయినట్లైతే జీవితాలు నిస్సారంగా తయారవుతాయి. దానికోసం మన వంతు మనం ఏమి చేయాలో చూద్దాం.

భార్య భర్తల ప్రవర్తనలో ఇరు పక్షాల వారికి నచ్చినవి, నచ్చనవి ఉండోచ్చు. కొత్తలో వీటిని అంగీకరించి, తర్వాత తీరిగ్గా వాటి గురించి తన ప్రవర్తనలో మార్చుకోవడానికి ప్రయత్నించరు అని భార్య భర్తలు భాదపడడంలో అర్దం ఉండదు. భార్య భర్తలు ఇద్దరిలో ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలను ఎప్పటికప్పుడు చర్చించుకోని పరిష్కరించుకోవాలి. ఇది మాత్రమే కాకుండా భార్య ఒక ముఖ్య విషయం మాట్లాడుతున్నప్పుడు భర్త తన ల్యాప్ టాప్‌ మీద పని చేసుకోవడం, పేపరు చదవడం లాంటివి చేస్తుంటే సహాజంగా ఆడవారి మనసు నోచ్చుకుంటుంది.

ఆసయమంలో ఈయనెప్పుడూ ఇంతే అని అతనితో మాట్లాడకుండా ఉండడం పరిష్కారం కానే కాదు. నువ్వు ఇలా చేస్తుంటే నన్ను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా భార్య భర్తలు ఇద్దరూ వారి మనోభావాలను పరస్పరం పంచుకోవడం సంసారంలో చాలా ముఖ్యం. ఇంకోక ముఖ్య విషయం ఏమిటంటే మీరు మీభార్యతో గానీ, భర్తతోగానీ మాట్లాడేటప్పుడు అది గోడవకు దారితీయకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక వేళ అలాంటిది ఏమైనా జరిగినా వెంటనే భార్యను బుజ్జగించో, బ్రతిమాలో మన దారికి తెచ్చుకోవాలి.

ఇది మాత్రమే కాకుండా గోడవ మొదలవుతుందేమో అని అనుమానం వస్తే ఏదో ఒక జోక్‌తో వాతావరణాన్ని కూల్ చేయాలి. మాట్లాడుతున్న అంశానికి సంబంధం లేని మరో విషయాన్ని ఎత్తుకోవడం, కోంత సేపు మౌనంగా ఉండడం ఇలాంటివి పాటిస్తే ఇబ్బంది ఉండదు. మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ గురించే అన్నది మరచిపోకూడదు. ఇంకోక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. మాట్లాడాడేటప్పుడు భార్యను తక్కవ చేసి మాట్లాడడం, మద్యలో నువ్వు, నేను లాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది.

పెళ్శి అనే బంధం ద్వారా ఇద్దరి మద్య ఏర్పడే జీవిత కాల అనుబందమే భార్య భర్తలు. కాబట్టి మనల్ని నమ్ముకోని వచ్చినటువంటి వారికి మనం అన్యాయం చేయకూడదనే భావన మనం గుర్తుపెట్టుకోవాలి. నమ్మకం, ఇష్టా ఇష్టాలు, ప్రేమ మాత్రమే మన జీవితాన్ని ఆనంద డోలికల్లో తేలియాడడానికి ఉపయోగపడతాయి. దీనిని బట్టి మీ జీవితాయి మీ చేతుల్లోనే ఉన్నాయి. వాటిని సక్రమమైన మార్గంలో ఉంచుకోవాల్సిన భాద్యత కూడా మనదే. అంతేకాని కోపాలకు పోయి విడాకులు తీసుకుంటున్న సాప్ట్‌వేర్ జీవితాలు మరోసారి ఆలోచించాలి.

భూమికి చేరువవుతున్న సూపర్ మూన్.. అందుకే జపాన్ సునామీ?


హీరో తో ఎఫైర్ పెట్టుకుంటున్న డైరెక్టర్ భార్య

Hot Divorcee Actress Fresh Affair with Hero !

మసాజ్ యాడ్స్ కి పనికొస్తున్న త్రిష


Trisha advertising for massage centers

బావ అడుగు జాడల్లోనే బన్నీ


Allu Arjun following Ram Charan

పది కోట్లు ఇస్తే ఒకే ......!

Hot actress takes 10 crores to go bald head