అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సేవా గుణం మెండు అని చాలా విషయాలు ప్రూవ్ చేసాయి. తాజాగా మరో వార్త పవన్ సేవా గుణాన్ని బయట పెడుతోంది. ఇటీవల తన భార్య రేణుదేశాయ్ తన పిల్లలను తీసుకుని పవన్ ని వదిలేసి వెళ్ళిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంగా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ లో ఉన్నాడని వినికిడి.
కానీ ఎన్ని టెన్షన్ లు ఉన్నా తనలో దాగి ఉన్న సేవాగుణంతో ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు గట్టి పునాది అవ్వాలని కోరుకుంటున్నాడట. కొంతమంది హీరోల్లా కేవలం మాటల వరకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ పని చేస్తాడని, అంతటి సేవాగుణం అతనికి ఉందని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మంచి పనిని ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాల్సిందే...
No comments:
Post a Comment