మీర్పూర్: ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. నాలుగేళ్ల కింద వెస్ట్ ఇండీస్‌లో జరిగిన పరాభవాన్ని తలదన్నేలా పంతం నెరవేర్చుకుంది. బంగ్లాదేశ్‌పై భారత్ 87 పరుగుల ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ తొలి రోజే భారత్ సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలిసొచ్చింది. ధోనీసేన టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. సెహ్వాగ్ 140 బంతుల్లో 175, కోహ్లీ 83 బంతుల్లో 100 పరుగులతో భారత్‌కు భారీ విజయాన్ని అందించారు. సచిన్ 28, గంభీర్ 39లతో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో భారత్ తొలుత నాలుగు వికెట్లకు 370 పరుగుల సాధించింది. బంగ్లాదేశ్ మొదట బాగా పోరాటం చేసినప్పటికి ఆ తర్వాత తొమ్మిది వికెట్లకు 283 పరుగుల చేసింది. మునాఫ్‌పటేల్ 4/48 తీసుకున్నాడు. సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
కొద్దిలో చేజారిందిగానీ డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మనయ్యేవాడే. అతడి ఎక్కువసేపు క్రీజులో నిలవడం మిగతా బ్యాట్స్‌మెన్ విశ్వాసాన్ని పెంచడంతో పాటు ప్రత్యర్థి నైతిక స్త్థెర్యాన్ని దెబ్బతీసింది. వీరూ ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గనివ్వలేదు. చక్కగా స్త్ట్రెక్ రొటేట్ చేస్తూ.. మధ్య మధ్యలో భారీ షాట్లు బాదాడు. టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగన్నాడు షకిబ్. అతడు బొక్కాబోర్లా పడ్డాడని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. 10 ఓవర్లలోనే స్కోరు 60/0. తొలి బంతినే బ్యాక్‌ఫుట్‌పై కవర్‌లో బౌండరీకి తరలించి ప్రపంచకప్ పరుగుల ఖాతా తెరిచిన సెహ్వాగ్.. ఆ ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. రెండో ఓవర్లో సచిన్ రెండు ఫోర్లు కొట్టాడు. తొలి 4 ఓవర్లలోనే స్కోరు 36. ఐతే స్పిన్నర్ అబ్దుర్ రజాక్ రంగ ప్రవేశం చేయడంతో స్కోరు వేగం తగ్గింది. అయినా పది ఓవర్లలో 60. అయితే 11వ ఓవర్లో అనవసరంగా వికెట్! ఊపుమీదున్న సచిన్, సెహ్వాగ్‌తో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు.
ఆ తర్వాత సెహ్వాగ్ రజాక్ ఓవర్లో తొలి సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరూ చెలరేగుతుంటే ఆత్మవిశ్వాసంతో ఆడిన గంభీర్ పదే పదే సింగిల్స్, డబుల్స్‌తో తన ఇన్నింగ్స్‌ను నిర్మించుకున్నాడు. ఐతే 24వ ఓవర్లో మహ్మదుల్లా స్ట్రెయిట్ డెలివరీకి అతడు బౌల్డ్ కావడంతో 83 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వీరూ.. విరాట్ జోరు: ఈ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో సెహ్వాగ్, విరాట్ కోహ్లిల భాగస్వామ్యమే హైలైట్. వీరూ విధ్వంసానికి ఇన్నింగ్స్ మధ్యలో కోహ్లి తోడవడంతో బంగ్లా విలవిల్లాడింది. ఎందరు బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. ఎప్పటిలాగే దూకుడును ప్రదర్శించిన కోహ్లి అద్భుతమైన డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు.
పేస్, స్పిన్ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు రాబట్టాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ చకచకా సింగిల్స్ తీశాడు. నయీమ్ ఇస్లామ్ వేసిన 33వ ఓవర్లో కవర్‌లో రెండు ఫోర్లతో పాటు ఓ సిక్స్ కొట్టాడు. సెహ్వాగ్ అంతకుముందు ఓవర్లో మిడ్‌వికెట్లో సింగిల్ తీసి సెంచరీ 94 బంతుల్లో పూర్తి చేశాడు. 35వ ఓవర్లో భారత్ బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకుంది. అందులో 48 పరుగులొచ్చాయి. గాయం కారణంగా వీరూ.. గంభీర్‌ను రన్నర్‌గా పెట్టుకుని అడాడు. జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ అలసిపోయిన అతడు 48వ ఓవర్లో బౌల్డయ్యాడు. కోహ్లితో కలిసి సెహ్వాగ్ మూడో వికెట్‌కు 203 పరుగులు జోడించాడు. చివరి ఓవర్ ఐదో బంతికి శతకం పూర్తి చేసిన కోహ్లి ఆనందం పట్టలేక పోయాడు.
స్కోరు
భారత్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) షకిబ్ 175; సచిన్ రనౌట్ 28; గంభీర్ (బి) మహ్మదుల్లా 39; విరాట్ కోహ్లి నాటౌట్ 100; యూసుఫ్ పఠాన్ (సి) ముష్ఫికర్ (బి) షఫియుల్ ఇస్లామ్ 8; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (50 ఓవర్లలో 4 వికెట్లకు) 370; వికెట్ల పతనం: 1-69, 2-152, 3-355, 4-370
బౌలింగ్: షఫియుల్ ఇస్లామ్ 7-0-69-1; రుబెల్ 10-0-60-0; అబ్దుర్ రజాక్ 9-0-74-0; షకిబ్ అల్ హసన్ 10-0-61-1; నయీమ్ ఇస్లామ్ 7-0-54-0; మహ్మదుల్లా 7-0-49-1
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) యువరాజ్ (బి) మునాఫ్ 70; ఇమ్రుల్ కయెస్ (బి) మునాఫ్ 34; జునైద్ సిద్దిఖీ (స్టంప్డ్) ధోనీ (బి) హర్భజన్ 37; షకిబ్ (సి) హర్భజన్ (బి) యూసుఫ్ 55; ముష్ఫికర్ (సి) రైనా (బి) జహీర్ 25; రకిబుల్ నాటౌట్ 28; మహ్మదుల్లా (బి) మునాఫ్ 6; నయీం ఇస్లామ్ ఎల్బీ (బి) మునాఫ్ 2; అబ్దుర్ రజాక్ ఎల్బీ (బి) జహీర్ 1; షఫియుల్ ఇస్లామ్ రనౌట్ 0; రుబెల్ హొసెన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 24 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 283; వికెట్ల పతనం: 1-56, 2-129, 3-188, 4-234, 5-248, 6-261, 7-275, 8-279, 9-280
బౌలింగ్: శ్రీశాంత్ 5-0-53-0; జహీర్ 10-0-40-2; మునాఫ్ పటేల్ 10-0-48-4; హర్భజన్ 10-0-41-1; యూసుఫ్ పఠాన్ 8-0-49-1; యువరాజ్ 7-0-42-0
No comments:
Post a Comment