అలాగే, ప్రభాస్ తో 'ఛత్రపతి' తర్వాత చేస్తున్న సినిమా ఇది. కథ ఇంకా పక్కాగా తయారవ్వలేదు. అయితే, ఓ లైన్ అనుకున్నాను. ఫుల్ ఫ్యాంటసీ సినిమా అవుతుంది. ఆ విధంగా నా కోరిక తీరుస్తుంది. సెప్టెంబర్ లో సెట్స్ కి వెళతాం. మొత్తం పూర్తవడానికి ఓ ఏడాది పడుతుంది. బడ్జెట్ పరంగా చాలా పెద్దది. 'మగధీర' కంటే ఎక్కువ అవుతుంది. అందుకే, తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వుంటాయి. వినోదాన్ని కోరుకునే వారికి విందు భోజనం లాంటి సినిమా అవుతుంది’ అన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ, ’మా నాన్న గారికి రాఘవేంద్ర రావు గారు మంచి మిత్రులు.
అలాగే పెదనాన్నకు కూడా! ఆయనకు 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి పెద్ద హిట్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి అనుకుంటున్నాం, ఈ సినిమా చేయాలని. ఇప్పటికి కుదిరింది. ఇలాంటి సినిమా మళ్లీ నా కెరీర్ లో వస్తుందో, రాదో తెలియదు. అంతటి స్పాన్ వున్న సినిమా ఇది’ అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, ఎడిటర్ రవీందర్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.