విజయవాడ నేఫధ్యంలో రామ్ గోపాల్ వర్మ రూపొందనున్న తాజా చిత్రం ' బెజవాడ రౌడీలు' టైటిల్ ప్రకటించగానే సంచలనం రేగిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్ళూ రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తారనుకున్నారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు.
నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.
No comments:
Post a Comment