BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, January 19, 2011

మహేష్, శ్రీను వైట్ల 'దూకుడు' చిత్రం కథ ఇదేనా?

మహేష్, శ్రీను వైట్ల 'దూకుడు' చిత్రం కథ ఇదేనా?

Mahesh Babu


 మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న దూకుడు చిత్రం కధ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటి గత కొద్ది రోజులుగా వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...మహేష్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. అతను చేతుల్లోంచి నుంచి ఓ మాఫియా లీడర్ (ప్రకాష్ రాజ్)పొలిటికల్ పవర్ ఉపయోగించుకుని తప్పించుకుని పారిపోతాడు. అతన్ని పట్టుకుని తిరిగి పది రోజుల్లోగా సరెండర్ చేయకపోతే మహేష్ వి, అతని టీమ్ వి ఉద్యోగాలు పోతాయని అతని సుపీయర్ ఆఫీసర్ (నాజర్)హెచ్చరిస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ ని పట్టుకోవాలని బయిలుదేరతాడు. ఈ లోగా ప్రకాష్ రాజ్..టర్కీలో తేలతాడు. ప్రకాష్ రాజ్ ని పట్టుకునే క్రమంలో టర్కీకి వెళ్ళిన అతనికి సమంత పరిచయమై..ప్రేమలో పడతాడు. ఆమె నాజర్ కూతురని తర్వాత తెలుస్తుంది. మరి కొంత సమయం గడిచాక అస్సలు ప్రకాష్ రాజ్ తప్పించుకుపోవటానికి డిపార్టమెంట్ లోనే ఉండి సహాయం చేసింది నాజరే నని అర్దమవుతుంది. దాంతో నాజరే విలన్ అని అర్దం చేసుకున్న మహేష్ ఎలా ప్రూవ్ చేసాడు అన్నది మిగతా కథ అంటున్నారు. ఇక ఈ చిత్రం ట్రీట్ మెంట్ ఎక్కువ భాగం కామిడీతో రన్ అవుతుంది. అలాగే ఈ కథ నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికి అంతే అవకాసం ఉంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.


సినిమా పోతేనేం సిద్దార్ధ రెండు కోరికలు తీరాయి

సినిమా పోతేనేం సిద్దార్ధ రెండు కోరికలు తీరాయి..

Siddharth

నాకున్న రెండు కోరికలూ 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తీరాయి అంటున్నారు సిద్దార్ద. ఇంతకీ ఆ రెండు కోరికలూ ఏమిటీ అంటే...యాక్షన్‌ చేయడం అంటే నాకిష్టం అది ఈ చిత్రంతో తీరింది. అలాగే 'పాతాళ భైరవి'లాంటి చిత్రంలో నటించాలి ఎప్పుడూ అనేకునేవాడిని..ఈ రెండు కోరికలు 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో నెరవేరాయి. పిల్లలకు, మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోందంటూంటే హ్యాపీగా ఉంది అన్నారు సిద్దార్ద. అలాగే తెలుగు సినిమాలో ఈ తరహా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇంత వరకూ రాలేదని రామ్‌గోపాల్‌ వర్మ లాంటి దర్శకులు చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌, కాంతారావు నటించిన జానపద చిత్రాలు చాలానే చూశాను. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా ఓ అందమైన చందమామ కథలా ఈ సినిమాను తీర్చిదిద్దారుఅదే నాకు నచ్చింది అని చెప్పారు. ఇక తదుపరి చిత్రాలు గురించి చెబుతూ...త్వరలోనే దిల్‌ రాజు నిర్మాతగా 'బొమ్మరిల్లు' తరహాలో ఓ చక్కటి ప్రేమ కథలో నటిస్తున్నాను. వచ్చే నెల్లో ఈ సినిమా మొదలవుతుంది. '180', దీపా మెహతా దర్శకత్వంలో వస్తున్న 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌' చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు.



మెగా బ్రదర్స్ కాంపౌండ్ నుండి బయట పడ్డ బాధితురాలు...

మెగా బ్రదర్స్ కాంపౌండ్ నుండి బయట పడ్డ బాధితురాలు...

 Deeksha Seth

   తమ చిత్రాలతో నిర్మాతలు, బయ్యర్ల కొంప ముంచడమే కాకుండా తమతో నటించిన పాపానికి పలువురు హీరోయిన్లు కెరీర్ కూడా నాశనమైపోవడానికి కారణమయ్యారు మెగా హీరోలు. ‘వరుడు’లో నటించిన భాను మెహ్రాకి మళ్లీ ఇంకో అవకాశమిచ్చే వాళ్లే కనిపించలేదు. ‘పులి’ తో జత కట్టిన నికీషా పటేల్ కి కనీసం చిన్న చిత్రాల్లో అయినా ఛాన్స్ రావట్లేదు. ఇక ‘ఆరెంజ్’లో నటించిన షాజాన్’ని పట్టించుకునే వాళ్లే లేరు. ఆరంజ్ లో రామ్ చరణ్ సరసన నటించిన జెనీలియాకు సినిమా ఇస్తే పెద్ద వింతే అనుకోవచ్చు..ఇలా చెప్పుతూ పోతో చాలా మందే ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీతో నటించిన హీరోయిన్ల సంఖ్య ఇప్పుడు బాధిత సంఘం ఏర్సాటు చేసుకునే లెవల్ కి ఎదిగిపోయింది.

అయితే మెగాబ్రదర్స్ మరియు అల్లు అర్జున్ పై కామెంట్స్ చాలానే వున్నాయి. వారితో సినిమా చేసిన నూతన కదానాయికలకు ఆ తర్వాత సరైన అవకాశాలు రావనేది ఆ కామెంట్ సారాంశం. అల్లు అర్జున్ కైతే వరస బెట్టి గంగోత్రి తో పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో పరిచయమైన అనురాధా మెహతా, బన్ని తో పరిచయమైన గౌరీ ముంజాల్, వరుడు తో పరిచయమైన భాను శ్రీ మెహ్రల కెరీర్ లే ఇందుకు నిదర్శనాలు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పై వున్న ఆ అపనిందను అర్జున్ తో ‘వేదం’ చిత్రంలో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ తొలిగించారు. ఎందుకంటె వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేథ్ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో చాన్స్ కొట్టేసి సినిమా సక్సెస్ తో మంచి మార్కులే కొట్టేస్తోంది. తర్వాత గోపీచంద్ సరసన నటిస్తోన్న సంగతి విదితమే. ఇలా వరుస విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర కధానాయికగా ఎదుగుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా భాసిల్లుతున్నారు.

 

 

తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....

తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....

 Ram Gopal Varma

    రామ్ గోపాల్‌ వర్మ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో దిట్ట. ఇప్పటికే రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో రౌడీలు, దాదాలు వంటి చిత్రాలు తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అలాంటిదే రవితేజతో 'దొంగలముఠా' సినిమాను తీయనున్నట్లు ప్రకటించారు.

కాగా ‘రక్త చరిత్ర’ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరితో కొన్నాళ్ళు చర్చలు జరిపాడు. అలాగే ఈ సినిమాకి సూరి ఫైనాన్స్ చేసాడనే వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది. దాంతో మీడియా దృష్టిని ఈ టాపిక్ పై నుండి మళ్ళించడానికి రామ్ గోపాల్ వర్మ ‘దొంగలముఠా’ సినిమాని అనౌన్స్ చేసాడని పరిశీలకులు అంటున్నారు. ‘దొంగల ముఠా’ని ఐదు రోజుల్లోనే తీస్తున్నామని, ఎవ్వరూ పారితోషికాలు తీసుకోవడంలేదని, సినిమా పూర్తయ్యి లాభాలు వస్తే పంచుకుంటామని రామూ పేర్కొన్నాడు. ఇప్పుడు మీడియా ఈ సినిమాపైనే దృష్టి సారించడంతో రామూ పాచిక పారినట్టే.

సైరాబానుతో సుమన్ ‌శెట్టి 'గవ్వలాట' మొదలెట్టాడు

సైరాబానుతో సుమన్ ‌శెట్టి 'గవ్వలాట' మొదలెట్టాడు.

  Saira Bhanu

  సుమన్‌ శెట్టి, సైరాబాను, జోత్స్న (రమ్య), సుస్మిత కాంబినేషన్ లో 'గవ్వలాట' అనే చిత్రం మొదలైంది. ఈ చిత్రం కథ ప్రకారం ఒక హైవేలో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ హైవేలో హీరో, ముగ్గురు హీరోయిన్లు కూడా ప్రయాణం చేస్తుంటారు. హీరో చాలా అమాయకుడు. హీరోయిన్స్‌ అనుకోకుండా హీరోని కలుస్తారు. హీరో ముగ్గురి మీద విడివిడిగా మనసు పారేసుకుంటాడు. తర్వాత అందరూ ప్రమాదంలో చిక్కుకుని, చివరికి అందరూ భయటపడతారా? లేక కొందరే మిగులుతారా? చివరికి హీరో ఏ అమ్మాయిని ప్రేమిస్తాడు? ఇంతకీ ఆ ప్రమాదాలు ఎవరు చేస్తున్నారు అనే అంశం చుట్టూ జరుగుతుంది. ఈ చిత్రానికి కథ: రమారామ్‌ కుమార్‌, మాటలు: శ్రీధర్‌, పాటలు: రామారావు, ఫోటోగ్రఫీ: కల్యాణ్‌సమి, సంగీతం: జాన్‌, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: నారాయణరావు, సారథ్యం: శ్రీధర్‌గౌడ్‌, సహ నిర్మాత: బి.చంద్రశేఖర్‌రెడ్డి, సమర్పణ: బి.శివరంజనిరెడ్డి, నిర్మాత: సి.హెచ్‌.సుధాకర్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రత్నాకర్ ‌రావు.

 

నేను విడాకులు ఇవ్వాలంటే నాకు రెండు మిలియన్ పౌండ్లు ఇవ్వాల్సిందే

నేను విడాకులు ఇవ్వాలంటే నాకు రెండు మిలియన్ పౌండ్లు ఇవ్వాల్సిందే.

 

Alex Reid-Katie Price 

  ప్రముఖ బ్రిటీష్ మోడల్ క్యాటీ ప్రైజ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన సింగర్ పీటర్ ఆండ్రూ ఇద్దరూ ప్రేమించి పెళ్శి చేసుకున్నారు. పీటర్ ఆండ్రూ తన మేనేజర్ అయినటువంటి క్లారి పోవెల్ తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడంటూ కారణం చేత ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరి ప్రేమ ఫలితంగా వీరికి ఎనిమిది సంవత్సరాల హార్వే పుట్టాడు. ఆ తర్వాత ఆమె నెలతిరక్కుండానే కేజ్ ఫైటర్ అలెక్స్ రెయిడ్ అనే అతనిని పెళ్శి చేసుకున్నారు. పీటర్ మాత్రం ఆమెనే తలచుకుంటూ ఆమె తలపులతో నిత్యం నరకం అనుభవించాడట. తనెంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య తనని వీడి వెళ్లిపోవడమే కాకుండా నెలయినా కాకముందే మరో బాయ్ ఫ్రెండ్ తో కులుకుతుండటంతో పీటర్ తట్టుకోలేకపోయాడట. ఎంత లేదన్నా రోజుకు 20 గాయాలు అయ్యేలా తనని హింసించుకొనే వాడిని సమాచారం.

ఇది ఇలాఉండగా క్యాటీ ప్రైజ్ ఇప్పుడు తన రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారంట. ఇందుకు గాను అలెక్స్ రెయిడ్ తన భార్య నుండి రెండు మిలియన్ పౌండ్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనకి రెండు కోట్లు ఇస్తేనే విడాకులు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈసందర్బంలో అలెక్స్ రెయిడ్ మాట్లాడుతూ తనని పెళ్శి చేసుకున్న తర్వాత తన మాటవిని నేను కొన్నాళ్శు గేజింగ్ ఆర్డర్స్ కూడా ఒప్పుకోక పోవడం వల్ల నాఆదాయానికి దెబ్బడి పోయింది కనుక ఇంత మొత్తాన్ని తాను ఆశిస్తున్నానని తెలిపారు.

ఇంతవరకు క్యాటీ ప్రైజ్ ఏడవడం ఎవ్వరూ చూసి ఉండరు, కానీ ఈవిషయం తెలిసిన వెంటనే క్యాటీ ప్రైజ్‌కు ఫిట్స్ రావడం ఖాయం అని అన్నారు. ఈఒప్పందానికి క్యాటీ ప్రైజ్ అంగీకరించినట్లైతే అలెక్స్ రెయిడ్‌ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి బయటకు వెళ్శడానికి సిద్దంగా ఉన్నారని అన్నట్లు వినికిడి. అంతేకాకుండా దీనిని బట్టి చూస్తుంటే క్యాటీ ప్రైజ్ చివరకు అలెక్స్ రెయిడ్‌‌తో రాజీపడి అతనితో జీవతం పంచుకోవడం మేలు అని క్యాటీ ప్రైజ్‌కు తన లాయర్స్ చెప్పడం ఖాయం అని అంటారని అన్నారు.

తమ్ముడు బాలకృష్ణ ఓ ఉగ్రనరసింహం...పురందేశ్వరి

తమ్ముడు బాలకృష్ణ ఓ ఉగ్రనరసింహం...పురందేశ్వరి.

  Purandeswari

  తమ్ముడు బాలకృష్ణ ఓ నటసింహంలా, ఓ ఉగ్రనరసింహంలా తనలోని నటనని చాటుకున్న చక్కని సందేశాత్మక చిత్రం ఇదని భావిస్తున్నా. నేడు ఒక పౌరాణికం కానీ, ఒక జానపదం కానీ, ఒక సాంఘికం కానీ చెయగల నటుడు ఒక్క బాలకృష్ణ మాత్రమే. తమ్ముడు సంపూర్ణ నటుడు అని చెప్పగలను అన్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి.

రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన వంశీ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటుచేసిన సభలో ఆమె పరమవీరచక్ర చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..."నా యాభయ్యోయేట దాసరి 150వ చిత్రంలో నటించడం చాలా సంతోషం. ప్రతి పౌరుడూ వీర జవాను కావాలనీ, అలాంటి చట్టం తేవాలనీ కోరుతున్నా అన్నారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ "మన సైనిక శక్తిని బాలకృష్ణ తన పాత్రలో అద్భుతంగా ప్రదర్శించారు. 150 కాదు, ఇంకో 150 సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్న దర్శకుడు దాసరి. నాలుగు రోజుల తర్వాతైనా ఈ చిత్రాన్ని ప్రేక్షకలోకం ఆదరిస్తుంది. ఇది ఉత్కృష్టకోవకు చెందిన చిత్రం" అని చెప్పారు.

కో డైరక్టర్ గా పూరీ జగన్నాధ్, అసోసియేట్ డైరక్టర్ గా హరీష్ శంకర్

కో డైరక్టర్ గా పూరీ జగన్నాధ్, అసోసియేట్ డైరక్టర్ గా హరీష్ శంకర్.

 Puri Jagannath

   రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించబోయే చిత్రం దొంగల ముఠాకు కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ నే తీసుకుంటానన్నారు. వీరి ఎంపక జరుగుతోంది. మొదటగా ఈ చిత్రానికి కో డైరక్టర్ గా పూరీ జగన్నాధ్, అశోశియేట్ డైరక్టర్ గా మిరపకాయ డైరక్టర్ హరీష్ శంకర్ ఎంపికయ్యారు. మిగిలిన ఆరుగురు కు విపరీతమైన కాంపిటేషన్ ఉండబోతోందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లో ఫినిష్ చేస్తానంటన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం గురించి చెబుతూ వర్మ...కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-అప్పలరాజు సినిమా పిబ్రవరి 4న విడుదలైన వెంటనే వారం లోపల పిబ్రవరి 11న నేను రవితేజతో సినిమా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా అత్యంత ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ ఉత్కంఠభరితమైన ధ్రిల్లర్ అని అంటున్నారు.

పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే ఇందులో ఛార్మి, అజయ్, సుబ్బరాజు, మంచు లక్ష్మి, బ్రహ్మాజి,బ్రహ్మానందం, అజయ్, ప్రకాష్ రాజ్, కొన్ని ముఖ్యమైన పాత్రలు ఫోషిస్తున్నారు. మిగలిన పాత్రధారుల ఎంపిక ఇంకా జరుగుతోంది.సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి. అలాగే ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన మేకింగ్ టెక్నాలిజీతో చేయటం వల్లే రెండు గంటల సినిమాని కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసి, అంత వేగంగా రిలీజ్ చేయటం సాధ్యపడుతుంది. ఇలా ఈ టెక్నాలిజితో చేయటం వెనక నా ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ యుగంలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలిజీని సరైన పద్దతిలో ఉపయోగిస్తే ఏమేమి సాధించవచ్చో అనేది అందరికీ తెలియచేయటం అన్నారు.

సినిమాలలో క్యాజువల్ సెక్స్ లేకపోతే ఆడియన్స్ ధియేటర్లకు ఎలా వస్తారు

సినిమాలలో క్యాజువల్ సెక్స్ లేకపోతే ఆడియన్స్ ధియేటర్లకు ఎలా వస్తారు.

 Ashton Kutcher-Natalie Portman

  ప్రస్తుతం హాలీవుడ్ మొత్తం ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు నటించినటువంటి నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమా గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఈసినిమాలో ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారం ఒలకించారని సమాచారం. ఈ సందర్బంలో ఆస్టన్ కుచర్ మాట్లాడుతూ సాధారణంగా సినిమాలలో నిజంతమైన సెక్స్ ఉండడం అనేది సహాజం.

నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో నటాలీ పోర్ట్ మెన్ నేను చేసింది అలాంటి సెక్స్ మాత్రమే. అంతేకాకుండా నిజజీవితంలో యంగ్ పీపుల్ రిలేషన్ షిప్స్ కోసం ఎలా పరితపించిపోతారో ముఖ్యంగా ఈసినిమాలో చూపించడం జరిగందన్నారు. అలాంటి సన్నివేశాలు లేకుండా సినిమా తీయకపోతే ఈసినిమాకి అస్సలు అర్దం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈసినిమాలో మేము చేసినటువంటి సెక్సీ సీన్లు కూడా చాలా నిజజీవితంలో ఒక భార్య భర్తలు ఎలా ప్రవర్తస్తారో అలానే ఉన్నాయి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేవిధంగా ఉండవు అని అన్నారు.

ఈసినిమాని పోర్ట్ మెన్ ప్రోడక్షన్ కంపెనీ, హ్యాండ్ సమ్ చార్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ గా రిట్ మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసందర్బంలో నాటలీ పోర్ట్ మెన్ మాట్లాడుతూ ఇది మాసోంత ప్రోడక్షన్ లోవస్తున్నటువంటి సినిమా. అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము, వోగ్ మ్యాగజైన్ ఇద్దరం కలసి వుమెన్స్ కోసం ప్రత్యేకంగా సినిమాలు రూపోందించాలని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి పీమేల్ కుసంబంధించినటువంటి కొన్ని కామెడీ సినిమాలు రూపోందిస్తున్నాం. ఇవి మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు రూపోందిస్తాం అన్నారు. ఇకపోతే నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో బ్రా లకు మరియు అండర్ ప్యాంట్స్ కుఉన్నటువంటి వ్యత్యాసాన్నిచాలా చక్కగా చూపించడం జరిగింది. ఇక ఈసినిమా ప్రీమియర్స్ జనవరి 21న ప్రదర్శించడం జరుగుతుందన్నారు.