BREAKING NEWS
Tuesday, April 12, 2011
జపాన్‌లో మరోసారి భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో : జపాన్‌ను మరోసారి భూకంపం తాకింది. వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతోంది. తాజాగా హోన్షు తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రానికి 94 కిలో మీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతం జపాన్ రాజధాని టోక్యోకు 164 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం తర్వాత టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ప్రకంపనాలకు భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. జపాన్‌ను భారీ భూకంపం తాకి 25 వేల మంది ప్రాణాలు పోగొట్టున్న సంఘటన జరిగి సరిగ్గా నెలరోజులవుతోంది. ఇంతలో మరోసారి ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలు వణికపోయారు. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రేడియేషన్ వెలువడడం ఇంకా ఆగిపోలేదు. నరిటా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు.
ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' లేటు రిలీజ్ కు కారణం: దశరధ్
ప్రభాస్, కాజల్ నటించిన మిస్టర్‌ఫర్‌ఫెక్ట్ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రాజు మాట్లాడుతూ 'తెలుగు తెరపై ఇంతవరకూ రాని కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ప్రభాస్ పాత్ర కొత్తగా ఉంటుంది. మంచి కథకు తగిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. మా సంస్థ నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది అన్నారు.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...నాలుగురోజుల్లో తొలికాపీ సిద్ధంకానుంది. దేవీశ్రీప్రసాద్ ఆడియో ఇప్పటికే ప్రజాదరణ పొందింది.ప్రభాస్ కొత్తగా కనబడతాడు.అందరిచేత మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనిపించుకుంటాడు. కథ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది.ప్రభాస్ బాడీలాంగ్వేజ్‌కు బాగా సూట్ అయింది.కాజల్ చాలా బాగా నటించింది. అటు యూత్‌కు, ఇటు మాస్‌కు, మరోవైపు ఫ్యామిలీకి నచ్చే సినిమా అవుతుంది.మొదట 21న విడుదల చేయాలనుకున్నాం. సాంకేతిక కారణాల వల్ల 22న విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రంలో కాజల్, తాప్సి హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఫొటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, స్క్రీన్‌ప్లే: పి.హరి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్
శ్రీకాంత్ సేవకుడు నిర్మాతపై ఛీటింగ్ కేసు
'సేవకుడు' సినిమా నిర్మాత మందం సుధాకర్, జెమిని ల్యాబ్స్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్‌స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.2010లో నిర్మాత సుధాకర్...నలభై లక్షల రూపాయలను చిక్కడపల్లికి చెందిన విజయ్ శేఖర్ నుంచి ఫైనాన్స్త్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ లో డబ్బు చెల్లించిన తర్వాతే విడుదల చేద్దామని రాసుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంగించి జెమినీ ల్యాబ్స్ మేనేజ్ మెంట్ తో కలిసి వేరే వ్యక్తి దగ్గర ఫైనాన్స్ తీసుకుని విడుదల చేయటానకి సిద్దపడ్డారు. దాంతో నాంపల్లి కోర్టులో ఫైనాన్షియర్ విజయ్ పిటిషన్ వేసారు. దాంతో ఫోర్ ట్వంటి కేసు పెట్టమని పోలీసులను కోర్టు ఆదేశించిం
కంప్యూటర్ కోసం యాభైవేలు తీసుకురాలేదని భార్యను ఉరేసి చంపిన సాప్ట్‌వేర్ ఇంజనీర్
పూణె: ఐఎయస్ లా కాలేజి స్టూడెంట్ జయశ్రీ బాంబ్లే సోమవారం పూణెలోని కేసర్ వాడిలో ఉన్న వాళ్శ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకోవడం జరిగింది. ఈ కేసు నిమిత్తం భోసారి పోలీసులు జయశ్రీ భర్త అయినటువంటి సుశాంత్, బ్రదర్ ఇన్ లా సచిన్ ధార్వే, సిస్టర్ ఇన్ లా దీప్తి సచిన్ ధార్వేని అరెస్టు చేయడం జరిగింది. అస్సలు జయశ్రీ చనిపోవడానికి కారణం తన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భర్త అయినటువంటి సుశాంత తన భార్యని లాప్ ట్యాప్ కోనుక్కోవడం కోసం తన పుట్టింటి నుండి రూ 50,000 తీసుకోని రమ్మని చాలా రోజులు నుండి వేధిస్తున్నాడంట. ఈ వేధింపులు తట్టుకోలేకనే జయశ్రీ ఫ్యాన్‌కి ఉరేసుకోని చనిపోయిందని పోలీసులు విచారణలో తేలింది.
పోస్ట్ మార్టం వివరాల ప్రకారం జయశ్రీ చనిపోయినటువంటి తీరు చూస్తుంటే ఇది హాత్యగా భావించారు. ఈ కేసు విషయమై పోలీసులు సుశాంత్ తల్లిదండ్రులుని కూడా అరెస్టు చేయడం జరిగింది. జయశ్రీని ఇంతలా వేధించడానికి కారణం వరకట్నమే ముఖ్యకారణమని ఆమె అన్నయ్య డాక్టర్ సంజయ్ సోనేకర్ వెల్లడించారు. ఇది ఖచ్చితంగా మర్డర్ నని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దానికి కారణం మా చెల్లి ఉరేసుకోని చనిపోయేటటువంటి పిరికిపంద కాదని అన్నారు. తను ఉరికి అంగీకరించికపోవడంతో తనని హింసించి మరీ ఉరి వేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది.
ఐతే జయశ్రీ తల్లిదండ్రులు మార్చి 23వ తారీఖునే సుశాంత్‌ని కలసి తన ల్యాప్ ట్యాప్ కోసం రూ 50,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఇద్దరి కుటుంబాల మద్య ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మార్చి 26వ తారీఖున కూర్చోని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై చర్చి జరుగుతున్న సమయంలో జయశ్రీని సుశాంత్ వాళ్శ చెల్లి తన తల్లిదండ్రుల ముందే గట్టిగా తోయడం జరిగింది. దాంతో ఏదో సర్ది చెప్పి తన కూతురుతో మాట్లాడి తల్లిదండ్రులు వెళ్శిపోయిన తర్వాత ఇలా తనని చంపేశారని జయశ్రీ తల్లి దండ్రులు వాపోయారు.

Subscribe to:
Posts (Atom)