హైదరాబాద్: పదిరోజుల క్రితం హైదరాబాదులో అదృశ్యమైన ఓ అమ్మాయి కృష్ణా నదిలో శవంగా కనిపించింది. అయితే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు మరణించిందా తెలియరాలేదు. జీడిమెట్లలోని సంజయ్‌గాంధీ నగర్‌లో భవాని కుటుంబం ఉంటుంది. భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని చెప్పి తోటి స్నేహితులు భవానిని తీసుకొని వెళ్లారు. అయితే ఆ తర్వాత భవాని ఇంటికి రాలేదు. దీంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భవాని స్నేహితులతో కలిసి పర్యటన(టూర్)కు వెళ్లింది. హైదరాబాదు నుండి తిరుపతి అక్కడి నుండి విజయవాడ తదితర ప్రాంతాలలో పర్యటించినట్లుగా తెలుస్తోంది.
కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్‌లో శవంగా కనిపించింది. అయితే పోలీసులు మొదట గుర్తు తెలియని శవంగా చూసినప్పటికీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ఆ బాడీని భవానిదిగా గుర్తు పట్టారు. భవాని బాడీకి పోస్టు మార్టం చేశారు. కృష్ణా నదిలో భవాని ప్రమాదవశాత్తు మరణించిందా లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా తెలియలేదు. అయితే భవానిని తీసుకు వెళ్లిన స్నేహితులు (శ్రీకాంత్, పప్పుగా తెలుస్తోంది) పోలీసులకు అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలు జారి నదిలో పడిపోయిందని చెబుతున్నారు. అయితే కాలుజారి భవాని నదిలో పడిపోతే వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉండగా ఎందుకు చెప్పలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment