BREAKING NEWS
Thursday, April 28, 2011
సింపుల్ స్టోరీ..వండర్‌ఫుల్ కెమెస్ట్రీ ..'100% లవ్'
సింపుల్ స్టోరీ, వండర్‌ఫుల్ కెమెస్ట్రీ, సూపర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ వేసవికి మా సినిమా వస్తోంది అని దర్సకుడు సుకుమార్ తన తాజా చిత్రం గురించి అన్నారు. అలాగే మా '100% లవ్' సినిమాలో నాగచైతన్య, తమన్నా జోడి 100% చూడ ముచ్చటగా ఉంటుంది. వాళ్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి.దేవి అందించిన ఆడియో సూపర్ డూపర్ హిట్టయింది అని చెప్పుకొచ్చారు. నాగచైతన్య, తమన్నా జంటగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రం '100% లవ్'. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఆర్. విజయ, విజయ్‌కుమార్, నరేశ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆనంద్, తారా అలీషా, చిత్రం శ్రీను, 'తాగుబోతు' రమేశ్, ప్రవీణ్ తారాగణమైన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: జె. హరిప్రసాద్, పాటలు: చంద్రబోస్, శ్రీమణి, రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా, కథ, దర్శకత్వం: సుకుమార్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment