BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 6, 2011

15 మంది భారతీయుల రహస్య ఖాతాలను వెల్లడించిన తెహెల్కా

15 మంది భారతీయుల రహస్య ఖాతాలను వెల్లడించిన తెహెల్కా

 Moneyన్యూఢిల్లీ: పన్ను ఎగవేయడానికి వీలున్న లీచెన్‌స్టీన్ బ్యాంకులో రహస్య ఖాతాలున్నాయని అనుమానిస్తున్న 15 మంది భారతీయుల పేర్లను తెహెల్కా పత్రిక విడుదల చేసింది. గురువారం విడుదలైన ఆ పత్రిక సంచికలో వారి వివరాలు ఉన్నాయి. ఈ జాబితాను 2009 మార్చిలో భారత ప్రభుత్వానికి అందజేశారు. గోప్యతా నిబంధనలపై జర్మనీ ప్రభుత్వం ఆ జాబితాను అందజేయడంతో భారత ప్రభుత్వం వెల్లడించలేదు. జాబితాలో ఉన్న వ్యక్తులపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ చేపట్టిన దర్యాప్తు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయం పన్నున చట్టం కింది వివిధ నిబంధనల కింద వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశాలున్నాయి. తెహెల్కా విడుదల చేసిన జాబితాలో 12 మంది వ్యక్తుల పేర్లు, మూడు ఫౌండేషన్ల పేర్లు ఉన్నాయి.

తెహెల్కా విడుదల చేసిన పేర్ల జాబితా - మనోజ్ దూపేలియా, రూపాల్ దుపేలియా, మోహన్ దూపాలియా, హస్ముఖ్ గాంధీ, చింతన్ గాంధీ, దిలీప్ మెహతా, అరుణ్ మెహతా, గుణవతి మెహతా, రజనీకాంత్ మెహతా, ప్రబోధ్ మెహతా, అశోక్ జైపూరియా, రాజ్ ఫౌండేషన్, ఊర్వశి ఫౌండేషన్, అంబ్రునోవా ట్రస్టు. తాము వీరిని సంప్రదించడానికి ప్రయత్నించామని, వారి నుంచి స్పందన రాలేదని, దీంతో ఆ పేర్లు ఇచ్చామని తెహెల్కా చెప్పింది. ఇండియన్ కార్పోరేషన్ చైర్మన్ పేరు కూడా జాబితాలో ఉందని, అయితే ఆయన నుంచి పూర్తి వాదన కోసం చూస్తున్నామని, దాంతో ఆయన పేరు ఇవ్వలేదని తెహెల్కా వివరించింది.

తాజా పరిణామాలతో వివాదాస్పదమైన కొచ్చి ఐపియల్ ఫ్రాంచైజీ తీవ్రమైన ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. కొచ్చి ఐపియల్ ఫ్రాంచైజీలో 12 శాతం వాటా ఉన్న రోజీ బ్లూ యజమాని హర్షద్ మెహతాపై భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌లైన్స్ టుడే తెలిపింది.

రామానాయుడు కి రాజమౌళి పేరు చెప్పి జూ ఎన్టీఆర్ ట్విస్ట్

రామానాయుడు కి రాజమౌళి పేరు చెప్పి జూ ఎన్టీఆర్ ట్విస్ట్

 Jr Ntrప్రముఖ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు పిలిచి దర్శకుడు రాజమౌళి కి ఆఫర్ ఇస్తానంటే ఆయన వెంటనే కాస్త కూడా ఆలోచించకుండా నో చెప్పేయటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అదెలా జరిగిందంటే జూనియర్‌ ఎన్టీఆర్ ‌తో తన పాత చిత్రం 'రాముడు-భీముడు' తీయాలని రామానాయుడుకి ఎప్పుడు నుంచో ఆలోచన ఉంది. ఇదే విషయం గురించి ఎన్టీఆర్ వద్ద గతంలో ఆయన ప్రస్తావించారు. తన తాత నటించిన 'రాముడు-భీముడు' అయితే తనకి ఇష్టమేనని ఆయన ఓకే అన్నారు. అయితే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అయితేనే ఓకే అంటానన్నాడు.

దాంతో నాయుడు గారు వెంటనే రాజమౌళికి కబురు పెట్టారు. ఈగ షూటింగ్ నిమిత్తం సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఉన్న రాజమౌళి వెంటనే వచ్చి ఆ ప్రపోజల్ విన్నారు. అయితే డైరక్ట్ గా కాదనకుండా తనకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయని తప్పించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ అంతకు ముందే రాజమౌళితో ఈ విషయం మాట్లాడాడని,తాను డైరక్ట్ గా కాదనకుండా రాజమౌళిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ తప్పించుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం

వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం

 Deeksha Sethవేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఇక మంచు లక్ష్మీ 'ఝుమ్మంది నాదం' తరవాత నిర్మించే చిత్రం ఇది. ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అంటున్నారు.

జై బోలో తెలంగాణ' లో ఆ మాటలు తొలిగిస్తాం...ఎన్.శంకర్

జై బోలో తెలంగాణ' లో ఆ మాటలు తొలిగిస్తాం...ఎన్.శంకర్

 Jagapati Babu'జై బోలో తెలంగాణ' చిత్రంలో సీమాంధ్రులను కించపరిచే విధంగా ఉన్న వలసవాదులు అనే సంబోధనలను తొలగించడంకాని, మార్చడం కాని చేస్తామని దర్శక నిర్మాతలు శంకర్, కోటగిరి వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు.అలాగే 'జై బోలో తెలంగాణ' సినిమా విడుదలైన ప్రతి చోటి నుంచి సూపర్ హిట్ అన్న టాక్ వస్తున్నదని దర్శకుడు శంకర్ చెప్పారు.

ఉద్యమానికి ఈ చిత్రం మరింత ఊతమిస్తుందన్నారు.. పది పుస్తకాల సారాంశాన్ని ఈ ఒక్క సినిమాలో చూపారని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇక మొన్న శుక్రవారం విడుదలైన 'జై బోలో తెలంగాణ' నైజాం ప్రాంతంలో మంచి చిత్రంగా పేరు సంపాదించుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. కేసీఆర్ రాసిన పాటకు, గద్దర్ నృత్యానికి జనం నీరాజానాలు పడుతున్నారు.

అదే చేస్తూంటే నాక్కూడా విసుగొస్తుంది...కాజల్

అదే చేస్తూంటే నాక్కూడా విసుగొస్తుంది...కాజల్ 

 Kajal Agarwalఎప్పుడూ ఒకేలా కనిపిస్తే చూసేవాళ్లకే కాదు... నాక్కూడా విసుగొస్తుంది. అందుకే పాత్రల్లో కొత్తదనం కోసం అన్వేషిస్తున్నా. ఒకవేళ కొత్త కథలు, విభిన్న పాత్రలు రాకపోతే కనీసం మేకప్ లో అయినా ఆ మార్పు చూపించాలి అంటూ చెప్తోంది కాజల్.. అని చెప్పుకొచ్చింది. సినిమా సినిమాకీ నాలో మార్పులు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సినిమాలకంటే 'డార్లింగ్‌'లో బాగున్నాను.

'బృందావనం'లో ఇంకొంచెం మారాను. ఇప్పుడు 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'లో కూడా ఆ మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది.అలాగే ... సినిమా అంటే ఇరవై నాలుగు విభాగాల కృషి. ఏ ఒక్కరి వలనో సినిమా ఆడదు. విజయంలో, పరాజయంలో అందరికీ భాగం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్వరలో కాజల్...కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనుంది. రవితేజ హీరోగా చేసే వీర చిత్రం కోసం ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తోంది. ఈ వేసవి కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

గోపిచంద్, కృష్ణవంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో..

గోపిచంద్, కృష్ణవంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో..

 Gopichandగోపిచంద్, కృష్ణవంశీ కాంబినేషన్ లో నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న చిత్రానికి కళ్యాణ్ మాలిక్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసారు.రీసెంట్ గా రిలీజైన అలా మొదలైంది,గోల్కొండ హైస్కూల్ చిత్రాలకు సంగీతం అందించి పేరు తెచ్చుకున్న కళ్యాణ్ మాలిక్ కిది పెద్ద చిత్రమే. అయితే ఇప్పటికే ఆయన బాలకృష్ణ తాజా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...కృష్ణవంశీతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఇన్నాళ్ళకు అది నెరవేరబోతోంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించనున్నారు అన్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ‘మొగుడు’ (హజ్బెండ్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున,రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి.

పోలవరం పాదయాత్ర మంచిదే కదా..: జగన్‌కు జేసి దివాకర్ మద్దతు

పోలవరం పాదయాత్ర మంచిదే కదా..: జగన్‌కు జేసి దివాకర్ మద్దతు

 JC Diwakar Reddy
రాజమండ్రి : కాంగ్రెస్ పార్టీతో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి ఆదివారం చెప్పారు. చిరంజీవి కలయికతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందన్నారు. పోలవరంపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న యాత్ర మంచిదే కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చెప్పారు. రాష్ట్రం పోలవరం సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగన్ యాత్రతో లాభం చేకూరితే మంచిదే కదా అని అన్నారు. కాగా పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావటం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

కాగా పోలవరంపై స్వార్ధ ప్రయోజనాలతో జరిగే యాత్రల వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వేరుగా విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు జాతీయ హోదా కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు వచ్చిన సమయంలో ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ప్రక్రియను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పైగా విజయవంతమైందని అన్నారు.

జగన్‌ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా

జగన్‌ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా

Roja హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం జనాకర్షణ మాత్రమే కాదని జనాధరణ కూడా ఉందని జగన్ వర్గం నేత, ప్రముఖ సినీ నటి రోజా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రజారాజ్యం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దురదృష్టకరమన్నారు. అయితే ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కేవలం జగన్ ఒక్కరే ముందుకు తీసుకు వెళతారని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్‌ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు.

పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేస్తున్నారన్నారు. పదవుల కోసం పార్టీని విలీనం చేస్తూ ప్రజల గురించి మాత్రం ఆలోచించడం లేదన్నారు. చిరంజీవి ప్రజల విశ్వాసం కోల్పోవడం వల్లే ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్నున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌పై పోరాడాల్సిన చిరు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ప్రజలకు నమ్మక ద్రోహం చేయడమే అవుతుందన్నారు.
 

రాజీనామా ఆఖరి అస్త్రం, 14న ఢిల్లీకి వెళతాం: తెలంగాణ ఎమ్మెల్యేలు

రాజీనామా ఆఖరి అస్త్రం, 14న ఢిల్లీకి వెళతాం: తెలంగాణ ఎమ్మెల్యేలు

 Telangana Congress leaders హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆఖరి అస్త్రంగా మాత్రమే రాజీనామాలు ప్రయోగిస్తామని తెలంగాణ కాంగ్రెస్

కేంద్రం నుండి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు పార్టీ ఎజెండా పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని పార్టీలలోని తెలంగాణవాదులు ఇందుకోసం కలిసి రావాలన్నారు. శాసనసభ్యులు ఆదివారం స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం కేవలం పదవులే కాదు. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణకోసం 14వ తారీఖున న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. ఆదివారం తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

జగన్‌పై పోటీకి వివేకా అల్లుడు: జయమ్మపై వైఎస్ వివేకానంద!

జగన్‌పై పోటీకి వివేకా అల్లుడు: జయమ్మపై వైఎస్ వివేకానంద!

 YS Jaganమాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యవసాయ శాఖమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా నర్రెడ్డి కూడా జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. అయితే అధిష్టానం నుండి ఆదేశాలు రావాలని చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు. ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నట్లుగా చెప్పారు. అధిష్టానం నర్రెడ్డిని ఎప్పుడో ఖరారు చేసినందునే ఆయన తెరముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. జగన్ అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పినందున, నర్రెడ్డి కూడా జగన్‌పై పోటీకి సిద్ధమని చెప్పిన కారణంగా ఎంపీగా పోటీ చేయడానికి నర్రెడ్డి ఉత్సాహ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా నర్రెడ్డి నియోజకవర్గాల్లో తిరుగుతూ తాను వైఎస్ కుటుంబ సభ్యుడినే అని చెబుతున్నట్టుగా కనిపిస్తోంది.

కడప ఎంపికి జగన్‌తో నర్రెడ్డి పోటీ చేస్తుండగా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విజయమ్మను జగన్ దించే అవకాశాలు ఉన్నాయి. ఆమెపై మరిది వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ కారణంగా అదే కుటుంబానికి చెందిన వివేకానందను అభ్యర్థిగా దించడానికే ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌గానీ, అటు అధిష్టానం గానీ మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు రాష్ట్ర రాజకీయాలను వైఎస్ చూసుకునేవారని, వివేకానంద కడప జిల్లాకు పరిమితం అయ్యేవాడని తెలుస్తోంది. జిల్లాలో వివేకాకు ఉన్న పరిచయాల నేపథ్యంలో కూడా ఆయననే పోటీ చేయాలని కాంగ్రెస్
పార్టీతో పాటు, వివేకా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు.