హైదరాబాద్: బస్సులో టిక్కెట్లు తీసుకోని వారిపై కాకుండా తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పిన యూపిఏ ప్రభుత్వంపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని సిరిసిల్ల శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కె తారకరామారావు ఆదివారం డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని గత డిసెంబర్ 9న ప్రకటించి ఇప్పుడు మాట తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
తెలంగాణలోని పది జిల్లాల్లో విజయవంతంగా జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చూసి ప్రపంచమే విస్తు పోతోందని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలంటే ప్రభుత్వం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆయన అన్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బతీయకుంటే ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు లేవన్నారు. అధికా పార్టీకి ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు.
No comments:
Post a Comment