BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 29, 2011

Genelia Cute Stills in Saree




















Samantha Cute Sexy Stills in Saree















అనాధలను దత్తత తీసుకుంటున్న పవన్ సేవానిరతికి హ్యాట్సాఫ్...

Pawan Kalyanగతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మతిస్తిమితం లేని 100మంది పిల్లలను దత్తత తీసుకొని వారి కావలసిన సౌకర్యాలు సమకూర్చుతున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సియంపిఎఫ్)ను 2008లో ప్రారంభించవలసి ఉన్నింది, అయితే తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా అఫిషియల్ గా చేయ్యెచ్చు అనే భావంతో సియంపిఎఫ్ ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రజారాజ్యంపార్టీ, కాంగ్రెస్ లో వీలినం అయిపోయింది కాబట్టి, పవన్ కళ్యాణే స్వతహాగా ఒక్కరే ఈ కార్యక్రామానికి కార్యరూపందాల్చనున్నారు.


అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సేవా గుణం మెండు అని చాలా విషయాలు ప్రూవ్ చేసాయి. తాజాగా మరో వార్త పవన్ సేవా గుణాన్ని బయట పెడుతోంది. ఇటీవల తన భార్య రేణుదేశాయ్ తన పిల్లలను తీసుకుని పవన్ ని వదిలేసి వెళ్ళిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంగా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ లో ఉన్నాడని వినికిడి.

కానీ ఎన్ని టెన్షన్ లు ఉన్నా తనలో దాగి ఉన్న సేవాగుణంతో ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు గట్టి పునాది అవ్వాలని కోరుకుంటున్నాడట. కొంతమంది హీరోల్లా కేవలం మాటల వరకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ పని చేస్తాడని, అంతటి సేవాగుణం అతనికి ఉందని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మంచి పనిని ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాల్సిందే...

చచ్చిపోతే ఏమౌతుంది? ('నేనూ..నా రాక్షసి' ప్రివ్యూ)

Nenu Naa Rakshasiరాణా, ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన నేనూ..నా రాక్షసి చిత్రం ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఫెరఫెక్ట్ ప్లానింగ్ తో మర్డర్స్ చేసే ప్రొఫెషనల్ కిల్లర్ అభిమన్యు (రాణా). వృత్తిలో భాగంగా ఎంతట సమస్యను అయినా సాహసింతో ఎదుర్కొంటూంటాడు. ఇక మీనాక్షి (ఇలియానా)అందంతోపాటు తెలివితేటలున్న నేటితరం యువతి. ఓ సమస్యతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తుంటుంది. ఓ రోజు అనుకోకుండా అభిమన్యుకి మీనాక్షి తారసపడుతుంది. వారిద్దరి కలయిక ఏ పరిస్థితులకు దారి తీసింది. అసలు మీనాక్షి సమస్యేమిటి? వారిద్దరి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనే విషయాల్ని తెరపైనే చూడాలి అంటున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ..ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. అసాధారణంగా ప్రవర్తించే రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది. ఆ పాత్రల చిత్రణ అందరికీ నచ్చుతుంది. వెనిస్‌లో చిత్రించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలీ, ముమైత్‌ఖాన్‌ కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. నేను బాగా ఇష్టపడి రాసుకొన్న కథ ఇది అంటున్నారు.

సంస్థ: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌
నటీనటులు: రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్‌, ముమైత్‌ఖాన్‌ తదితరులు
సంగీతం: విశ్వ-రెహమాన్‌
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి)
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

అక్రమ సంబంధంతోనే భార్య హత్య, ఇద్దరు పిల్లలనూ చంపిన కిరాతకుడు

Krishna Districtవిజయవాడ: తానే తన భార్య అరుణను హత్య చేసినట్లు ప్రభాకర్ అనే వ్యక్తి అంగీకరించాడు. బుధవారం రాత్రి కృష్ణా జిల్లా బుద్ధవరం గ్రామంలో ప్రభాకర్ అనే వ్యక్తి భార్యను గొంతు కోసి హత్య చేసి, ఇద్దరు కూతుళ్లను కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ సంస్థలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన భార్యను హత్య చేశానని ప్రభాకర్ విచారణలో అంగీకరించాడు. అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లు శ్రావ్య, కావ్యలను కూడా తానే హత్య చేసినట్లు చెప్పాడు.

భార్యను గొంతు కోసి హత్య చేసిన ప్రభాకర్ పిల్లలను హత్య చేసిన వారి శవాలను కాలువలో పడేశాడు. కాలువ నుంచి పిల్లల శవాలను పోలీసులు వెలికి తీశారు. యాకూబ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తాను తన భార్యను హత్య చేసినట్లు ప్రభాకర్ చెప్పాడు. రాత్రి కార్యాలయానికి వెళ్లినట్లు నటించి, వెనక్కి వచ్చి భార్యను, పిల్లలను ప్రభాకర్ హత్య చేశాడు. అరుణ ప్రభాకర్‌ను వదిలేసి గతంలో యాకూబ్‌తో వెళ్లిపోయింది. ప్రభాకర్ బతిలాడి తిరిగి ఆమెను తెచ్చుకున్నాడు. అయినా, యాకూబ్‌తో ఆమె తన సంబంధాన్ని వదులుకోలేదు. పైగా, తన ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు యాకూబ్ వల్లనే పుట్టినట్లు కూడా ప్రభాకర్ తెలుసుకున్నాడు. దీంతో భార్యను, పిల్లలను హత్య చేశానని ప్రభాకర్ అంగీకరించాడు.

గుంటూరులో భవాని మృతి: పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు

Hyderabadహైదరాబాద్: పదిరోజుల క్రితం హైదరాబాదులో అదృశ్యమైన కృష్ణా నదిలో శవమై తేలిన జీడిమెట్లకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని భవాని అనుమానాస్పద మృతి కేసులో పప్పు, శ్రీకాంత్, శిరీష అనే ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు మరింతమంది సహ విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భవానిని ఎక్కడకు తీసుకు వెళ్లారు, ఎందుకు తీసుకు వెళ్లారు, భవాని ఎలా చనిపోయిందనే విషయాలపై వారి నుండి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వారి సమాధానాలు స్పష్టంగా లేనట్లుగా తెలుస్తోంది. భవాని మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా జీడిమెట్లలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉంటున్న భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని వెళ్లిన భవాని ఆ తర్వాత రోజు కూడా ఇంటికి రాకపోవడంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్‌లో శవంగా కనించింది.

బాలికపై రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్, దక్షిణ ఢిల్లీలో ఆరుగురి అకృత్యం

Teen Gang Rapeన్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికపై ఆరుగురు యువకులు రాక్షసత్వానికి ఒడిగట్టారు. ఓ మైనర్ బాలికను ఆరుగురు యువకులు రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఆరుగురిలో రాజేష్ అనే యువకుడు ఆ బాలిక మిత్రుడు. ఆ ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు తన మిత్రురాలితో కోట్లలో ఉంటోంది. ఆమెను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినవారిలో ఇద్దరు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఉన్నారు.

గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన యువకులను రాజేష్ (21), అనిల్ (22), సిద్ధార్థ్ అలియాస్ సుధీర్ (20), ప్రతీక్ అలియాస్ సర్క్యూట్ (23), పింకు (22), తిలక్ అలియాస్ రాజా బాబు (23)గా గుర్తించారు. అండ్ర్యూస్ గంజ్‌లోని సీనియర్ అధికారులకు చెందిన సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు ఉంటోంది. తన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తండ్రి ఈ నెల 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనను వివేకానంద పార్కులో కలవాలని రాజేష్ ఆ బాలికకు చెప్పాడని, ఆమెను అక్కడి నుంచి సంగం విహార్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడికి మిగతా వారు వచ్చారని, అక్కడే బాలికను వారు రేప్ చేశారని పోలీసు అధికారులు చెప్పారు. రేప్ చేసి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేశారని, అయితే భయంతో ఆమె ఇంటికి వెళ్లకుండా మిత్రురాలి ఇంటికి వెళ్లిందని చెప్పారు.

గుంటూరులో హైదరాబాద్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య?

Hyderabadహైదరాబాద్: పదిరోజుల క్రితం హైదరాబాదులో అదృశ్యమైన ఓ అమ్మాయి కృష్ణా నదిలో శవంగా కనిపించింది. అయితే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు మరణించిందా తెలియరాలేదు. జీడిమెట్లలోని సంజయ్‌గాంధీ నగర్‌లో భవాని కుటుంబం ఉంటుంది. భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని చెప్పి తోటి స్నేహితులు భవానిని తీసుకొని వెళ్లారు. అయితే ఆ తర్వాత భవాని ఇంటికి రాలేదు. దీంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భవాని స్నేహితులతో కలిసి పర్యటన(టూర్)కు వెళ్లింది. హైదరాబాదు నుండి తిరుపతి అక్కడి నుండి విజయవాడ తదితర ప్రాంతాలలో పర్యటించినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్‌లో శవంగా కనిపించింది. అయితే పోలీసులు మొదట గుర్తు తెలియని శవంగా చూసినప్పటికీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ఆ బాడీని భవానిదిగా గుర్తు పట్టారు. భవాని బాడీకి పోస్టు మార్టం చేశారు. కృష్ణా నదిలో భవాని ప్రమాదవశాత్తు మరణించిందా లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా తెలియలేదు. అయితే భవానిని తీసుకు వెళ్లిన స్నేహితులు (శ్రీకాంత్, పప్పుగా తెలుస్తోంది) పోలీసులకు అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలు జారి నదిలో పడిపోయిందని చెబుతున్నారు. అయితే కాలుజారి భవాని నదిలో పడిపోతే వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉండగా ఎందుకు చెప్పలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జగన్, చిరుపై రాజశేఖర్, జీవిత ధ్వజం: కంటతడి పెట్టిన రాజశేఖర్

Rajasekharహైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీలో తానే ఫోకస్ కావాలని జగన్ అనుకుంటారని, ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలూ ఇష్టం ఉండదని హీరో రాజశేఖర్ కంట తడి పెట్టారు. జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలే దూరంగా ఉంచారని ఆరోపించారు. విజయవాడ జగన్ జలదీక్షలో తమకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయ పడ్డారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే స్వార్థంతోనే పార్టీ స్థాపించారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని హైకమాండ్‌కు తప్పుగా చూపించి సిఎం కావాలని అనుకున్నారని అన్నారు. జగన్ చేసేది సరియైనదే అయితే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉంటారని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.

Thursday, April 28, 2011

హోమ్లీ హీరోయిన్ కి కూడా బికినీ పిచ్చి పట్టేసుకుంది

Snehaబాపూ బొమ్మగా పేరుతెచ్చుకున్న స్నేహకు హోమ్లీ హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషల్లో మంచి పేరుంది. అయితే ఈ మధ్యన ఆమెకు ప్లాపులు పిలవకుండానే వచ్చి పలకరిస్తున్నాయి. దాంతో విసిగిపోయిన ఆమె తన లుక్ ని మార్చేసుకోవాలనుకుంటోంది. అయితే దర్శక, నిర్మాతలెవరూ ఈ విషయమై ఆసక్తి చూపటం లేదు. దాంతో ఆమే తాను బికినీ నటించాటనికి కైనా రెడీ అని, లిప్ లాక్ కిస్సుల కైనా సమస్య లేదని స్టేట్మెంట్లు ఇస్తోంది. రీసెంట్ గా ఈ విషయాన్ని మీడియా వద్ద ప్రస్దావిస్తూ స్టోరీ డిమాండ్ చేసిన విధానాన్ని బట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడనని, కథాపరంగా ఎక్స్‌పోజ్‌లాంటి దృశ్యాలు చేయాల్సి వచ్చినా చేస్తానని అంది. అంతేగాక ఇంకా తాను మడికట్టుకుకూర్చునే పాత్రలు చేయలేనని తాను వెరైటీ కోరుకుంటున్నానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం స్నేహ..నాగార్జున సరసన రాజన్న చిత్రంలో చేస్తోంది.

'నేను నా రాక్షసి'కి మధ్యలో ఇంటర్వెల్ వేయొద్దంటున్నారు

Rana'నేను నా రాక్షసి' చిత్రాన్ని ఇప్పటికే నా ప్రెండ్స్, కావాల్సినవాళ్ళూ చూశారు. సినిమా చూసి వాళ్లు మధ్యలో ఇంటెర్వెల్ కూడా వద్దన్నారు. అంత ఇంటర్టింగ్ గా ఉంటుందీ చిత్రం అంటున్నాడు రానా. 'లీడర్‌'తో కథానాయకుడైన రానా ఇటీవలే హిందీలోనూ దమ్ మారో దమ్ అంటూ అడుగుపెట్టారు. 'నేను నా రాక్షసి'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే తనకీ 'నేను నా రాక్షసి'చిత్రం గురించి ఏ రిఫెరెన్సూ దొరకలేదంటూ...నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. భాషతో సంబంధం లేకుండా రోజూ ఏదో ఒక సినిమా చూస్తాను. టర్కీ, కొరియా చిత్రాలు కూడా వదిలిపెట్టను. ఇన్ని సినిమాలు చూసిన నాకు... ఎక్కడా ఇలాంటి కథ కనిపించలేదు. ప్రతి సినిమాకీ ఎక్కడో ఒక చోట పోలిక ఉంటుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం నాకు ఆ అవకాశమే దొరకలేదు. ఇలాంటి సినిమా ఏదైనా ఒకటి చూపించండి సార్‌ అని పూరి జగన్నాథ్‌ని అడిగితే... 'నా స్క్రిప్టే నీకు రెఫరెన్స్‌' అని చెప్పారు. చిత్రంలో ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ పాత్ర పోషించాను. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.

సింపుల్ స్టోరీ..వండర్‌ఫుల్ కెమెస్ట్రీ ..'100% లవ్'

Naga Chaitanyaసింపుల్ స్టోరీ, వండర్‌ఫుల్ కెమెస్ట్రీ, సూపర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ వేసవికి మా సినిమా వస్తోంది అని దర్సకుడు సుకుమార్ తన తాజా చిత్రం గురించి అన్నారు. అలాగే మా '100% లవ్' సినిమాలో నాగచైతన్య, తమన్నా జోడి 100% చూడ ముచ్చటగా ఉంటుంది. వాళ్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి.దేవి అందించిన ఆడియో సూపర్ డూపర్ హిట్టయింది అని చెప్పుకొచ్చారు. నాగచైతన్య, తమన్నా జంటగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రం '100% లవ్'. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఆర్. విజయ, విజయ్‌కుమార్, నరేశ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆనంద్, తారా అలీషా, చిత్రం శ్రీను, 'తాగుబోతు' రమేశ్, ప్రవీణ్ తారాగణమైన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: జె. హరిప్రసాద్, పాటలు: చంద్రబోస్, శ్రీమణి, రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా, కథ, దర్శకత్వం: సుకుమార్.

దేవుళ్లు కాంబినేషన్లో వెండితెరపై సత్య సాయిబాబా మహిమలు చిత్రంSathya Sai Baba

Sathya Sai Babaప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవంగా మారిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్రపై ఓ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతోంది. సత్యసాయిబాబా పుట్టుక నుండి ఆయన తన పద్నాలుగేళ్లలో ఆధ్యాత్మిక వైపు మరలడం, ఆ తర్వాత తాను షిరిడీ సాయిబాబా అవతారంగా చెప్పడం, ఆ సమయంలో ఆయన మాటలు చేసి భక్తులకు కానుకలు సమర్పించడం ఆ తర్వాత ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు తదితర అంశాలను జోడిస్తూ త్వరలో చిత్రాన్ని నిర్మించే యోచనలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య నిర్మించనున్నారు. జోగయ్య గతంలో దేవుళ్లు చిత్రాన్ని కూడా నిర్మించారు.

ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య దీనిని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగయ్యతో పాటు కరాటం రాంబాబు, తెలుగమ్మాయి నిర్మించిన వానపల్లి బాబురావు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కాగా బాబా అంతిమ సంస్కారాల సందర్భంగా సత్యసాయి మహిమలు, సేవా కార్యక్రమాలపై సినిమా ఎందుకు నిర్మించకూడదనే ఆలోచన వచ్చినట్టు హరిరామ జోగయ్య చెప్పారు. ఆ వెంటనే కోడి రామకృష్ణను సంప్రతిస్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1994లో తాను మంత్రిగా ఉన్న సమయంలో బాబా వద్దకు తాను వెళ్లినప్పుడు వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలవడం కష్టమని చెప్పారని అలాగే జరిగిందని చెప్పారు. ట్రస్టు సభ్యుల సహకారంతో కథను రెడీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

రామ్ చరణ్ కొత్త చిత్రం'రచ్చ' స్టోరీ ఫ్లోరైడ్ వాటర్ సమస్యతోనే

Ram Charan Tejaరామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది దర్సకత్వంలో రచ్చ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథాంశం ప్లోరైడ్ వాటర్ చుట్టూ తిరుగుతుందని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. మే 2011లో మొదలయ్యే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న కథ ప్రకారం తెలంగాణాలో ఓ ప్రాతం ప్లోరైడ్ వాటర్ కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడనుంచి వీడే చిత్రం టైపులో హీరో చేసే ప్రయత్నాలే కధాంశం అంటున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీని సైతం తీర్చిదిద్దుకుని వచ్చి రెడీ అవుతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆరెంజ్ ప్లాప్ నుంచి ఈ చిత్రం పూర్తిగా కోలుకునేలా చేస్తుందని రామ్ చరణ్ ఆశగా ఉన్నారు.

రామ్ గోపాల్ వర్మ సారి చెప్పటానకే ఆ సూపర్ స్టార్ ఇంటికి

Ram Gopal Varmaప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరికీ తలవంచడు..ఎవరినీ భరించడు అన్నట్లుగా ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు సీన్ తిరగబడిందంటున్నారు. తాజాగా ఆయన అభిషేక్ బచ్చన్ పై చేసిన ఎస్ ఎమ్మెస్ వివాదం అంతటా సంచలనం అయ్యేలా చేసింది. ఈ నేపధ్యంలో ఇలాంటివి ఇష్టపడిని అమితాబ్ తన కుమారుడుని విమర్శించిన దర్శకుడుతో పనిచేయటం ఎందుకుని తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు ముంబై మీడియానుంచి వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ పరిస్ధితి తన చేయజారిపోతోందని భావించిన వర్మ దాన్ని చక్కదిద్దేందుకు రంగంలో దిగాడని నిన్న రాత్రి చాలా సేపు అమితాబ్ ఆయన చర్చలు జరిపాడని అంటున్నారు.

వర్మ కారు రాత్రి చాలా సేపు అమితాబ్ ఇల్లు జల్సా వద్ద నిలబడి ఉందని చెప్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడని, తన కుమారుడు నటన బాగోలని ఎస్సమ్మెస్ లు ఇవ్వటమే కాక తన కుమారుడుని తీసేసి రానాకి అవకాశమివ్వటం ఆయన భరించలేకున్నారని చెప్తున్నారు. అయితే వర్మ జరిగిన దానికి సారి చెప్పుకుని ఈ ప్రాజెక్టుని ఎట్టిపరిస్ధితుల్లోనూ ముందుకు తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేగాక తప్పనిసరి పరిస్ధితి అయితే అభిషేక్ ని మళ్లీ ప్రాజెక్టులోకి తీసుకుంటాని చెప్తున్నారు. అయితే అలా ఒకసారి బయిటకు వచ్చిన అభిషేక్ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తో చేయటానికి ఇష్టపడతాడా అనేది అందరి ముందున్న ప్రశ్న.

అల్లు అరవింద్ హంగామా అంతా రామ్ చరణ్ ని చల్లబరచడానికే...!?

Ram Charan Tejaమగధీర విడుదలైన రెండేళ్లకి తమిళంలో దాని అనువాదాన్ని విడుదల చేస్తున్న అల్లు అరవింద్ చడీ చప్పుడు లేకుండా ఈ సినిమాని తోసేయడానికి చూడట్లేదు. రెండేళ్ల తర్వాత మేలుకున్నాకానీ హడావిడి గట్టిగానే చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ చిత్ర ప్రముఖులు పలువురు హాజరు కాగా, సత్యసాయి బాబా మరణించడంతో చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా పుట్టపర్తి వెళ్లారు.

అయితే ఇంత ఆలస్యంగా విడుదల చేస్తున్న సినిమాకి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక తమిళ చిత్ర ప్రముఖులు అయోమయానికి గురయ్యారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడింత హంగామా చేస్తున్నది రామ్ చరణ్ ని చల్లబరచడానికేనని అంటున్నారు. మగధీర తమిళ వెర్షన్ విడుదల చేయకపోవడం పట్ల చరణ్ చాలా కాలంగా అసహనంతో ఉన్నాడని, అతడిని కూల్ చేయడానికి అల్లు అరవింద్ ఇలా దొంగలు పడ్డ రెండేళ్లకి అలర్ట్ అయిన పోలీసులా విజిల్ ఊదుతున్నాడని చెప్పుకుంటున్నారు.

ఆకుల శివ కథతో రామ్ చరణ్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో

Ram Charan Tejaరామ్ చరణ్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు.ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తో చేయటానికి ఓకే చేసారు. ఆకుల శివ అందించే ఈ కథ కు ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. కంటిన్యూగా స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వినాయిక్..అల్లు అర్జున్ తో చేస్తున్న బధిరీనాధ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. జూన్ లో ఈ చిత్రం విడుదల అయ్యాక రామ్ చరణ్ తో చేసే చిత్రం మొదలవుతుంది. ఇక వినాయిక్ గతంలో చరణ్ తండ్రి చిరంజీవితో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నారు. దాంతో ఆరెంజ్ తో ఫ్లాప్ లో ఉన్న చరణ్ కి వినాయిక్ ఓకే చేయటంతో ఊరట లభించనట్లయింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రానికి ప్రిపేర్ అవుతున్నారు. సంపత్ నంది చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు సహకారం అందిస్తున్నారు.