BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 20, 2011

కాఫీ కప్పులో ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు

Bhimaneni Srinivasa Raoగతంలో శుభాకాంక్షలు, సుస్వాగతం,సూర్య వంశం వంటి సూపర్ హిట్స్ అందించిన దర్సకుడు భీమినేని శ్రీనివాస రావు త్వరలో నటుడుగా పలకరించనున్నారు. వరుణ్ సందేశ్ తాజా చిత్రం కుదిరితే కాఫీ కప్పు చిత్రంలో ఆయన వరుణ్ సందేశ్ తండ్రిగా చేస్తున్నారు. సుస్వాగతం చిత్రంలో రఘువరన్ తరహా క్యారెక్టరైజేషన్ తో ఈయన పాత్ర సాగనుందని తెలుస్తోంది. కొడుకుని స్నేహితుడిలా భావిస్తూ ఎంకరేజ్ చేసే ఈ పాత్రతో భీమినేని నటుడుగా కూడా బిజీ అవుతాడని యూనిట్ వారు అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రమణ సెల్వా అనే కెమెరా మెన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భీమినేని శ్రీనివాసరావు ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమచారం.

ఇక వరుణ్ సందేశ్, సుమాభట్టాచార్య జంటగా రూపొందిన ‘కుదిరితే కప్పు కాఫీ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న విడుదల కానుంది. 80 స్క్రీన్స్‌తో ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిదని దర్శకుడు చెప్తున్నారు.సుకుమారి, తనికెళ్ల భరణి, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం యోగేశ్వరశర్మ, పాటలు: సిరివెన్నె సీతారామశాస్ర్తీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: అనిల్‌కుమార్, కెమెరా: సంతోష్‌రాయ్, ఆర్ట్: శశిధర్ అడప, నిర్మాతలు: శివ, మహి, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణ సాల్వ.

No comments:

Post a Comment