సంస్థ: గీతా ఆర్ట్స్
నటీనటులు: అల్లు అర్జున్, తమన్నా, ప్రకాష్‌రాజ్, కెల్లీ దోర్జ్, అశ్వనీ కల్‌శేఖర్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, గీతాసింగ్, కృష్ణభగవాన్ తదితరులు.
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: వి.వి.వినాయక్
విషయం: మన సంస్కృతికి నిలయమైన దేవాలయాలను కాపాడుకోవాలంటే క్షేత్రపాలకుల వ్యవస్థను పునరుద్ధరించాలనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. భీష్మనారాయణ్ (ప్రకాష్‌రాజ్) ఉత్సాహవంతులైన యువ బృందానికి శిక్షణ ఇచ్చి యోధులుగా తయారుచేస్తారు. ఒక్కొక్కరినీ ఒక్కో పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా నియమిస్తారు. బద్రినాథ్ (అల్లు అర్జున్)కి బద్రినాథ్ క్షేత్రం దక్కుతుంది. ఈ క్షేత్రానికి ఒక రోజు అలకానంద (తమన్నా) వస్తుంది. ఈ యువతికి దేవుడంటే నమ్మకం లేదు. అలక ప్రాణాలకు కొంత మంది నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆమెను కాపాడే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొంటాడు బద్రినాథ్. ఆ తరవాత ఏం జరిగింది? బద్రినాథ్-అలకల మనసులు ఎలా కలిశాయి అనేదే చిత్ర కథ.
విశేషాలు: రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ ''బద్రినాథ్ అంటే ఓ నమ్మకం. ఆ నమ్మకం ఈ సినిమాలో ఎవరి మీద ఎవరికి కలిగింది అనేది ఆసక్తికరం. ఇలాంటి నేపథ్యంలో నడిచే కథ ఇంత వరకూ రాలేదు. వినాయక్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతుంది. అల్లు అర్జున్‌ని కొత్త కోణంలో చూస్తారు. యాక్షన్ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. కీరవాణి సంగీతం ప్రధాన బలం'' అన్నారు