BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, May 14, 2011

మాజీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గర్బవతి

Shilpa Shettyపారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుని సెటిల్ అయిపోయిన శిల్పాశెట్టి తన కుటుంబంలోకి మరో మెంబర్ ని ఆహ్వానిస్తోంది. ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చారు. ఈ విషయమై ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆమె గతంలోనే ..నేను చాలా డెస్పరేట్ గా ఫ్యామిలీని ప్రారంభించాలని అనుకుంటున్నాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో రెడీ మేడ్ నర్శరీ కూడా ఉంది. మినిమం నాకు ఇద్దరు పిల్లలైనా నాకు కావాలి. అలాగే ఇప్పటికే ఓ చైల్డ్ బెడ్ రూమ్ ని మా ఇంట్లో ఏర్పాటు చేసాం. నా పిల్లలు ఆ గదిలోకి ఎప్పుడు పరుగెడతారో చూడాలని ఉంది అంది. అయితే ఆమె గర్భవతి అన్న విషయాన్ని ఆమె మీడియాకి తెలపటానికి ఇష్టపడలేదు. ఇది తన ప్యామిలీకి చెందిన పర్శనల్ వ్యవహారం అంది. ఆమె సన్నిహితులు ద్వారా ఈ విషయం బయిటకు వచ్చింది. ఇక రాజ్ కుంద్రాకి గతంలో మొదటి భార్య ద్వారా ఓ పాప ఉంది.

బిజినెస్ మేన్ మహేష్ తో నటించడానికి భయపడుతున్న కాజల్...?

Kajalమహేష్ బాబు ‘అతిథి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఖలేజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మళ్ళీ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంటున్నాడు ‘దూకుడు’ సినిమా రిలీజ్ కోసం. ‘దూకుడు’ సినిమా నాన్చుడు వ్యవహారంతో నలిగిపోతోందంటూ ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో గాసిప్స్ విన్పిస్తోన్న సంగతి తెల్సిందే, ఇక ‘దూకుడు’ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా కాజల్ పేరు విన్పిస్తోంది.

కాజల్ కోసం ట్రై చేస్తున్నానంటూ పూరి జగన్నాథ్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడుగానీ, కాజల్ మాత్రం మహేష్ తో నటించేందుకు అయోమయంలో పడిందట. అందుకు బలమైన కారణం ‘ఖలేజా’ సినిమాలో నటించినందుకు అనుష్క ఆ తర్వాత ఎంత బాధపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దూకుడు’ సినిమాకి ఒప్పుకున్నందుకు సమంత తెగ ఫీలైందట. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు కెరీర్ స్పాన్ తక్కువ కావడంతో, తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసుకుంటూ పోతారు. అలాంటిది మహేష్ ని నమ్ముకుంటే విలువైన సమయం వృదా అయిపోతుందన్నది అతనితో పనిచేసిన హీరోయిన్ల బాధ. ఆ బాధ తాను ముందు ముందు పడకూడదనే, మహేష్ తో నటించాలా వద్దా అనే ఆలోచనలో పడిందని సమాచారం.

హనీమూన్ కోసం మారిషెస్ వెళ్ళిన జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి

Jr Ntr-Lakshmi Pranathiయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5న నభూతో... నభవిష్యత్ అన్న రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు నూతన దంపతులు. అటుఫై వివాహపు తోలి రోజులను ఆహ్లాదంగా గడపటానికి ఈ కొత్త జంట మారిషస్ ఎగిరిపోయినట్టు సమాచారం.

లెక్కలేనన్ని బీచ్ లతో, పచ్చని కొండలు, అడవులతో అందంగా ఉండే ద్వీపం మారిషెస్. ఈ సమయంలో అక్కడ కొద్దిగా ఎండతో, అప్పుడప్పుడు చిరుజల్లులతో, 24 డిగ్రీల మినిమం టెంపరేచర్ తో గమ్మతైన శీతాకాల వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హనీమూన్లకు ఈ సమయం అనువైనదిగా చెబుతారు. బీచ్ లకు పెట్టింది పేరు అయిన మారిషెస్ లో బ్లూబే బీచ్, పెరేయ్బెరే బీచ్, లా ప్రేనేఉసే బీచ్ వంటి తదితర బీచ్ లు కేవలం పర్యటకులనే కాకుండా షూటింగుల కోసం సినిమా వాళ్ళను కూడా అమితంగా ఆకర్షిస్తాయి.

సాదారణంగా వేడిని, చెమటను అసహ్యించుకునే ఎన్టీఆర్ చలి ప్రదేశాలను, చల్లని వాతావరణాన్ని ఇష్టపడతాడు. సరిగ్గా ఇప్పుడు మారిషస్ అతని మూడ్ కు తగ్గట్టు గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని తన హనీ మూన్ కోసం ఎంచుకుని ఉంటాడు అని ఊహించవచ్చు. పది రోజుల ఈ ట్రిప్ ముగిసిన తరవాత ఎన్టీఆర్ షూటింగులకు హాజరుకానున్నాడు.

ఆరు వసంతాలు పూర్తి చేసుకోని ఏడవ వసంతంలోకి అడుగు పెట్టిన జీ తెలుగు

ZEE Telugu
తెలుగులో ప్రారంభమైన తోలి కుకరీ షోగా ఖ్యాతిగాంచింది జీ తెలుగు మీ ఇంటి వంట. జీ తెలుగు ప్రారంభమైన నాటి నుండి కొనసాగుతున్న ఈ వినోదాల వంటల కార్యక్రమం ఇప్పటికీ 2000పైగా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.

ఉదయాన్నే ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావాన్ని అందించాలన్న ఆలోచనతో పుట్టిన భక్తి సమాచారం కార్యక్రమం నిర్విరామంగా కోనసాగుతూ 2000పైగా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇలా విజ్ఞానం, గోపురం గడసరి అత్త సోగసరి కోడలు కార్యక్రమాలు మహిళా ప్రేక్షకుల మన్ననలతో సాగుతున్నాయి. సామాజిక భాద్యతతో మేం నిర్వహిస్తున్న బతుకు జట్కాబండి కార్యక్రమం ఇప్పటికీ దాదాపు వంద కుటుంబాలను కలిపింది.

ఇక జీ తెలుగు విజయ ప్రస్దానంలో మరో మైలురాయి. జీ సీరియల్స్. మహిళా ప్రేక్షకుల మనోభావాలకు అద్దం పడుతూ, సున్నితమై కధా, కధనాలతో ప్రేక్షకుల ఆతరాభిమానులు పోందుతున్నాయి. జీ సీరియల్స్ రాధికా మాధవుల ప్రణయగాధ, చిన్న కోడలు, చిట్టి తల్లి, సావిత్రి హృదయ వేదన పసుపు కుంకుమ చిన్నారి రాధతో విధి చెలగాటం, రాధా కళ్యాణం...ఈ మూడు సీరియల్స్ జీ తెలుగు మహిళా ప్రేక్షకుల చేరువ చేశాయి అనడంలో సందేహాం లేదు.

త్వరలో తాత కాబోతున్నకలెక్షన్ కింగ్ మోహన్ బాబు..!

Mohan Babu-Vishnuvardhan Babu-Veronicaకలక్షన్ కింగ్ మోహన్ బాబు తాత కాబోతున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణువర్థన్ బాబు గత రెండు సంవత్సరాల క్రిత్రం విరోనికాను వివాహం చేసుకొన్నాడు. విష్ణు భార్య విరోనికా ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం విరోనికా యుఎస్ లో తన తల్లి దగ్గర ఉంది. విష్ణు కూడా భార్యతో అక్కడ ఉండి ఇటీవలే ఇండియా వచ్చాడు. విష్ణు, విరోనికా తమ తొలి సంతానం కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల విరోనికా ఇండియా రానుంది. తను తాత అవ్వనుండటం వల్ల మోహన్ బాబు కూడా చాలా ఆనందంగా ఉన్నారట. విష్ణు విరోనికాలకు ‘దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

100% లవ్ డైరెక్టర్ కి మహేష్ ఛాన్స్ ఇస్తాడా..!?

Mahesh Babu100% లవ్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ‘ఆర్య’ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. మహేష్ కోసం సుకుమార్ ఇప్పటికే కథ కూడా సిద్దం చేశాడు. అయితే ఇంతదాకా మహేష్ కి ఆ కథ వినిపించలేదట. త్వరలోనే ప్రిన్స్ ని కలిసి కథ వినిపిస్తానని, అతను తప్పకుండా అంగీకరిస్తాడని సుకుమార్ నమ్మకంగా ఉన్నాడు.

ఒక వేళ మహేష్ అంగీకరించినట్టయితే ఈ చిత్రం 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం దూకుడు సినిమాని నిర్మిస్తున్నది కూడా వీరే. సుకుమార్ కి ఆల్రెడి ఈ సంస్థ అడ్వాన్స్ కూడా చెల్లించేసింది. నిజానికి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చిత్రం చాలా కాలంగా డిస్కషన్స్ లో ఉంది. గతంలో మహేష్ ని కలిసి సుకుమార్ చర్చలు కూడా జరిపాడు. ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఇప్పుడు వర్కవుట్ అవనుందన్నమాట. ఒక వేళ మహేష్ అంగీకారం కనుక లభిస్తే సుకుమార్ ప్రతిభకి ఈ చిత్రం అసలైన పరీక్ష పెడుతుంది. ఇంతదాకా స్టార్స్ తో సినిమాలు రూపొందించని సుకుమార్ ఒక పెద్ద స్టార్ ని ఎలా హ్యాండిల్ చేయగలడనేది ఆసక్తి రేకెత్తిస్తుంది.

సొంతగడ్డపై దక్కన్ ఛార్జర్స్ చేతిలో సచిన్ సేన ఘోర పరాజయం

Deccan Chargersముంబై: పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్ ఆవకాశాలను చేజార్చుకున్న డెక్కన్ చార్జర్స్‌కు కాస్త ఊరట కలిగించే విషయం. సొంతగడ్డపై ఓటములతో కుదేలైన సంగక్కర బృందానికి ముంబైలో విజయం దక్కింది. మాస్టర్ సేనతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చార్జర్స్ 10 పరుగుల తేడాతో ఇండియన్స్‌పై నెగ్గారు. మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. తొలుత ముంబై పేసర్ కులకర్ణి ధాటికి సంగక్కర సేన నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు చేసింది. ఛేదించాల్సింది స్వల్ప లక్ష్యమే అయినా ముంబై కూడా డెక్కన్ బాటలోనే నడిచింది. ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. చివర్లో పొలార్డ్ 24, హర్భజన్ 17 పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్ర మే చేసి ఓటమిపాలైంది.స్వల్ప లక్ష్యఛేదనకు బరిలో దిగిన ముంబైని ఇషాంత్ దెబ్బతీశాడు. ఫామ్‌లో ఉన్న రాయుడు, రోహిత్లను 7పరుగుల తేడాతో వెనక్కిపంపాడు. అంతకుముందు ఓపెనర్ బ్లిజార్డ్వికెట్ డుమినీ ఖాతాలో చేరింది. సచిన్, సైమండ్స్‌లు నాల్గో వికెట్‌కు 29 రన్స్ జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా మిశ్రా బంతికి సైమో అవుటవడంతో ముంబై కష్టాల్లో పడింది. ఆ జట్టు ఇబ్బందులను రెట్టింపు చేస్తూ కొత్త కుర్రాడు రాజన్ ఒకే ఓవర్లో సుమన్ 14, సచిన్ 37లను పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 16 ఓవర్లలో ఆరు వికెట్లకు 83. ఇక 24 బంతుల్లో 53 రన్స్ చేయాల్సి ఉండగా, పొలార్డ్, భజ్జీలు సిక్స్‌లు, ఫోర్ల మోత మోగించినా పొలార్డ్ నిష్క్రమించిన అనంతరం ముంబై ఓటమి ఖాయమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డెక్కన్ టాపార్డర్ పరుగులు సాధించడం ఇష్టంలేదన్నట్టుగా క్రీజులో కదిలింది. ఈ అంచెలో తొలి మ్యాచ్ ఆడుతున్న లంబ్ పరుగులు ఏమీ చేయకుండా రెండో బంతికే అవుట్ కాగా సంగక్కర 27, సోహాల్ 20లు నింపాదిగా ఆడుతూ రెండో వికెట్‌కు 39 రన్స్ జోడించారు. ఈ జోడీ రెండు ఓవర్ల వ్యవధిలో నిష్క్రమించగా, డుమినీ మాత్రం నిరాశపరిచాడు. ఇక ముంబై పేసర్ కులకర్ణి విజృంభణకు చిప్లి 10, క్రిస్టియన్ 18లు బలయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 18.2 ఓవర్లలో 105/6. అయితే మిశ్రా చివర్లో ధాటిగా ఆడటంతో ఛార్జర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మళ్లీ అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

Rajinikanthచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత రాత్రి ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌ను చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కాళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం గత రెండు నెలల కాలంలో ఇది మూడోసారి.

రజనీకాంత్ మరణించినట్లు తమిళనాడులో వార్తలు గుప్పుమన్నాయి. ఆ వదంతులను రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం ఖండించారు. రజనీకాంత్ బాగానే ఉన్నారని, ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె చెప్పారు. వదంతులు నమ్మవద్దని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. రాణా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన తరుచుగా అస్వస్థతకు గురవుతున్నారు.

కాగా, రజనీకాంత్ మరణించినట్లు వదంతులు వ్యాపించడం వెనక డిఎంకె వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ వదంతులను ప్రచారంలో పెట్టారని అంటున్నారు. రజనీకాంత్ అస్వస్థతతో రాణా షూటింగుకు అంతరాయం కలుగుతోంది.