BREAKING NEWS
Thursday, April 28, 2011
ఆకుల శివ కథతో రామ్ చరణ్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో
రామ్ చరణ్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు.ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తో చేయటానికి ఓకే చేసారు. ఆకుల శివ అందించే ఈ కథ కు ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. కంటిన్యూగా స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వినాయిక్..అల్లు అర్జున్ తో చేస్తున్న బధిరీనాధ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. జూన్ లో ఈ చిత్రం విడుదల అయ్యాక రామ్ చరణ్ తో చేసే చిత్రం మొదలవుతుంది. ఇక వినాయిక్ గతంలో చరణ్ తండ్రి చిరంజీవితో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నారు. దాంతో ఆరెంజ్ తో ఫ్లాప్ లో ఉన్న చరణ్ కి వినాయిక్ ఓకే చేయటంతో ఊరట లభించనట్లయింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రానికి ప్రిపేర్ అవుతున్నారు. సంపత్ నంది చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు సహకారం అందిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment