అయితే తాను బిజీగా ఉన్నానని రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. అన్నట్టుగానే పది గంటలకు ఫోన్ చేశాడు. నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. అటునుండి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని భావించాడు. కానీ ఆ తల్లి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని ఉపాధ్యాయుడు నమ్మబలుకుతున్నాడు.
BREAKING NEWS
Friday, August 26, 2011
విద్యార్థి తల్లిపై కన్నేసిన టీచర్, తిరగబడిన కథ
అయితే తాను బిజీగా ఉన్నానని రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. అన్నట్టుగానే పది గంటలకు ఫోన్ చేశాడు. నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. అటునుండి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని భావించాడు. కానీ ఆ తల్లి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని ఉపాధ్యాయుడు నమ్మబలుకుతున్నాడు.
పరిటాల రవి హత్య కేసులో మలుపులుపరిటాల రవి హత్య కేసులో మలుపులు
నక్సలైట్ రాజకీయాల నుంచి వచ్చిన పరిటాల రవి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి పెనుకొండ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆయన ఎన్టీ రామరావు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. పలు సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలున్నాయి. శ్రీరాములయ్య వంటి సినిమాల ద్వారా తెలుగు సినీ రంగంలో కూడా అడుగు పెట్టారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఉన్న పరిటాల రవి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యాడు.
పరిటాల రవి హత్యపై జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, రవి ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరిలపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ క్రమంలో 2005 జనవరి 28వ తేదీన కేసును సిబిఐకి అప్పగించారు. మద్దెలచెర్వు సూరి, షార్ప్ షూటర్ జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను, కాంగ్రెసు నాయకుడు టి. కొండా రెడ్డిలపై ప్రధాన అనుమానితులుగా కేసు దర్యాప్తు ప్రారంభమైంది. సిబిఐ అధికారులు వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్, దివాకర్ రెడ్డిలను ప్రశ్నించారు. అయితే, వారి పేర్లను కేసు నుంచి తొలగించారు.
సిబిఐ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మొద్దు శీను లైవ్ ఇంటర్వ్యూ ఓ టీవీ చానెల్లో వచ్చింది. అది పెద్ద సంచలనంగా మారింది. సూరి బావ కళ్లలో సంతోషం చూడడానికి తాను పరిటాల రవిని హత్య చేసినట్లు అతను చెప్పాడు. కానీ, అతని ఆచూకీ లభించలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేఖమయ్య పోలీసుల ముందు లొంగిపోవడంతో చాలా వరకు కేసు చిక్కు ముడి వీడింది. అతను చెప్పిన వివరాల ఆధారంగా హత్యకు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో ముద్దాయి అయిన మద్దెలచెర్వు సూరి పరిటాల రవి హత్యకు మొద్దు శీనును నియోగించాడనే ఆరోపణలు వచ్చాయి. పరారీలో ఉన్న మొద్దు శీను విచిత్ర పరిస్థితిలో పోలీసులకు చిక్కాడు. హైదరాబాదు శివారులోని ఓ లాడ్జీలో సంభవించిన పేలుడులో గాయపడి ఆస్పత్రి పాలైన మొద్దు శీనును గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మొద్దు శీను జైలులో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత టి. కొండారెడ్డి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు. మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలో మరణించాడు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దేశభక్త విప్లవ పులుల పేరిట పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హల్చల్ చేశాడు. దీంతో అతన్ని, మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కోట్లు ముంచిన విజయకృష్ణ చిట్ఫండ్ చైర్మన్ ఆరెస్టు
కాగా విజయవాడలో వారం రోజుల నాగేశ్వర రావు తన చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. తాము వారం రోజులు ఉండటం లేదని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ ముందు బోర్డు పెట్టి వెళ్లారు. అయితే వారం రోజులు అయినా రాక పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా చిట్ ఫండ్ కంపెనీ ప్రధాన సూచిక పైన కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఖాతాదారులను బురిడీ కొట్టించినట్లుగా తెలుస్తోంది.
నవంబర్ లో ఒక ఇంటిది కాబోతున్న సమీరా...!
నవంబర్ లో గృహ ప్రవేశం చేస్తాను. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా డైరక్షన్ లో 'వేడి', లింగస్వామి డైరక్షన్ లో 'వెట్టయ్' సినిమాలు చేస్తున్నాను. సౌత్ లో మంచి డైరెక్టర్ గౌతమ్ మీనన్, ఇక్కడ నాకు మంచి పేరు రావటానికి కారణం ఆయనే అని చెప్పింది. గౌతమ్ దర్శకత్వంలో చేసిన 'వారనమ్ అయిరమ్' తనకు మంచి పేరు తెచ్చిందని తెలిపింది.
పోల్ ఫలితం: వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తు కుట్రేపోల్ ఫలితం: వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తు కుట్రే
కాంగ్రెసు అధిష్టానం కుట్రలో భాగంగానే తనపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయినప్పటికీ దాన్ని వైయస్ జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ స్థితిలో దట్స్ తెలుగు డాట్ కామ్ జగన్ వాదిస్తున్నట్లుగా సిబిఐ దర్యాప్తు కుట్రలో భాగమా అనే ప్రశ్న ఇచ్చి పోల్ నిర్వహించింది.
అయితే, పోల్కు కొన్ని పరిమితులున్న విషయాన్ని పాఠకులు గమనించాలి. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నావాళ్లు, దాన్ని వాడేవాళ్లు మాత్రమే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వాడకం చాలా తక్కువ కాబట్టి గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యుల అభిప్రాయం ఇందులో ప్రతిఫలించే అవకాశం లేదు.
వైయస్ జగన్ చిట్టా నా వద్ద ఉంది: డిఎల్ రవీంద్రా రెడ్డి
తనను గెలిపించిన ప్రజల కోసం నిస్వార్థంతో సేవ చేస్తున్నానని అందుకే మరోసారి తనను గెలిపించేందుకు తన నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్నా శాసనసభ్యులు రాజీనామా చేయాలని సవాల్ చేయడంపై స్పందిస్తూ ఎవరో దారిన పోయే వాళ్లు రాజీనామా చేయమంటే చేయాలా అని ప్రశ్నించారు. రాజీనామా చేయడానికి ఓ నిర్దిష్ట కారణం ఉండాలన్నారు.
Subscribe to:
Posts (Atom)