హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి కార్యవర్గ సభ్యుడు కె కేశవరావు ఆదివారం అన్నారు. అయితే దాడిని మాత్రం తాము సమర్థించడం లేదన్నారు. దాడి ఖండించదగినదే అన్నారు. జెపి అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించుకోవాలని కోరారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో సహాయ నిరాకరణపై గానీ, తెలంగాణ అంశంగానీ ప్రస్తావనకు రాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఏ అంశమూ ప్రస్తావనకు రాకుంటే తెలంగాణలోని సామాన్య జనానికి బాధ కలగదా అని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. అసెంబ్లీ అవినీతిపరుల అడ్డా అని చెప్పడం జెపికి ఎంతవరకు సమంజసం అన్నారు.
No comments:
Post a Comment