BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, April 28, 2011

'నేను నా రాక్షసి'కి మధ్యలో ఇంటర్వెల్ వేయొద్దంటున్నారు

Rana'నేను నా రాక్షసి' చిత్రాన్ని ఇప్పటికే నా ప్రెండ్స్, కావాల్సినవాళ్ళూ చూశారు. సినిమా చూసి వాళ్లు మధ్యలో ఇంటెర్వెల్ కూడా వద్దన్నారు. అంత ఇంటర్టింగ్ గా ఉంటుందీ చిత్రం అంటున్నాడు రానా. 'లీడర్‌'తో కథానాయకుడైన రానా ఇటీవలే హిందీలోనూ దమ్ మారో దమ్ అంటూ అడుగుపెట్టారు. 'నేను నా రాక్షసి'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే తనకీ 'నేను నా రాక్షసి'చిత్రం గురించి ఏ రిఫెరెన్సూ దొరకలేదంటూ...నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. భాషతో సంబంధం లేకుండా రోజూ ఏదో ఒక సినిమా చూస్తాను. టర్కీ, కొరియా చిత్రాలు కూడా వదిలిపెట్టను. ఇన్ని సినిమాలు చూసిన నాకు... ఎక్కడా ఇలాంటి కథ కనిపించలేదు. ప్రతి సినిమాకీ ఎక్కడో ఒక చోట పోలిక ఉంటుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం నాకు ఆ అవకాశమే దొరకలేదు. ఇలాంటి సినిమా ఏదైనా ఒకటి చూపించండి సార్‌ అని పూరి జగన్నాథ్‌ని అడిగితే... 'నా స్క్రిప్టే నీకు రెఫరెన్స్‌' అని చెప్పారు. చిత్రంలో ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ పాత్ర పోషించాను. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.

No comments:

Post a Comment