BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 20, 2011

హైదరాబాద్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెడతాను: హీరో నాగార్జున

Nagarjunaస్టార్ హీరో నాగార్జున త్వరలో హైదరాబాద్ లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్ధాపించే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో... చిత్ర పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నిపుణుల్ని అందించేందుకు, ఔత్సాహిక నటులను తీర్చిదిద్దేందుకు మన దగ్గర సరైన శిక్షణ సంస్థల్లేవు.ముంబయిలో ఉన్నట్లుగా దక్షిణాదిన సరైన శిక్షణ సంస్థల్లేవు. ఉన్నా అవి సినిమా రంగానికి అవసరమైన రీతిలో తీర్చిదిద్దేలా ఉండట్లేదు. దాంతో ఆసక్తి ఉన్న ఔత్సాహికులుకు సరైన మార్గ దర్శకత్వం లభించట్లేదు.

ప్రస్తుతం ఈ రంగంలో అసెస్టింట్ లుగా చేరి పని చేస్తూనే నేర్చుకొంటున్నారు. ఇది సరైన విధానం కాదు. అందుకే నేను అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా తరహాలో ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాలనుకొంటున్నా అన్నారు. ఇక తెలుగులో ఇప్పటికే చిన్న చిన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లు ప్రక్కన పెడితే రామానాయుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, రామోజీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటివి అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్నాయి.

No comments:

Post a Comment