BREAKING NEWS
Thursday, April 28, 2011
రామ్ చరణ్ కొత్త చిత్రం'రచ్చ' స్టోరీ ఫ్లోరైడ్ వాటర్ సమస్యతోనే
రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది దర్సకత్వంలో రచ్చ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథాంశం ప్లోరైడ్ వాటర్ చుట్టూ తిరుగుతుందని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. మే 2011లో మొదలయ్యే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న కథ ప్రకారం తెలంగాణాలో ఓ ప్రాతం ప్లోరైడ్ వాటర్ కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడనుంచి వీడే చిత్రం టైపులో హీరో చేసే ప్రయత్నాలే కధాంశం అంటున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీని సైతం తీర్చిదిద్దుకుని వచ్చి రెడీ అవుతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆరెంజ్ ప్లాప్ నుంచి ఈ చిత్రం పూర్తిగా కోలుకునేలా చేస్తుందని రామ్ చరణ్ ఆశగా ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment