కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో సోమవారం నుండి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో తెలంగాకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతో రావాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రేపటి నుండి జరగనున్న సమావేశాలలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయిస్తామని చెప్పారు. సహాయ నిరాకరణను అణిచివేసే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని అన్నారు. ప్రజల మనోభావాలను గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో చేర్చక పోవడం శోచనీయమని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం తప్పు కాదన్నారు. సభ్యులకు ఆ హక్కు ఉందన్నారు.
గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఇలాగే గవర్నర్ రంగరాజన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని కేవలం మూడు నిమిషాల్లో బయటకు పంపించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఘటన జరిగిన రోజును చీకటి రోజుగా అభివర్ణించటం సరికాదన్నారు. ఆయన ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ప్రతినిధి అనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment